ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. అందులోనూ ఫైనల్ మ్యాచ్ అంటే అటు క్రీడాభిమానులకు పండగే పండగ. వాళ్లతో పాటు బుకీలు కూడా అంతే సంబరాలు చేసుకుంటారు. వందల కోట్ల రూపాయల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై పందేలను బుకీలు నిర్వహిస్తుండటంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు.