ప్రస్తుత యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కరే స్పూర్తి. అతడి ఆటను ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌వైపు అడుగులు వేసిన వారూ ఉన్నారు. అయితే ఏకంగా సచినే ఓ క్రికెటర్ ఆటను మెచ్చుకుంటే ఇంకేంటి ఎగిరి గంతేసుడే. ప్రస్తుతం టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా చేస్తుంది అదే. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం సచిన్ మాట్లాడుతూ ప్రస్తుతం బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కితాబిచ్చిన విషయం తెలిసిందే.