టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ వెల్లడించారు. లండన్‌లో జరిగిన స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆమె పలు అంశాలను చర్చించారు. వివిధ క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లు ప్రయివేట్ లీగ్‌లతో ప్రపంచానికి పరిచయం అయ్యారని పేర్కొన్నారు. యువ ఆటగాళ్లు తమను తాము నిరుపించుకోవడానికి ఐసీఎల్, ఐపీఎల్ వంటి టోర్నీలు ఉపయోగపడ్డాయన్నారు.