చివరి ఓవర్‌లో మంచి ఊపు మీదున్న షేన్ వాట్సన్(80) రనౌట్ కావడం మ్యాచ్ గతినే తిప్పేసింది. అయితే వాట్సన్ రనౌట్‌కు జడేజానే కారణం అంటూ సీఎస్‌కే అభిమానులు ఫైర్ అవుతున్నారు. అవసరంలేకున్నా జడేజా రెండో పరుగు కోసం యత్నించి వాట్సన్‌ను రనౌట్ చేసి సీఎస్‌కే ఓటమికి కారణమయ్యాడంటూ మండిపడుతున్నారు.