చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ రన్నౌట్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించడం.. మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపింది. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా పేరొందిన ధోనీ.. లక్ష్య ఛేదనలో జట్టుకు ఎంతో అవసరమైన దశలో.. అతడు రన్నౌట్ అయ్యాడా? లేదా? అన్నది తేల్చే బాధ్యత థర్డ్ అంపైర్‌పై పడింది. హార్దిక్ పాండ్యా వేసిన 13వ ఓవర్ రెండో బంతిని స్ట్రయికింగ్‌లో ఉన్న షేన్ వాట్సన్ షార్ట్ ఫైన్‌లెగ్‌లో దిశగా తరలించాడు. దీంతో సింగిల్ వచ్చింది. అయితే, అక్కడ ఉన్న లసిత్ మలింగా ఓవర్‌త్రో విసరడంతో మరొక పరుగు కోసం ఇద్దరు ప్రయత్నించారు. బంతిని వేగంగా అందుకున్న ఇషాన్ కిషన్ బౌలర్స్ ఎండ్ వైపుగా ఉన్న స్టంప్స్‌కు నేరుగా విసిరాడు. బంతి వికెట్లకు తగలడంతో తీర్పు ఇచ్చే బాధ్యతను గ్రౌండ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌కు అప్పగించారు. థర్డ్ అంపైర్ నిగేల్ లాంజ్ వివిధ కోణాల్లో విశ్లేషణ జరిపేందుకు సమయం తీసుకున్నాడు. ఒక కోణంలో ధోనీ బంతి వికెట్లకు తగలకముందే లైన్‌ను దాటినట్టు కనిపించింది. మరో కోణంలో మాత్రం లైన్‌కు కొద్దిగా అటు-ఇటు ఉన్నట్టు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.