మహేంద్ర సింగ్ ధోని ఈ పేరులోనే వైబ్రేషన్ ఉంది.. రికార్డుల సెన్సేషన్ ఉంది. అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేసి చూపించిన సారథి అతడు. కేవలం ఆటతోనే కాకుండా మంచి మనసుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంత చేసుకున్నాడు. ఇక ఏమి లెక్క చేయకుండా ధోని కోసం మైదానంలోకి దూసుకొచ్చి అతడిని అభిమానులు కలవడం ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం. అయితే తాజాగా ముంబైలోని వాంఖడే మైదానంలో ఓ ప్రత్యేక అభిమానిని ధోని కలుసుకున్నాడు. ధోనిని అమితంగా అభిమానించే ఓ పెద్దావిడ కల ఫలించింది.