shane watson
-
షేన్ వాట్సన్ సెంచరీ వృథా.. ఆసీస్‌పై వెస్టిండీస్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025 టోర్నీలో వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు శుభారంభం చేసింది. ముంబై వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ షేన్ వాట్సన్(Shane Watson) విధ్వంసకర శతకంతో చెలరేగాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన వాట్సన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కేశాడు. కేవలం 52 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 107 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డానియల్ క్రిస్టియన్(32), కట్టింగ్(18) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో యాష్లే నర్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. జెర్మీ టేలర్, రామ్‌పాల్ తలా రెండు వికెట్లు సాధించారు.సిమ్మన్స్ ఊచకోత..అనంతరం 217 బంతుల్లో విండీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. విండీస్ మాజీ ప్లేయర్ లెండిల్ సిమన్స్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్య చేధనలో సిమన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు,8 సిక్సర్లతో 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డ్వేన్ స్మిత్(51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. చాడ్విక్ వాల్టన్(11 బంతుల్లో 4 ఫోర్లతో23) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ హిల్ఫెన్హాస్, మెక్గైన్, క్రిస్టియన్ తలా వికెట్ సాధించాడు. కాగా మంగళవారం ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించింది.చదవండి: PAK vs IND: ఛాంపియన్స్ ట్రోఫీలో 'పాక్' చెత్త ప్రదర్శన.. అతడిపై వేటు..! -
భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ టెండుల్కర్.. అభిమానులకు పండుగే!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎమ్ఎల్- International Masters League) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాదే ఆరంభం కావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి అడ్డంకులేవీ లేవంటూ నిర్వాహకులు తాజాగా ఐఎమ్ఎల్ ఆరంభ, ముగింపు తేదీలను ప్రకటించారు.ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫిబ్రవరి 22న మొదలై.. మార్చి 16న ఫైనల్‌తో పూర్తవుతుందని తెలిపారు. ఇందుకు మూడు వేదికలను కూడా ఖరారు చేసినట్లు పరోక్షంగా వెల్లడించారు. కాగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఈ టీ20 లీగ్ జరుగనుంది.భారత జట్టు కెప్టెన్‌గా సచిన్ఇందులో ఆరు జట్లు పాల్గొనున్నాయి. భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక ఈ టీ20 లీగ్‌లో దిగ్గజ క్రికెటర్లు కూడా పాల్గొననుండటం విశేషం. భారత జట్టుకు లెజెండరీ బ్యాటర్, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.మరోవైపు.. వెస్టిండీస్ జట్టుకు రికార్డుల ధీరుడు బ్రియన్ లారా, శ్రీలంక టీమ్‌కు కుమార్ సంగక్కర, ఆస్ట్రేలియా బృందానికి షేన్ వాట్సన్, ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్, సౌతాఫ్రికా టీమ్‌కు జాక్వెస్ కలిస్ సారథ్యం వహించనున్నారు. ఆ ముగ్గురు కీలకంకాగా ఐఎమ్ఎల్కు సంబంధించి గతేడాది ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. లీగ్ కమిషనర్‌గా ఎంపికైన టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) మాట్లాడుతూ.. ‘‘ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను మరోసారి ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఐఎమ్ఎల్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని అందిస్తామని మాట ఇస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐఎమ్ఎల్ పాలక మండలిలో గావస్కర్‌తో పాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌తో పాటు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా ఉన్నారు. కాగా గతేడాది నవంబరు 17 నుంచి డిసెంబరు 8 వరకు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ నిర్వహిస్తామని తొలుత ప్రకటన వచ్చింది. అయితే, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ లీగ్‌ను ఎట్టకేలకు ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.వేదికలు అవే?ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌కు సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు కానట్లు సమాచారం. అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు.. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం, రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.డబుల్ ధమాకాఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో పాటు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ అర్హత సాధించింది. ఇక ఈ ఐసీసీ టోర్నీ మొదలైన మూడు రోజులకే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ కూడా ఆరంభం కానుండటం.. అందులోనూ సచిన్ టెండుల్కర్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగడం.. క్రికెట్ ప్రేమికులకు డబుల్ ధమాకా అనడంలో సందేహం లేదు.చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు? -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం..?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాట్సన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వాట్సన్ సమాధానం కోసం పీసీబీ ఎదురు చూస్తున్నట్లు నివేదికలు ద్వారా తెలుస్తుంది. వాట్సన్ త్వరలోనే పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వి కలుస్తాడని సమాచారం. ప్రస్తుతం వాట్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ అయిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పీసీబీ ప్రతిపాదనకు వాట్సన్ నో చెప్పినా వారి వద్ద ప్రత్యామ్నాయ ఆప్షన్ ఉన్నట్లు సమాచారం. పీసీబీ అధికారుల దృష్టిలో విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సామి పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీకి కెప్టెన్‌గా వ్యవహరించి ఉండటంతో అతనికి పాక్‌లో భారీ క్రేజ్ ఉంది. పాక్ హెచ్ కోచ్ పదవికి వాట్సన్ నో చెబితే పీసీబీ సామినే కోచ్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్‌గా మొహమ్మద్ హఫీజ్ తొలగించబడినప్పటి నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ నాటి విదేశీ కోచింగ్ సిబ్బంది మొత్తాన్ని తొలగించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పీఎస్ఎల్ సీజన్ నడుస్తుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యాయి. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. -
షేన్ వాట్సన్ ఇళయరాజా పాట
ఒక ఇంటర్య్వూలో ‘డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ టాలెంట్స్?’ అనే ప్రశ్నకు సమాధానంగా గిటారు చేతిలోకి తీసుకున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వాట్సన్. ఆంగ్ల పాట ట్యూన్ ఏదో ప్లే చేస్తాడు అని మనం అనుకునేలోపే ఇళయరాజా పాట ‘ఎన్ ఇనియ పొన్నిలావే’ కొంచెం ప్లే చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
మెరుగవ్వాలి కానీ దిగజారుతారా?! పాంటింగ్ హెడ్‌కోచ్ పదవి గోవిందా! వాళ్లు కూడా అవుట్!
IPL 2023- Delhi Capitals- Ricky Ponting- Sourav Ganguly: ఐపీఎల్-2023 సీజన్లో ఇంత వరకు విజయాల ఖాతా తెరవని ఒకే ఒక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. 2020లో ఫైనల్ చేరిన ఢిల్లీ మళ్లీ ఆ స్థాయిలో ఇంతవరకు రాణించింది లేదు. మూడేళ్ల క్రితం ఫైనల్ వరకు వెళ్లిన ఢిల్లీ ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ మరుసటి ఏడాది ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక 2022లో మాత్రం కనీసం టాప్-4లో నిలవలేకపోయింది. 14 మ్యాచ్‌లకు గానూ ఏడింటి గెలిచిన ఢిల్లీ 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక తాజా ఎడిషన్‌లో మరీ ఘోరంగా ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదూ ఓడి విమర్శలు ఎదుర్కొంటోంది. దెబ్బ మీద దెబ్బ ఈ నేపథ్యంలో ఏడాదికేడాది మెరుగవ్వాల్సింది పోయి ఇలా దిగజారమేమిటని అభిమానులు మండిపడుతున్నారు. కాగా రిషభ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరం కావడం.. పృథ్వీ షా వంటి స్టార్ ప్లేయర్ల వరుస వైఫల్యాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఆట తీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. పంత్ స్థానంలో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన డేవిడ్ వార్నర్ తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. సారథిగా ఆశించిన మేర రాణించలేక చతికిలపడ్డాడు. ఇక కోచింగ్ స్టాఫ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ హెడ్‌కోచ్‌గా ఉండగా.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందిస్తున్నాడు. మరోవైపు షేన్ వాట్సన్, జేమ్స్ హోప్స్, అజిత్ అగార్కర్, ప్రవీణ్ ఆమ్రే, బిజూ జార్జ్ అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. జంబో స్టాఫ్‌నకు స్వస్తి.. పాంటింగ్ పదవికి ఎసరు! తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో కోచింగ్ స్టాఫ్‌ను తగ్గించుకునే ఆలోచనలో పడిందట ఫ్రాంఛైజీ. జంబో స్టాఫ్‌ను తగ్గించడం సహా రిక్కీని హెడ్‌కోచ్‌గా కొనసాగించాలా లేదా అన్న విషయంపై కసరత్తు చేస్తోందట. ఈ మేరకు.. ‘‘కచ్చితంగా మార్పులు ఉండబోతున్నాయి. అయితే, సీజన్ మధ్యలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్లు జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూప్ సభ్యులు కలిసి కూర్చుని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి వచ్చే ఏడాది ఈ జంబో కోచింగ్ స్టాఫ్ కనుమరుగై పోవచ్చు. ముఖ్యంగా కొన్ని పెద్ద తలకాయలు ఇకపై జట్టుతో కొనసాగకపోవచ్చు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. 2018 నుంచి ఢిల్లీతో దీంతో పాంటింగ్ పదవి పోయే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఆర్సీబీ చేతిలో ఢిల్లీ ఓటమి అనంతరం టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. గతంలో విజయాలకు క్రెడిట్ తీసుకున్న రిక్కీ పాంటింగ్ ఓటములకు కూడా బాధ్యత వహించాలంటూ విమర్శించిన విషయం తెలిసిందే. కాగా రిక్కీ పాంటింగ్ 2018 నుంచి ఢిల్లీ జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్ టెండుల్కర్‌ను చూడండి!’ చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణాకు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా -
సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని!
IPL 2023- David Warner: ‘‘డేవీ అద్భుతమైన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్‌గా తనకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు కోసం మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాడు. ఐపీఎల్లో డేవీ గణాంకాలు అత్యద్భుతం. నిజానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నాలుగైదు మ్యాచ్‌లలో తను విఫలమయ్యాడు. కానీ కేవలం పరుగులు సాధించని కారణంగా అతడిని తప్పించడం తెలివితక్కువతనం’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అన్నాడు. బిత్తిరి చర్య ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పట్ల సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ వ్యవహరించిన తీరు సరికాదని, పిచ్చితనంతో గొప్ప నాయకుడిని వదులుకున్నారని పేర్కొన్నాడు. కాగా సన్‌రైజర్స్ సారథిగా వ్యవహరించిన వార్నర్ 2016లో ఆ జట్టుకు టైటిల్ అందించాడు. సుదీర్ఘకాలం పాటు హైదరాబాద్‌కు ఆడిన వార్నర్‌ను అవమానకరరీతిలో బయటకు పంపింది యాజమాన్యం. రిషభ్ పంత్‌తో వార్నర్ (PC: David Warner Instagram) ఢిల్లీ కెప్టెన్‌గా ఈ క్రమంలో గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గత సీజన్లో మొత్తంగా 12 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ భాయ్ 432 పరుగులతో రాణించాడు. అత్యధిక స్కోరు 92 నాటౌట్. ఇక పదిహేనో ఎడిషన్‌లో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ ఐదో స్థానంలో నిలిచి పర్వాలేదనిపించిన విషయం తెలిసిందే. అయితే, యాక్సిడెంట్‌కు గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్ ఈసారి ఐపీఎల్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. వార్నర్ కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రశంసించాడు. ‘‘వార్నర్ గొప్ప నాయకుడు. గతేడాది ఢిల్లీ తరఫున ఉత్తమంగా రాణించాడు. బ్యాటర్‌గా తన వంతు పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈసారి కెప్టెన్‌గా తన వ్యూహాలతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాడు’’ అని వాట్సన్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఏప్రిల్ 1న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: MS Dhoni- Rohit Sharma: మూడేళ్లుగా వింటున్నా..! మాకది తీరని లోటు.. అయితే.. హద్దు మీరి.. అభ్యంతరకరంగా! నెట్టింట షారుక్, కోహ్లి ఫ్యాన్స్ రచ్చ! ఎందుకురా తన్నుకుంటారు? -
IPL 2023: ‘ధోని పూర్తి ఫిట్‌గా ఉన్నాడు.. మరో మూడు, నాలుగేళ్లు ఐపీఎల్ ఆడతాడు’
Will MS Dhoni Retire From IPL In 2023?: మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్-2023 తర్వాత రిటైర్ అవుతాడా? తలా అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. మిస్టర్ కూల్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న అంచనాల నేపథ్యంలో ఈ అంశంపై క్రీడావర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ ఏడాది వేలంలో ఇంగ్లండ్ సారథి బెన్‌స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకోవడంతో.. అతడిని కెప్టెన్‌ను చేసి ధోని ఇక విశ్రాంతి తీసుకుంటాడనే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో స్టోక్స్ జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన తర్వాత పగ్గాలు అతడికి అప్పజెప్పి తలా రిటైర్ అవుతాడనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై సీఎస్కే ఫాస్ట్‌బౌలర్ దీపక్ చహర్‌కు ప్రశ్న ఎదురుకాగా అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘‘ధోనికి ఐపీఎల్లో ఇదే చివరి ఏడాది అని ఎవరు చెప్పారు. నిజానికి ఆయన కూడా స్వయంగా ఎప్పుడూ ఈ మాట అనలేదు. నాకు తెలిసి ధోని ఇంకొన్నాళ్లు ఆడతాడు. ఆడాలని కోరుకుంటున్నా కూడా! ఎప్పుడు రిటైర్ అవ్వాలో ధోనికి బాగా తెలుసు. టెస్టు క్రికెట్‌కు, తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయంలో ధోని తీసుకున్న నిర్ణయాలు మనమంతా చూశాం కదా! నేనైతే ధోని ఇంకొన్నాళ్లు ఆడతాడనే అనుకుంటున్నా. ఆయన సారథ్యంలో.. ఆయనతో కలిసి క్రికెట్ ఆడటమనే నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నా. ధోని ఇప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి ఐపీఎల్లో తలా బ్యాటింగ్ చూస్తే మీకే ఆ విషయం అర్థమవుతుంది. ధోని రిటైర్మెంట్ గురించి మాకైతే అస్సలు ఐడియా లేదు’’ అని దీపక్ చహర్ న్యూ ఇండియా స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. మరో మూడు, నాలుగేళ్లు.. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ సైతం ధోని ఐపీఎల్ కెరీర్ గురించి స్పందిస్తూ.. ‘‘ధోనికి ఇదే ఆఖరి సీజన్ అని నేను విన్నాను. నా దృష్టిలో మాత్రం మరో మూడు నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడగల సత్తా ధోనికి ఉంది. ఇప్పటికీ తను ఫిట్‌గా ఉన్నాడు. అద్భుతంగా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. తనొక గొప్ప నాయకుడు. సీఎస్కే విజయవంతం కావడానికి ప్రధాన కారణం అతడి కెప్టెన్సీనే. నాకు తెలిసి ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ కాదు.. అతడు ఇంకొంత కాలం కొనసాగుతాడు’’ అని ఏఎన్ఐతో పేర్కొన్నాడు. కాగా టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని.. ఐపీఎల్లో చెన్నై జట్టును నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus 2nd ODI: ఘోర ఓటమి.. టీమిండియా చెత్త రికార్డులివే! మరీ దారుణంగా.. IND vs AUS: అతడు లేకపోవడం వల్లే టీమిండియాకు ఓటమి.. లేదంటేనా ఆసీస్‌కు చుక్కలే -
'అతడు ఒంటి చేత్తో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందిస్తాడు'
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వాట్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను హార్దిక్ ఒంటి చేత్తో అందిస్తాడని వాట్సన్ కొనియాడాడు. కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చాక హార్దిక్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పడు ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022లో తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఇక ఈ ఏడాది ప్రపంచకప్-2022లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆక్టోబర్ 23న తలపడనుంది. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో వాట్సన్ మాట్లాడుతూ.. "హార్ధిక్ పాండ్యా చాలా ప్రతిభావంతుడైన క్రికెటర్. అతడు 140 కి.మీ స్పీడ్‌తో బౌలింగ్ చేసే విధానం అద్భుతమైనది. అతడికి మిడిల్ ఓవర్లలో వికెట్ల తీసే సత్తా ఉంది. ఇక హ్యార్దిక్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. అతడు ప్రస్తుతం బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. హార్దిక్ కేవలం ఫినిషర్ మాత్రమే కాదు, పవర్ హిట్టర్ కూడా. అతడికి అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్లో హార్దిక్ ప్రదర్శననుమనం చూశాం. హార్దిక్ ఏ విధంగా అయితే గుజరాత్‌కు టైటిల్‌ను అందించాడో.. ఇప్పడు భారత్‌కు కూడా ఒంటి చేత్తో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందిస్తాడు" అని పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు -
గెలిపించిన షేన్ వాట్సన్.. ఫైనల్‌కు బిల్వారా కింగ్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా బిల్వారా కింగ్స్ ఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో బిల్వారా కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది.ఓపెనర్లు విలియం పోర్టర్‌ఫీల్డ్ (43 బంతుల్లో 60 పరుగులు), మోర్నీ వాన్విక్ 31 పరుగులు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్(24 బంతుల్లో 48 నాటౌట్) చివరిదాకా నిలిచి జట్టును గెలిపించాడు. ఆఖర్లో పఠాన్ బ్రదర్స్ యూసఫ్ పఠాన్(21), ఇర్ఫాన్ పఠాన్(22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రియాన్ 45, యశ్పాల్ సింగ్ 43, తిలకరత్నే దిల్షాన్ 36 పరుగులు చేశారు. బిల్వారా కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్ 2, పనేసర్, ఎడ్వర్ట్స్, బ్రెస్నన్, త్యాగిలు తలా ఒక వికెట్ తీశారు. ఇక అక్టోబర్ 8న(శనివారం) ఇండియా క్యాపిటల్స్‌తో జరగనున్న ఫైనల్లో బిల్వారా కింగ్స్ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఆదివారం(అక్టోబర్ 2న) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఇండియా క్యాపిటల్స్ చేతిలో బిల్వారా కింగ్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చదవండి: యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా! Glimpses of @Bhilwarakings from tonight! #BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/JadTaqN5gK — Legends League Cricket (@llct20) October 3, 2022 -
T20 WC: అతడి స్థానాన్ని ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరు.. భారత్ గెలవడం కష్టమే!
T20 World Cup 2022- Jasprit Bumrah: ‘‘ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా గనుక ఫిట్నెస్ నిరూపించుకోలేక వరల్డ్‌కప్ టోర్నీకి దూరమైతే టీమిండియాకు ట్రోఫీ గెలిచే అవకాశాలు సంక్లిష్టమవుతాయి. తన అటాకింగ్ బౌలింగ్‌తో బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించగలడు. అదే విధంగా అంత తేలికగా పరుగులు సమర్పించుకోడు. అతడు అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలు కలవాడు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అలాంటి బౌలర్ మరొకరు లేరని చెప్పొచ్చు. ఒకవేళ గాయం కారణంగా అతడు దూరమైతే టీమిండియాకు అది తీరని లోటు’’ అని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా వేధిస్తున్న గాయం టీ20 ప్రపంచకప్-2022కు ముందు స్వదేశంలో టీమిండియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, వెన్నునొప్పి తిరగబెట్టిన కారణంగా తిరువనంతపురం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌కు బుమ్రా దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. ఫ్యాన్స్‌లో ఆందోళన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సహా టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్.. బుమ్రా ఇంకా ప్రపంచకప్ జట్టు నుంచి పూర్తిగా తప్పుకోలేదని చెబుతున్నా అభిమానులను మాత్రం భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవేళ గాయం నుంచి పూర్తిగా కోలుకోనట్లయితే ఈ ఐసీసీ మెగా టోర్నీకి అతడు దూరమయ్యే అవకాశాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లను జట్టుతో పంపేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ అతడిని ఆకాశానికెత్తాడు. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు ‘‘ప్రస్తుతం బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్ ప్రపంచంలోనే లేడు. బుమ్రాలాగా అటాక్ చేస్తూ.. డిఫెన్సివ్‌గా ఆడగలిగే వాళ్లు చాలా తక్కువ. అతడు లేకుండా మెగా టోర్నీ ఆడటం టీమిండియాకు కఠిన సవాలు. మిగిలిన ఫాస్ట్బౌలర్లలో ఎవరో ఒకరు మెరుగ్గా రాణిస్తేనే టైటిల్ రేసులో నిలవగలుగుతుంది’’ అని వాట్సన్ ఎన్డీటీవీతో వ్యాఖ్యానించాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానుంది. చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే! -
ఆసియాకప్ విజేత ఎవరో చెప్పేసిన షేన్ వాట్సన్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2022కు మరో రెండు రోజుల్లో తేరలేవనుంది. ఆగస్టు 27 జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతోంది. ఆసియాకప్‌లో టీమిండియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు టీమిండియా ఈ మెగా ఈవెంట్లో 7 సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆడనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీ ప్రారంభం కాకముందే మాజీ ఆటగాళ్లు, క్రికెట్ నిపుణులు విజేతను అంచనావేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ కూడా చేరాడు. ఆసియాకప్-2022లో భారత్ విజేతగా నిలుస్తోందని వాట్సన్ జోస్యం చెప్పాడు. ఆసియాకప్ విజేత ఎవరంటే! ఐసీసీ రివ్యూ తాజా ఎపిసోడ్లో వాట్సన్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది ఆసియాకప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలుస్తోంది అని భావిస్తున్నాను. ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అదే విధంగా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆడే సత్తా భారత్‌కు ఉంది. అదే విధంగా భారత బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలంగా ఉంది" అని పేర్కొన్నాడు. ఇక దాయాదుల పోరు గురించి మాట్లాడుతూ.. "భారత్-పాక్ మ్యాచ్ చూడాటానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించగలమని పాక్ పూర్తి నమ్మకంగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే ఆసియాకప్‌ను కూడా కైవసం చేసుకుంటుంది" అని వార్నర్ తెలిపాడు. ఇక ఆసియాకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. చదవండి: ASIA CUP 2022: ఆసియా కప్‌కు అర్హత సాధించిన హాంకాంగ్.. భారత్, పాక్‌తో ఢీ! -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే రెండు జట్లు ఇవే: షేన్ వాట్సన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(2021-23)లో ఫైనల్‌కు చేరే జట్లను ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అంచనా వేశాడు. ప్రస్తుత టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి అని వాట్సన్ జోస్యం చెప్పాడు. కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 75 విజయ శాతంతో ఆగ్రస్థానంలో కొనసాగుదోంది. అదే విధంగా ఆస్ట్రేలియా 70 విజయ శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్ 52.08 విజయ శాతంతో మూడో స్థానంలో ఉంది. కాగా గత డబ్ల్యూటీసీ(2019-21) ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. అయితే ఫైనల్లో టీమిండియాపై కివీస్ విజయం సాధించి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రోటీస్,ఆస్ట్రేలియా ఢీ! "వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో ప్రోటీస్,ఆస్ట్రేలియా జట్లు ముందున్నాయి. రెండు జట్లు కూడా ఇటీవల కాలంలో అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాయి. శ్రీలంకతో జరిగిన అఖరి టెస్టులో ఆస్ట్రేలియా అత్యుత్తమంగా ఆడింది. అయితే పాకిస్తాన్,భారత్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ఇరు జట్లులో కూడా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న భారత్,పాక్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తే అది సంచలనమే అవుతోంది" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సన్ పేర్కొన్నాడు. చదవండి: యూఏఈ టీ20 లీగ్‌లో అజం ఖాన్.. తొలి పాక్ ఆటగాడిగా! -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌షాక్.. కీలక సమయంలో యువ ఆటగాడు దూరం!
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2022 సీజన్లో తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించగానే తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవడం అలవాటుగా చేసుకుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి.. మిగతా జట్లు ఓడిపోతేనే ఢిల్లీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు యువ ఆటగాడు.. పృథ్వీ షా లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పృథ్వీ షా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. పంత్ కూడా పృథ్వీ షాను మిస్సవుతున్నామని పేర్కొన్నాడు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ఒక ప్రకటనలో తెలిపాడు. ''పృథ్వీ షా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యులు రోజు పృథ్వీకి డయాగ్నసిస్ నిర్వహిస్తున్నారు. కొన్న వారాల నుంచి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పృథ్వీ దూరం కావడం మాకు ఇబ్బందిగా మారింది. అందునా ప్లేఆఫ్ చేరుకునే క్రమంలో ఒక డాషింగ్ ఆటగాడు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఆరంభంలోనే బౌలర్లకు ముచ్చెటమలు పట్టిస్తూ అలవోకగా బౌండరీలు బాది ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తెచ్చేవాడు. అతని సేవలు కోల్పోవడం మాకు పెద్ద నష్టం అని చెప్పొచ్చు'' అంటూ తెలిపాడు. ఇక ఈ సీజన్లో పృథ్వీ షా 9 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 259 పరుగులు చేశాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో మే 16న ఆడనుంది. చదవండి: Rishabh Pant: 'పృథ్వీ షాను మిస్సవుతున్నాం.. కచ్చితంగా ప్లేఆఫ్ చేరుకుంటాం' -
"ముంబై అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది.. అందుకే ఇలా"
ఐపీఎల్-2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచిందని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్క మ్యాచ్‌లో కూడా ముంబై విజయం సాధించలేదు. అయితే వేలంలో సరైన వ్యూహం అనుసరించలేదని టోర్నమెంట్ ఆరంభం నుంచే ముంబై ఇండియన్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇషాన్ కిషన్‌ను రూ.15.25 కోట్లకు కొనుగోలు చేయడం, అదేవిధంగా ఈ ఏడాది సీజన్‌కు జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేనప్పటికీ భారీ డబ్బుకు కొనుగోలు చేయడం వంటి నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి. "ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో ఉండటం నాకు ఎటువంటి ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే వారు వేలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఇషాన్ కిషన్ కోసం వారు చాలా మొత్తం వెచ్చించారు. కిషన్ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ల పర్స్‌లో ఉన్న మొత్తాన్ని అతడికే వెచ్చిండం సరైనది కాదు. ఇక జోఫ్రా ఆర్చర్ జట్టులోకి తిరిగి వస్తాడో లేదో తెలియదు. అతడు చాలా కాలంగా క్రికెట్ ఆడటంలేదు. అతడిని కూడా భారీ ధరకు కొనుగోలు చేశారు" అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం(ఏప్రిల్16) తలపడనుంది. చదవండి: KKR VS SRH: కేన్ మామ ఖాతాలో అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా..! -
IPL 2022: 41 ఏళ్ల వాట్సన్ తొలిసారిగా..
IPL 2022- Delhi Capitals: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 41 ఏళ్ల వాట్సన్ కోచింగ్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. ఢిల్లీ హెడ్ కోచ్ పాంటింగ్‌తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు అమ్రే, అగార్కర్‌లతో కలిసి అతను పని చేస్తాడు. కాగా 2008నుంచి 2020 వరకు రాజస్తాన్, బెంగళూరు, చెన్నై జట్ల తరఫున వాట్సన్ మొత్తం 145 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్(2008)లో రాజస్తాన్ రాయల్స్ మొయిడెన్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో వాట్సన్ పాత్ర మరువలేనిది. ఆ తర్వాత చెన్నైకి ఆడిన వాట్సన్ 2018లో ఐపీఎల్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు మూడో ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలకంగా వ్యవహరించాడు. Winner of the inaugural IPL in 2008 ➡️ Winner of the 2018 IPL and Player of the Final ➡️ Joins Delhi Capitals as Assistant Coach to help in the quest for our first IPL title 🤩 Join us in giving @ShaneRWatson33 a hearty welcome 💙#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/EkCRcJpU4S — Delhi Capitals (@DelhiCapitals) March 15, 2022 -
పాంటింగ్ సిఫార్సు.. కీలక పాత్రలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఐపీఎల్లో మరోసారి మెరవనున్నాడు. ఈసారి ఆటగాడిగా కాకుండా అసిస్టెంట్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న వాట్సన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ స్వయంగా వాట్సన్‌ను సిఫార్సు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సదరు ఫ్రాంచైజీ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించనుంది. కాగా ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌గా తిరుగులేని గుర్తింపు పొందిన షేన్ వాట్సన్ ఐపీఎల్‌లోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2008లో రాజస్తాన్ రాయల్స్ మొయిడెన్ ఐపీఎల్ టైటిల్‌ను గెలవడంలో వాట్సన్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత సీఎస్కేకు వెళ్లిన వాట్సన్ 2018లో ఐపీఎల్ ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మూడో ఐపీఎల్ టైటిల్ అందించాడు. వయసు మీద పడడంతో 2020 సీజన్ నుంచి వాట్సన్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తాజాగా అసిస్టెంట్ కోచ్ పాత్రలో వాట్సన్ ఐపీఎల్లో మరోసారి కనిపించనుండడం ఆసక్తిగా మారింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను మార్చి 26 నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు జరుపుతుంది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంచ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఢిల్లీ ఫ్రాంచైజీ అగార్కర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చదవండి: IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం! PSL 2022: మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్ ఓవర్ -
IPL 2022 Mega Auction: వేలంలో అత్యధిక ధర.. అతడి కోసం ఏకంగా రూ. 20 కోట్లు!
IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. మరి కొన్ని గంటల్లో బెంగళూరు వేదికగా మెగా ఆక్షన్ ప్రారంభం కానుంది. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు వేలం ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఈ ఆటగాళ్లు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. కాగా తమ అభిమాన ఆటగాళ్లని ఏ ఫ్రాంచైజీ కోనుగొలు చేస్తుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ వేలంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు పాల్గొనడంతో వేలానికి సరికొత్త ప్రాధన్యత సంతరించుకొంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రానున్న వేలంలో శ్రేయస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లలో ఎవరో ఒకరు రూ. 20 కోట్ల భారీ ధర దక్కించుకుంటారని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపటిల్స్ రీటైన్ చేసుకోలేదు. అదే విధంగా డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ రీటైన్ చేసుకోలేదు. ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్ ,యుజ్వేంద్ర చాహల్ వంటి వారికి భారీ ధర దక్కనుందని వాట్సన్ భావిస్తున్నాడు. డేవిడ్ వార్నర్: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రీటైన్ చేసుకోలేదు. దీంతో రానున్న వేలంలో అతడి కోసం ప్రాంఛైజీలు పోటీ పడడం ఖాయం. ఐపీఎల్లో 41.59 బ్యాటింగ్ సగటుతో అద్భుతమైన రికార్డును వార్నర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా మంచి రికార్డులను కలిగి ఉన్నాడు. కాబట్టి ఐపీఎల్లో రూ. 20 కోట్ల మార్కును అధిగమించే తొలి వ్యక్తి కావచ్చు. కాగా ఈ వేలంలో వార్నర్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ కలిగి ఉన్నాడు. మిచెల్ మార్ష్: ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు బిగ్ బ్యాష్ లీగ్‌లో బ్యాట్‌తోను, బాల్‌తోను అద్భుతంగా రాణించాడు. అయితే వేలంలో రూ. 20 కోట్లు పొదే అవకాశం ఉన్న రెండో ఆటగాడిగా మిచెల్ మార్ష్‌ను షేన్ వాట్సన్ ఎంపిక చేశాడు. వేలంలో అతడి పేరును 2 కోట్ల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్: ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకోలేదు. కాగా గతంలో ఢిల్లీకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉండడంతో అతడికి భారీ ధర దక్కనుంది. రూ. 20 కోట్ల మార్కును అధిగమించే మూడు ఆటగాడిగా శ్రేయస్‌ను వాట్సన్ ఎంపిక చేశాడు. చదవండి: Ind Vs Wi 3rd ODI- Virat Kohli Duck Out: ఏంటిది కోహ్లి.. 8, 18, 0... మరీ ఇంత చెత్తగా.. తుది జట్టులో ఉంటావా? లేదా? On the eve of the IPL mega auction, here are 5 players that I feel are the top picks for any team. One former teammate is at the top of my list @MELbet_in @melbet_bangla pic.twitter.com/ZJJi6erp5r — Shane Watson (@ShaneRWatson33) February 11, 2022 -
కలిస్, వాట్సన్లతో పోల్చుకున్నందుకు విజయ్ శంకర్‌కు చివాట్లు
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల అతను చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ట్విటర్ వేదికగా తనను ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్లైన కలిస్, వాట్సన్లతో పోల్చుకోవడంపై క్రికెట్ అభిమానులు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తూ చివాట్లు పెట్టారు. వివరాల్లోకి వెళితే, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ శంకర్ మాట్లాడుతూ.. తాను టీమిండియాకు కలిస్, షేన్ వాట్సన్ లాంటి ఆల్‌రౌండర్‌నని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. Kallis and Watson reaction after Vijay Shankar’s comment pic.twitter.com/fk8fmlvqGh — Simran Kaur (@kaursimran_ind) May 17, 2021 దిగ్గజ ఆల్రౌండర్లలానే తాను కూడా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్ధుడినని, ఎటువంటి సందర్భంలోనైనా బౌల్ చేయగల సత్తా తనలో ఉందని పేర్కొన్నాడు. తాను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేశానని, అదే తన రెగ్యులర్ స్లాట్ అయితే అందుకు తగ్గట్టుగా తన ప్రణాళికలుంటాయని తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో తాను వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన విషయాన్ని ఆయన ప్రస్థావించాడు. Vijay Shankar in IPL 2022 pic.twitter.com/R4OYMraRg8 — The Beautiful game (@Leg_Gully) May 17, 2021 Indian fans after Vijay Shankar's statement: pic.twitter.com/cF4hh4skS9 — Tanishq Ganu (@smart__leaks) May 17, 2021 అయితే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగడం వల్ల తాను 30, 40 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయానని, ఇటువంటి ప్రదర్శనతో జాతీయ జట్టులో స్థానం ఆశించడం కూడా సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా, శంకర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుగా అర్ధం చేసుకుని ట్రోల్ చేశారు. శంకర్ చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ మెగా టోర్నీలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుని కాదని శంకర్ ఆవకాశం దక్కించుకున్నాడు. చదవండి: కోహ్లి సేనకు వ్యాక్సిన్ రెండో డోసు అక్కడే.. -
'ధోని ఇంపాక్ట్ ఎంత అనేది అప్పుడు తెలిసింది'
దుబాయ్ : ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ 2016లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 క్రికెట్ టోర్నమెంట్లలో ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. తాజాగా వాట్సన్ గత మంగళవారం అన్ని రకాల టీ20 క్రికెట్ లీగ్‌లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా వాట్సన్ సీఎస్కే టీమ్‌తో పాటు ధోనితో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : వాట్సన్ ఉద్వేగం.. క్రికెట్‌కు గుడ్ బై!) ' 2018 నుంచి సీఎస్కేతో ఉన్న మూడేళ్ల ప్రయాణం నాకు మరువలేనిది. ఈ మూడేళ్లలో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనితో పాటు కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ నాకు ఎంతో సహకరించారు. ఒక దశలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విఫలమైన సమయంలో ధోని నాకు అండగా నిలిచాడు. కేవలం నాపై ఉన్న నమ్మకంతోనే అవకాశాలు కల్పించాడు. ఈ మూడేళ్లలో సీఎస్కేతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మొదటిసారి సీఎస్కే జట్టులో అడుగుపెట్టిన 2018లోనే చెన్నై సూపర్‌కింగ్స్ టైటిల్ కొల్లగొట్టడం.. అదే విధంగా నేను ఆడిన మొదటి ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున మొదటి ఐపీఎల్ టైటిల్ గెలవడం యాదృశ్చికం అనే చెప్పొచ్చు. ఒకసారి ఐపీఎల్ సీజన్ సందర్భంగా ఒకసారి విమానంలో ప్రయాణం చేస్తుండగా ధోనిపై తీసిన డాక్యుమెంటరీ చూసాను. ఆ డాక్యుమెంటరీలో ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటినుంచి కెప్టెన్ అయ్యేవరకు చూశాం. ధోని అనే పేరుకు ఇంత అభిమానం ఉందా.. ఒక వ్యక్తిపై భారతీయ ప్రజలు ఇంతలా గౌరవిస్తారా అనేది వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది. బహుశా సచిన్ తర్వాత భారత క్రికెట్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది ధోనిలోనే అనుకుంటా. ఒక కెప్టెన్‌గా ప్రతి చిన్న విషయానికి ఏమాత్రం బయపడకుండా అతను తీసుకునే నిర్ణయాలు కూల్ కెప్టెన్ అనే పేరును సార్థకం చేశాయని చెప్పొచ్చు. జట్టు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నా.. కేవలం తన ఆలోచనలతోనే ఓటమి నుంచి విజయాల బాట పట్టించాడు. భారత్‌లో క్రికెట్‌కు ఎంతలా అభిమానులుంటారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ సందర్భంలో ఇలాంటివి నేను చాలా చూశా. ధోనికున్న ఫాలోయింగ్‌తో సాధారణంగానే సీఎస్కేకు ఎక్కువగా అభిమానులు ఉండేవారు. చెన్నైలో మ్యాచ్‌లు జరిగేటప్పుడు అభిమానం ఎంతలా ఉంటుందో.. మేం బయటి మైదానాల్లో ఆడేటప్పుడు కూడా సీఎస్కేకు అంతేమంది ఫ్యాన్స్ ఉంటారు. ఇది కేవలం ధోని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని స్పష్టంగా చెప్పొచ్చు. 'అని వాట్సన్ చెప్పుకొచ్చాడు. (చదవండి : అంతర్జాతీయ క్రికెట్‌కు శామ్యూల్స్ గుడ్‌బై) అంతర్జాతీయ కెరీర్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన వాట్సన్ ఐపీఎల్‌లోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ మొదటి సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను తొలి సీజన్లోనే 472 పరుగులతో పాటు 17 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. రాజస్తాన్ రాయల్స్ మొదటి టైటిల్ గెలవడంలో వాట్సన్ పాత్ర కీలకం. ఆ తర్వాత దాదాపు ఏడు సీజన్లపాటు రాయల్స్‌కు ఆడాడు. కాగా ఆర్ఆర్ జట్టుపై నిషేధం పడిన తర్వాత 2016లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్ 2018లో సీఎస్కే గూటికి చేరాడు. 2018లో సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో 57 బంతుల్లోనే 117 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్‌తో సీఎస్కేను మూడోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ కెరీర్లో 145 మ్యాచ్‌లాడి 3874 పరుగులు, బౌలింగ్‌లో 92 వికెట్లు పడగొట్టాడు. -
క్రికెట్‌కు వాట్సన్ గుడ్‌బై
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆస్ట్రేలియా ప్లేయర్ షేన్ వాట్సన్ చివరి మ్యాచ్ ఆడేశాడు. 2018 నుంచి ఓపెనర్‌గా చెన్నై విజయాల్లో కీలకంగా వ్యవహరించిన వాట్సన్ ఆదివారం ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలుపు అనంతరం వాట్సన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. 2016లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న 39 ఏళ్ల వాట్సన్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 క్రికెట్ టోర్నమెంట్లలో ఆయా ఫ్రాంచైజీలకు ఆడుతున్నాడు. ఆదివారంతో ఇక అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు సీఎస్కే సహచరులతో వాట్సన్ చెప్పాడు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ వాట్సన్ ఉద్వేగానికి గురయ్యాడు. చెన్నై ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అతను అన్నాడు’ అని జట్టు వర్గాలు తెలిపాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై కన్నా ముందు రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వాట్సన్ ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లోనే కాకుండా కరీబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్‌లీగ్, బిగ్‌బాష్ లీగ్‌లలో కూడా వాట్సన్ బరిలోకి దిగాడు. ఓవరాల్‌గా వాట్సన్ తన టి20 కెరీర్లో 343 మ్యాచ్‌లు ఆడి 8,821 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 216 వికెట్లు కూడా పడగొట్టిన వాట్సన్ 101 క్యాచ్‌లు తీసుకున్నాడు. -
వాట్సన్ ఉద్వేగం.. క్రికెట్‌కు గుడ్ బై!
దుబాయ్: నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత వాట్సన్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ముందు నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇదే వాట్సన్‌కు ‘చివరి ఆట’ అనే మాట ఎక్కుగా వినిపించింది. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ సీఎస్కేకు చివరిది. ఈ సీజన్లో లీగ్ దశ నుంచి సీఎస్కే ఆట ముగించడంతో ఇక ఆ జట్టు ఆటగాళ్లు తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సీఎస్కే సభ్యులకు వాట్సన్ వీడ్కోలు సందేశాన్ని ఇచ్చినట్లు సమాచారం. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సహచరులతో షేర్ చేసుకునే క్రమంలో వాట్సన్ ఉద్వేగానికి గురయ్యాడట.(ఐపీఎల్ 2020: నెట్ రన్‌రేట్ టై అయితే..) ఈ సీజన్లో వాట్సన్ 11 మ్యాచ్‌లు ఆడి 299 పరుగులు చేశాడు. ఇందుదలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2018 నుంచి సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న వాట్సన్.. ఆ ఏడాది టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి సీఎస్కే టైటిల్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. గతేడాది ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్లో వాట్సన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కానీ సీఎస్కే పరుగు తేడాతో టైటిల్‌ను కోల్పోయింది. సీఎస్కే తరఫున ఆడటానికి ముందు వాట్సన్ రాజస్తాన్ రాయల్స్, రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆడాడు. ఓవరాల్‌గా 145 ఐపీఎల్ మ్యాచ్‌లను వాట్సన్ ఆడాడు. అందులో సీఎస్కే తరఫున ఆడినవి 43. వాట్సన్ తన ఐపీఎల్ కెరీర్లో 3,874 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలున్నాయి. ఆల్‌రౌండర్ అయిన వాట్సన్ 92 ఐపీఎల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది తమ దేశంలో జరిగే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. -
టీ20లో టాప్ 5 బౌలర్లు వీళ్లే !
ఢిల్లీ: షేన్ వాట్సన్.. క్రికెట్ ప్రపంచంలో ఒక్క గొప్ప ఆల్‌రౌండర్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా తన బ్యాట్‌తో విజృంభించగల ఆటగాడు. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ తన సత్తా చూపగలడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా, ఫ్రాంచైజీల్లో ఇంకా తన ఆటను కొనసాగిస్తున్నాడు. ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటికీ ప్రత్యర్థి జట్లకు తను ఒక టార్గెట్ బ్యాట్స్‌మెన్. తన కెరీర్లో ఎంతో మంది మేటి బౌలర్ల్‌ను ఎదుర్కున్నాడు. అలాంటి బ్యాట్స్‌మెన్‌కు టీ20లో టాప్ 5 బౌలర్లు ఎవరో తెలుసా... వాట్సన్ తన టాప్-5 టీ20 బౌలర్ల జాబితాలో లసిత్ మలింగ మొదటి స్థానంలో ఉన్నాడు. టీ20లో అతడు అత్యుత్తమ బౌలర్ అని వాట్సన్ అన్నాడు. మలింగ వేసే 'యార్కర్స్' ఏ బౌలర్ వేయలేడని, భవిష్యత్తులో కూడా అలాంటి బౌలర్‌ను చూడకపోవచ్చని కితాబిచ్చాడు. ఇక రెండో బౌలర్ షాహిద్ అఫ్రిది పేరు చెప్పాడు. షాహిద్ ఒక విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయినా, టీ20లో అతడు మంచి బౌలర్ అని పేర్కొన్నాడు. వికెట్లు తీయడకమే కాకుండా పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయగల సత్తా ఉన్న బౌలర్ అని అన్నాడు. ప్రతి జట్టులో అలాంటి ఒక బౌలర్ ఉండాలని కోరుకుంటారని తెలిపాడు. ఇక మూడో స్థానంలో జస్ప్రిత్ బుమ్రా పేరు చెప్పాడు. ప్రస్తుత కాలంలో అతడు అత్యుత్తమ బౌలర్ అని, అద్భుతమైన యార్కర్స్ వేస్తాడని తెలిపాడు. బంతి వేగంతో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలరని...అతడి బౌలింగ్‌లో ఆడడం 'ఛాలెంజింగ్'గా ఉంటుందని పేర్కొన్నారు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వెస్టిండీస్ ఆటగాళ్లు డ్వైన్ బ్రావో, సునిల్ నరైన్ పేర్లను తెలిపాడు. (ఇదీ చదవండి: ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్) -
ధోనిలో ఉన్న గ్రేట్‌నెస్ అదే!
దుబాయ్: జట్టు సభ్యులపై విశ్వాసం ఉంచి ముందుకు నడిపించడం మహేంద్ర సింగ్ ధోనిలోని గొప్పదనమని ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అన్నాడు. ఒత్తిడిలో కూడా మెరుగ్గా ఆడేందుకు ఇది దోహదపడుతుందని చెప్పాడు. ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న షేన్ వాట్సన్‌ని భుజం తట్టి ప్రోత్సహించడం వల్లనే గత మ్యాచ్‌లో రాణించగలిగాడని బ్రెట్‌లీ మీడియా చాట్‌లో పేర్కొన్నాడు. కాగా, కింగ్స్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని డుప్లెసిస్‌తో కలిసి షేన్‌వాట్సన్ ఛేదించాడు. ఓపెనర్లు వాట్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (53 బంతుల్లో 87 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) హీరోచిత ఇన్నింగ్స్‌లతో మరో 14 బంతులు మిగిలిఉండగానే చెన్నై జట్టు 10 వికెట్లతో తేడాతో భారీ విజయం సాధించింది. చెన్నైకి ఇది రెండో విజయం. ఇక తొలి నాలుగు మ్యాచుల్లో 52 పరుగులే చేసిన వాట్సన్‌ను కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ధోని ఆడిస్తాడా? పక్కన పెడతాడా? అనే సందేహం కలిగింది అభిమానులకు. ఈ దశలో కెప్టెన్ ధోని వాట్సన్వైపు మొగ్గు చూపాడు. (చదవండి: ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్) -
ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్
దుబాయ్: ఈ సీజన్ ఐపీఎల్లో భాగంగా ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. హ్యాట్రిక్ ఓటములతో జూలు విదిల్చిన చెన్నై ఓ అతిపెద్ద విజయాన్ని అందుకుంది. షేన్ వాట్సన్, డుప్లెసిస్‌లు విశేషంగా రాణించడంతో సీఎస్కే 17.4 ఓవర్లలోనే కింగ్స్ పంజాబ్ నిర్దేశించిన 179 టార్గెన్‌ను ఛేదించింది. గత నాలుగ మ్యాచ్‌లుగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న వాట్సన్ ఫామ్‌లోకి రావడంతో సీఎస్కే బెంగ తీరడమే కాకుండా భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో వాట్సన్ అజేయంగా 83 పరుగులు చేయగా, డుప్లెసిస్ 87 పరుగులు చేశాడు. ఎన్నో విమర్శలు చవిచూసి సరైన సమయంలో మెరిసిన వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.(చదవండి: ఎంఎస్ ధోని మరో రికార్డు) ఈ మేరకు డుప్లెసిస్ కలిసి తన అనుభవాన్ని షేర్ చేసుకున్న వాట్సన్ ఒక వీడియోను ఐపీఎల్ టీ20 డాట్ కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ‘ఆటగాళ్లపై నమ్మకం ఉంచడంలో ధోనిది ప్రత్యేకశైలి. ప్లేయర్స్‌పై విశ్వాసం ఉంచడంలో ధోని తీరు అసాధారణం. అలాగే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఆటగాళ్లపై ఎక్కువ నమ్మకం ఉంచుతాడు. ఆటగాళ్ల నాణ్యత, సామర్థ్యాలని వీరు బాగా నమ్ముతారు. ఫామ్‌లో లేనప్పుడు క్రికెటర్లపై నమ్మకం ఉంచాలనే విషయం వారికి బాగా తెలుసు. అవే మార్పులు తీసుకొస్తాయని వారు భావిస్తారు. నా మంచి స్నేహితుడు డుప్లెసిస్ కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉంది. చిన్న చిన్న విషయాల్లో మనల్ని మార్చుకుంటే అవి పెద్ద పెద్ద ఫలితాల్ని ఇస్తాయి. ఇందుకు నా తాజా ఇన్నింగ్సే కారణం. సీఎస్కే మేనేజ్మెంట్కు థాంక్స్ ’ అని వాట్సన్ తెలిపాడు. ఇక డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ క్రెడిట్ అంతా ఎంఎస్ ధోని. ఫ్లెమింగ్లకే దక్కుతుంది. అది సీఎస్కే స్టైల్ కూడా. ఫలానా ఆటగాడిలో సామర్థ్యం ఉంది అని భావిస్తే వారు దానికి కట్టుబడే అవకాశాలు ఇస్తూ ఉంటారు’ అని తెలిపాడు. -
చెన్నై చిందేసింది
చెన్నై సూపర్‌గా ఆడి కింగ్స్ ఎలెవన్‌ను ఓడించింది. పంజాబ్ లక్ష్యం ఓపెనర్ల పంజాకే కరిగిపోయింది. ఓవర్లు గడిచేకొద్దీ పరుగులు పెరిగిపోతున్నాయి. కానీ ఒక్క వికెట్ కూడా పడకపోవడం కింగ్స్ ఎలెవన్ బౌలింగ్ వైఫల్యాన్ని వేలెత్తి చూపించింది. లీగ్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లాడిన పంజాబ్‌కు ఇది నాలుగో ఓటమి కాగా... సూపర్‌కింగ్స్ తమ ‘హ్యాట్రిక్’ పరాజయాలకు ఫుల్స్టాప్ పెట్టింది. టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్: చెన్నై దర్జాగా చిందేసింది. ప్రత్యర్థి తమ ముందు గట్టి లక్ష్యాన్నే నిర్దేశించినా... ఓపెనర్లు వాట్సన్ (53 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్ (53 బంతుల్లో 87 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) వేసిన పరుగుల బాటతో సూపర్‌కింగ్స్ విజయబావుటా ఎగరేసింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని బృందం 10 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ లోకేశ్ రాహుల్ (52 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) స్కోరుబోర్డును నడిపించగా... పూరన్ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండానే 181 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కింగ్స్ తుది జట్టులో కరుణ్, గౌతమ్, నీషమ్‌లను పక్కనబెట్టి మన్దీప్, హర్‌ప్రీత్ బ్రార్, జోర్డాన్‌లను తీసుకోగా... చెన్నై మార్పులేకుండా గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. రాహుల్ ఫిఫ్టీ... రాహుల్, మయాంక్ జోరు లేని శుభారంభమైతే ఇచ్చారు. అయితే వేగం పెరిగే దశలో మయాంక్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఔటయ్యాడు. మన్దీప్ సింగ్... చావ్లా ఓవర్లో మిడ్‌వికెట్, డీప్ మికెట్ల మీదుగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. కానీ మరుసటి ఓవర్లోనే జడేజా అతని స్పీడ్‌కు కళ్లెం వేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ భారీ షాట్లే లక్ష్యమని బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జడేజా ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదా డు. ఓపెనర్ రాహుల్ ఆలస్యంగా 15వ ఓవర్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. శార్దుల్ వేసిన ఈ ఓవర్లో సిక్స్ సహా వరుసగా రెండు బౌండరీలు కూడా కొట్టాడు. మరోవైపు పూరన్ సిక్సర్లతో అలరించాడు. 9 పరుగుల రన్‌రేట్‌కు చేరిన ఈ దశలో 18వ ఓవర్ వేసిన శార్దుల్ వరుస బంతుల్లో పూరన్, రాహుల్‌లను ఔట్ చేయడంతో డెత్ ఓవర్లలో రావల్సినన్ని పరుగులు రాలేదు. ఇద్దరే పూర్తి చేశారు... చెన్నై తరఫున పరుగుల వేట ప్రారంభించింది ఇద్దరే. పరుగులన్నీ చకచకా చేసింది ఇద్దరే! లక్ష్యం చేరేదాకా నిలబడింది కూడా ఆ ఇద్దరే! ఆ ఇద్దరు ఇంకెవరో కాదు... ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లెసిస్. మొత్తం 18 ఓవర్లు వేయగా... ఇందులో రెండే రెండు ఓవర్లు (1, 13వ) బౌండరీకి దూరమయ్యాయి. కానీ 16 ఓవర్లు బౌండరీని చేరేందుకే ఇష్టపడినట్లుగా ఇద్దరి ఆట రమ్యంగా సాగిపోయింది. జట్టు 6వ ఓవర్లో 50, 10వ ఓవర్లో వంద పరుగుల్ని దాటింది. వాట్సన్ 31 బంతుల్లో (9 ఫోర్లు, 1 సిక్స్)... డుప్లెసిస్ 33 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఏదో భారీ షాట్‌కో లేదంటే లూజ్ షాట్‌కో పెవిలియన్ చేరతారనుకుంటే పొరపాటే! జట్టు గెలిచేదాకా ఒట్టు పెట్టుకుని ఆడినట్లే ఆడారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌తో చెన్నై దూసుకెళ్లింది. పది వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. 2 ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 వికెట్ల విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి. 2013లోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పైనే చెన్నై జట్టు తొలి 10 వికెట్ల విజయాన్ని సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఐపీఎల్లో 12 సార్లు 10 వికెట్ల తేడాతో విజయాలు నమోదయ్యాయి. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) ధోని (బి) శార్దుల్ 63; మయాంక్ (సి) కరన్ (బి) పీయూశ్ 26; మన్దీప్ (సి) రాయుడు (బి) జడేజా 27; పూరన్ (సి) జడేజా (బి) శార్దుల్ 33; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 11; సర్ఫరాజ్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–61, 2–94, 3–152, 4–152. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–17–0, స్యామ్ కరన్ 3–0–31–0, శార్దుల్ 4–0–39–2, బ్రేవో 4–0–38–0, జడేజా 4–0–30–1, పీయూశ్ 2–0–22–1. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (నాటౌట్) 83; డుప్లెసిస్ (నాటౌట్) 87; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 181. బౌలింగ్: కాట్రెల్ 3–0–30–0, షమీ 3.4–0–35–0, హర్‌ప్రీత్ 4–0–41–0, జోర్డాన్ 3–0–42–0, రవి బిష్ణోయ్ 4–0–33–0. -
వాట్సన్ ఫామ్‌లోకి.. సీఎస్కే టచ్‌లోకి
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సుదీర్ఘ విరామం తర్వాత మరో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసిన సీఎస్కే.. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేధించింది. షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడంతో పాటు మరో ఓపెనర్ డుప్లెసిస్ మళ్లీ రాణించడంతో సీఎస్కే 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వాట్సన్(83 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ), డుప్లెసిస్(87 నాటౌట్; 53 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్)లు కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో సీఎస్కేకు తిరుగులేకుండా పోయింది. ఈ టోర్నీ ఆరంభమైన తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వాట్సన్.. తాజా మ్యాచ్‌లో విశేషంగా రాణించడంతో సీఎస్కే 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక డుప్లెసిన్ తన ఫామ్‌ను కొనసాగించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో సీఎస్కేకు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.(చదవండి: స్టోక్స్ వచ్చాడు.. క్వారంటైన్‌కు వెళ్లాడు) ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ 179 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ పంజాబ్‌కు శుభారంభం లభించింది. మయాంక్ అగర్వాల్(26; 19 బంతుల్లో 3 ఫోర్లు), కేఎల్ రాహుల్(63; 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్)లు తొలి వికెట్‌కు 61 పరుగులు జత చేశారు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరిన తర్వాత మన్దీప్ సింగ్(27;16 బంతుల్లో 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. కింగ్స్ పంజాబ్ స్కోరు 94 పరుగుల వద్ద ఉండగా మన్దీప్ సింగ్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఆపై పూరన్-రాహుల్‌ల జోడి పంజాబ్ స్కోరును చక్కదిద్దింది. ఈ జోడి మూడో వికెట్‌కు 58 పరుగుల జత చేసిన తర్వాత పూరన్(33; 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 18 ఓవర్ తొలి బంతికి పూరన్ ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్..ఆ మరుసటి బంతికి రాహుల్‌ను ఔట్ చేశాడు. దాంతో 152 పరుగుల వద్ద పూరన్, రాహుల్ వికెట్లను కింగ్స్ పంజాబ్ కోల్పోయింది. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు మందగించింది. మ్యాక్స్‌వెల్(11 నాటౌట్), సర్పరాజ్ ఖాన్(14 నాటౌట్)ల నుంచి భారీ షాట్ల రాకపోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లాలు తలో వికెట్ తీశారు. -
‘నేనైతే వాట్సన్‌ను తీసే ప్రసక్తే ఉండదు’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో సీఎస్కే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓపెనర్ షేన్ వాట్సన్ దారుణంగా విఫలమవుతున్నాడు. సరైన శుభారంభాన్ని అందివ్వడంలో ఫెయిల్ అవుతున్న వాట్సన్‌ను ఇంకా కొనసాగించడం ఎందుకు అనే చర్చ నడుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అయితే వాట్సన్‌ను తప్పిస్తేనే సీఎస్కే గాడిలో పడుతుందని విమర్శించాడు. కాగా, మరో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మాత్రం విభేదించాడు. ఏంటి వాట్సన్‌ను తీయడం అంటే సీఎస్కే సాహసం చేసినట్లేనని ఎద్దేవా చేశాడు. ఓవరాల్ సీఎస్కే బ్యాటింగ్ తుప్పుబట్టినట్లు ఉన్నప్పుడు వాట్సన్‌ను తప్పించడం ఎందుకు అని ప్రశ్నించాడు. (చదవండి:ఐపీఎల్ చరిత్రలో ‘గ్రేటెస్ట్ వార్నర్’) తానైతే వాట్సన్‌ను తప్పించే ప్రసక్తే ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో వాట్సన్‌ను కొనసాగిస్తేనే మంచిదన్నాడు. అసలు సీఎస్కే బ్యాటింగ్‌లో పసలేనప్పుడు వాట్సన్‌కు ఉద్వాసన పలికే సాహసం మంచిది కాదన్నాడు. ఒకవేళ వాట్సన్‌ను తీసేస్తే అతని ప్లేస్‌లో ఎవరిని రిప్లేస్ చేస్తారని నిలదీశాడు. వాట్సన్ తప్పిస్తే మురళీ విజయ్, రుతురాజ్ గ్వైక్వాడ్లలో ఎవరో ఒకర్ని తీసుకోవాలని, వారిలో ఎవరూ ఫామ్‌లో లేకపోవడంతో వాట్సన్‌ను తీసేసి నిర్ణయం అనేది మంచిది కాదన్నాడు. మరో నాలుగు, ఐదు మ్యాచ్‌ల వరకూ వాట్సన్‌ను కొనసాగించడమే సమంజసమన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని, కానీ ఒక బ్యాట్స్‌మన్ విజయాలు అందించాలంటే జట్టులో సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సిందేనన్నాడు. ప్రస్తుతం వాట్సన్ ఫామ్‌లో లేకపోవచ్చు.. కానీ ఒకసారి గాడిలో పడితే మాత్రం అతనొక చాంపియన్ ప్లేయర్ అని అన్నాడు. వాట్సన్ ఫామ్‌లోకి ఎప్పుడు వస్తాడో తెలియన్నప్పుడు, అతనికంటే మంచి ప్రత్యామ్నాయం సీఎస్కేకు లేనప్పుడు మార్పులు అనవసరమని గంభీర్ విశ్లేషించాడు. -
‘ఆ గన్ ప్లేయర్‌తో రైనా స్థానాన్ని పూడుస్తాం’
దుబాయ్: ఐపీఎల్ తాజా సీజన్ మరో వారం రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో స్వదేశానికి తిరిగి వచ్చేసిన సీఎస్కే ఆటగాడు సురేశ్ రైనా మళ్లీ యూఏఈకి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకూ రైనా తిరిగి జట్టుతో కలిసే అవకాశంపై ఎటువంటి క్లారిటీ లేదు. కాగా, తాజాగా సీఎస్కే ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ చేసిన వ్యాఖ్యలు రైనా ఇక సీఎస్కేతో కలిసే అవకాశం లేదనే దానికి బలం చేకూరుస్తోంది. రైనా స్థానాన్ని ఒక గన్ ప్లేయర్‌తో పూడుస్తామంటూ వాట్సన్ చెప్పుకొచ్చాడు. సురేశ్ రైనా లేకపోవడం జట్టుకు అతిపెద్ద లోటైనప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక క్రికెటర్‌ను సిద్ధం చేశామన్నాడు. (చదవండి: మిస్బాకు ఉద్వాసన.. రేసులో అక్తర్?) ‘మాకు రైనా, హర్భజన్లు అందుబాటులో లేకపోవడం చాలా లోటు. మొత్తం అన్ని ఐపీఎల్ జట్లను చూస్తే అవి చాలా బలంగా ఉన్నాయి. ఈ సమయంలో రైనా లేకపోవడం జట్టుకు కష్టమే. అతని స్థానాన్ని పూడ్చడం అంత ఈజీ కాదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతతో పాటు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. రైనా ఐపీఎల్ రికార్డులు బాగున్నాయి. అతన్ని మిస్ కావడం బాధిస్తుంది. యూఏఈ వికెట్‌కు అతనికి సరిపోతుంది. ఇప్పుడు అతని ప్లేస్ భర్తీ చేయడానికి ఒక గన్ ప్లేయర్‌ను అన్వేషించాం. అతను మురళీ విజయ్. గత కొన్నేళ్ల నుంచి మురళీ విజయ్‌కు అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. ఇప్పుడు రైనా స్థానాన్ని విజయ్ భర్తీ చేస్తాడని ఆశిస్తున్నాను. అతనొక గన్ ప్లేయర్. ఇక్కడ వికెట్‌కు మురళీ విజయ్ బాగానే నప్పుతుంది. స్పిన్‌ను విజయ్ సమర్థవంతంగా ఆడగలడు. చాలా కాలంగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. ఈసారి మురళీ విజయ్‌కు అవకాశం రావడం ఖాయం. సీరియస్‌గా చెప్పాలంటే మురళీ విజయ్ మంచి బ్యాట్స్‌మన్’ అని వాట్సాన్ తెలిపాడు.(చదవండి: ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్) -
ధోనితో వాట్సన్ బ్రేక్‌ఫాస్ట్..
చైన్నై: కరోనా పాజిటివ్ కలకలంతో ఐపీఎల్లో పాల్గొనే సీఎస్కే(చెన్సై సూపర్ కింగ్స్) టీమ్ ఇటీవలే హోమ్ క్వారంటైన్లోకి వెళ్లింది. అయితే సీఎస్కే క్వారంటైన్ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆటగాళ్లందరు కలిసి టిఫిన్ చేశారు. కాగా సీఎస్కే టీమ్‌లో 13మందికి కరోనా పాజిటివ్ రావడంతో సీఎస్కే స్టాఫ్, ఫ్రాంచైజీలు క్వారంటైన్లోకి వెళ్లారు. అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌లు ఇద్దరు టేబుల్‌పై కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తమిళ భాషలో సీఎస్కే టీమ్ వాట్టో థాలా దర్శనమ్(టిఫిన్ చేయడానికి సిద్ధం) అని పోస్ట్ చేసింది. కాగా ఇటీవల సీఎస్కేలో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యక్తిగత కారణాలతో సీఎస్కే ఆటగాడు రైనా ఐపీఎల్లో పాల్గొనడం లేదు. ఈ విషయమై సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్‌కు రైనాకు కొంత వివాదం నెలకొందని ఆరోపణలు వచ్చాయి. అయితే సీఎస్కే టీమ్‌లో ఎలాంటి వివాదాలు లేవని రైనా, శ్రీనివాసన్ పేర్కొన్న విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 (సెప్టెంబర్ 19నుంచి నవంబర్ 10) వరకు జరగనుంది. చదవండి: ‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’ -
రైనా నిష్క్రమణ.. వాట్సన్ ఆవేదన
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అనుహ్య నిర్ణయంతో జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటివరకు నెట్ ప్రాస్టీక్స్‌తో మంచి ఊపుమీద కనిపించిన రైనా.. దుబాయ్ వెళ్లిన కొంతకాలానికే భారత్‌కు తిరుగుముఖం పట్టాడు. కరోనా భయంతోనే రైనా ఐపీఎల్ టోర్నీ తప్పుకున్నాడని ఓవైపు వార్తలు వస్తున్నా.. వ్యక్తిగత కారణాలతోనే నిష్క్రమించాడని సీఎస్కే యాజమాన్యం చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో సహచర ఆటగాడు లోటుపై సీఎస్కే ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. రైనా నిష్క్రమణ చెన్నై జట్టుతో పాటు ఐపీఎల్ టోర్నీకే పెద్ద లోటని అభిప్రాయపడ్డాడు. చెన్నై గుండె చప్పుడు రైనా అంటూ సోషల్ మీడియా వేదికగా వాట్సన్ ఓ వీడియోను విడుదల చేశాడు. (ఐపీఎల్‌కు సురేశ్ రైనా దూరం) ‘ఈరోజు పొద్దునే ఓ చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఐపీఎల్ టోర్నీ నుంచి సురేష్ రైనా వైదొలగడం బాధించింది. చెన్నైతో పాటు ఐపీఎల్ టోర్నీలోనే రైనా ఎంతో విలువైన ఆటగాడు. వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నా.. ఆయనకు, కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నా. జట్టు సభ్యులమంతా నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం’ అని వాట్సన్ పేర్కొన్నాడు. కాగా రైనా మేనత్త భర్త అశోక్ కుమార్ ఆగస్ట్ 19న పంజాబ్‌లోని పఠాన్‌కోట సమీపంలో గుర్తుతెలియని దుండుగల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. ఈ కారణంగానే రైనా ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్నాడని తొలుత వార్తులు వినిపించాయి. అయితే సహచర ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది కూడా కరోనా వైరస్ బారిన పడటంతో రైనా అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా భయం కారణంగానే టోర్నీ నుంచి తప్పుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. (సురేష్ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం) View this post on Instagram @sureshraina3 - you and your family are in my thoughts. You will be dearly missed here @chennaiipl. You have always been the heartbeat of the team so we will be doing everything we can to make you proud. Take care mate and stay safe. A post shared by Shane Watson (@srwatson33) on Aug 29, 2020 at 3:02am PDT -
ధోనికి వయసుతో సంబంధం లేదు : వాట్సన్
ఢిల్లీ : ఆటకు వయసుతో సంబంధం లేదని.. ఏ వయసులో ఉన్నా సరే ఫిట్నెస్ బాగుంటే బ్యాట్సమన్కు ఏ రికార్డైనా సాధ్యమవుతుంది.. ఇదే అంశం తనకు ధోనిలోనూ కనిపిస్తోందంటూ చెన్నై సూపర్‌కింగ్స్ సహచర ఆటగాడు షేన్ వాట్సన్ అంటున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వాట్సన్ ధోని గురించి, సీఎస్కే విజయావకాశాలపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.('సంజయ్.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు') 'ధోని.. క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నాడు. అతను ఎప్పటికి ఎవర్ గ్రీన్ ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతనికి వయసుతో సంబంధం లేదు.. 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా ధోని అదే కచ్చితమైన వేగంతో పరుగులు సాధిస్తాడని నా నమ్మకం. బ్యాటింగ్‌లోనే కాదు.. కీపింగ్‌లోనూ తనదైన శైలిని చూపించే ఎంఎస్ ధోనికి నేను పెద్ద అభిమానిని. అది ఐపీఎల్ లేక అంతరర్జాతీయ మ్యాచ్ ఏదైనా కావొచ్చు.. అతని ఆటను ఎప్పటికి ఇష్టపడుతూనే ఉంటా.' అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 13వ సీజన్లో సీఎస్కే అవకాశాలు ఎలా ఉన్నాయని వాట్సన్‌ను ప్రశ్నించారు. దీనికి వాట్సన్ స్పందిస్తూ.. ' అందరితో పాటు మాకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుభవం కలిగిన ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది.అందులోనూ ఎంఎస్ ధోని కెప్టెన్సీ.. కోచ్‌గా స్టీఫెన్ ప్లెమింగ్ ఉండడం జట్టుకు అదనపు బలం. ఇన్ని అంశాలతో మా జట్టుకు టైటిల్ గెలిచే సత్తా ఉంది. అంటూ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరున్న చెన్నై సూపర్‌కింగ్స్ ఇప్పటివరకు మూడుసార్లు టైటిల్( 2010,2011,2018) సాధించింది. గతేడాది ఐపీఎల్ 2019 సీజన్లో ముంబైతో జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్లో కేవలం ఒక్కపరుగు తేడాతో ఓడిపోయి నాలుగోసారి టైటిల్‌ను నెగ్గే అవకాశం కోల్పోయింది. -
సుశాంత్ ఎందుకిలా చేశావ్: వాట్సన్
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనపై సినీ, క్రీడా ప్రముఖులు తీవ్ర విచారం వెలిబుచ్చారు. గొప్ప ప్రతిభ, కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటం కలచివేస్తోందని అంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షేన్ వాట్సన్ సుశాంత్ మృతిపట్ల నివాళి అర్పించారు. చక్కని ప్రతిభ త్వరగా కనుమరుగైపోయిందని ట్విటర్లో పేర్కొన్నాడు. (చదవండి: డిప్రెషన్‌ను జయించండిలా..) సుశాంత్ ఎందుకిలా చేశాడో ఆలోచించడం ఆపలేకపోతున్నానని తెలిపారు. ‘ఇది చాలా విషాదకర ఘటన. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమా చూస్తున్న సమయంలో నటిస్తోంది ధోనియా, సుశాంతా అనే విషయం మర్చిపోయి చక్కని అనుభూతి పొందా. ఆ సినిమాలో సుశాంత్ అత్యద్భుతంగా నటించి వినోదం పంచాడు. అంతలోనే ఈ ప్రపంచాన్ని ఒంటరి చేసి దిగంతాలకు పయనమయ్యాడు. గొప్ప ప్రతిభ త్వరగా కనుమరుగైంది’అని వాట్సన్ ట్వీట్ చేశాడు. (చదవండి: ఆవేదన వ్యక్తం చేసిన ‘బిగ్ బీ’) I can’t stop thinking about #sushantsinghrajput. It is just so tragic!!! In The Untold Story, at times you forgot whether it was Sushant or MSD. Amazing portrayal and now the world is much poorer with him not here in it. #gonetoosoon pic.twitter.com/pFYz4cD9jK — Shane Watson (@ShaneRWatson33) June 15, 2020 -
షేన్ వాట్సన్‌కు కీలక పదవి
మెల్బోర్న్: ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ) హెడ్‌గా వాట్సన్ నియమించారు. ఈ మేరకు వాట్సన్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ సోమవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్ తరఫున ఆడిన సమయంలో తనదైన మార్కుతో ఎన్నో విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన వాట్సన్‌పై నమ్మకం ఉంచి ఏజీఎం సభ్యులు.. సరికొత్త బాధ్యతను కట్టబెట్టారు. దాంతో షేన్ వాట్సన్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభం కానుంది. దీనిపై వాట్సన్ మాట్లాడుతూ..‘ ఇది నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. దాంతో పాటు ఇదొక పెద్ద బాధ్యత కూడా. ఆసీస్ క్రికెటర్ల నమ్మకాన్ని మరోసారి చూరగొంటా. నాకు ఆస్ట్రేలియా క్రికెట్ ఏమైతే ఇచ్చిందో దాన్ని తిరిగి ఈ రూపంలో తీర్చుకోవడానికి మంచి అవకాశం’ అని వాట్సన్ పేర్కొన్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్లో 59 టెస్టులు ఆడిన వాట్సన్, 190 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు విశేషమైన సేవలందించాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ బోర్డులోని సభ్యులను 10 మందికి పెంచుతూ ఏజీఎం నిర్ణయం తీసుకుంది. ఇందులో మూడు కొత్త ముఖాలకు తొలిసారి అవకాశం కల్పించారు. -
తన ఫాలోవర్స్‌కు క్షమాపణ చెప్పిన వాట్సన్
సిడ్నీ : ఆస్ట్రేలియన్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. తనకు తెలియకుండానే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు షేర్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన లోదుస్తులు ధరించిన మహిళకు సంబంధించిన స్క్రీన్ షాట్లను బ్రిటీష్ టాబ్లాయిడ్ 'ది సన్' ప్రచురించడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నాడు. దీనిపై వాట్సన్ స్పందిస్తూ.. 'నా అకౌంట్ తనకు తెలియకుండానే ఎవరో హ్యాక్ చేశారు. గత శుక్రవారం ఇదే విధంగా ట్విటర్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారు. ఈ సందర్భంగా మీఅందరితో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. ఈ ఫోటోలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరిని క్షమాపణ కోరుతున్నట్లు' ట్వీట్ చేశాడు. షేన్ వాట్సన్‌ను ఇన్స్టాగ్రామ్, ఇతర అకౌంట్లతో కలిపి దాదాపు 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా తరపున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించిన వాట్సన్ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఆస్ట్రేలియా 2007, 2015 ప్రపంచకప్‌లు గెలవడంలో వాట్సన్ పాత్ర మరువలేనిది. ఇక ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. Another day..... Another social media account hacked!!!! Thanks to Twitter for getting onto this so quickly for me. Fingers crossed I have sorted this all out and it won’t happen again. 🤞🏻🤞🏻🤞🏻 #mysincereapologies #anotherhacking — Shane Watson (@ShaneRWatson33) October 16, 2019 My apologies to everyone for the illicit photos that have been posted on my Instagram account. First my Twitter account on Friday got hacked and now Instagram today. Instagram needs to help out a lot quicker when things like this happens. This is taking way too long!!! 😡😡😡😡 — Shane Watson (@ShaneRWatson33) October 15, 2019 -
‘వారిదే అత్యుత్తమ కెప్టెన్-కోచ్ కాంబినేషన్’
సిడ్నీ: ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్-కోచ్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది ఎంఎస్ ధోని-స్టీఫెన్ ఫ్లెమింగ్లదేనని ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ధోని ఉండగా, కోచ్‌గా ఫ్లెమింగ్ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఆ జట్టు సభ్యుడిగా ఉన్న వాట్సన్.. తాను ఇప్పటివరకూ చూసిన కెప్టెన్-కోచ్ కాంబినేషన్లో ధోని-ఫ్లెమింగ్లదే అగ్రస్థామంటూ కొనియాడాడు. సీఎస్కేను సమన్వయంగా నడపడంతో పాటు ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో వీరిది కీలక పాత్ర అని పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రవేశపెట్టిన తర్వాత సీఎస్కే ఒక సక్సెస్ఫుల్ జట్టుగా ఉందంటే అందుకు కారణం ధోని కెప్టెన్సీతో పాటు ఫ్లెమింగ్ కోచింగ్ పర్యవేక్షణే కారణమన్నాడు. ‘చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)తో నా అనుభవం చాలా ప్రత్యేకమైనది.. ఆహ్వానించదగినది. నేను ఆడిన అత్యధిక లీగ్ మ్యాచ్‌లు సీఎస్కే తరఫునే ఆడాను. ఇప్పటివరకూ సీఎస్కే కచ్చితమైన మార్గంలో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతుంది. ఇందుకు ఆ జట్టుకు ఉన్న సరైన ప్రణాళికే కారణం. ఇందులో ధోని-ఫ్లెమింగ్‌ల పాత్రే అమోఘం. వరల్డ్‌లోనే ఆ ఇద్దరిదీ అత్యుత్తమ కెప్టెన్-కోచ్ కాంబినేషన్ అని నేను బలంగా నమ్ముతాను’ అని వాట్సన్ పేర్కొన్నాడు. -
ఆసీస్ సిక్సర్ కొడుతుందా?
విశ్వ విజేతగా నిలిచిన తర్వాత గత నాలుగేళ్లలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అనేక ఒడిదుడుకులకు లోనైంది. అసలు కొంత కాలం పాటు వన్డేలకు ఎలాంటి జట్టును ఎంపిక చేయాలో కూడా అర్థం కానంత అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ జరిగిన 2017 జూన్ నుంచి 2019 మార్చి వరకు కంగారూ టీమ్ 26 ఆడితే 4 మ్యాచ్‌లే గెలవగలిగింది! దీనికి తోడు ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్, స్మిత్‌లపై ఏడాది నిషేధంతో టీమ్ సమతూకం పూర్తిగా దెబ్బ తింది. అయితే భారత గడ్డపై వన్డే సిరీస్ విజయం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సరిగ్గా ప్రపంచ కప్‌కు ముందు పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు ఇదే జోరులో ఫించ్ సేన వరల్డ్ కప్ వేదికపై తమ బలం ప్రదర్శించేందుకు సిద్ధమైంది. టీమ్ బలంగానే కనిపిస్తున్నా ఎక్కువ మంది దానిని ప్రస్తుతానికి ఫేవరెట్గానైతే చూడటం లేదు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆసీస్ అంచనాలకు భిన్నంగా తమ అసలు సత్తాను ప్రదర్శించగలదా! బలాలు సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ కప్ గెలిచే లక్ష్యంతో బలమైన జట్టునే ఎంపిక చేసింది. సరిగ్గా చెప్పాలంటే వారికి వన్డేలకు సరైన టీమ్ లభించింది. వార్నర్, ఫించ్ రూపంలో ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు జట్టులో ఉన్నారు. వీరు ఆరంభంలో చెలరేగితే ఆసీస్‌కు మంచి పునాది లభిస్తుంది. మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ ఇదే ఊపును చివర్లో కొనసాగించగల సమర్థులు. వీరందరి మధ్య వారధిగా అసలైన వన్డే ఆటను ప్రదర్శించగల నైపుణ్యం స్టీవ్ స్మిత్ సొంతం. పునరాగమనం తర్వాత వరుసగా మూడు వార్మప్ మ్యాచ్‌లలో మూడు అర్ధసెంచరీలు చేసిన అతను టచ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. తుది జట్టులో ఉంటే షాన్ మార్ష, ఖాజా కూడా పరిస్థితులకు తగినట్లుగా రాణించగలరు. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్ ఎలాంటి ప్రత్యర్థులనైనా కుప్పకూల్చగలరు. ముఖ్యంగా ఇంగ్లండ్ పరిస్థితులు స్వింగ్‌కు కొంత అనుకూలించినా వీరికి తిరుగుండదు. ఈ వరల్డ్ కప్‌లో లెగ్ స్పిన్ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఆడమ్ జంపా కూడా ప్రభావం చూపించవచ్చు. అన్నింటికి మంచి ఒక మెగా ఈవెంట్లో ఎలా ఆడాలో, ఒత్తిడిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆస్ట్రేలియన్లకు తెలిసినట్లుగా మరే జట్టుకు తెలీదు. అప్పటి వరకు ఎలాంటి రికార్డు ఉన్నా... వరల్డ్ కప్‌కు వచ్చేసరికి ఈ మానసిక దృఢత్వం వల్లే వారు సవాల్ విసరగలరు. ఇదే కంగారూలను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. పైగా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం జట్టులో చాలా మందికి ఉండటం కూడా కలిసొచ్చే అంశం. మూడు వరల్డ్ కప్ విజయాలలో భాగమైన రికీ పాంటింగ్ సహాయక సిబ్బందిలో ఉండటం జట్టు వ్యూహాలపరంగా బలమైన అంశం. బలహీనతలు నిషేధం తర్వాత వార్నర్, స్మిత్ ఆడుతున్న తొలి టోర్నీ (ఐపీఎల్‌ను మినహాయిస్తే) ఇదే. సహజంగానే వారిపై కొంత ఒత్తిడి ఉంటుంది. అంతే కాకుండా ఇంగ్లండ్‌లో ప్రేక్షకుల నుంచి వెక్కిరింతలు, హేళనకు కూడా వారు సిద్ధం కావాల్సిందే. ఇలాంటి స్థితిలో వారు తమలోని 100 శాతం ఆటను ప్రదర్శించగలరా అనేది ప్రశ్నార్ధకం. ఐపీఎల్ కూడా ఆడని మ్యాక్స్‌వెల్ వన్డేలు ఆడి ఏడాది దాటింది. అతను ఒక్కసారిగా ఫామ్‌లోకి రాకపోతే కష్టం. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్ కాకుండా ఇతర బౌలర్లకు అనుభవం చాలా తక్కువ. ఇది వరల్డ్ కప్‌లో వారిపై ఒత్తిడి పెంచవచ్చు. రెండో స్పిన్నర్‌గా చోటు దక్కించుకున్న లయన్ వన్డే సామర్థ్యం అంతంత మాత్రమే. స్టార్క్ కూడా వరుస గాయాల కారణంగా ఏడాదిన్నరగా వన్డేలు ఆడలేదు. పైగా గత ప్రపంచ కప్‌లో ఆసీస్ గడ్డపై భారీ, బౌన్సీ మైదానాల్లో ఆసీస్ పేసర్లు షార్ట్ బంతులను సమర్థంగా ఉపయోగించి ఫలితం సాధించారు. ఇంగ్లండ్‌లోని చిన్న మైదానాల్లో బంతిని నియంత్రించడం అంత సులువు కాదు. ఇది బలహీనతగా మారితే స్టార్క్, కమిన్స్ భారీగా పరుగులు ఇచ్చే ప్రమాదముంది. స్పిన్‌ను సమర్థంగా ఆడలేని బలహీనత కూడా ఆసీస్‌ను దెబ్బ తీయవచ్చు. గత రికార్డు వరల్డ్ కప్ చరిత్రలో మరే జట్టుకు లేని అద్భుతమైన రికార్డు ఆస్ట్రేలియా సొంతం. 11 సార్లు ప్రపంచకప్ జరిగితే ఏకంగా ఐదు సార్లు (1987, 1999, 2003, 2007, 2015) విశ్వ విజేతగా నిలిచింది. మరో రెండుసార్లు (1975, 1996) ఫైనల్లో పరాజయం పాలైంది. 1987 ప్రపంచ కప్‌కు ముందు కూడా వరుస పరాజయాలు, భారత గడ్డపై స్పిన్‌ను ఆడలేని బలహీనత వల్లే ఆసీస్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ చివరకు బోర్డర్ సేనదే విజయమైంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా... వాటిని అధిగమించగల సత్తా ఉన్న ఆస్ట్రేలియా మరోసారి అలాంటి అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. స్పిన్‌తోనే గెలుపోటములు... ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్‌ను ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందో, జట్టు స్పిన్నర్లు ఎంత బాగా బౌలింగ్ చేస్తారో అనే దానిపైనే మా విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. గత 12–18 నెలలుగా మాకు ఇదే ప్రధాన లోపంగా ఉంది. ఇప్పుడు స్పిన్‌ను ఆడటంలో మా మిడిలార్డర్ కొంత మెరుగైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా వార్నర్, స్నిత్ వచ్చాక సమస్య తగ్గినట్లు కనిపిస్తోంది. బౌలింగ్‌లో చూస్తే జంపా బాగానే రాణిస్తుండగా, లయన్, మ్యాక్స్‌వెల్ కూడా పర్వాలేదు. మొత్తంగా జట్టుపై స్పిన్ ప్రభావం చూపించడం ఖాయం. – రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ -
వాట్సన్‌పై ముంబై ఫ్యాన్స్ కామెంట్స్
ఐపీఎల్ ఫైనల్లో గాయాన్ని లెక్కచేయకుండా వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌పై అన్నివైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇతర జట్ల అభిమానులు కూడా అతడిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను వ్యతిరేకించే వారు కూడా వాట్సన్ ఆటకు ఫిదా అయిపోయారు. ‘నేను ముంబై ఇండియన్స్ అభిమానిని. కానీ వాట్సన్ ఆట, అంకితభావం చూశాక అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాన’ని ముంబై అభిమాని ఒకరు కామెంట్ చేశారు. ‘నేను రోహిత్ సేన ఫ్యాన్‌ని. రక్తంతో తడిసిన ప్యాడ్స్‌తో ఆడినట్టు వాట్సన్ ఫొటోలు చూసిన తర్వాత విజయానికి అన్నివిధాల అర్హుడని భావించాను. దురదృష్టవశాత్తు విజయాన్ని అందించలేకపోయాడు. ఒక్క విషయం మాత్రం నిజం. తన ఆటతో లక్షలాది మంది హృదయాలను గెల్చుకున్నాడ’ని నిశాంత్ పరిహార్ అనే ముంబై ఇండియన్స్ అభిమాని పేర్కొన్నాడు. రక్తమోడుతూ వాట్సన్ బ్యాటింగ్ చేయడం చూసి కన్నీరు ఆగలేదని, నోటి వెంట మాటలు రాలేదని మరో అభిమాని వెల్లడించారు. వాట్సన్ వారియర్, లెజెండ్ అని.. ఐపీఎల్ ట్రోఫికి అతడు అన్నివిధాల అర్హుడన్నారు. అతడిపై గౌరవం పెరిగిందన్నాడు. వాట్సన్‌ను అల్టిమేట్ హీరోగా, సూపర్ హీరోగా సినీ నటి కస్తూరి వర్ణించారు. గాయం బాధను పంటి బిగువున బిగబట్టి ప్రపంచానికి రక్తం రంగును పసుపుగా చూపించాడని ప్రశంసించారు. ఐపీఎల్లో సీఎస్కే తరపున అతడు ఆడటం గౌరవంగానూ, గర్వంగా ఉందన్నారు. -
గాయం లెక్క చేయకుండా.. బ్యాటింగ్ చేసిన వాట్సన్
-
కుంబ్లేను గుర్తుచేశావ్ వాట్సన్..
చెన్నై: గాయం లెక్క చేయకుండా.. రక్తం కారుతున్నా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన షేన్ వాట్సన్‌కు చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం, అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు. విజయం ఎవరిని వరించినా గాయంతో వాట్సన్ పోరాడిన తీరు అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. మంగళవారం సీఎస్కే తన అధికారిక ట్వీటర్‌లోనూ వాట్సన్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ఆటపై వాట్సన్కున్న అంకితభావం గొప్పది, అతడు నిజమైన చాంపియన్ అంటూ సీఎస్కే ట్వీట్ చేసింది. వాట్సన్ ఎంత అంకితభావం ఆటగాడో తెలుస్తుందని, అతడిపై గౌరవం పెరుగుతుందని సహచర ఆటగాడు హర్భజన్ సింగ్ కొనియాడాడు. ఒక వైపు రక్తం కారుతున్న పట్టించుకోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని భజ్జీ ప్రశంసించాడు. వాట్సన్ టీమిండియా లెజెండ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను గుర్తుచేశాడంటూ కొంతమంది గుర్తు చేశారు. కుంబ్లే కూడా ఓ టెస్టు మ్యాచ్ సందర్భంగా గాయపడితే. తలకు కట్టు కట్టుకొని మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఇక సీఎస్కే ఫ్యాన్స్ కూడా వాట్సన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘మ్యాచ్ ఓడినా.. మా మనసులను గెలుచుకున్నావ్’, ‘సీఎస్కే అభిమానుల గుండెల్లో వాట్సన్‌కు ఎప్పుడూ స్థానం ఉంటుంది’ ‘సీఎస్కే అభిమాని అయినందుకు చాలా గర్వంగా ఉంది’ అంటూ సీఎస్కే అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : గాయం లెక్క చేయకుండా.. బ్యాటింగ్ చేసిన వాట్సన్ -
రక్తంతో తడిసిన వాట్సన్ మోకాలిని చూశారా?
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో వీరోచితంగా బ్యాటింగ్ చేసి.. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును దాదాపుగా విజయతీరాలకు చేర్చి.. చివరలో రన్నౌట్ అయిన సీనియర్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ గురించి ఆ జట్టు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. మోకాలికి దెబ్బతగిలి.. రక్తం కారుతున్నా.. ఆ గాయం తాలుకూ బాధ సలుపుతున్నా.. ఏమాత్రం చెక్కుచెదరకుండా షేన్ వాట్సన్ చివరివరకు బ్యాటింగ్ చేశాడని హర్భజన్ వెల్లడించాడు. ఎడమ మోకాలు వద్ద రక్తంతో వాట్సన్ ప్యాంటు తడిసిపోయిన ఫొటోను భజ్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘గాయ్స్.. రక్తంతో తడిసిన అతని మోకాలిని చూశారా? మ్యాచ్ తర్వాత అతని గాయానికి ఆరు కుట్లు వేశారు. మ్యాచ్ డైవింగ్ సందర్భంగా వాట్సన్ గాయపడ్డాడు. అయినా ఎవరికీ చెప్పకుండా అతను వీరోచితంగా బ్యాటింగ్ కొనసాగించాడు. వాట్సన్ అంటే అది. అతను దాదాపుగా మమ్నల్ని విజయం ముంగిటికి తీసుకొచ్చాడు’ అని భజ్జీ తెలిపాడు. ముంబై ఇండియన్స్ విసిరిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో ఒంటరిపోరాటం చేసిన వాట్సన్.. 59 బంతుల్లో 80 పరుగులు చేసి.. చివరిఓవర్లో రన్నౌట్ అయిన సంగతి తెలిసిందే. వాట్సన్ రన్నౌట్తో గట్టి షాక్‌కు గురైన చెన్నై జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఈ మ్యాచ్‌లో ఓడి.. ఐపీఎల్ కప్ కోల్పోయింది. వాట్సన్ వీరోచిత ఇన్సింగ్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. డైవింగ్‌లో గాయపడి.. మోకాలు రక్తపుమయంగా మారిన ఏమాత్రం బెదరకుండా బ్యాటింగ్ కొనసాగించిన వాట్సన్‌ను హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
సీఎస్కే ఓటమికి కారణమైన వాట్సన్‌ను రనౌట్
-
చెన్నై ఓటమికి అతడే కారణం..
హైదరాబాద్: ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కీలక సమయాలలో బ్యాట్స్‌మెన్ రనౌట్లు అవడం చెన్నై సూపర్‌కింగ్స్ కొంపముంచింది. బెస్ట్ ఫినిషర్‌గా పేరుగాంచిన ఎంఎస్ ధోని(2)ని ఇషాన్ కిషన్ తన సూపర్‌త్రోతో రనౌట్ చేసి చెన్నై కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక చివరి ఓవర్లో మంచి ఊపు మీదున్న షేన్ వాట్సన్(80) రనౌట్ కావడం మ్యాచ్ గతినే తిప్పేసింది. అయితే వాట్సన్ రనౌట్‌కు జడేజానే కారణం అంటూ సీఎస్కే అభిమానులు ఫైర్ అవుతున్నారు. అవసరంలేకున్నా జడేజా రెండో పరుగు కోసం యత్నించి వాట్సన్‌ను రనౌట్ చేసి సీఎస్కే ఓటమికి కారణమయ్యాడంటూ మండిపడుతున్నారు. ‘ఏం మనిషివిరా నాయనా.. వాట్సన్‌ను అట్లా రనౌట్ చేయించినవ్’, ‘చెన్నై ఓటమికి జడేజానే కారణం.. అతడే అపరాధి’, ‘జడేజా అత్యుత్సాహానికి వాట్సన్ బలయ్యాడు’, ‘జడేజానే అపరాధి’ ,అంటూ సీఎస్కే ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మ్యాచ్ అనంతరం ధోని, వాట్సన్‌లు జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. మలింగ వేసిన తొలి బంతికి వాట్సన్ సింగల్ తీయగా.. రెండో బంతికి జడేజా సింగల్ తీసాడు. ఇక మూడో బంతికి వాట్సన్ రెండు పరుగులు చేసాడు. దీంతో 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. అప్పటికే వాట్సన్ జోరుమీదుండడంతో చెన్నై విజయం ఖాయం అనుకున్నారు అందరు. చెన్నై అభిమానులు సంబరాలు చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. నాలుగో బంతిని వాట్సన్ డీప్ పాయింట్ వైపు షాట్ ఆడగా.. మొదటి పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం ప్రయత్నించిన వాట్సన్ రనౌటయ్యాడు. వాట్సన్ రెండో రన్ కోసం వెళ్లాలా వద్దా అనుకుంటుండగానే.. జడేజా పరుగు కోసం ప్రయత్నించడంతో అతను కూడా వెళ్లాల్సి వచ్చింది. ఫలితంగా మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటి వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్ ముంబయి వైపు తిరిగింది. 2 బంతుల్లో 4 పరుగులు కావాలి. ఐదో బంతికి 2పరుగులు తీసిన శార్దూల్.. చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో చెన్నై ఓడింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : సీఎస్కే ఓటమికి కారణమైన వాట్సన్‌ను రనౌట్ -
ముంబైదే ఐపీఎల్ టైటిల్
-
థ్రిల్లింగ్ ఫైనల్లో ముంబై విండియన్స్
ఒక్క పరుగు... ఒక్క పరుగు... ముంబై ఇండియన్స్ ఇకపై ఉచ్ఛరించే మంత్రమిది... రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే వేదికపై ఐపీఎల్ ఫైనల్లో స్వల్ప స్కోరును నమోదు చేసి ఒక్క పరుగుతో చాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేన ఇప్పుడు మళ్లీ అదే అద్భుతాన్ని చేసి చూపించింది. బ్యాటింగ్ వైఫల్యంతో 149 పరుగులకే పరిమితమై... చెత్త ఫీల్డింగ్, క్యాచ్‌లు, రనౌట్లు వదిలేసి కూడా చివరకు చిరకాల ప్రత్యర్థి చెన్నైపై పైచేయి సాధించగలిగింది. చార్మినార్ కోటలో ‘చార్ మార్’ చేస్తూ నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అనూహ్య పరిణామాలతో, మలుపులతో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తుది పోరులో ముంబై విజయజెండా ఎగరవేసింది. మ్యాచ్‌లో ఎక్కువ భాగం పట్టు కొనసాగించిన ధోని వ్యూహానికే ఇక టైటిల్ ఖాయమనిపించగా... రోహిత్ చివరి ఓవర్ ప్లాన్ అద్భుతంగా పని చేసింది. సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ తమ అద్భుత రికార్డును కొనసాగించింది. మూడో సారి కూడా ధోని సేనను చిత్తు చేసి ఐపీఎల్ –2019 విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. వాట్సన్ మినహా... సింగిల్ తీయడంలో తడబాటు... త్రుటిలో తప్పించుకున్న రనౌట్... ఇలా చెన్నై తొలి మూడు ఓవర్ల ఇన్నింగ్స్ గందరగోళంగా సాగింది. ఆ తర్వాత కృనాల్ వేసిన నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాదిన డు ప్లెసిస్ (13 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మలింగ ఓవర్లో వాట్సన్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ ఇచ్చిన క్యాచ్‌ను మలింగ వదిలేయడంతో చెన్నైకి లైఫ్ లభించింది. అతి కష్టమ్మీద పరుగులు తీస్తూ, అప్పటికే అంపైర్ రివ్యూలో ఒకసారి బతికిపోయిన రైనా (8) ఈసారి నిలవలేకపోయాడు. రాహుల్ చహర్ బౌలింగ్‌లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు. ఇప్పుడు రివ్యూ కోరినా ఫలితం దక్కలేదు. రాయుడు (1) తన వైఫల్యం కొనసాగిస్తూ బుమ్రా బౌన్సర్‌కు ఔటయ్యాడు. వరుసగా వికెట్లు పోతుండగా, మరో ఎండ్‌లో నిలిచిన వాట్సన్‌లో కూడా జోరు తగ్గింది. మళ్లీ జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత ధోని (2) పైనే పడింది. అయితే అతను అనూహ్యంగా రనౌట్ అయిన్పటికీ, ఆ తర్వాత వాట్సన్ జోరుతో చెన్నై గెలుపునకు చేరువగా రాగలిగింది. ధోని రనౌట్‌తో... ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధోని కీలక సమయంలో రనౌట్ కావడం చెన్నై శిబిరాన్ని ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. హార్దిక్ బౌలింగ్‌లో వాట్సన్ ఫైన్‌లెగ్ వైపు ఆడగా సింగిల్ వచ్చింది. బంతిని ఆపి మలింగ విసిరిన త్రో నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కు దూరంగా వెళుతుండటంతో ధోని రెండో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా దూసుకొచ్చిన ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లపైకి కొట్టాడు. బంతి స్టంప్స్‌కు తగిలే సమయంలో బ్యాట్ క్రీజ్ గీతపైనే ఉంది. నిజానికి ధోని తనే ఔట్‌గా భావించి ముందే నడవటం మొదలు పెట్టినా ఫీల్డ్ అంపైర్లు అతడిని ఆపారు. సుదీర్ఘ సమయం పాటు పదే పదే రీప్లేలు చూసిన అనంతరం చివరకు అంపైర్ నైజేల్ లాంజ్ ధోనిని ఔట్‌గా ప్రకటించాడు. ఈ వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. చివరి 5 ఓవర్లలో... ధోని వికెట్ పడ్డాక వాట్సన్‌తో పాటు పెద్దగా ఫామ్‌లో లేని బ్రేవో క్రీజ్‌లో ఉన్నాడు. 30 బంతుల్లో 62 పరుగులు చేయాల్సిన స్థితి చెన్నైకి కష్టంగానే కనిపిస్తోంది. అయితే 16వ ఓవర్లో మళ్లీ ఆట మారిపోయింది. మలింగ వేసిన ఈ ఓవర్లో బ్రేవో సిక్స్ బాదగా, వాట్సన్ 3 ఫోర్లు కొట్టాడు. దాంతో 20 పరుగులు వచ్చాయి. అప్పటి వరకు అద్భుత బౌలింగ్‌తో ప్రశంసలు అందుకున్న రాహుల్ చహర్... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థికి మరో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 6, 6 బాది వాట్సన్ చెలరేగిపోయాడు. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ చెన్నై వైపు తిరిగింది. బ్రేవో (15) ఔటైనా, వాట్సన్ గెలిపించే స్థితిలో నిలిచాడు. అయితే చివరకు అదృష్టం సూపర్ కింగ్స్ మొహం చాటేసింది. రోహిత్ విఫలం... ఆరంభంలో డి కాక్, ఆ తర్వాత పొలార్డ్ మినహా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో జోష్ కనిపించలేదు. జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 9 ఫోర్లే ఉన్నాయి. ఇన్నింగ్స్ తొలి రెండు ఓవర్లలో ఒక సిక్సర్ సహా ముంబై పది పరుగులే చేసింది. అనంతరం డి కాక్ దూకుడైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. దీపక్ చహర్ వేసిన మూడో ఓవర్లో డి కాక్ మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత శార్దుల్ బౌలింగ్‌లోనూ అతను మరో సిక్స్ బాదాడు. అయితే తర్వాతి బంతికే డి కాక్‌ను ఔట్ చేసి శార్దుల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. పవర్‌ప్లే చివరి ఓవర్ చెన్నైకి మరింతగా కలిసొచ్చింది. అంతకుముందు ఓవర్లో భారీగా పరుగులిచ్చినా దీపక్ చహర్‌తో మళ్లీ బౌలింగ్ వేయించిన ధోని వ్యూహం పని చేసింది. చక్కటి బంతిని డ్రైవ్ చేయబోయి కెప్టెన్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఓవర్ మెయిడిన్‌గా కూడా ముగిసింది. క్వాలిఫయర్ హీరో సూర్య కుమార్ (17 బంతుల్లో 15; ఫోర్) తడబడుతూ ఆడగా, కృనాల్ పాండ్యా (7 బంతుల్లో 7) విఫలమయ్యాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు) కొద్దిగా నిలిచినా వేగంగా ఆడలేకపోవడంతో రన్‌రేట్ బాగా తగ్గింది. పొలార్డ్ మెరుపులు... ఆదివారం ఫైనల్ రోజునే పుట్టిన రోజు జరుపుకున్న పొలార్డ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గతంలో చెన్నైపై మూడు ఫైనల్స్‌లో కలిపి 60 బంతుల్లో 123 పరుగులు చేసిన రికార్డు ఉన్న అతను మరోసారి ఆకట్టుకున్నాడు. తాహిర్ వరుస ఓవర్లలో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. మరోవైపు 4 పరుగుల వద్ద రైనా క్యాచ్ వదిలేసినా హార్దిక్ (10 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) దానిని పెద్దగా వాడుకోలేకపోయాడు. దీపక్ చహర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన హార్దిక్ రివ్యూకు వెళ్లినా లాభం లేకపోయింది. బ్రేవో వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులకు రెండు ఫోర్లు కొట్టి పొలార్డ్ ఆట ముగించాడు. పొలార్డ్ నిరసన... ఐపీఎల్లో గతంలో ఒకసారి తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో నోటికి ప్లాస్టర్ వేసుకొని మైదానంలోకి దిగిన పొలార్డ్ మరోసారి తనదైన తరహాలో నిరసన తెలిపాడు. బ్రేవో వేసిన చివరి ఓవర్ మూడో బంతి క్రీజ్‌కు దూరంగా వెళుతుండటంతో అతను వైడ్‌గా భావించి వదిలేశాడు. అయితే అంపైర్ నితిన్ మీనన్ మాత్రం వైడ్ ఇవ్వలేదు. దాంతో ఆగ్రహించిన పొలార్డ్ తర్వాతి బంతికి వికెట్లకు పూర్తిగా పక్కకు జరిగి, అంతకుముందు బంతి ఎక్కడి నుంచి వెళ్లిందో దాదాపు అక్కడ (ట్రామ్‌లైన్స్) నిలబడి బ్రేవోను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. దాంతో బౌలింగ్ చేసేందుకు వచ్చిన బ్రేవో మధ్యలో విరమించుకోవాల్సి వచ్చింది. చివరకు అంపైర్ గౌల్డ్, మీనన్ కలిసి సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు. లాంజ్‌ను పక్కన పెట్టారు... ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లితో వాదన తర్వాత గది అద్దాలపై తన ప్రతాపం చూపించిన అంపైర్ నైజేల్ లాంజ్‌పై ఎలాంటి చర్య ఉండదని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. పైగా ఈ సీజన్లో భారత అంపైర్ల ప్రమాణాలు సరిగ్గా లేవని, లాంజ్ అత్యుత్తమ అంపైర్లలో ఒకడని కితాబు కూడా ఇచ్చింది. ఫైనల్‌కు నాలుగు రోజుల ముందు ప్రకటించిన ఫీల్డ్ అంపైర్ల జాబితాలో నైజేల్ లాంజ్ పేరు ఉంది. తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్‌లాంటి కీలక మ్యాచ్‌కు అలాంటి అంపైర్ అవసరం ఉందని కూడా బోర్డు ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో, లేక ఎవరినుంచైనా అభ్యంతరం వచ్చిందో తెలీదు కానీ అతడిని ఫీల్డ్ అంపైరింగ్ నుంచి పక్కన పెట్టారు. చివరకు థర్డ్ అంపైర్ స్థానానికి పరిమితం చేశారు. అతని స్థానంలో వచ్చిన నితిన్ మీనన్ బోర్డు భయపడినట్లు పేలవ అంపైరింగ్ చేశాడు. పొలార్డ్‌కు వైడ్ నిరాకరించడం అందులో ఒకటి. ►1 ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ విజయాల్లో పాలుపంచుకున్న ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. 2009 చాంపియన్ డెక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉండగా... 2013, 2015, 2017, 2019లలో ముంబై జట్టుకు రోహిత్ సారథ్యం వహించాడు. ►4 ముంబై జట్టు నెగ్గిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లో (2013, 2015, 2017, 2019) తొలుత బ్యాటింగ్ చేయడం విశేషం. ►4 ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందడం విశేషం. 2010లో చెన్నై 22 పరుగుల తేడాతో... 2013లో ముంబై 23 పరుగుల తేడాతో... 2015లో ముంబై 41 పరుగుల తేడాతో... 2019లో ముంబై ఒక పరుగు తేడాతో గెలిచాయి. ఐపీఎల్ అవార్డులు ►ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్) డేవిడ్ వార్నర్ (హైదరాబాద్) 692 పరుగులు ప్రైజ్‌మనీ రూ.10లక్షలు, ట్రోఫీ ►పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) ఇమ్రాన్ తాహిర్ (చెన్నై) 26 వికెట్లు ప్రైజ్‌మనీ రూ.10లక్షలు, ట్రోఫీ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు: ►పంజాబ్, హైదరాబాద్ ప్రైజ్‌మనీ: రూ. 25 లక్షలు చొప్పున ►పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ, ►సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ ఆండ్రీ రసెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) ట్రోఫీ, టాటా మోటార్స్ హారియర్ ఎస్యువీ కారు ►స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ లోకేశ్ రాహుల్ (పంజాబ్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ ►డ్రీమ్–11 గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డు రాహుల్ చహర్ (ముంబై ఇండియన్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ ►ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు శుబ్‌మన్ గిల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ►ఫెయిర్ ప్లే అవార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ ►మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ (కోల్‌కతా) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ -
ఎన్నిమిదోస్సారి
అనుభవం ముందు యువతరం తలవంచింది. సీనియర్ నాయకుడి వ్యూహాలకు కుర్ర కెప్టెన్ ప్రణాళికలు సరిపోలేదు. ధోని నేతృత్వంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో మళ్లీ తన ముద్రను చూపించింది. ఏకంగా ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరి తమ సత్తా ఏమిటో ప్రదర్శించింది. ఏడేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ దశకు చేరి ఎలిమినేటర్లోనూ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన మూడో స్థానానికే పరిమితమైంది. ముందుగా చెన్నై స్పిన్ త్రయం దెబ్బకు 147 పరుగులే చేసి విజయావకాశాలు తగ్గించుకున్న శ్రేయస్ అయ్యర్ బృందం తర్వాత సాధారణ బౌలింగ్ ప్రదర్శనతో, చెత్త ఫీల్డింగ్‌తో చెన్నైని నిలువరించలేకపోయింది. వెటరన్లు వాట్సన్, డు ప్లెసిస్ అర్ధ సెంచరీలకు యువ ఢిల్లీ ఆట ముగిసింది. ఇక నాలుగోసారి ఫైనల్లో తలపడనున్న చెన్నై, ముంబై మధ్య విజేత ఎవరో ఆదివారం హైదరాబాద్‌లో తేలనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నిషేధం తర్వాత గత ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేసి చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడి డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో విజేతగా నిలిచి సూపర్ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కొలిన్ మున్రో (24 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో, జడేజా, హర్భజన్, దీపక్ చహర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షేన్ వాట్సన్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 62 బంతుల్లో 81 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. పంత్ మినహా... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగినప్పటి నుంచి ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. మధ్యలో పంత్ ప్రయత్నం మినహా జట్టు బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. టాప్–4 బ్యాట్స్‌మెన్ నుంచి కనీసం ఒక్క సిక్సర్ కూడా రాకపోగా, స్కోరులో అత్యధిక భాగస్వామ్యం 22 పరుగులే అంటే పరిస్థితి అర్థమవుతుంది! శార్దుల్ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో ధావన్ (14 బంతుల్లో 18; 3 ఫోర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే చహర్ బౌలింగ్‌లో పృథ్వీ షా (6 బంతుల్లో 5; ఫోర్) వికెట్ల ముందు దొరికిపోవడంతో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. ముందుగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... ధోని రివ్యూ కోరి ఫలితం సాధించాడు. కొద్ది సేపటికి హర్భజన్ బౌలింగ్‌లో ధోని చక్కటి క్యాచ్ పట్టడంతో ధావన్ వెనుదిరిగాడు. అనంతరం భజ్జీని సమర్థంగా ఎదుర్కొని వరుసగా రెండు ఫోర్లు కొట్టిన మున్రో... జడేజాకు తలవంచాడు. కెప్టెన్ అయ్యర్ (18 బంతుల్లో 13; ఫోర్) పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ మళ్లీ విఫలమయ్యాడు. ఈ దశలో జట్టు స్కోరు 75/4 కాగా... పంత్ 10 పరుగుల వద్ద ఆడుతున్నాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ (6 బంతుల్లో 3), రూథర్‌ఫోర్డ్ (12 బంతుల్లో 10; సిక్స్), కీమో పాల్ (7 బంతుల్లో 3) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పంత్ ధాటిని పెంచాడు. తాహిర్ ఓవర్లో వరుసగా అతను ఫోర్, సిక్స్ కొట్టడంతో కొంత ఊపు వచ్చింది. అయితే అది ఎంతో సేపు సాగలేదు. చివరకు బ్రేవో బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి పంత్ ఔటయ్యాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్లో బౌల్ట్ (3 బంతుల్లో 6) ఒక సిక్స్... చివరి రెండు బంతులకు ఇషాంత్ శర్మ (3 బంతుల్లో 10 నాటౌట్) వరుసగా ఫోర్, సిక్స్ కొట్టడంతో ఈ మాత్రం స్కోరైనా వచ్చింది. పంత్ వెనుదిరిగాక ఢిల్లీ చివరి 8 బంతుల్లో 24 పరుగులు రాబట్టగలిగింది. ఒక బ్యాట్స్‌మన్ (విజయ్)ను తప్పించి తుది జట్టులో పేసర్ శార్దుల్‌కు చోటిచ్చిన చెన్నై అతనితో ఒకటే ఓవర్ వేయించగా... ఈ సీజన్లో చాలా వరకు పేలవ ప్రదర్శన కనబర్చిన బ్రేవో (2/19) ఎట్టకేలకు తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు చెలరేగగా... తొలి నాలుగు ఓవర్ల పాటు కాస్త ప్రశాంతత... ఆ తర్వాత ఒక్కసారిగా చెన్నై ఓపెనర్లు చెలరేగిపోయారు. వరుసగా గత నాలుగు మ్యాచ్‌లలో విఫలమైన వాట్సన్ ఫామ్ అందుకోగా, డు ప్లెసిస్ తన దూకుడును చూపించాడు. బౌల్ట్, ఇషాంత్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 4 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 16 పరుగులే చేసింది. కానీ అక్షర్ వేసిన ఐదో ఓవర్‌తో ఆట మలుపు తిరిగింది. ఈ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన ప్లెసిస్... ఇషాంత్ వేసిన తర్వాతి ఓవర్లో తొలి మూడు బంతులను వరుసగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే ప్లెసిస్‌ను ఔట్ చేసి బౌల్ట్ తొలి వికెట్ భాగస్వామ్యాన్ని ముగించాడు. ఇక్కడి నుంచి బాధ్యత తీసుకున్న వాట్సన్... పాల్ వేసిన 12వ ఓవర్లో చెలరేగిపోయాడు. ఏకంగా 3 సిక్సర్లు, ఫోర్ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న తర్వాత మిశ్రా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వాట్సన్ వెనుదిరిగాడు. చివర్లో రైనా (13 బంతుల్లో 11), ధోని (9 బంతుల్లో 9) వెనుదిరిగినా చెన్నైకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. రాయుడు (20 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు) అజేయంగా నిలవడంతో ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టు గెలిచింది. ఆనవాయితీ కొనసాగింది... ఐపీఎల్లో 2011 నుంచి ప్లే ఆఫ్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి ఈ సీజన్ వరకు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టు కచ్చితంగా ఫైనల్ చేరుతోంది. 2011లో చెన్నై, 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్, 2013లో ముంబై ఇండియన్స్, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్, 2015లో ముంబై ఇండియన్స్, 2016లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, 2018, 2019లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు లీగ్ దశలో రెండో స్థానంలో నిలవడంతో పాటు ఫైనల్‌కు చేరుకున్నాయి. మరో విశేషమేమింటే 2011 నుంచి 2015 వరకు వరుసగా ఐదేళ్లపాటు ఐపీఎల్లో లీగ్ దశ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టుకే టైటిల్ లభించింది. ►4 ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండటం ఇది నాలుగోసారి. 2010లో చెన్నై విజేతగా నిలువగా... 2013, 2015లలో ముంబై టైటిల్ సాధించింది. ►4 ఐపీఎల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్న నాలుగో బౌలర్ హర్భజన్. ఈ జాబితాలో లసిత్ మలింగ (169 వికెట్లు), అమిత్ మిశ్రా (157 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా... పీయూష్ చావ్లా (150 వికెట్లు), హర్భజన్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ►2 ఐపీఎల్ చరిత్రలో 100 విజయాలు నమోదు చేసుకున్న రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్ 106 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. రనౌట్ చేయడంలో విఫలమై... గత కొన్ని మ్యాచ్‌లలో చెన్నైకి ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోతున్నారు. ఆ ఒత్తిడి వారిపై ఆరంభంలోనే కనిపించింది. అయితే చేతికి చిక్కిన చక్కటి అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ వృథా చేసుకొని ఫలితం అనుభవించింది. ఇన్నింగ్స్ మూడో బంతికే రనౌట్ చేసే చాన్స్ వచ్చినా బుర్ర వాడకుండా ప్రత్యర్థికి లైఫ్ అందించింది. బౌల్ట్ వేసిన బంతిని పాయింట్ దిశగా ఆడి వాట్సన్, డు ప్లెసిస్ సింగిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఇద్దరిలో సమన్వయ లోపంతో గందరగోళానికి లోనై ఒక దశలో ఇద్దరు పిచ్ మధ్యలోకి వచ్చేశారు. అయితే ఢిల్లీ ఫీల్డర్లు సరైన రీతిలో త్రో వేయడంలో విఫలం కావడంతో ఇద్దరు బ్యాట్స్‌మెన్ క్షేమంగా బయటపడ్డారు. బంతిని ఆపి అక్షర్ పటేల్ నాన్‌స్ట్రయికింగ్ దిశగా విసరగా, అక్కడే ఉన్న మున్రో బ్యాట్స్‌మెన్ గమనాన్ని పట్టించుకోకుండా కీపర్ వైపు విసిరాడు. అది దూరంగా వెళ్లడంతో పంత్ కూడా దానిని అందుకోలేకపోయాడు. ఆలోగా ప్లెసిస్ వేగంగా వచ్చి పరుగు పూర్తి చేసుకోగా క్యాపిటల్స్ ఆటగాళ్లంతా తలలు పట్టుకున్నారు. మున్రో కాస్త చురుగ్గా ఆలోచిస్తే సునాయాసంగా రనౌట్ చేయగలిగే అవకాశం అక్కడ ఉంది. తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఉంటే అసలే ఒక బ్యాట్స్‌మన్ తక్కువగా ఉన్న చెన్నైపై కచ్చితంగా ఒత్తిడి పెరిగేదే! -
బీబీఎల్‌కు వాట్సన్ గుడ్‌బై
సిడ్నీ: తమ దేశంలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)కు ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ గుడ్ బై చెప్పేశాడు. ఇక బీబీఎల్ ఆడబోనంటూ వాట్సన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఆడుతున్న వాట్సన్.. తమ దేశంలో జరిగే బీబీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. కాగా, కొన్ని విదేశీ లీగ్‌ల్లో మాత్రం ఆడతానంటూ పేర్కొన్నాడు. గత మూడు సీజన్ల నుంచి బీబీఎల్‌లో సిడ్నీ థండర్‌కు సారథిగా వ్యవహరిస్తున్న వాట్సన్..తన జట్టు సహచరులకు కృతజ్ఞతలు తెలిపాడు. సిడ్నీ థండర్‌తో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని, అవి ఎప్పుడూ తన మదిలో పదిలంగానే ఉంటాయన్నాడు. ప్రధానంగా నిక్ కమిన్స్, పాడీ ఆప్టన్, లీ జర్మన్, షేన్ బాండ్లతో తన అనుభవం ఎప్పటికీ మరచిపోలేనిదిగా పేర్కొన్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు బీబీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. -
వారికి థాంక్స్ చెబితే సరిపోదు: వాట్సన్
చెన్నై: ఐపీఎల్లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాట్సన్ (96; 53బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేసి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. అయితే ఇక్కడ తనపై నమ్మకం ఉంచి జట్టులో కొనసాగిస్తున్న జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రధానంగా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కెప్టెన్ ఎంఎస్ ధోని తనపై ఎంతో నమ్మకం ఉంచడంతోనే తుది జట్టులో పదే పదే అవకాశాలు ఇస్తూ వచ్చారన్నాడు. తనపై నమ్మకం ఉంచిన వారిద్దరికీ థాంక్స్ చెబితే సరిపోదని వాట్సన్ పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తప్ప వేరే జట్టులో ఉండి ఉంటే తనను ఎప్పుడో డ్రెస్సింగ్ రూమ్‌కి పరిమితం చేసేవారని ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు. ‘చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కెప్టెన్ ధోని నామీద ఎంతో నమ్మకం ఉంచారు. నేను జట్టుకు ఇంకా ఎన్నో పరుగులు బాకీ ఉన్నాను. గతంలో బీబీఎల్, పీఎస్‌లోనూ రాణించాను. కానీ, ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచి అంచనాలు అందుకోలేకపోయాను. అయితే, జట్టు నామీద నమ్మకం ఉంచింనందుకు ఆ జట్టుకు రుణపడి ఉంటాను. ఫ్లెమింగ్, ధోనిలకు థాంక్స్ చెప్పి సరిపెట్టడం చాలా చిన్నదే అవుతుంది’ అని వాట్సన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 173 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో డుప్లెసిస్ వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో పడ్డ చెన్నైని వాట్సన్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఈ సీజన్లో మొదటిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వాట్సన్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించిన వాట్సన్.. సన్‌రైజర్స్‌పై చెలరేగి ఆడి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. -
రషీద్ ఖాన్ Vs వాట్సన్.. పేలుతున్న జోకులు!
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్బుత ఇన్నింగ్స్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై 6 వికెట్లతో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోపాటు ఫ్లే ఆఫ్ బెర్త్‌ను కాయం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ పూర్తిగా తెలిపోయాడు. వాట్సన్ దాటికి ఎన్నడు లేని విధంగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన రషీద్ వాట్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీదికి దూసుకెళ్లాడు. దీనికి వాట్సన్ కూడా అదే తరహాలో ప్రతిఘటించడంతో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. కానీ ఇద్దరు ఏమనుకోకుండానే వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తుండగా అభిమానులు మాత్రం ఫన్నీమీమ్స్, కామెంట్స్‌తో జోకులు పేల్చుతున్నారు. రషీద్ వాట్సాన్... అంటే వాట్సన్.. వాట్ సన్! అని అడుగుతాడని కామెంట్ చేస్తున్నారు. ఇక వాట్సన్ జట్టు కోచ్ ఫ్లెమింగ్.. కెప్టెన్ ధోనిలకు ధన్యవాదాలు తెలిపాడు. ‘ మంచు కురువడం వల్లే నేను పరుగులు చేశాను. మా కోచ్ స్టిఫెన్ ప్లెమింగ్, కెప్టెన్ ఎంఎస్ ధోని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. నేను చాలా జట్లకు ఆడాను. ప్రస్తుత పరిస్థితే ఉంటే ఏ జట్టు నాకు అవకాశం ఇచ్చేది కాదు. కానీ ఫ్లెమింగ్,ధోని నాపై విశ్వాసం ఉంచి అవకాశం ఇచ్చారు.’ అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటూ పేర్కొన్నాడు. What's going on, mate?#CSKvSRH pic.twitter.com/nz9HVrh6c5 — IndianPremierLeague (@IPL) 23 April 2019 Watson vs Rashid Khan yesterday: pic.twitter.com/XA4lXr2Npy — Elite Alagappan (@IndianMourinho) 24 April 2019 #CSKvSRH Rashid: Watson. Watson: What Son? pic.twitter.com/MaiisS8pqn — Robin Singh Rajput🇮🇳 (@biharihuBC) 23 April 2019 Rashid Khan against Shane Watson~#CSKvSRH pic.twitter.com/JQqM8G2SmY — BPNDVNTH (@bapsepanganale) 23 April 2019 -
అతను అలా ఆడుతుంటే ఏం చేయలేకపోయాం.!
చెన్నై : షేన్ వాట్సన్ దాటికి తాము ఏం చేయలేకపోయామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ..‘ఈ వికెట్‌పై మరిన్ని పరుగులు చేయాల్సింది. మా బౌలింగ్ సమయంలో మైదానంలో మంచు కురిసింది. కానీ మాకేం ఇబ్బంది కలుగలేదు. వాట్సన్ దాటికి తాము ఏం చేయలేకపోయాం. ఈ మ్యాచ్ క్రెడిట్ మొత్తం అతనిదే. ఇక ప్రతి బౌలర్‌కు ఎదో ఒకరోజు దుర్దినం వస్తుంది. అఫ్గాన్ సంచలనం రషీద్‌ఖాన్‌కు ఈ రోజు వచ్చింది. అతను గత మూడేళ్లలో ఎన్నడు లేని విధంగా ఓవర్‌కు 10 పరుగులు సమర్పించుకున్నాడు. మేం బెయిర్‌స్టో సేవలు కోల్పోతున్నాం. కానీ మా జట్టులో అతన్ని భర్తీ చేసే ఆటగాళ్లున్నారు. ఇంకా మాకు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఇతర మైదానాల్లోనే ఉన్నాయి. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాలంటే ఆ మ్యాచ్‌లు గెలవాల్సిందే. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపు కోసం సాయశక్తులా పోరాడుతాం. ఇక కెప్టెన్సీతో నేను చాలా నేర్చుకున్నాను.’ అని భువీ చెప్పుకొచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగాడు. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వాట్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ స్వదేశం వెళ్లడంతో షకీబుల్ హసన్ ఈ మ్యాచ్ బరిలోకి దిగగా.. భువనేశ్వర్ సారథ్యం వహించాడు. -
సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన హైదరాబాద్
-
మూడో సారి ‘సూపర్’
ఐపీఎల్లో రెండేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు మళ్లీ ఈ ఏడాది బరిలో నిలిచాయి. పదేళ్ల పాటు సోనీ టెలివిజన్‌తో కొనసాగించిన లీగ్ బంధం ముగిసి ఈ ఏడాదినుంచి స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ హక్కులు దక్కించుకోవడం కీలక మార్పు. ఇందుకోసం స్టార్ ఏకంగా రూ.16,347 కోట్లు చెల్లించడం విశేషం. ఇదే సీజన్‌నుంచి ఐపీఎల్లో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టారు. లీగ్‌కు కొద్ది రోజుల ముందే బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌కు దూరమయ్యారు. పునరాగమనంలో తన సత్తాను ప్రదర్శిస్తూ దూసుకుపోయిన ధోని సేన మూడో సారి ట్రోఫీని గెలుచుకొని ముంబై సరసన నిలిచింది. వాట్సన్ ఒంటి చేత్తో... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నైనే ఫైనల్‌కు కూడా అర్హత సాధించాయి. ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ముందుగా సన్‌రైజర్స్ 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షేన్ వాట్సన్ (57 బంతుల్లో 111 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో 2 వికెట్లకు 181 పరుగులు చేసి చెన్నై విజయాన్నందుకుంది. సీజన్లో రెండు లీగ్ మ్యాచ్‌లతో పాటు తొలి క్వాలిఫయర్‌లో కూడా రైజర్స్‌ను ఓడించిన చెన్నై నాలుగో విజయాన్ని నమోదు చేయడం విశేషం. వాట్సన్ జోరు... టోర్నీలో మొత్తం ఐదు శతకాలు నమోదయ్యాయి. షేన్ వాట్సన్ రెండు సెంచరీలు సాధించగా... అంబటి రాయుడు, రిషభ్ పంత్, క్రిస్ గేల్ ఒక్కో సెంచరీ కొట్టారు. రిషభ్ పంత్ 68 ఫోర్లు, 37 సిక్సర్లు బాది రెండింటిలోనూ అగ్రస్థానంలో నిలవడం విశేషం. -
టీమిండియానే ఫేవరెట్.. కానీ
సిడ్నీ: త్వరలో టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభం కానున్న నాలుగు టెస్టుల సిరీస్‌పై ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు. ఆస్ట్రేలియాలో మొట్టమొదటి టెస్టు సిరీస్ గెలవడానికి టీమిండియాకు ఈసారి ఎక్కువ అవకాశాలున్నాయని వాట్సన్ జోస్యం చెప్పాడు. కానీ సొంత గడ్డపై ఆసీస్‌ను ఓడించడం భారత్‌కు పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. ‘ ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడానికి టీమిండియా మంచి అవకాశాలున్నాయి. ఈ సిరీస్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత క్రికెట్ జట్టు చాలా బలంగా ఉంది. ప్రధానంగా వైవిధ్యమైన భారత్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఆసీస్ కష్టపడాల్సి ఉంటుంది. కాకపోతే సొంతగడ్డపై ఆసీస్ ఎప్పుడూ ప్రమాదకారే. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఆసీస్‌కు ఎక్కువగా ఉంటుందింది. ఇప్పటివరకూ స్వదేశంలో ఆసీస్ చాలా తక్కువసార్లు మాత్రమే ఓడిపోయింది. ఈసారి టీమిండియా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ, హోరాహోరీ పోరు తప్పదు’ అని వాట్సన్ పేర్కొన్నాడు. డిసెంబర్ 6వ తేదీన ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. -
అప్పుడు నేను ఆశ్చర్యపోతా: వాట్సన్
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా టెస్టు సిరీస్ గెలవకపోతే అది కచ్చితంగా తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందంటున్నాడు ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న వాట్సన్.. భారత్-ఇంగ్లండ్ జట్ల టెస్టు సిరీస్ గురించి మాట్లాడాడు. ‘ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడేందుకు టీమిండియా జట్టు ఎంపికకు చాలా అవకాశాలు ఉన్నాయి. గతంలో భారత జట్టు ఇంగ్లిష్ గడ్డపై ఎలా ఆడింది, ఎన్ని విజయాలు సాధించిందో ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై భారత జట్టు తప్పకుండా సిరీస్ గెలుస్తుందనే నమ్మకం నాకు ఉంది. టెస్టు సిరీస్ గెలవకపోతే అప్పుడు నేను ఆశ్చర్యపోతా. 2014లో ఇంగ్లండ్ పర్యటన ద్వారా విరాట్ కోహ్లికి నేర్చుకునే అవకాశం దక్కిందనే చెప్పుకోవాలి. అతని టెక్నిక్ అసాధారణం. ఎలాంటి పరిస్థితులకైనా సులువుగా అలవాటు పడిపోతాడు. ఆస్ట్రేలియాలో నేను అతడి నుంచి అది బాగా గమనించాను. కేఎల్ రాహుల్ ఆడుతుంటే చూడటం చాలా ఇష్టం. ఫాస్ట్ బౌలర్లను చాలా తెలివిగా, సులువుగా ఎదుర్కొంటాడు. అన్ని రకాల షాట్లను ఆడేందుకు ప్రయత్నిస్తాడు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడు’ అని వాట్సన్ చెప్పాడు. -
గత ఏడేళ్లుగా ఆ క్రికెటర్ వయసు 36!
చెన్నై : సీనియర్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్‌లు యువరాజ్ సింగ్‌ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో పోల్చారు. ఐపీఎల్-11 విజేత చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన హర్భజన్ సింగ్(37), షేన్ వాట్సన్‌ల మధ్య జరిగిన సరదా సంభాషణే అందుకు కారణం. 2001లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు నీ వయసెంత అని భజ్జీని అడగగా.. 18 అని వాట్సన్‌కు చెప్పాడు. నేను అడిగింది నీ కెరీర్ వయసు కాదని, కేవలం నీ వయసు మాత్రమేనంటూ వాట్సన్ భజ్జీపై జోక్ పేల్చాడు. దీంతో భజ్జీ గట్టిగా నవ్వేశాడట. నువ్వు అఫ్రిది(38)తో క్రికెట్ ఆడావా.. అతడిని దగ్గరగా గమనించావా అని వాట్సన్‌ను అడిగాడు. కొన్నేళ్లుగా అఫ్రిదిని గమనిస్తున్నాను, గత ఏడేళ్లుగా అతడి వయసు 36 ఏళ్లు మాత్రమేనంటూ వాట్సన్ చమత్కరించాడు. హర్భజన్ కథ... నేను(హర్భజన్), యువరాజ్ సింగ్ చాలాకాలం కలిసి క్రికెట్ ఆడాం. అండర్-14, అండర్-16, అండర్-19 జట్లలో యువీతో కలిసి ఆడాను. కానీ నేను యువీ కంటే వృద్ధాప్యంలో ఉన్నానని కామెంట్ చేస్తున్నారు. అండర్-19 వరల్డ్‌కప్‌లో మా జట్టుపై యువీ 20 బంతుల్లోనే 50 పరుగులు చేశాడని, ఆపై ఛాంపియన్స్ ట్రోఫీలోనూ యువీ అద్భుతంగా ఆడాడని ఆసీస్ క్రికెటర్ వాట్సన్ గుర్తు చేశాడు. వెంటనే స్పందించిన భజ్జీ.. అయితే యువరాజ్ కూడా అఫ్రిది లాంటివాడేనంటూ గట్టిగా నవ్వేశాడు. కాగా, హర్భజన్, యువీలు ప్రస్తుతం జట్టులో చోటు కోసం యత్నిస్తున్నారు. వీరి సంభాషణపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
వారి శిక్షలు చాలా దారుణం : వాట్సన్
దుబాయ్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లపై విధించిన శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయని ఆ జట్టు మాజీ ఆటగాడు, ఐపీఎల్ ఫైనల్ హీరో షేన్‌వాట్సన్ అభిప్రాపడ్డాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఆసీస్ యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించి అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సూత్రదారైన డేవిడ్ వార్నర్, ఇది జట్టు వ్యూహమే అని తెలిపిన స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్‌కు 9 నెలలు, వార్నర్, స్మిత్‌లను ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ శిక్షలు ఖరారు చేసింది. అంతేకాకుండా వార్నర్ ఎప్పటికి కెప్టెన్ కాలేడని ప్రకటించింది. దీంతో స్మిత్, వార్నర్‌లు ఈ సీజన్ ఐపీఎల్‌కు సైతం దూరమయ్యారు. దుబాయ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన వాట్సన్ బాల్‌ట్యాంపరింగ్ ఉదంతపై స్పందిస్తూ.. ‘‘గతంలో పలువురు ఆటగాళ్లకు విధించిన శిక్షలతో పోలిస్తే.. ఇవి చాలా దారుణమైన శిక్షలు. ఇప్పటికే వాళ్లు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్లు మళ్లి తిరిగొచ్చే సమయానికి మరింత దృఢంగా తయారవుతారు. వారు చేసిన తప్పులే వారిని అలా తయారు చేస్తాయి. వారు చేసింది పెద్ద నేరమే. కాదనడం లేదు. ఈ వివాదం నుంచి ఆస్ట్రేలియా జట్టు కోలుకునేలా చేసే సత్తా కొత్త కోచ్ జస్టిన్ లాంగర్‌కు ఉంది. అతనే సరైనవాడు.’ అని వాట్సన్ తెలిపాడు. ఐపీఎల్-11 సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్ సెంచరీతో రాణించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ అందుకోవడం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ శిక్షలు మరి ఎక్కువగా ఉన్నాయని గతంలో భారత క్రికెటర్లతో సహా ఆసీస్ మాజీ క్రికెటర్లు సైతం ఈ ఆటగాళ్లపై సానుభూతి వ్యక్తం చేశారు. -
తొలి ఆటగాడిగా వాట్సన్
ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఐపీఎల్ ఫైనల్స్‌లో భాగంగా ఛేజింగ్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా వాట్సన్ రికార్డు సృష్టించాడు. ఆదివారంతో ముగిసిన ఐపీఎల్-11 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తుది పోరులో వాట్సన్(117 నాటౌట్) అజేయ శతకం సాధించాడు. ఫలితంగా ఓవరాల్ ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ పోరు లక్ష్య ఛేదనలో శతకం బాదిన మొదటి ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు సాధించాడు. అంతకముందు ఐపీఎల్ ఫైనల్ పోరు ఛేదనలో అత్యధిక స్కోరు చేసిన వారిలో మనీష్ పాండే(94-2014), మన్వీందర్ బిస్లా(89-2012), క్రిస్ గేల్(76-2016)లు మాత్రమే ఉన్నారు. అయితే ఐపీఎల్ ఫైనల్స్‌లో శతకం సాధించిన రెండో ఆటగాడిగా వాట్సన్ నిలిచాడు. గతంలో వృద్ధిమాన్ సాహా ఐపీఎల్ ఫైనల్లో సెంచరీ సాధించాడు. 2014 ఐపీఎల్ ఫైనల్లో కింగ్స్ పంజాబ్ తరపున ఆడిన వృద్ధిమాన్ సాహా(115 నాటౌట్)..కేకేఆర్‌పై సెంచరీ సాధించాడు. -
వాట్సన్.. నీకిదే వందనం!
సాక్షి, ముంబై : ‘సింహంతో వేట.. నాతో ఆట’ రెండూ ప్రమాదకరమే.. అన్నచందంగా సాగింది షేన్ వాట్సన్ బ్యాటింగ్... తొలి 10 బంతుల్లో స్కోరు 0... కానీ తర్వాతి 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 117 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బలమైన బౌలింగ్ జట్టుగా పేరున్న సన్‌రైజర్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడిన వాట్సన్.. చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ధోనీ జట్టు, షేన్ వాట్సన్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు అభినందనలు. ప్రపంచంలోనే పెద్ద టీ20 టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్ టైటిల్‌కు మీరు అర్హులు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న చెన్నై ఆటగాళ్లకు శుభాభినందనలు. ఈ విజయం తమిళనాడు ప్రజలందరికీ చెందుతుందంటూ’.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై జట్టును ప్రశంసలతో ముంచెత్తాడు. ‘సూపర్ కోచ్... సూపర్ కెప్టెన్.. సూపర్ టోర్నమెంట్లో సూపర్ విజయాన్ని అందుకుందంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ‘అద్భుతమైన ప్రదర్శన చేసిన షేన్ వాట్సన్.. నీకిదే నా వందనం. మనందరికీ ఎంతో ఇష్టమైన క్రికెట్ పండుగ ముగిసింది. లవ్ యూ ఇండియా’ అంటూ ఆసీస్ క్రికెట్ దిగ్గజం మాథ్యూ హెడెన్ వాట్సన్‌ను అభినందించారు. ‘ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఆటతీరు పట్ల నాకెంతో గర్వంగా ఉంది. మమ్మల్ని పోత్సహించిన అభిమానులకు, సన్‌రైజర్స్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. షేన్ వాట్సన్ చాలా అద్భుతంగా ఆడాడు. మీరు(సీఎస్కే) ఈ విజయానికి అర్హులంటూ’.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. ‘సీఎస్కే మూడోసారి ఐపీఎల్ టైటిల్ సాధించడంలో షేన్ వాట్సన్ కీలక పాత్ర పోషించాడు’ అంటూ ఐసీసీ అభినందించింది. Congratulations Chennai Superkings on becoming deserving champions of the biggest T20 tournament in the world. Brilliant throughout the tournament and the wonderful people from Chennai and whole of TN deserve this @ChennaiIPL . #IPL2018Final — Virender Sehwag (@virendersehwag) May 27, 2018 Super Coach ... Super Captain ... Winning a Super Tournament ... #IPL2018Final — Michael Vaughan (@MichaelVaughan) May 27, 2018 Very very special performance @ChennaiIPL @ShaneRWatson33 take a bow mate...#crushedit God Bless you all as our beloved festival of @IPL comes to a conclusion. Love you India❤️❤️❤️ pic.twitter.com/sDHeLJucwq — Matthew Hayden AM (@HaydosTweets) May 27, 2018 A @ShaneRWatson33 special guides @ChennaiIPL to their third @IPL title! 🏆 #IPL2018Final #CSKvSRH pic.twitter.com/VguMr6T8SQ — ICC (@ICC) May 27, 2018 Very proud of the way @SunRisers played in this IPL, I thank each and every member of the @SunRisers family for their efforts and support. Absolutely brilliant knock from Shane Watson and many congratulations to @ChennaiIPL on a well-deserved victory #IPLfinal2018 — VVS Laxman (@VVSLaxman281) May 27, 2018 -
సాధించెన్నై...
రిటర్న్ ఆఫ్ సూపర్ కింగ్స్... పునరాగమనం అంటే ఎంత ఘనంగా ఉండాలో చెన్నై నిరూపించింది. వివాదంతో లీగ్‌కు రెండేళ్లు దూరమై, వేలంలో మూడు పదుల ఆటగాళ్లతో అంకుల్స్ జట్టుగా ముద్ర పడి, సీజన్లో సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌కే పరిమితమై కూడా ఆ జట్టు అద్భుతాన్ని చేసింది. తమకే సాధ్యమైన రీతిలో విజయయాత్ర కొనసాగించి మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. నాయకుడిగా తనేమిటో మళ్లీ మళ్లీ చూపించిన ధోని మార్గనిర్దేశనంలో, మదరాసీల అభిమాన జనం ప్రోత్సాహంతో విజిల్ పొడు అంటూ గెలుపు ఈల వేసింది. తొలి 10 బంతుల్లో 0 పరుగులు... ఒక టి20 మ్యాచ్‌లో ఇంతటి చెత్త ఆరంభం ఏ బ్యాట్స్‌మన్ కూడా చేసి ఉండడు. కానీ షేన్ వాట్సన్ అలాగే ఆడాడు. కానీ ఆ తర్వాత అతను వీర విధ్వంసం సృష్టించాడు. తర్వాతి 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో ఏకంగా 117 పరుగులు బాది చెన్నైని విజేతగా నిలిపాడు. ప్రధాన బౌలర్లు భువనేశ్వర్ (0/17), రషీద్ (0/24)లను జాగ్రత్తగా ఆడి మిగిలిన బౌలర్లపై విరుచుకుపడాలనుకున్న చెన్నై వ్యూహం అద్భుతంగా పని చేసింది. ఫలితంగా తుది పోరు ఏకపక్షంగా మారిపోయి ఈ సీజన్లో రైజర్స్పై చెన్నై స్కోరు 4–0గా మారిపోయింది. బలమైన బౌలింగ్ అండగా, కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ముందుండి నడిపించగా... ఫైనల్ వరకు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. చిన్న మైదానమైన వాంఖెడేలో ముందుగా భారీ స్కోరు చేయడంలో తడబడిన ఆ జట్టు లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కూడా విఫలమైంది. ఈ సీజన్లో అతి స్వల్ప స్కోర్లను కూడా రక్షించుకోగలిగిన జట్టుకు తుది పోరులో మాత్రం అది సాధ్యం కాలేదు. అసలు మ్యాచ్‌లో సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్ వైఫల్యం రైజర్స్‌ను దెబ్బ తీసింది. విలియమ్సన్ స్ఫూర్తిదాయక నాయకత్వం జట్టును ఫైనల్ వరకు చేర్చినా చివరకు నిరాశ తప్పలేదు. ముంబై: మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఐపీఎల్ ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వాట్సన్ గుర్తింపు పొందగా, సురేశ్ రైనా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 117 పరుగులు జోడించడం విశేషం. పఠాన్, బ్రాత్‌వైట్ మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఆరంభంలోనే గోస్వామి (5) వికెట్ కోల్పోయింది. లేని రెండో పరుగు తీసే ప్రయత్నంలో అతను ఔటయ్యాడు. ఇన్‌గిడి మెయిడిన్ వేయడంతో తొలి 4 ఓవర్లు ముగిసేసరికి జట్టు 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే చహర్ వేసిన ఐదో ఓవర్లో విలియమ్సన్ 6, 4 కొట్టి జోరు పెంచాడు. ఆ తర్వాత బ్రేవో బౌలింగ్‌లోనూ విలియమ్సన్ వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరోవైపు శిఖర్ ధావన్ (25 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. అయితే జడేజా తొలి ఓవర్లోనే ధావన్ బౌల్డ్ కావడంతో 51 పరుగుల రెండో వికెట్ (40 బంతుల్లో) భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో కెప్టెన్, షకీబ్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. జడేజా ఓవర్లో వీరిద్దరు 2 ఫోర్లు, సిక్స్‌తో 17 పరుగులు రాబట్టారు. బ్రేవో ఓవర్లో మళ్లీ రెండు ఫోర్లు కొట్టి దూసుకుపోతున్న విలియమ్సన్కు ఎట్టకేలకు కరణ్ శర్మ బ్రేక్ వేశాడు. దూరంగా వెళుతున్న బంతిని ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో అతను స్టంపౌటయ్యాడు. అయితే దూకుడు తగ్గనివ్వని షకీబ్, పఠాన్ 22 బంతుల్లో 32 పరుగులు జత చేశా రు. రైనా అద్భుత క్యాచ్‌కు షకీబ్ వెనుదిరగ్గా, హుడా (3) విఫలమయ్యాడు. ఈ దశలో పఠాన్, బ్రాత్‌వైట్ బ్యాటింగ్ దూకుడు రైజర్స్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు భారీ షాట్లతో 18 బంతుల్లోనే 34 పరుగులు జోడించారు. తొలి 10 ఓవర్లలో 73 పరుగులు సాధించిన హైదరాబాద్... తర్వాతి 10 ఓవర్లలో 105 పరుగులు చేయడం విశేషం. భారీ భాగస్వామ్యం... ఛేదనను చెన్నై చాలా నెమ్మదిగా ప్రారంభించింది. భువనేశ్వర్ తొలి ఓవర్‌ను మెయిడిన్ వేయగా... కుదురుకునేందుకు వాట్సన్ చాలా సమయం తీసుకున్నాడు. ఇదే ఒత్తిడిలో డు ప్లెసిస్ (10) వెనుదిరగడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే వాట్సన్, రైనా కలిసి ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. సందీప్ ఓవర్లో వరుసగా 6, 4 బాది తొలిసారి టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత అతడిని ఆపడం సన్‌రైజర్స్ వల్ల కాలేదు. కౌల్ తన తొలి ఓవర్లో 16 పరుగులు సమర్పించుకోవడంతో చెన్నై జోరు మొదలైంది. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 80 పరుగులకు చేరింది. తర్వాతి రెండు ఓవర్లలో రెండు సిక్సర్ల సహాయంతో చెన్నై 24 పరుగులు రాబట్టింది. అనంతరం సందీప్ శర్మ వేసిన ఓవర్లో ఏకంగా 27 పరుగులు రావడంతో సూపర్ కింగ్స్ విజయం దాదాపుగా ఖాయమైంది. రైనా ఔటైనా... 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం వాట్సన్ చివరి వరకు నిలిచాడు. అతనికి రాయుడు (16 నాటౌట్) సహకరించడంతో 9 బంతులు మిగిలి ఉండగానే విజయం పూర్తయింది. ఆ ఓవర్... సందీప్ శర్మ 13వ ఓవర్ వేయడానికి ముందు చెన్నై లక్ష్యం 48 బంతుల్లో 75 పరుగులు. ఒకటి, రెండు వికెట్లు పడితే ఒత్తిడి పెరిగే అవకాశం ఉండేది. కానీ వాట్సన్ వరుస బంతుల్లో 4, 6, 6, 6, 4 బాదడంతో మ్యాచ్ చెన్నై వైపు పూర్తిగా మళ్లింది. మరో వైడ్‌తో కలిసి ఈ ఓవర్లో సందీప్ 27 పరుగులిచ్చాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: శ్రీవత్స్ గోస్వామి రనౌట్ 5; ధావన్ (బి) జడేజా 26; విలియమ్సన్ (స్టంప్డ్) ధోని (బి) కరణ్ శర్మ 47; షకీబ్ (సి) రైనా (బి) బ్రేవో 23; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 45; దీపక్ హుడా (సి) సబ్–షోరే (బి) ఇన్‌గిడి 3; బ్రాత్‌వైట్ (సి) రాయుడు (బి) శార్దుల్ ఠాకూర్ 21; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–13, 2–64, 3–101, 4–133, 5–144, 6–178. బౌలింగ్: చహర్ 4–0–25–0, ఇన్‌గిడి 4–1–26–1, శార్దుల్ ఠాకూర్ 3–0–31–1, కరణ్ శర్మ 3–0–25–1, బ్రేవో 4–0–46–1, జడేజా 2–0–24–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: వాట్సన్ నాటౌట్ 117; డు ప్లెసిస్ (సి అండ్ బి) సందీప్ శర్మ 10; రైనా (సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 32; రాయుడు నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–16, 2–133. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–17–0, సందీప్ శర్మ 4–0–52–1, సిద్ధార్థ్ కౌల్ 3–0–43–0, రషీద్ ఖాన్ 4–1–24–0, షకీబ్ 1–0–15–0, బ్రాత్‌వైట్ 2.3–0–27–1. ‘మేం చేసిన స్కోరు గెలిచేందుకు సరిపోతుందని భావించినా ఆ తర్వాత పిచ్ మారిపోయింది. తొలి 5–6 ఓవర్లతో పాటు మ్యాచ్‌లో చాలా భాగం ముందంజలోనే ఉన్నాం. కానీ వాట్సన్ అంతా మార్చేశాడు. సీజన్ మొత్తం బాగా ఆడి ఇలా ఓడిపోవడం నిరాశగా ఉంది. మా కుర్రాళ్లు చాలా బాధపడుతున్నారు. అయితే మేం గెలవకపోయినా బాగా పోరాడాం. నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉండటం అదృష్టం. అయితే వెనుదిరిగి చూస్తే కొన్ని గుర్తుంచుకునే క్షణాలు ఉన్నా చివరకు ఓటమే దక్కింది. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా బాధ్యతగా రాణించడం సంతృప్తిగా ఉంది. జట్టు ఫైనల్ చేరడం సమష్టి కృషిగానే భావిస్తా’ – కేన్ విలియమ్సన్ ‘రషీద్లాగే భువనేశ్వర్ కూడా చాలా తెలివైన బౌలర్. కాబట్టి ప్రత్యర్థి జట్టులో మమ్మల్ని ఇబ్బందిపెట్టేవారు ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. మా బ్యాటింగ్ చాలా బాగా సాగింది. బలమైన మిడిలార్డర్‌ను నమ్ముకున్నాం. ప్రతీ విజయం ప్రత్యేకమే. ఏ ఒక్కటో గొప్పదని చెప్పలేను. నా దృష్టిలో వయసనేది ఒక అంకె మాత్రమే. 33 ఏళ్ల రాయుడు మా ప్రధాన బ్యాట్స్‌మన్. 19–20 ఏళ్ల కుర్రాళ్లు కాకపోయినా మైదానంలో చురుగ్గా ఉండగలవాళ్లే కావాలి. మాకు వయసుకంటే మా ఆటగాళ్ల గురించి, వారి ఫిట్నెస్ గురించి చక్కటి అవగాహన ఉంది కాబట్టి దానికి తగినట్లుగా వ్యూహాలు రూపొందించాం. గెలిచినా, ఓడినా చెన్నై వెళ్లి అభిమానులను కలుసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కప్‌తో చెన్నైకి తిరిగి వెళుతున్నాం.’ – ఎమ్మెస్ ధోని (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బట్లర్ గెలిపించాడు..
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ ఇంకా బంతి ఉండగా ఛేదించింది. తద్వారా ఈ సీజన్లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి రాజస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. రాజస్తాన్ ఆటగాళ్లలో జోస్ బట్లర్(95 నాటౌట్;60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. అతనికి జతగా శాంసన్(21), స్టువర్ట్ బిన్నీ(22)లు ఫర్వాలేదనిపించారు. అంతకముందు సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 19 పరుగుల వద్ద అంబటి రాయడు(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ షేన్ వాట్సన్‌కు జత కలిసిన సురేశ్ రైనా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ రెండో వికెట్ 86 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత వాట్సన్(39; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. ఆపై రైనాకు ఎంఎస్ ధోని జత కలిశాడు. కాగా, హాఫ్ సెంచరీ నమోదు చేసిన తర్వాత రైనా(52;35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను మరోసారి భుజాలపై వేసుకున్న ధోని సమయోచితంగా ఆడాడు. సామ్ బిల్లింగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ధోని(33 నాటౌట్; 23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్), సామ్ బిల్లింగ్స్(27; 22 బంతుల్లో 3 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా, ఇష్ సోథీకి ఓ వికెట్ దక్కింది. -
వాట్సన్‌కు ఇదే అత్యుత్తమం..
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న షేన్ వాట్సన్ సరికొత్త ఘనతను సాధించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్లో వాట్సన్ ఆడిన వేదికల పరంగా చూస్తే జైపూర్‌లోనే అత్యధిక పరుగుల్ని నమోదు చేసి కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో ఇక్కడ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో వాట్సన్(39) ఫర్వాలేదనిపించాడు. దాంతో జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో వాట్సన్ 865 పరుగులు సాధించాడు. ఏ వేదిక పరంగా చూసినా వాట్సన్‌కు ఇదే అత్యుత్తమంగా నిలిచింది. -
‘ధోని విజయ రహస్యం ఇదే’
పుణే : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా కనిపిస్తాడు. ఈ ప్రశాంతతోనే ధోని సారథిగా ఎన్నో విజయాలందించాడు. అయితే ఈ ప్రశాంతత వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ధోని సహచర ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ మీడియాతో పంచుకున్నాడు. పుష్టిగా తినడం, కంటి నిండా నిద్రపోవడమే ధోని విజయ రహస్యమని ఈ ఆసీస్ ఆటగాడు చెప్పుకొచ్చాడు. సోమవారం ఢిల్లీడేర్ డెవిల్స్‌పై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ ధోని తినడం మనం చూడలేము. మధ్యాహ్నభోజనమైనా..అల్పహారమైనా ఒకేలా చాలా ఎక్కువగా తింటాడు. అతనికి నింద్రంటే అమితమైన ప్రేమ. ధోనితో కలిసి ఆడటం మాకు దక్కిన ప్రత్యేక హక్కు. సీఎస్కేకు ఆడటమంటేనే ప్రతి ఒక్కరు ధోనితో ఆడినట్టేనని’ వాట్సన్ తెలిపాడు. ధోని హిట్టింగ్ సూపర్.. ధోని బంతిని హిట్ చేసే విధానం బాగుంటుందని, అతను ఓ అద్భుతమైన ఆటగాడని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ‘ ధోని బంతిని హిట్ చేసే విధానం బాగుంటుంది. అతనో అద్బుత ఆటగాడు. అతను ఆడే షాట్లు అన్ని రకాల వికెట్‌పై, అందరి బౌలింగ్‌లో ఆడుతాడు. ఒత్తిడిలో సైతం అతను ప్రశాంతంగా ఉంటాడు. ఎవరి బౌలింగ్‌లో రన్‌రేట్‌ను పెంచే అవకాశం ఉంటుందోనని సరిగ్గా అంచనా వేస్తాడు. అతను ప్రశాంతంగా ఉండటం అత్యద్బుతం. గత కొద్దిరోజులుగా ధోని దగ్గరగా ఉంటూ అతని గురించి తెలుసుకుంటున్నానని’ వాట్సన్ పేర్కొన్నాడు. -
అత్యుత్తమ ఆటగాడు అతనే :వాట్సన్
పుణే : ఐపీఎల్ సీజన్ 11 లో సెంచరీ చేసిన రెండో ఆటగాడు షేన్‌వాట్సన్ క్రిస్‌గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆసీస్ ఆల్ రౌండర్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. సెంచరీల మోత మోగించే క్రిస్‌గేల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ 20 ఆటగాడని కీర్తించాడు. టీ 20ల్లో అధిక సెంచరీలు చేయగలిగే ప్రతిభ క్రిస్‌గేల్ సొంతమని కొనియాడాడు. ఆ కారణంగానే గేల్‌ను యూనివర్స్ బాస్ అంటారంటూ ప్రశంసలు కురిపించాడు. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీఎస్కే జట్టులో ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వాట్సన్ పేర్కొన్నాడు. రాత్రి జరిగిన మ్యాచులో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచులో 57 బంతుల్లో 106 పరుగులు చేసిన వాట్సన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. తద్వారా ఈ సీజన్లో క్రిస్‌గేల్ తర్వాత సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్‌గేల్.. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. -
రాయల్స్‌పై చెన్నై ఘనవిజయం
-
రాయల్స్‌పై చెన్నై ఘనవిజయం
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చెందింది. రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్(45) రాణించగా, జాస్ బట్లర్(22) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, డ్వేన్ బ్రేవో, కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్లు తలో రెండు వికెట్లు సాధించగా, వాట్సన్, తాహీర్‌లు తలో వికెట్ తీశారు. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో చెన్నై ఇన్నింగ్స్‌ను అంబటి రాయుడు, షేన్ వాట్సన్‌లు ఆరంభించారు. జట్టు 50 పరుగుల వద్ద రాయుడు(12) ఔట్ కాగా, షేన్ వాట్సన్ మాత్రం రెచ్చిపోయాడు. సురేశ్ రైనా(46)తో కలిసి రెండో వికెట్‌కు 81 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే వాట్సన్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. వీరిద్దరూ చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో చెన్నై 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే రైనా తర్వాత వాట్సన్ తన దూకుడును మరింత పెంచాడు. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిన వాట్సన్ రాయల్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఓపెనర్‌గా దిగిన వాట్సన్‌కు ఆరంభంలోనే రెండు లైఫ్‌లు లభించడంతో దాన్ని సద్వినియోగం చేసుకుని రాయల్స్‌కు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వాట్సన్ దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 106 పరుగులు చేసిన వాట్సన్ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. వాట్సన్‌కు జతగా సురేశ్ రైనా(46;29 బంతుల్లో 9ఫోర్లు), డ్వేన్ బ్రేవో(24 నాటౌట్;16 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. -
వాట్సన్ విజృంభణ
పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్లో రెండో సెంచరీ నమోదైంది. నిన్నటి ఆటలో క్రిస్ గేల్ సెంచరీతో చెలరేగిపోతే, ఈ రోజు ఆటలో షేన్ వాట్సన్ సెంచరీ(106; 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు)తో విజృంభించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు వాట్సన్ శతకంతో విరుచుకుపడ్డాడు. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిన వాట్సన్ రాయల్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఓపెనర్‌గా దిగిన వాట్సన్‌కు ఆరంభంలోనే రెండు లైఫ్‌లు లభించడంతో దాన్ని సద్వినియోగం చేసుకుని రాయల్స్‌కు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వాట్సన్ దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా సురేశ్ రైనా(46;29 బంతుల్లో 9ఫోర్లు), డ్వేన్ బ్రేవో(24 నాటౌట్;16 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో చెన్నై ఇన్నింగ్స్‌ను అంబటి రాయుడు, షేన్ వాట్సన్‌లు ఆరంభించారు. జట్టు 50 పరుగుల వద్ద రాయుడు(12) ఔట్ కాగా, షేన్ వాట్సన్ మాత్రం రెచ్చిపోయాడు. సురేశ్ రైనా(46)తో కలిసి రెండో వికెట్‌కు 81 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే వాట్సన్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. వీరిద్దరూ చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో చెన్నై 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే రైనా తర్వాత వాట్సన్ తన దూకుడును కొనసాగించడంతో చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌గా వచ్చిన వాట్సన్ ఇన్నింగ్స్‌లో ఇంకా బంతి ఉండగా మాత్రమే ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. -
తండ్రీ కొడుకుల సరదా ఆట..
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌తో క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి ఫ్రాంఛైజీలు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన తమ జట్టు ఆటగాళ్లను అభినందిస్తూ ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. అంతేకాదు విరామ సమయాల్లో వారు చేసే అల్లరిని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)టీమ్ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 11లో సీఎస్కేకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కుటుంబంతో పాటు భారత్‌కు విచ్చేసిన షేన్ వాట్సన్ తన కుమారుడితో కలిసి హోటల్ కారిడార్‌లో ఫుట్‌బాల్ ఆడాడు. సరదా కోసం ఆడుతున్నప్పటికీ వాట్సన్ కుమారుడు మాత్రం గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. బాల్ కోసం తండ్రిని వెనక్కి నెట్టేస్తూ మరీ పోటీపడ్డాడు. కొడుకు పట్టుదలను చూసిన వాట్సన్.. అతని ఆటను ఎంజాయ్ చేస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు. ‘వట్టూ బ్రేకింగ్ ద వట్టూ డిఫెన్స్’ అంటూ ఈ తండ్రీ కొడుకుల సరదా వీడియోను సీఎస్కే టీమ్ ట్విటర్లో పోస్ట్ చేసింది. Watto breaking the Watto defence! #WhistlePodu 🦁💛 @ShaneRWatson33 pic.twitter.com/zqPuVfUtT8 — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2018 -
నాదే తప్పు.. అందుకే ఓడిపోయాం: కెప్టెన్
ఇండోర్: కింగ్స్ పంజాబ్ ఎలెవన్ చేతిలో ఎదురైన అవమానకరమైన పరాభవానికి తానే కారణమని బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ షేన్ వాట్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటమి నిందను తనపై వేసుకున్నాడు. ఇండోర్‌లో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక దశలో 22 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగళూరును డివీలియర్స్ ఆదుకున్నాడు. సుడిగాలి ఇన్నింగ్స్‌తో 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. కానీ అతను అంత మోత మోగించినా బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. 149 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు హషీమ్ ఆమ్లా (58), గ్లెన్ మాక్స్వెల్ (43) రాణించడంతో 14.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెంగళూరు సారథి.. ఓటమికి తనదే బాధ్యత అంటూ తనను తాను నిందించుకున్నాడు. ‘నేను బాగా బ్యాటింగ్ చేయలేదు. మొదటి ఓవర్లోనే నేను ఔటయ్యాను. కాబట్టి నన్ను నేను నిందించుకోక తప్పదు’ అని వాట్సన్ అన్నాడు. తమ జట్టు కనీసం 170-180 పరుగులు చేసి ఉంటే విజయాన్ని అందుకొని ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ కెప్టెన్ గ్లెన్ మాక్స్వెల్ మాట్లాడుతూ తమ విజయం క్రెడిట్ బౌలర్లదేనని ప్రశంసించారు. -
ఆసీస్ కెప్టెన్ల పోరు..నెగ్గేదెవరు
ఇండోర్: ఐపీఎల్-10 లో భాగంగా సోమవారం జరిగే పంజాబ్, బెంగళూరు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తాత్కలిక కెప్టెన్ ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మాక్స్‌వెల్‌ల మధ్య పోటికి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. ఈ రసవత్తర పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. పంజాబ్ తొలి మ్యాచ్ రైజింగ్పుణేపై గెలిచి ఊపు మీద ఉంది. బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ పై గెలిచి బోణి కొట్టింది. ఇరు జట్లు గెలుపుపై కన్నెశాయి. గాయంతో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లకు దూరమైన బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లి, డివిలియర్స్‌లు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఒక వేళ ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడితే బెంగళూరు బ్యాటింగ్ పటిష్టం కానుంది. ఇప్పటికే విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్, కేదార్ జాదవ్, షేన్ వాట్సన్లతో జట్టు పటిష్టంగా ఉంది. అయితే గేల్ ఫాం మాత్రం బెంగళూరును కలవరపెడుతుంది. గేల్ జరిగిన రెండు మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు. బౌలింగ్‌లో యజువేంద్ర చాహాల్, తైమిల్ మిల్స్, బిల్లీ స్టేన్లేక్లతో బైలింగ్ లైనప్ పర్వాలేదు. ఢిల్లీ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో చెలరేగిన కేదార్ జాదావ్ ఫాం కంటిన్యూ అయితే బెంగళూరు విజయం కాయం. రైజింగ్ పుణేపై గెలిచి ధీమాతో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్ గెలుస్తామనే విశ్వాసంతో ఉంది. మ్యాక్స్‌వెల్ మెరుపులకు మిల్లర్ తోడు నిలవడంతో పుణేపై పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండోర్‌లో జరిగే ఈ మ్యాచ్ మాత్రం అభిమానులను కనువిందు చేయనుంది. -
ఏబీ కాదు.. వాట్సన్!
హైదరాబాద్: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ ను ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా పూర్తిగా జట్టుకు దూరం కాగా, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా పలు మ్యాచ్‌ల నుంచి వైదొలుగుతున్నాడు. అతను భుజం గాయం నుంచి ఇంకా కోలుకోపోవడంతో ఆర్సీబీ ఆరంభపు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. దాంతో విరాట్ స్థానంలో ఆ జట్టు తాత్కాలిక సారథిగా ఏబీ డివిలియర్స్ కు బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ తొలుత భావిచింది. ఈ మేరకు సన్ రైజర్స్ హైదరాబాద్ తో బుధవారం జరిగే మ్యాచ్‌కు తమ కెప్టెన్ ఏబీ అంటూ ఆ జట్టు ప్రధాన కోచ్ డానియల్ వెటోరి కూడా ఒక ప్రకటన చేశాడు. అయితే ఏబీ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్(సీఎస్ఏ) చేసిన ట్వీట్ ఆందోళనలో పడేసింది. ప్రస్తుతం ఆర్సీబీతో డివిలియర్స్ కలిసినప్పటికీ ప్రారంభపు మ్యాచ్‌లో అతను పాల్గొనడం లేదు. అతని స్థానంలో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆర్సీబీ జట్టులో కోహ్లి, డివిలియర్స్ లు గైర్హాజరీ అయితే వారి స్థానాన్ని వాట్సన్ భర్తీ చేయనున్నట్లు వెటోరి తెలిపాడు. ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న డివిలియర్స్ కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమన్నాడు. ఇదిలా ఉంచితే ఆ జట్టు డాషింగ్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా గాయంతో టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. -
బ్యాట్ సైజు ఎందుకు తగ్గించాలి: వాట్సన్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ‘బ్యాట్ల’ సైజ్ తగ్గించాలనే సూచనను వ్యతిరేకిస్తున్నాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఇటీవల ముంబై సమావేశంలో పలు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ‘బ్యాట్ కంపెనీలు ఎప్పటికప్పు డు బంతితో పోటీతత్వ ప్రయోజనానికి అనుగుణంగానే బ్యాట్లను రూపొందిస్తున్నాయి. చాలా ఏళ్లుగా వారి కృషి న్యాయబద్ధంగానే ఉంది. ఇప్పుడు కొత్తగా బ్యాట్ల సైజ్‌పై అర్థంలేని కుదింపులు తగవు. క్రిస్ గేల్‌నే చూస్తే... తనకు నప్పిన మూడు పౌండ్ల బరువున్న బ్యాట్‌తోనే సహజసిద్ధమైన ఆట ఆడతాడు. అంతేతప్ప అక్కర్లేని లెక్కల పరిమాణాలతో బ్యాట్ ను తగ్గిస్తే అతనికి నప్పుతుందా’ అని అసంతృప్తి వెళ్లగక్కాడు. మెరుగైన బౌలింగ్‌తో ఎంతటి ఆటగాడినైనా ఔట్ చేసే అవకాశం బౌలర్‌కు ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దని అతను సూచించాడు. -
'వాట్సన్ క్యాన్సర్ కణితి లాంటి వాడు'
సిడ్నీ:తనతో పాటు చాలాకాలం క్రికెట్ ఆడిన షేన్ వాట్సన్‌ను ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ క్యాన్సర్ కణితితో పోల్చాడు. గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చోటు చేసుకున్న విభేదాలను క్లార్క్ మరోసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. తన ఆటో బయోగ్రఫీ విడుదలకు సంబంధించి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో క్లార్ పలు విషయాలను వెల్లడించాడు. తాను జట్టుకు కెప్టెన్ గా ఉన్న సమయంలో చాలా మంది ఆటగాళ్లు సెపరేట్ గ్రూప్ గా ఉండేవారనే సంగతిని పేర్కొన్నాడు. వారంతా ఒక కణితి లాంటి వారని, ఆ గ్రూప్ ను అలానే వదిలేస్తే క్యాన్సర్ తరహాలో ప్రమాదకరంగా మారిపోతారన్నాడు. ఆ గ్రూప్ లో వాట్సన్ కూడా ఉన్నాడంటూ మరోసారి అడిగిన ప్రశ్నకు క్లార్క్ అవుననే సమాధానం ఇచ్చాడు. దీనిలో భాగంగానే మూడు సంవత్సరాల క్రితం భారత్ లో టెస్టు సిరీస్ లో మొహాలీలో జరిగిన మూడో మ్యాచ్ నుంచి పలువురు ఆటగాళ్లపై వేటు వేసినట్లు పేర్కొన్నాడు. మరోవైపు 2009లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా టెస్టు విజయం సాధించిన తరువాత అప్పటి వైస్ కెప్టెన్ గా ఉన్న సైమన్ కాటిచ్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పాడు చేశాడన్నాడు. -
ఇది కొలవెరి కాదు.. 'కోహ్లి'వెరి!
'వై దిస్ కొలవెరి.. కొలవెరి డీ' అంటూ అప్పట్లో ధనుష్ ఇంటర్నెట్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన పరుగుల సునామీతో విరాట్ కోహ్లి అంతే దుమారం రేపుతున్నాడు. తాజాగా ఈ బెంగళూరు కెప్టెన్ పుణెతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాది.. కొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే ఐపీఎల్లో రెండు సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో క్రిస్ గేల్ ఒకే ఐపీఎల్ సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించాడు. ఈ సిరీస్‌లో గత నెల 24న గుజరాత్ లయన్స్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి నాటౌట్‌గా 63 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసినా బెంగళూరు జట్టు ఓడిపోయింది. తాజాగా శనివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి 58 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. ఏడు సిక్స్ లు, ఎనిమిది ఫోర్లతో కోహ్లి వీరవిహారంతో బెంగళూరు జట్టు పుణెపై అలవోకగా విజయాన్ని సాధించింది. తీరని పరుగుల దాహంతో మైదానంలో అడుగుపెడుతున్న కోహ్లి రికార్డుల పరంపర ఇక్కడితో ఆగిపోలేదు. మూడు ఐపీఎల్ ఎడిషన్లలోనూ 500లకుపైగా పరుగులు చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. తాజా సిరీస్‌లో ఇప్పటివరకు 541 పరుగులు చేసిన ఆయన 2015లో 505 పరుగులు, 2013లో 634 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సచిన్ టెండూల్కర్ రెండుసార్లు 500లకుపైగా పరుగులు చేశాడు. 2011లో 553, 2010లో 618 పరుగులు ఆయన చేశాడు. సచిన్ రికార్డును తాజాగా కోహ్లి అధిగమించాడు. అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రికార్డు కూడా ఆయన పేరిట ఉంది. ఒక కెప్టెన్‌గా కోహ్లి 2013లో 634 పరుగులే అత్యధికం. పేరుకు అనేకమంది స్టార్ ఆటగాళ్లు ఉన్న బెంగళూరు జట్టు గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ తనదైన పరుగుల వరదతో తిరిగి జట్టును విజయాల ట్రాక్‌లోకి తీసుకురావడంతో అతన్ని బెంగళూరు జట్టు సభ్యులు వేనోళ్లతో కొనియాడుతున్నారు. క్రికెట్ దిగ్గజాలు కూడా కోహ్లి బ్యాటింగ్ ను కొనియాడుతున్నారు. అన్ని ఫార్మెట్లలోనూ కోహ్లి ఆల్‌టైమ్ గ్రేట్ ఛేజర్ అని, అతను జట్టులో ఉండటం వల్ల ఛేజింగ్ అనేది చాలా సులువుగా మారిపోయిందని బెంగళూరు క్రికెటర్ షేన్ వాట్సన్ కోహ్లిని ప్రశంసించాడు. -
వాట్సన్ గిటార్.. కోహ్లి, గేల్ తీన్మార్!!
జల్సా చేయడంలో, నైట్ అంతా పార్టీలో చిందులు వేయడంలో, తీన్మార్ డ్యాన్స్ చేయడంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లకు మరెవరు సాటిరారనే చెప్పాలి. ఇరగదీసే స్టెప్పులు వేయడంలో విరాట్ కోహ్లి ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇక కోహ్లికి సుడిగాలి లాంటి క్రిస్ గేల్ జతకలిస్తే.. షేన్ వాట్సన్ తన గిటారుతో దుమ్ములేపే ట్యూన్ ఇస్తే.. ఇక చెప్పాల్సిన పని లేదు. టాప్ లేచిపోద్ది. అలాంటి టాప్ లేచిపోయే డ్యాన్సులతో సుడి'గేల్', 'వీర' విరాట్ దుమ్ములేపారు. నిజానికి తాజా ఐపీఎల్లో బెంగళూరు జట్టు ఏమంతగా విజయాలు సాధించడం లేదు. అయినా ఆ జట్టు ఆటగాళ్ల జల్సాలకు, పార్టీ లైఫ్ అడ్డులేనట్టు కనిపిస్తోంది. ఇటీవల బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ తన గిటారు నైపుణ్యాన్ని చూపించాడు. అదరగొట్టేలా వాట్సన్ గిటారు వాయిస్తుంటే.. ఆ మ్యూజిక్కు తగ్గట్టు విరాట్ కోహ్లి స్టెప్పులు వేశాడు. ఇటీవల కూతురు పుట్టడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న గేల్ కూడా కోహ్లితో జతకలిసి తన డ్యాన్సింగ్ రిథమ్ ను చూపెట్టాడు. క్రికెటర్లు ఫుల్ జోష్‌తో హంగామా చేసిన ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. -
'సర్ఫరాజ్ బ్యాటింగ్ సూపర్'
బెంగళూరు: భారత యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ పై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. అతడి బ్యాటింగ్ స్టయిల్ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. అతడు ఆడే షాట్లపై కంట్రోల్ బాగుందని పేర్కొన్నాడు. 'అతడో అద్భుతమైన యువకుడు. అన్నిరకాల షాట్లు ఆడేందుకు అతడు ఎంతో ప్రాక్టీస్ చేసినట్టు అర్థమవుతోంది. తాను ఆడే షాట్లపై నియంత్రణ బాగుంది. ఇలాంటి యంగ్ టాలెంట్ ను ఇంతకుముందెన్నడూ చూడలేదు. బాగా బ్యాటింగ్ చేసేందుకు అతడు చాలా ప్రాక్టీస్ చేస్తాడు. అది ఈ రోజు మ్యాచ్ లో ప్రస్ఫుటమైంది. ఒక్క చెత్త షాట్ కూడా ఆడలేదు. బ్యాక్ ఫుట్ మీద అతడు కొట్టిన సిక్సర్ అద్భుతమైన షాట్. ఎంతో సులువుగా బాదిన ఈ షాట్ ను చూసి తీరాల్సిందే. సర్ఫరాజ్ షాట్ సెలెక్షన్ చాలా బాగుంద'ని వాట్సన్ అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 10 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు బాదాడు. సర్ఫరాజ్ చెలరేగడంతో బెంగళూరు స్కోరు 200 పరుగులు దాటింది. -
అతడే ఒక సైన్యం
కోహ్లికే ఎలా సాధ్యమైంది... మళ్లీ అంతే అలవోకగా, అదే ఒత్తిడిలోనూ ఎక్కడా మనసు చెదరకుండా అతను మాత్రమే ఎలా ఆడగలడు. నా బ్యాటింగ్‌లో మ్యాజిక్ లేదని కోహ్లి స్వయంగా చెప్పుకోవచ్చు గాక... కానీ ఇలాంటి ఆటను మ్యాజిక్ అనకుండా ఏం చెప్పగలం. మరో లోకంనుంచి వచ్చినట్లుగా మరెవరికీ సాధ్యం కానట్లుగా అంత సునాయాసంగా షాట్లు ఆడేస్తుంటే బౌలర్లు మాత్రం ఏం చేయగలరు, ఎలాంటి ప్రత్యర్థి అయినా తలవంచక ఏం చేస్తుంది. పూజా పునస్కారాలకు దూరం అని సరదాగా చెప్పుకోవచ్చు... కానీ మైదానంలో దిగితే దీక్ష బూనిన రుషిలా ఎంతటి పట్టుదల, ఎంతటి గాంభీర్యం, లక్ష్యం చేరే వరకు పట్టు వీడని అచంచల ఆత్మవిశ్వాసం. సమకాలీన క్రికెట్లో అతనితో పోల్చేందుకు స్మిత్‌లు, రూట్లు, విలియమ్సన్ల పేర్లు ఏవేవో చెబుతున్నారు. కానీ లక్ష్యాన్ని చేర్చడంలో వారితో పోలిస్తే విరాట్ ఎక్కడో అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రశంసలు కురిపిస్తూ, అతని ఆటను పొగుడుతూ ఎంతో మంది అలసిపోతున్నారు. కానీ పరుగులు తీయడంలో మాత్రం తను అలసిపోవడం లేదు. జట్టు గెలిచిన సమయంలో అతని భావోద్వేగాలు చూస్తే ఒక విజయానికి అతను ఎంతగా ప్రాణం ఒడ్డుతాడో అర్థమవుతుంది. బౌండరీల వర్షం... ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆరంభంలో హాజల్‌వుడ్ బౌలింగ్‌లో వరుసగా కొట్టిన మొదటి రెండు ఫోర్లు చూస్తే ఏదో బ్యాట్ సరిచేసుకుంటూ ఆడినంత సులభంగా అనిపించాయి. పరిస్థితి చక్క బెడుతూ సింగిల్స్‌కే పరిమితమై, కొద్ది సేపటికి మరో ఫోర్, సిక్స్ తర్వాత 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయింది. కానీ ఎలాంటి భావోద్వేగాలు లేవు. ఇంకా కర్తవ్యం పూర్తి కాలేదు. చేయాల్సిన పని మిగిలే ఉంది. అప్పుడు మొదలైంది ఫాల్క్‌నర్ ఓవర్. షార్ట్ బాల్ వేస్తే ఫోర్, యార్కర్ వేస్తే పక్కకు జరిగి ఆడి మరో బౌండరీ, ఆ వెంటనే ముందుకు దూసుకొచ్చి భారీ సిక్సర్. పాపం ఆసీస్ కెప్టెన్ స్మిత్‌కు ఏమీ పాలుపోవడం లేదు. ఏదో అపనమ్మకంగానే కూల్టర్‌నీల్‌కు బంతి అప్పగించాడు. వరుసగా నాలుగు బంతులు... పాయింట్, ఫైన్ లెగ్, ఎక్స్ట్రా కవర్, కవర్స్లపై నాలుగు ఫోర్లు పడ్డాయి. ఏ దిక్కున వేసినా నాకు దిక్కు లేదు అన్నట్లుగా కనిపించింది బౌలర్ మొహం. అంతటితో ఆగిపోయాడా... మధ్యలో మంచింగ్లాగా ఇంతటి ఉత్కంఠ స్థితిలో అవతలి వైపు అన్నలాంటి ధోని అండగా ఉండగా వికెట్ల మధ్య పరుగెత్తడాన్ని చిన్నపిల్లల ఆటలా మార్చేశాడు కోహ్లి. చరిత్రలో గొప్ప క్రికెటర్ల కథలు ఎన్నో వినిపించవచ్చు. కానీ ఇలాంటి ఆటతో ఆడితే ఈతరంలో అతను ఉంటే చాలు మిగతా పది మంది లేకున్నా మ్యాచ్ ఆడేయవచ్చు అన్నట్లుగా సాగుతున్న కోహ్లి ఆటకు హ్యాట్సాఫ్ ► 6 టి20ల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం ప్రతి మ్యాచ్‌లో సవాల్ ఎదురు కావడం ఆటగాడిగా మనల్ని తీర్చి దిద్దుతుంది. ఈ ఇన్నింగ్స్ నా టాప్-3లలో ఒకటి. ఇంకా చెప్పాలంటే ది బెస్ట్ అనవచ్చు. ఎందుకంటే ఇంత ఉద్వేగానికి ఎప్పుడూ గురి కాలేదు. - విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా స్టార్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పాడు. బుధవారం ఢిల్లీలో జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్; గురువారం ముంబైలో జరిగే రెండో సెమీస్‌లో వెస్టిండీస్‌తో భారత్ ఆడతాయి. -
బై బై వాట్సన్
టి20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వాట్సన్ వీడ్కోలు మొహాలీ: ఆస్ట్రేలియా క్రికెట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టి20 ప్రపంచకప్ తర్వాత ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ మేరకు ఐఎస్ బింద్రా స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న జట్టు సభ్యులకు వీడ్కోలు సందేశాన్ని ఇచ్చాడు. ఉద్వేగపూరితమైన మాటలతో సహచరులను ఆకట్టుకున్నాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న వాట్సన్ గత సెప్టెంబర్ నుంచి వన్డేలకూ దూరంగా ఉన్నాడు. 14 ఏళ్ల కిందట మార్చి 24న దక్షిణాఫ్రికాతో వన్డేల్లో అరంగేట్రం చేసిన వాట్సన్ మళ్లీ సరిగ్గా అదే రోజున వీడ్కోలు విషయాన్ని వెల్లడించడం గమనార్హం. 2005లో తొలి టెస్టు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 59 మ్యాచ్‌ల్లో 3731 పరుగులు; 75 వికెట్లు తీశాడు. 190 వన్డేల్లో 5757 పరుగులు; 168 వికెట్లు పడగొట్టాడు. 56 టి20ల్లో 1400 పరుగులు; 46 వికెట్లు తీశాడు. ఆరు టి20 ప్రపంచకప్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్... రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (2007, 2015) గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్లో రెగ్యులర్‌గా ఆడే ఈ ఆల్‌రౌండర్‌ను ఈసారి వేలంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ రూ. 9.5 కోట్లకు దక్కించుకుంది. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయని భావించా. గత వారం రోజులుగా దీని గురించే ఆలోచిస్తున్నా. బిజీ షెడ్యూల్ వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి టి20 ప్రపంచకప్ తర్వాత గుడ్‌బై చెప్పాలని నిర్ణయానికి వచ్చా. ఆసీస్‌కు ఆడటం గౌరవంగా భావిస్తున్నా’ అని వాట్సన్ పేర్కొన్నాడు. -
క్రికెట్ కు షేన్ వాట్సన్ వీడ్కోలు!
మొహాలి: వరల్డ్ ట్వంటీ 20 అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోబోతున్నట్లు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వాట్సన్ తాజాగా ప్రకటించాడు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ తరువాత తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపాడు. గతేడాది యాషెస్ సిరీస్ తరువాత టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు చెప్పిన వాట్సన్.. గత సెప్టెంబర్ నుంచి వన్డేలకు కూడా దూరంగా ఉన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు వాట్సన్ పేర్కొన్నాడు. తాను ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఒకింత గర్వంగా ఉందన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి తరచు గాయాల బారిన పడటం కూడా ఒక కారణమని వాట్సన్ పేర్కొన్నాడు. ఇటు వన్డేల్లో, టెస్టుల్లో, ట్వంటీ 20 ల్లో ఆస్ట్రేలియాకు అద్భుత విజయాలందించిన వాట్సన్.. 59 టెస్టు మ్యాచ్ లు, 190 వన్డేలు ఆడగా, 56 ట్వంటీ 20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2002లో సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన వాట్సన్.. 2005లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతని టెస్టు కెరీయర్ లో 35 .0 పైగా సగటుతో నాలుగు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో షేన్ వాట్సన్ అత్యధిక స్కోరు 176. కాగా, 75 వికెట్లు తీశాడు. ఇక వన్డేల విషయానికొస్తే 9 సెంచరీలు ,33 హాఫ్ సెంచరీల సాయంతో 5,757 పరుగులు చేయగా, 168 వికెట్లు తీశాడు. వన్డేల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 185 నాటౌట్. ఇక ట్వంటీ 20 ల్లో ఒక సెంచరీతో పాటు, 10 హాఫ్ సెంచరీలు సాధించగా, 46 వికెట్లు తీశాడు. ట్వంటీ 20ల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 124 నాటౌట్. -
'వరల్డ్ కప్ నాటికి ఫిట్ అవుతా'
సిడ్నీ:ఇటీవల పొత్తి కడుపులో నొప్పి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) టోర్నీ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్.. వచ్చే వరల్డ్ టీ 20 నాటికి అందుబాటులో ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉన్నందును అప్పటికి ఫిట్ అవుతానని వాట్సన్ తెలిపాడు. 'పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. దాంతో కడుపులో సలుపు మొదలైంది. బంతిని ఒక పరిధిలో వేసినా ఆ నొప్పి బాధించింది. దాంతో టోర్నీ నుంచి ఆకస్మికంగా బయటకు రావాల్సి వచ్చింది. అయితే ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. అన్ని అనుకున్నట్లు జరిగితే వరల్డ్ కప్ లో ఆడతా'అని వాట్సన్ తెలిపాడు. వరల్డ్ కప్‌లో వాట్సన్ పాల్గొనడంపై అనుమానస్పదంగా మారిందంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో అతను పైవిధంగా స్పందించాడు. భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌కు ఇంకా మూడు-నాలుగు వారాలు సమయం ఉన్నందున తన గాయం నుంచి కోలుకునే అవకాశం ఉందన్నాడు. -
వాట్సన్ ఆడటం అనుమానమే!
సిడ్నీ: ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)వేలంలోఅత్యధిక ధర దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ త్వరలో భారత్ లో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో పాల్గొనడం సందేహంగా మారింది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడుతున్న వాట్సన్ పొత్తి కడుపులో నొప్పి తీవ్రం కావడంతో ఆ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. దీంతో వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైన వాట్సన్ అందులో పాల్గొనడంపై కూడా నీలి నీడలు అలుముకున్నాయి. గత రాత్రి బౌలింగ్ చేస్తుండగా బాధ మరింత తీవ్రం కావడంతో పీఎస్ఎల్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు వాట్సన్ ప్రకటించాడు. దీంతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు వీడియో రూపంలో ఒక సందేశాన్ని పంపాడు. ' ఇలా వీడియో పంపడం నిజంగా దురదృష్టమే. నన్ను పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా బాధిస్తోంది. డాక్టర్ల సలహా మేరకు స్వదేశానికి తిరిగొస్తున్నా. ఆస్ట్రేలియా వచ్చాక చికిత్స చేయించుకోవాలనుకుంటున్నా. వరల్డ్ కప్ నాటికి అందుబాటులో ఉంటాననే ఆశిస్తున్నా' అని అని తన ట్విట్టర్ అకౌంట్లో వీడియోను పోస్ట్ చేశాడు.ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలతో సతమవుతున్న ఆస్ట్రేలియాకు వాట్సన్ గాయం కూడా ఇబ్బందికరంగా మారింది. ట్వంటీ 20 స్పెషలిస్టుగా పేరున్న వాట్సన్ వరల్డ్ కప్ కు దూరమైతే అది ఆస్ట్రేలియా జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
'టీమిండియాను ఓడించడం కష్టమే'
దుబాయ్:స్వదేశంలో భారత క్రికెట్ జట్టు చాలా ప్రమాదకరమైనదని ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్ ను వారి దేశంలో ఓడించడం అంత సులువు కాదని స్పష్టం చేశాడు. వచ్చే నెలలో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో భారత జట్టే ఫేవరెట్ గా వాట్సన్ అభివర్ణించాడు. 'నా దృష్టిలో భారత్ అత్యంత క్లిష్టమైన జట్టు. ఆ జట్టుకు స్వదేశీ పరిస్థితులు కచ్చితంగా కలిసొస్తాయి. దాంతో టీమిండియానే వరల్డ్ కప్ ఫేవరెట్' అని వాట్సన్ తెలిపాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో పాల్గొనేందుకు దుబాయ్ కు వచ్చిన వాట్సన్ క్రికెట్.డాట్.కమ్. ఏయూతో ముచ్చటించాడు. ప్రత్యర్థి జట్లు ఆడేదాని కంటే కూడా స్వదేశంలో పరిస్థితులు టీమిండియాకు కలిసొస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లతో భారత జట్టు సమతుల్యంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. బ్యాటింగ్ లో అత్యంత దూకుడుగా ఉండే భారత్.. బౌలింగ్ విభాగంలో కూడా మెరుగ్గానే ఉందన్నాడు. ప్రత్యేకంగా స్పిన్నర్ల విషయానికొస్తే మ్యాచ్ ను క్షణాల్లో ప్రభావితం చేసే అత్యుత్తమ స్పిన్నర్లు వారి సొంతమన్నాడు. పేస్ విభాగంలో సీనియర్ ఆటగాడు ఆశిష్ నెహ్రా, యువ బౌలర్ బూమ్రాల రాకతో భారత జట్టులో చక్కటి సమన్వయం కనబడుతుందని ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన వాట్సన్ తెలిపాడు.