
దుబాయ్: ఐపీఎల్ తాజా సీజన్ మరో వారం రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో స్వదేశానికి తిరిగి వచ్చేసిన సీఎస్‌కే ఆటగాడు సురేశ్ రైనా మళ్లీ యూఏఈకి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకూ రైనా తిరిగి జట్టుతో కలిసే అవకాశంపై ఎటువంటి క్లారిటీ లేదు. కాగా, తాజాగా సీఎస్‌కే ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ చేసిన వ్యాఖ్యలు రైనా ఇక సీఎస్‌కేతో కలిసే అవకాశం లేదనే దానికి బలం చేకూరుస్తోంది. రైనా స్థానాన్ని ఒక గన్ ప్లేయర్‌తో పూడుస్తామంటూ వాట్సన్ చెప్పుకొచ్చాడు. సురేశ్ రైనా లేకపోవడం జట్టుకు అతిపెద్ద లోటైనప్పటికీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక క్రికెటర్‌ను సిద్ధం చేశామన్నాడు. (చదవండి: మిస్బాకు ఉద్వాసన.. రేసులో అక్తర్?)
‘మాకు రైనా, హర్భజన్‌లు అందుబాటులో లేకపోవడం చాలా లోటు. మొత్తం అన్ని ఐపీఎల్ జట్లను చూస్తే అవి చాలా బలంగా ఉన్నాయి. ఈ సమయంలో రైనా లేకపోవడం జట్టుకు కష్టమే. అతని స్థానాన్ని పూడ్చడం అంత ఈజీ కాదు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతతో పాటు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. రైనా ఐపీఎల్ రికార్డులు బాగున్నాయి. అతన్ని మిస్ కావడం బాధిస్తుంది. యూఏఈ వికెట్‌కు అతనికి సరిపోతుంది. ఇప్పుడు అతని ప్లేస్ భర్తీ చేయడానికి ఒక గన్ ప్లేయర్‌ను అన్వేషించాం. అతను మురళీ విజయ్. గత కొన్నేళ్ల నుంచి మురళీ విజయ్‌కు అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. ఇప్పుడు రైనా స్థానాన్ని విజయ్ భర్తీ చేస్తాడని ఆశిస్తున్నాను. అతనొక గన్ ప్లేయర్. ఇక్కడ వికెట్‌కు మురళీ విజయ్ బాగానే నప్పుతుంది. స్పిన్‌ను విజయ్ సమర్థవంతంగా ఆడగలడు. చాలా కాలంగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. ఈసారి మురళీ విజయ్‌కు అవకాశం రావడం ఖాయం. సీరియస్‌గా చెప్పాలంటే మురళీ విజయ్ మంచి బ్యాట్స్‌మన్’ అని వాట్సాన్ తెలిపాడు.(చదవండి: ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్)
Comments
Please login to add a commentAdd a comment