
మూడో టీ-20: ఆస్ట్రేలియాకు కెప్టెన్ మారాడు!
సిడ్నీ: భారత్‌తో జరుగనున్న మూడో టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టుకు ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నాయకత్వం వహించనున్నాడు. ఆసిస్ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. అతడి తోడ కండరాలు పట్టేడయంతో మూడో టీ-20 మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదని తేలింది.
మూడు మ్యాచుల ట్వంటీ-20 ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్ జరిగిన రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఫించ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో ఆసిస్ జట్టు 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫించ్ స్థానంలో లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజా జట్టులోకి వచ్చాడు. త్వరలో న్యూజిల్యాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లోనూ అతను ఆసిస్ జట్టులో చోటు సంపాదించాడు.
ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించడం గర్వకారణమని, ఇప్పటికే సిరీస్ భారత్‌కు కోల్పోయినా.. వచ్చే ట్వంటీ-20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని.. మూడో మ్యాచులో గెలిచేందుకు తీవ్రంగా కృషిచేస్తామని కెప్టెన్ షేన్ వాట్సన్ చెప్పాడు.