PC: ACC
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2022కు మరో రెండు రోజుల్లో తేరలేవనుంది. ఆగస్టు 27 జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతోంది. ఆసియాకప్‌లో టీమిండియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.
ఇప్పటి వరకు టీమిండియా ఈ మెగా ఈవెంట్‌లో 7 సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆడనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీ ప్రారంభం కాకముందే మాజీ ఆటగాళ్లు, క్రికెట్ నిపుణులు విజేతను అంచనావేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ కూడా చేరాడు. ఆసియాకప్-2022లో భారత్ విజేతగా నిలుస్తోందని వాట్సన్ జోస్యం చెప్పాడు.
ఆసియాకప్ విజేత ఎవరంటే!
ఐసీసీ రివ్యూ తాజా ఎపిసోడ్‌లో వాట్సన్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది ఆసియాకప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలుస్తోంది అని భావిస్తున్నాను. ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అదే విధంగా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆడే సత్తా భారత్‌కు ఉంది. అదే విధంగా భారత బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలంగా ఉంది" అని పేర్కొన్నాడు.
ఇక దాయాదుల పోరు గురించి మాట్లాడుతూ.. "భారత్-పాక్ మ్యాచ్ చూడాటానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించగలమని పాక్ పూర్తి నమ్మకంగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే ఆసియాకప్‌ను కూడా కైవసం చేసుకుంటుంది" అని వార్నర్ తెలిపాడు. ఇక ఆసియాకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి.
చదవండి: ASIA CUP 2022: ఆసియా కప్‌కు అర్హత సాధించిన హాంకాంగ్.. భారత్, పాక్‌తో ఢీ!
Comments
Please login to add a commentAdd a comment