India Vs Pakistan, Asia Cup 2022: Rohit Sharma Surpass Suzie Bates To Become The Leading Run-Scorer In T20I - Sakshi
Sakshi News home page

Ind Vs Pak Super-4: టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ..

Published Mon, Sep 5 2022 3:30 PM | Last Updated on Mon, Sep 5 2022 3:41 PM

Rohit Sharma Surpasses Suzies Bates Tally In T20Is To Achieve This Milestone - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20ల్లో సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ( మెన్స్‌ అండ్‌ వుమెన్‌) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన రోహిత్‌.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్‌ బ్యాటర్‌ సుజీ బేట్స్ (3531) పేరిట ఉండేది.

అయితే తాజా మ్యాచ్‌తో రోహిత్‌ శర్మ(3548) ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తన టీ20 కెరీర్‌లో ఇప్పటి వరకు 127 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌ 3548 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 27 హాఫ్‌ సెంచరీలతో పాటు 4 సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో రోహిత్‌(3548) పరుగులతో టాప్‌లో ఉండగా.. గప్టిల్‌(3497), కోహ్లి(3462) పరుగులతో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: Asia Cup 2022: ఆస్పత్రిలో పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement