Ind Vs Pak: Mohammad Rizwan To Undergo MRI Scan For Right Leg Strain - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: ఆస్పత్రిలో పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు!

Published Mon, Sep 5 2022 2:53 PM | Last Updated on Mon, Sep 5 2022 4:15 PM

Mohammad Rizwan To Undergo MRI Scan For Right Leg Strain - Sakshi

మహ్మద్‌ రిజ్వాన్‌ (PC: Ndtv sports)

ఆసియాకప్‌-2022లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ గాయపడిన సంగతి తెలిసిందే. భారత ఇన్నింగ్స్‌లో మహ్మద్ హస్నైన్ వేసిన ఓ బౌన్సర్‌ బంతిని ఆపే క్రమంలో రిజ్వాన్‌ మెకాలికి గాయమైంది. అనంతరం ఫిజియో సాయం తీసుకుని ఫీల్డ్‌లో కొనసాగాడు.  ఓ వైపు గాయంతో బాధపడుతునే బ్యాటింగ్‌లో కూడా రిజ్వాన్‌ దుమ్మురేపాడు.

51 బంతుల్లో 71 పరుగులు సాధించి పాక్‌ విజయంలో రిజ్వాన్‌ కీలక పాత్ర పోషించాడు. కాగా మ్యాచ్‌ ముగిసిన అనంతరం రిజ్వాన్‌ను స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ మీడియా సోమవారం దృవీకరించింది. అయితే అతడి స్కాన్‌ రిపోర్ట్స్‌కు సంబంధించి ఇప్పుడు వరకు ఎటువంటి సమాచారం తెలియలేదు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాక్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌, ఫీల్డింగ్‌ తప్పిదాల వల్ల టీమిండియా ఓటమి పాలైంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(60) పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్‌ రాహుల్‌(28), రోహిత్‌ శర్మ(28) పరుగులతో రాణించారు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది.
చదవండి: Asia Cup 2022: ఉత్కంఠ పోరులో భారత్‌పై విజయం.. సంబరాల్లో మునిగి తేలిన పాక్‌ ఆటగాళ్లు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement