Rizwan
-
ఘోరీ.. ఘోరాలెన్నో!
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో దాక్కుని.. ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ అరెస్టు ఘటనతో కరుడుగట్టిన టెర్రరిస్ట్ మహ్మద్ ఫర్హతుల్లా ఘోరీ పేరు మరోసారి తెరపైకి వచి్చంది. హైదరాబాద్‌కే చెందిన ఘోరీ కోసం రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు వివిధ నిఘా ఏజెన్సీలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దాదాపు 26 ఏళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్న అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాంటెడ్ లిస్టులోనూ ఉన్నాడు.అజ్ఞాతంలోకి వెళ్లాకే విషయం బయటికి.. హైదరాబాద్‌లోని మాదన్నపేట సమీపంలో ఉన్న కూర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్.. 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అది జరిగిన నాలుగేళ్ల తర్వాతగానీ అతడి పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. 2002లో గుజరాత్‌లోని అక్షర్ధామ్ ఆలయంపై జరిగిన దాడి కేసుతో ఘోరీ వ్యవహారాలు బహిర్గతం అయ్యాయి. 2004లో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది.అప్పట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌కు (జేఈఎం) సానుభూతిపరుడిగా ఉన్న ఘోరీ.. ఆ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2005లో నగర కమిషనర్ టాస్‌్కఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులో.. 2012 నాటి బెంగళూరు ‘హుజీ కుట్ర’ కేసులోనూ ఘోరీ వాంటెడ్‌గా ఉన్నాడు. 2022 దసరా సమయంలో విధ్వంసాలకు కుట్రపన్ని హ్యాండ్ గ్రెనేడ్స్తో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరైన జాహెద్‌తో ఘోరీ సంప్రదింపులు జరిపాడు. దీనితోపాటు మరికొన్ని ఉగ్రవాద కేసుల్లోనూ ఘోరీ వాంటెడ్‌గా ఉన్నాడు.రిక్రూట్మెంట్తో పాటు ఫైనాన్సింగ్ ఘోరీ ప్రస్తుతం పాకిస్తాన్‌లోని రావలి్పండిలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు కొన్ని ఆధారాలు సేకరించాయి. దీనికి ముందు దు బాయ్ కేంద్రంగా ఉండి హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలకంగా పనిచేశాడు. గత 26 ఏళ్లుగా అనేక ఉగ్రవాద సంస్థలతో కలసి పనిచేశాడు. లష్కరేతొయిబా (ఎల్ఈటీ), హర్కతుల్ జిహీదే ఇస్లామీ (హుజీ), ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.హైదరాబాద్ సిటీలో 2007 ఆగ స్టు, 2013 ఫిబ్రవరిలో జరిగిన జంట పేలుళ్లకు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) స్థాపనలో కీలకంగా వ్యవహరించిన అమీర్ రజాఖాన్కు ఘోరీ సన్నిహితుడిగా ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్ర హోంశాఖ విదేశాల్లో ఉంటూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్న, సహకరిస్తున్న 18 మంది ఉగ్రవాదుల పేర్లతో 2020 లో మోస్ట్ వాంటెడ్ జాబితా విడుదల చేసింది. అందులో ఐఎం వ్యవస్థాపకుడు, సహ–వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌తోపాటు ఘోరీ సైతం ఉన్నాడు.ఇన్నాళ్లూ ఫొటో కూడా దొరకని రీతిలో.. ఘోరీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్ దాంతోపాటు దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి అస్పష్టమైన ఫొటోను విడుదల చేసింది. అతడి స్పష్టమైన ఫొటో సుదీర్ఘకాలం ఏ ఏజెన్సీ వద్ద కూడా లేకపోవడమే అందుకు కారణం. 2008 ఏప్రిల్‌లో అతడి మేనల్లుడు ఫయాఖ్ను దుబాయ్ నుంచి డీపోర్ట్ (బలవంతంగా తిప్పిపంపడం) చేయగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఫయాఖ్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఘోరీకి సంబంధించి 20 ఊహాచిత్రాలను రాష్ట్ర నిఘా వర్గాలు రూ పొందించాయి. అక్షర్ధామ్ కేసులో ఘోరీ సోదరుడు షౌకతుల్లాను 2009 ఏడాది జూలైలో అరెస్టు చేసినప్పుడు.. ఆ ఊహాచిత్రాలను చూపగా వాటిలో ఒకదానిని అతను నిర్ధారించాడు. అప్పటి నుంచి అదే ఆధారమైంది. తాజాగా రిజ్వాన్ అరెస్టుతో ఘోరీ కొత్త ఫొటో ఏజెన్సీలకు లభించింది. -
హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ.. యువతను ‘ఉగ్ర’బాట పట్టించడంలో దిట్ట.. పరారీలో ఉన్న అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగిన రిజ్వాన్‌ను.. గత శుక్రవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి ఫరీదాబాద్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించినప్పుడు బయటికొచి్చన రెండు అంశాలు కలకలం రేపుతున్నాయి.రిజ్వాన్ కొన్నాళ్లు హైదరాబాద్‌లో తలదాచుకున్నాడనేది ఒకటైతే.. సుదీర్ఘకాలం నుంచి పరారీలో ఉన్న గజ ఉగ్రవాది, హైదరాబాద్‌కే చెందిన ఫర్హాతుల్లా ఘోరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడనేది రెండో అంశం. రాష్ట్ర నిఘా విభాగానికి చెంప పెట్టులాంటి ఈ రెండు అంశాలు తెలిసిన వెంటనే ఇక్కడి నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ వెళ్లింది.6 నెలలు హైదరాబాద్‌లోనే..ఢిల్లీకి చెందిన రిజ్వాన్ అలీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015–16లో ఆన్లైన్ ద్వారా ప్రేరణ పొంది ఐసిస్ బాటపట్టాడు. జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో స్థిరపడిన షానవాజ్‌తో కలసి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఐసిస్ మాడ్యూల్ విస్తరణతోపాటు నిధుల సమీకరణకు పనిచేశాడు. చాలా మంది యువతను ఆన్లైన్ ద్వారా ఆకర్షించి ఉగ్రవాద బాటపట్టించాడు. 2023 జూన్‌లో పుణే అధికారులు షానవాజ్ నేతృత్వంలోని ఈ మాడ్యూల్ గుట్టురట్టు చేసి.. పలువురిని అరెస్టు చేశారు.దీంతో రిజ్వాన్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. అతడిని మోస్ట్ వాంటెడ్‌గా గుర్తించిన ఎన్ఐఏ.. పట్టిస్తే రూ.3 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రిజ్వాన్ కదలికలను గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. సంభాల్‌లోని ఓ స్థావరంపై దాడి చేశారు. కానీ తృటిలో తప్పించుకున్న రిజ్వాన్.. హైదరాబాద్‌కు మకాం మార్చాడు. మారుపేరుతో సికింద్రాబాద్ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల పాటు నివసించాడు. తర్వాత కేరళ వెళ్లాడు. స్వాతంత్య్ర దిన వేడుకల నేపథ్యంలో విధ్వంసాలకు పథకం వేసి ఢిల్లీ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ–ఫరీదాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెల్ పోలీసులకు దొరికిపోయాడు. వారు అతడి నుంచి తుపాకీ, తూటాలు స్వా«దీనం చేసుకున్నారు.విచారణలో బయటపడిన కీలక అంశాలురిజ్వాన్ను విచారించిన సమయంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కీలక అంశాలను గుర్తించారు. హైదరాబాద్‌లోని కూర్మగూడ ప్రాంతానికి చెందిన గజ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీతో రిజ్వాన్ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్టు తేల్చారు. ఘోరీ తాజా ఫొటోను సైతం రిజ్వాన్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడైన రిజ్వాన్ దేశంలోని వివిధ నగరాలను టార్గెట్‌గా చేసుకున్నట్టు గుర్తించారు. ఫర్హాతుల్లా ఘోరీతో సంప్రదింపులు, హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు ఉండటం నేపథ్యంలో.. ఘోరీ ద్వారానే ఇక్కడ ఆశ్రయం పొందినట్టు భావిస్తున్నారు. రిజ్వాన్‌ను విచారించేందుకు.. రిజ్వాన్‌ను విచారిస్తే హైదరాబాద్‌లో ఎవరి ద్వారా, ఎప్పుడు ఆశ్రయం పొందాడో, ఎవరెవరిని కలిశాడో తెలుస్తుందని.. ప్రస్తుతం ఘోరీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రిజ్వాన్‌ను విచారించడంతోపాటు ఢిల్లీ స్పెషల్ సెల్ నుంచి సమాచారం తీసుకోవడం కోసం రాష్ట్రం నుంచి ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు త్వరలో హైదరాబాద్ రానున్నట్లు తెలిసింది.మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆరు నెలల పాటు నగరంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కదలికలను రాష్ట్ర నిఘా విభాగాలు కనిపెట్టలేకపోవడం వైఫల్యంగానే ఉన్నతాధికారులు పరిగణిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంపై లోతుగా అంతర్గత సమీక్ష చేపట్టినట్టు సమాచారం. -
KOITA FOUNDATION: నై‘పుణ్య’ సేవ
కెరీర్లో దూసుకుపోతే ఆ కిక్కే వేరు. ‘అంతమాత్రాన సామాజిక బాధ్యత మరచిపోతే ఎలా’ అనుకునేవారు కొద్దిమంది ఉంటారు. అలాంటి వారిలో రేఖ–రిజ్వాన్ దంపతులు ఒకరు. తాము పనిచేస్తున్న రంగాలలో మంచి పేరు తెచ్చుకున్న రేఖ–రిజ్వాన్‌లు స్వచ్ఛందసేవారంగం లోకి వచ్చారు. ‘కోయిట ఫౌండేషన్’ ద్వారా హెల్త్‌కేర్ రంగంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మేనేజ్మెంట్ కన్సల్టెంట్, స్టార్టప్ ఫౌండర్స్‌గా విజయపథంలో దూసుకుపోయిన రిజ్వాన్, రేఖ కోయిటలు దాతృత్వం దారిలో ప్రయాణం ప్రారంభించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన రేఖకు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో తెలిశాయి. ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థలకు సాంకేతిక సహాయం తోడైతే ఎలా ఉంటుంది అనే అంశంపై దృష్టి పెట్టింది. సాంకేతిక సహకారంతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విషయాన్ని అవగాహన చేసుకుంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్)లో సభ్యుడిగా ఉన్న రిజ్వాన్ డిజిటల్ హెల్త్ స్పేస్‌లో ఎన్నో ఆస్పత్రులతో కలిసి పనిచేశాడు. విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. ‘కోయిట ఫౌండేషన్’ తరఫున ఐఐటీ–ముంబైలో కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ (కెసీడీహెచ్)ను ప్రారంభించారు. క్లినికల్ అప్లికేషన్స్, హెల్త్‌కేర్ డాటా మేనేజ్మెంట్(హెల్త్‌కేర్ డాటా ప్రైవసీ, సెక్యూరిటీ), హెల్త్‌కేర్ ఎనాలటిక్స్... మొదలైన వాటిని తన ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసుకుంది కెసీడీహెచ్. ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు కూడా రూపొందించుకుంది కేసీడీహెచ్. హెల్త్ కేర్ కెరీర్‌కు సంబంధించి యంగ్ ప్రొఫెషనల్స్‌ను ఉత్సాహపరచడం తన ప్రధాన లక్ష్యం అంటున్నాడు రిజ్వాన్. లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజీలు, హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్లు పూనుకొని తగిన కోర్సులకు అవకాశం కల్పిస్తే తన లక్ష్యం నెరవేరడం కష్టమేమీ కాదంటాడు రిజ్వాన్. ‘టాటా మెమోరియల్ సెంటర్’లో క్యాన్సర్ ఆస్పత్రులు డిజిటల్ హెల్త్టూల్స్ను ఎడాప్ట్ చేసుకోవడంలో సహాయపడటానికి ‘కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ ఆంకాలజీ’ని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్‌ను నిర్వహించడం అనేది ఆస్పత్రులకు సవాలుగా మారిన నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గాలు కనుక్కునే దిశగా ఆలోచనలు చేస్తుంది కేసీడీహెచ్. ‘మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’తో ఒప్పందం కుదుర్చుకుంది కేసీడీహెచ్. డిజిటల్ హెల్త్‌కు సంబంధించి పరిజ్ఞానం విషయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు... మొదలైన వారికి ఈ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇస్తారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు రూపొందించే విషయంపై చొరవ చూపుతున్నారు రిజ్వాన్–రేఖ దంపతులు. ‘మెటర్నల్ హెల్త్’కు సంబంధించి ఫౌండేషన్ ఫర్ మదర్ అండ్ చైల్డ్‌హెల్త్(ఎఫ్ఎంసిహెచ్)తో కలిసి పనిచేస్తోంది కోయిట సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్. ‘ఎఫ్ఎంసిహెచ్’ తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే లక్ష్యంగా ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఇందులో ప్రతి ఫీల్డ్వర్కర్కు కొన్ని కుటుంబాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. ‘నూట్రీ’ యాప్ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్లకు ఇన్పుట్ డాటాతో ఔట్పుట్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ బస్, స్నేహా, విప్ల ఫౌండేషన్‌లాంటి ఎన్నో సంస్థలతో కలిసి పనిచేస్తోంది కోయిట ఫౌండేషన్. ‘చేయాల్సిన పని సముద్రమంత పెద్దదిగా ఉంది. అయినప్పటికీ చేయాలనే ఆసక్తి ఉంది’ అంటుంది రేఖ. -
పాక్ అదరగొట్టింది
345 పరుగులు... వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టూ ఇంతటి భారీ లక్ష్యాన్ని అందుకోలేదు... శ్రీలంకతో మ్యాచ్‌లో 37 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన దశలో పాకిస్తాన్‌కు ఇది దాదాపు అసాధ్యం అనిపించింది. కానీ రిజ్వాన్, షఫీక్ కలిసి దానిని చేసి చూపించారు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌లో గేర్లు మారుస్తూ చివరకు మరో 8 బంతులు మిగిలి ఉండగా పాక్‌కు విజయాన్నందించారు. అంతకుముందు మెరుపు బ్యాటింగ్‌తో కుశాల్ మెండిస్, సమరవిక్రమ చేసిన శతకాలు చివరకు జట్టుకు ఉపయోగపడలేదు. మొత్తం 689 పరుగుల ఈ పోరుతో హైదరాబాద్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ముగిశాయి. సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్‌లనూ సంతృప్తిగా ముగించింది. మంగళవారం జరిగిన పోరులో పాక్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (77 బంతుల్లో 122; 14 ఫోర్లు, 6 సిక్స్‌లు), సదీర సమరవిక్రమ (89 బంతుల్లో 108; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా, పతుమ్ నిసాంక (61 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మెండిస్ రెండో వికెట్‌కు నిసాంకతో 102 పరుగులు, మూడో వికెట్‌కు సమరవిక్రమతో 111 పరుగులు జోడించాడు. 65 బంతుల్లో సెంచరీ సాధించిన మెండిస్ శ్రీలంక తరఫున ప్రపంచకప్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. అనంతరం పాకిస్తాన్ 48.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిజ్వాన్ (121 బంతుల్లో 131 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (103 బంతుల్లో 113; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు బాది జట్టును గెలిపించారు. కండరాల నొప్పితో బాధపడుతూనే రిజ్వాన్ తన జట్టును విజయతీరానికి చేర్చాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 176 పరుగులు జత చేశారు. ఆరంభంలో శ్రీలంక చెలరేగినా... చివరి పది ఓవర్లలో 61 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) షఫీక్ (బి) షాదాబ్ 51; పెరీరా (సి) రిజ్వాన్ (బి) హసన్ 0; మెండిస్ (సి) ఇమామ్ (బి) హసన్ 122; సమరవిక్రమ (సి) రిజ్వాన్ (బి) హసన్ 108; అసలంక (సి) రిజ్వాన్ (బి) హసన్ 1; ధనంజయ (సి) షాహిన్ (బి) నవాజ్ 25; షనక (సి) బాబర్ (బి) షాహిన్ 12; వెలలాగె (సి) షఫీక్ (బి) రవూఫ్ 10; తీక్షణ (బి) రవూఫ్ 0; పతిరణ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 344. వికెట్ల పతనం: 1–5, 2–107, 3–218, 4–229, 5–294, 6–324, 7–335, 8–343, 9–344. బౌలింగ్: షాహిన్ 9–0–66–1, హసన్ అలీ 10–0–71–4, నవాజ్ 9–0–62–1, రవూఫ్ 10–0–64–2, షాదాబ్ 8–0–55–1, ఇఫ్తికార్ 4–0–22–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) (సబ్) హేమంత (బి) పతిరణ 113; ఇమామ్ (సి) పెరీరా (బి) మదుషంక 12; బాబర్ ఆజమ్ (సి) సమరవిక్రమ (బి) మదుషంక 10; మొహమ్మద్ రిజ్వాన్ (నాటౌట్) 131; షకీల్ (సి) వెలలాగె (బి) తీక్షణ 31; ఇఫ్తికార్ అహ్మద్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (48.2 ఓవర్లలో 4 వికెట్లకు) 345. వికెట్ల పతనం: 1–16, 2–37, 3–213, 4–308. బౌలింగ్: తీక్షణ 10–0–59–1, మదుషంక 9.2– 0–60–2, షనక 5–0–28–0, పతిరణ 9–0– 90–1, వెలలాగె 10–0–62–0, ధనంజయ డిసిల్వా 4–0– 36–0, అసలంక 1–0–10–0. 3 ఒక వన్డే మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి మాత్రమే కాగా, వరల్డ్ కప్‌లో మొదటిసారి. 1998లో లాహోర్‌లో ఇజాజ్ అహ్మద్, మొహమ్మద్ యూసుఫ్, పాంటింగ్, గిల్‌క్రిస్ట్...2013లో నాగపూర్‌లో కోహ్లి, ధావన్, బెయిలీ, వాట్సన్ సెంచరీలు చేశారు. -
‘డచ్’ పని పట్టిన పాక్
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనలు, అసాధారణ బౌలింగ్ లేకపోయినా సమష్టి తత్వంతో ఆ జట్టు తొలి అడుగును విజయవంతంగా వేసింది. అసోసియేటెడ్ టీమ్ నెదర్లాండ్స్‌పై అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తమ ఆటతో మ్యాచ్‌లో అక్కడక్కడ పైచేయి సాధించినట్లు కనిపించినా... చివరకు నెదర్లాండ్స్ సులువుగానే తలవంచింది. ‘ఆరెంజ్’ జట్టు సంచలన విజయానికి ఈ ఆట సరిపోలేదు. సాక్షి, హైదరాబాద్: రెండు వామప్ మ్యాచ్‌లతో ఉప్పల్ స్టేడియంపై అంచనాకు వచ్చిన పాకిస్తాన్ ఈ వారం రోజుల అనుభవాన్ని అసలు మ్యాచ్‌లో సమర్థంగా వాడుకుంది. శుక్రవారం జరిగిన వన్డే వరల్డ్ కప్ పోరులో పాక్ 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సౌద్ షకీల్ (52 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 68; 8 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. బాస్ డి లీడ్ (68 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), విక్రమ్‌జిత్ సింగ్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా జట్టుకు ఓటమి తప్పలేదు. సెంచరీ భాగస్వామ్యం... కనీసం 300 పరుగులు నమోదు చేస్తాం. టాస్ సమయంలో పాక్ కెపె్టన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఇది. అయితే దానికి చేరువగా వెళ్లడంలో పాక్ సఫలమైంది. ఆరంభ ఓవర్లలో ప్రదర్శన చూస్తే అది కష్టంగానే అనిపించినా రెండు కీలక భాగస్వామ్యాలు జట్టును ఆదుకున్నాయి. తొలి పవర్‌ప్లేలో 9.1 ఓవర్లు ముగిసేసరికి పాక్ 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు ఫఖర్ (12), ఇమామ్ (15)లతో పాటు కెపె్టన్ బాబర్ ఆజమ్ (5) కూడా తొందరగా వెనుదిరిగారు. ఈ దశలో రిజ్వాన్, షకీల్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్న వీరిద్దరు ఆ తర్వాత చక్కటి షాట్లతో దూకుడు పెంచారు. ఈ క్రమంలో షకీల్ 32 బంతుల్లో, రిజ్వాన్ 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి శతక భాగస్వామ్యం తర్వాత తక్కువ వ్యవధిలో పాక్ 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే నవాజ్ (43 బంతుల్లో 39; 4 ఫోర్లు), షాదాబ్ (34 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) మళ్లీ పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 70 బంతుల్లో 64 పరుగులు జత చేశారు. చివరి 2 వికెట్లకు కలిపి మరో 34 పరుగులు రావడం కూడా పాక్‌ను మెరుగైన స్థితికి చేర్చింది. ఆ ఇద్దరు మినహా... ఛేదనలో నెదర్లాండ్స్‌కు విక్రమ్‌జిత్ చక్కటి షాట్లతో శుభారంభం అందించాడు. అయితే తక్కువ వ్యవధిలో జట్టు డౌడ్ (5), అకెర్మన్ (17) వికెట్లు కోల్పోయింది. దాంతో విక్రమ్‌జిత్‌కు డి లీడ్ జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 76 బంతుల్లో 70 పరుగులు జత చేసింది. అయితే 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే విక్రమ్ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. తేజ నిడమనూరు (5) విఫలం కాగా, డచ్ ఆ వెంటనే మరో 2 చేజార్చుకుంది. అయితే డి లీడ్ క్రీజ్‌లో ఉన్నంత వరకు టీమ్‌కు కాస్త ఆశలు ఉన్నాయి. 50 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీని అందుకున్నాడు. నవాజ్ చక్కటి బంతిని లీడ్ బౌల్డ్ కావడంతో ‘డచ్’ జట్టు ఓటమి లాంఛనమే అయింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫఖర్ (సి అండ్ బి) వాన్ బీక్ 12; ఇమామ్ (సి) దత్ (బి) మీకెరెన్ 15; బాబర్ (సి) సాఖిబ్ (బి) అకెర్మన్ 5; రిజ్వాన్ (బి) డి లీడ్ 68; షకీల్ (సి) సాఖిబ్ (బి) దత్ 68; ఇఫ్తికార్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 9; నవాజ్ (రనౌట్) 39; షాదాబ్ ఖాన్ (బి) డి లీడ్ 32; హసన్ అలీ (ఎల్బీ) (బి) డి లీడ్ 0; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 13; రవూఫ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) అకెర్మన్ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–15, 2–34, 3–38, 4–158, 5–182, 6–188, 7–252, 8–252, 9–267, 10–286. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–0–48–1, వాన్ బీక్ 6–0–30–1, అకెర్మన్ 8–1–39–2, మీకెరెన్ 6–0–40–1, డి లీడ్ 9–0–62–4, మెర్వ్ 6–0– 36– 0, విక్ర మ్జిత్ 2–0–16–0, సాఖిబ్ 2–0– 15–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (సి) ఫఖర్ (బి) షాదాబ్ 52; మ్యాక్స్ డౌడ్ (సి) షాహిన్ (బి) హసన్ 5; అకెర్మన్ (బి) ఇఫ్తికార్ 17; డి లీడ్ (బి) నవాజ్ 67; తేజ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 5; ఎడ్వర్డ్స్ (ఎల్బీ) (బి) రవూఫ్ 0; సాఖిబ్ (ఎల్బీ) (బి) షాహిన్ 10; వాన్‌డర్ మెర్వ్ (రనౌట్) 4; వాన్ బీక్ (నాటౌట్) 28; దత్ (బి) హసన్ 1; మీకెరెన్ (బి) రవూఫ్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్) 205. వికెట్ల పతనం: 1–28, 2–50, 3–120, 4–133, 5–133, 6–158, 7–164, 8–176, 9–184, 10–205. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 7–0–37–1, హసన్ అలీ 7–1–33–2, రవూఫ్ 9–0–43–3, ఇఫ్తికార్ అహ్మద్ 3–0–16–1, మొహమ్మద్ నవాజ్ 7–0– 31–1, షాదాబ్ ఖాన్ 8–0–45–1. ప్రపంచకప్‌లో నేడు అఫ్గానిస్తాన్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం శ్రీలంక X దక్షిణాఫ్రికా వేదిక: న్యూఢిల్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నాడు వీధి వ్యాపారి.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!
కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. ఇంటింటికీ తిరిగి పాలు పోశాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి.. యూఏఈలో అత్యంత ధనవంతులైన భారతీయల్లో ఆయన ఒకరు. డానుబే గ్రూప్ అధినేత, ముంబైకి చెందిన రిజ్వాన్ సజన్ స్ఫూర్తివంతమైన విజయగాథ ఇది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) తన తండ్రి మరణించినప్పుడు రిజ్వాన్ సజన్ వయసు కేవలం 16 సంవత్సరాలు. ముగ్గురు సంతానంలో రిజ్వాన్ పెద్దవాడు కావడంతో కుటుంబ పోషణ బాధ్యత అతనిపై పడింది. దీంతో రిజ్వాన్ వీధుల్లో పుస్తకాలు, స్టేషనరీ అమ్మాడు. అదనపు ఆదాయం కోసం మిల్క్ డెలివరీ బాయ్‌గా కూడా పనిచేశాడు. 1981లో 18 ఏళ్లు నిండిన రిజ్వాన్‌కు ఆయన మామ కువైట్‌లో ఉద్యోగం ఇప్పించి ఆయన ఎదుగుదలలో తోడ్పాటు అందించారు. కువైట్‌లో రిజ్వాన్ ప్రారంభంలో సేల్స్ ట్రెయినీగా 150 దినార్లు అంటే అప్పట్లో రూ.18 వేల జీతానికి పనిచేశారు. అలా ఎనిమిదేళ్లు పనిచేశాక సేల్స్ మేనేజర్ అయ్యారు. కానీ 1990లో గల్ఫ్ యుద్ధం తర్వాత సజన్ ముంబైకి తిరిగి వచ్చి మళ్లీ ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ సారి దుబాయ్‌లో బిల్డింగ్ మెటీరియల్స్ బ్రోకరేజ్ వ్యాపారంలో చేరాడు. ఒక రోజు రిజ్వాన్ ఆ ఉద్యోగం మానేసి తన సొంత నిర్మాణ సామగ్రి వ్యాపార సంస్థను స్థాపించారు. అలా పుట్టుకొచ్చింది డానుబే గ్రూప్. (ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ) బాల్యంలో తాను అనేక సవాళ్లు ఎదుర్కొన్నానని, తన తండ్రి ఓ స్టీల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవారని, నెలకు రూ. 7వేల జీతంతో ఇల్లు గవడం చాలా కష్టంగా ఉండేదని, స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందులు పడినట్లు రిజ్వాన్ గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ రిజ్వాన్ సజన్ పట్టు వదలలేదు. 1993లో డానుబే గ్రూప్‌ను ప్రారంభించేంత వరకూ అనేక కష్టాలు పడ్డారు. 2019 నాటికి డానుబే గ్రూప్ వార్షిక టర్నోవర్ 1.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. డానుబే గ్రూప్ బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) -
PAK vs ENG: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై పాక్ విజయం
లాహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ 3-2 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. కాగా 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ కెప్టెన్ మొయిన్ అలీ అఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. అఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. 8 పరుగులు మాత్రమే సాధించింది. ఇంగ్లండ్ బ్యాటరల్లో మొయిన్ (అలీ 51 పరుగులు నటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు, నవాజ్, వసీం, షాదాబ్ ఖాన్, ఆహ్మద్, జమేల్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టి పాక్‌ను దెబ్బతీశాడు. అదే విధంగా సామ్ కరణ్, విల్లీ చెరో రెండు వికెట్లు.. క్రిస్ వోక్స్ ఒక్క వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్లలో మరో సారి మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రిజ్వాన్ 46 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. చదవండి: IND vs SA: సూర్యకుమార్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
సూర్యకుమార్ యాదవ్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో టీమిండియా ముందంజ వేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బౌలర్లు సఫారీల బ్యాటర్ల భరతం పట్టగా.. అనంతరం బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. కాగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. చాహర్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(56 బంతుల్లో 51 నటౌట్), సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 50 పరుగులు నటౌట్) రాణించారు. మరోసారి అదరగొట్టిన సూర్య.. టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో సారి అదరగొట్టాడు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఆరంభంలో భారత్ తడబడింది. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరగగా.. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మూడు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్య.. తన ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 33 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు సాధించాడు. అఖరి వరకు క్రీజులో నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిజ్వాన్ రికార్డు బద్దలు కొట్టిన సూర్య ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా సూర్య రికార్డులకెక్కాడు. 2022 ఏడాదిలో ఇప్పటి వరకు ఈ ముంబైకర్ మొత్తం 45 సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో రిజ్వాన్ 42 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో రిజ్వాన్‌ను రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా స్కై నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అతడు 732 పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ ఘనత భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. 2018 ఏడాదిలో ధావన్ 689 పరుగులు చేశాడు. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న షమీ -
'రోహిత్ శర్మను పాక్ ఆటగాళ్లతో పోల్చడం సరికాదు'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ బట్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ విధ్వంసకర ఆటగాడని, అతడికి ఎవరూ సాటి రారు అని బట్ కొనియాడాడు. రోహిత్‌ను పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజాం, రిజ్వాలన్తో పోల్చడం సరికాదని బట్ అభిప్రాయపడ్డాడు. "రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. అటువంటి ఆటగాడిని బాబర్, రిజ్వాన్‌లతో పోల్చడం సరికాదు. కోహ్లిలో ఉన్న సగం ఫిట్నెస్ రోహిత్‌కు ఉంటే అతడికి ఎవరూ సాటి రారు. కేవలం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ మాత్రమే రోహిత్ శర్మ వంటి ఆట తీరును కలిగి ఉన్నాడు" అని యూట్యూబ్ ఛానల్లో బట్ పేర్కొన్నాడు. కాగా ఆసియాకప్-2022లో రోహిత్ శర్మ అంతగా రాణించలేకపోయాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రిజ్వాన్ మాత్రం ఈ టోర్నీలో అదరగొట్టాడు. 281 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా రిజ్వాన్ నిలిచాడు. చదవండి: Virat Kohli-Anushka Sharma: లండన్ వీధుల్లో విరుష్క దంపతుల చక్కర్లు -
ఆస్పత్రిలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు!
ఆసియాకప్-2022లో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ గాయపడిన సంగతి తెలిసిందే. భారత ఇన్నింగ్స్‌లో మహ్మద్ హస్నైన్ వేసిన ఓ బౌన్సర్ బంతిని ఆపే క్రమంలో రిజ్వాన్ మెకాలికి గాయమైంది. అనంతరం ఫిజియో సాయం తీసుకుని ఫీల్డ్‌లో కొనసాగాడు. ఓ వైపు గాయంతో బాధపడుతునే బ్యాటింగ్‌లో కూడా రిజ్వాన్ దుమ్మురేపాడు. 51 బంతుల్లో 71 పరుగులు సాధించి పాక్ విజయంలో రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం రిజ్వాన్‌ను స్కానింగ్ కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా సోమవారం దృవీకరించింది. అయితే అతడి స్కాన్ రిపోర్ట్స్‌కు సంబంధించి ఇప్పుడు వరకు ఎటువంటి సమాచారం తెలియలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాల వల్ల టీమిండియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(60) పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(28), రోహిత్ శర్మ(28) పరుగులతో రాణించారు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. చదవండి: Asia Cup 2022: ఉత్కంఠ పోరులో భారత్‌పై విజయం.. సంబరాల్లో మునిగి తేలిన పాక్ ఆటగాళ్లు! -
T20 WC 2021: రిజ్వాన్‌కు ఆ నిషేధిత మెడిసిన్ ఇచ్చాం: పీసీబీ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు
ICC T20 World Cup 2021 Semi Final PAK Vs AUS: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అదరగొట్టిన పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డాక్టర్ నజీబుల్లా సుమ్రొ సంచలన విషయాలు వెల్లడించాడు. వరల్డ్‌కప్ టోర్నీ సమయంలో అనారోగ్యం బారిన పడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కోలుకునేందుకు నిషేధిత పదార్థాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా యూఏఈ వేదికగా సాగిన ఐసీసీ పొట్టి ఫార్మాట్ ఈవెంట్లో పాకిస్తాన్ అజేయ రికార్డును కొనసాగిస్తూ సెమీస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు రిజ్వాన్ తీవ్ర చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. ఐసీయూలో చికిత్స పొందిన అతడు అనూహ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రావడమే కాదు.. 52 బంతుల్లోనే 67 పరుగులు సాధించాడు. PC: Shoaib Akhtar Instagram అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలగేరడంతో పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూలు.. ఆపై ఫైనల్ చేరి.. అక్కడ న్యూజిలాండ్‌ను ఓడించి తొలిసారి ట్రోఫీ గెలిచారు. ఇదిలా ఉంటే.. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక మైదానంలో దిగాడంటూ అప్పట్లో రిజ్వాన్‌పై ప్రశంసలు కురిశాయి. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అయితే రిజ్వాన్‌కు ఆట పట్ల ఉన్న అంకితభావం, దేశం కోసం ఆడాలన్న తపన చూసి గర్వపడుతున్నానంటూ పేర్కొన్నాడు. మిగతా పాక్ క్రికెటర్లు సైతం అతడిని ప్రశంసించారు. అయితే, ఈ ఘటన గురించి రిజ్వాన్‌కు చికిత్స అందించిన డాక్టర్ నజీబుల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు.. ‘‘నువ్వు అసలు శ్వాస తీసుకునే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు కోలుకోవాలంటే నీకు ఇంజెక్ట్ చేయాల్సిన మెడిసన్ గురించి ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఆ మెడిసిన్ అథ్లెట్లు వాడటం నిషేధం. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకు కచ్చితంగా ఐసీసీ పర్మిషన్ తీసుకోవాలి’’ అని రిజ్వాన్‌తో ఇంటర్వ్యూలో నజీబుల్లా వ్యాఖ్యానించాడు. కాగా నజీబుల్లా వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి. చదవండి👉🏾MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని చదవండి👉🏾IPL 2022: ధోని.. బ్యాట్ కొరకడం వెనుక అసలు కథ ఇదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రిజ్వాన్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్..!
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. రిజ్వాన్ ససెక్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్హామ్ రెండో ఇన్నింగ్స్‌లో ససెక్స్ స్పిన్నర్ రాలిన్స్ వేసిన బంతిని స్కాట్ బోర్త్విక్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్ ఫీల్డింగ్ చేస్తున్న రిజ్వాన్.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Rinku Singh: తొమ్మిదో క్లాస్‌లో చదువు బంద్.. స్వీపర్, ఆటోడ్రైవర్.. ఆ 80 లక్షలు! This catch from @iMRizwanPak. 🤯 👏 #GOSBTS pic.twitter.com/uOdy7JJ2nr — Sussex Cricket (@SussexCCC) May 1, 2022 -
పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత లాహోర్.. ఆరేళ్ల తర్వాత!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను 42 పరుగుల తేడాతో ఓడించిన లాహోర్.. తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లహోర్ కేవలం 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడంది. ఆ సమయంలో ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ జట్టును అదుకున్నాడు. 46 బంతుల్లో 69 పరుగులు హఫీజ్ సాదించాడు. హపీజ్తో పాటు చివర్లో బ్రూక్,డేవిడ్ వైస్ మెరుపులు మెరిపించడంతో లాహోర్ ఖలందర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 180 పరుగులు చేసింది. లహోర్ బ్యాటర్లలో హఫీజ్(69),బ్రూక్(41), వైస్(28) పరుగులతో రాణించారు. ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ 138 పరుగులకే కుప్పకూలింది. లహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ షా ఆఫ్రిది మూడు వికెట్ల పడగొట్టగా.. హఫీజ్, జమాన్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా లాహోర్ ఖలందర్స్ కెప్టెన్‌గా స్టార్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది వ్యవహరించాడు. అయితే ఆరు సీజన్లు తర్వాత లహోర్‌కు టైటిల్ అందించిన షాహీన్ షా ఆఫ్రిదిపై ప్రశంసల వర్షం కురిస్తోంది. చదవండి: Russia Ukraine War: వార్ ఎఫెక్ట్: పుతిన్‌కు మరో షాక్.. జూడో ఫెడరేషన్ పదవి ఊడింది -
6 సిక్స్‌లు, 2ఫోర్లు.. కేవలం 19 బంతుల్లోనే.. బౌలర్లకు చుక్కలు!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్ విజయ పరంపర కోనసాగిస్తోంది. శనివారం పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగల భారీ స్కోర్ సాధించింది. ముల్తాన్ సుల్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (82) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా రిజ్వాన్‌తో పాటు టిమ్ డేవిడ్ తుపాన్ ఇన్నింగ్స్ తోడు అవడంతో ముల్తాన్ సుల్తాన్ భారీ స్కోర్ చేయగల్గింది. డేవిడ్ కేవలం 19 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 సిక్స్‌లు,2 ఫోర్లు ఉన్నాయి. ఇక 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ జల్మీ 165 పరుగులకే ఆలౌటైంది. పెషావర్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(43), బెన్ కట్టింగ్(52) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముల్తాన్ సుల్తాన్ బౌలర్లలో షానవాజ్ దహానీ, తాహిర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా,ముజారబానీ రెండు వికెట్లు సాధించారు. ఇక 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మద్ రిజ్వాన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్... ముల్తాన్ సుల్తాన్ ఘన విజయం
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముల్తాన్ సుల్తాన్ బోణీ కొట్టింది. కరాచీ వేదికగా కరాచీ కింగ్స్‌తో జరగిన తొలి మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్తాన్ విజయంలో ఇమ్రాన్ తాహిర్, మహ్మద్ రిజ్వాన్ కీలక పాత్ర పోషించారు. తాహిర్ మూడు వికెట్లు పడగొట్టగా, రిజ్వాన్ 52 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కరాచీ కింగ్స్ నిర్ధేశించిన 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ముల్తాన్ చేధించింది. ముల్తాన్ బ్యాటర్లలో రిజ్వాన్(52), సోహైబ్ మసూద్(30) పరుగులతో రాణించారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరాచీ కింగ్స్‌కు ఘనమైన ఆరంభం లభించినప్పటికీ.. భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగల్గింది. కరాచీ కింగ్స్ బ్యాటర్లలో షర్జీల్ ఖాన్ (43), జో క్లార్క్(26) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక మూల్తాన్ బౌలింగ్‌లో తాహిర్ మూడు వికెట్లు పడగొట్టగా, దహాని, కుషీదల్ చెరో వికెట్ సాధించారు. చదవండి: Team India Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు..! -
మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మహ్మద్ రిజ్వాన్ ..
2021 ఏడాదికి గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వార్షిక అవార్డులను ప్రకటించింది. 2021లో పాకిస్తాన్ అద్భుతమైన విజయాలు సాధించింది. టీ20 ప్రపంచకప్-2021లో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ఈవెంట్లలో భారత్‌పై పాకిస్తాన్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు(20) నమోదు చేసిన జట్టుగా పాక్ నిలిచింది. పాక్ విజయాల్లో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజం కీలక పాత్రపోషిస్తున్నారు. వీరితో పాటు హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది బౌలింగ్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. గత ఏడాది టీ20ల్లో రిజ్వాన్ 1,326 పరుగులు సాధించాడు. ఇక హసన్ అలీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోగా,కెప్టెన్ బాబర్ అజామ్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అదే విధంగా పాక్ యువ బౌలర్ మహ్మద్ వసీం జూనియర్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ను అందుకున్నాడు. చదవండి: టాప్-5లోకి సౌతాఫ్రికా ... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే! -
ఆజమ్ కంటే రిజ్వాన్ బెటర్... భారత్ నుంచి ఒక్కడే.. నా ఫేవరెట్ జట్టు ఇదే!
ఈ ఏడాది కొన్ని క్రికెట్ జట్లకు మధురానుభూతులు పంచితే.. మరికొన్ని టీమ్‌లకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ముఖ్యంగా తమకు అందని ద్రాక్షగా ఉన్న టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి ఆస్ట్రేలియా పండుగ చేసుకుంటే.. టీమిండియా కనీసం మెగా టోర్నీ సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది. మరోవైపు భారత దాయాది జట్టు పాకిస్తాన్ మాత్రం ఈ మేజర్ ఈవెంట్ టైటిల్ గెలవలేకపోయినా.. పూర్తి స్థాయి పోరాటపటిమ కనబరించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి గానూ తన అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే... ఇద్దరు పాక్ ఆటగాళ్లకు చోటిచ్చాడు. టీమిండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే అవకాశం ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో చాట్ సందర్భంగా.... జట్టు ఎంపికలో తాను పరిగణనలోకి తీసుకున్న అంశాలను ప్రస్తావించాడు. ‘‘బాబర్ ఆజమ్.. మహ్మద్ రిజ్వాన్ ఇద్దరి గణాంకాలు బాగానే ఉన్నాయి. ఇద్దరి స్ట్రైక్ రేటు దాదాపుగా.. 130 ఉంది. ఇద్దరికీ ఈ ఏడాది చాలా బాగా కలిసివచ్చింది. అయితే, పవర్‌ప్లేలో స్ట్రేక్ రేటును బట్టి వీరిద్దరిలో నేను రిజ్వాన్ వైపే మొగ్గు చూపుతాను. ఇక ఆల్‌రౌండర్ల విషయానికొస్తే ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్‌ను ఎంపిక చేసుకుంటాను. బౌలర్లలో రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, బుమ్రాను ఎంచుకుంటాను. ఓపెనర్లుగా జోస్ బట్లర్, రిజ్వాన్ నా ఛాయిస్’’ అని హర్షా బోగ్లే చెప్పుకొచ్చాడు. హర్షా బోగ్లే 2021 అత్యుత్తమ టీ20 జట్టు: జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్, మిచెల్ మార్ష్, మొయిన్ అలీ, గ్లెన్ మాక్స్వెల్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: David Warner: ఎంతైనా వార్నర్ కూతురు కదా.. ఆ మాత్రం ఉండాలి -
రిజ్వాన్ కోలుకోవడంలో భారత డాక్టర్ కీలక పాత్ర... కృతజ్ఞతగా ఏమి ఇచ్చాడంటే..
Indian doctor who treated Mohammad Rizwan: టీ20 ప్రపంచకప్-2021లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. టోర్నీ లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే గురువారం (నవంబర్-11)న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా రెండు రోజులు ఐసీయూలో గడిపిన రిజ్వాన్ .. నేరుగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో 52 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రిజ్వాన్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన రిజ్వాన్ త్వరగా కోలుకోవడంలో ఓ భారతీయ డాక్టర్ పాత్ర ఉంది. దుబాయ్‌లోని మెడెరో ఆసుపత్రిలో పల్మోనాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ షహీర్ సైనాలాబ్దీన్.. రిజ్వాన్‌కు రెండు రోజులు పాటు వైద్యం అందించాడు. ముజే ఖేల్నా హై, టీమ్ కె సాత్ రెహనా హై (నేను జట్టుతో ఆడాలనుకుంటున్నాను, నేను జట్టులో ఎలాగైనా ఉండాలి) అని రిజ్వాన్ వైద్యులతో చెప్పాడంట. "రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్ఫెక్షన్ కు గురైయ్యాడు. సెమీఫైనల్‌కు ముందు కోలుకోవడం కష్టంగా అనిపించింది. ఎందుకంటే చెస్ట్ ఇన్ఫెక్షన్తో బాధ పడతున్నవారు ఎవరైనా కోలుకోవడానికి సాధారణంగా 5-7 రోజులు పడుతుంది. కానీ రిజ్వాన్ ఇంత త్వరగా కోలుకోవడం నన్ను కూడా ఆశ్చర్యపరిచింది. రిజ్వాన్ ధైర్యంగా, దృడ సంకల్పంతో ఉన్నాడు. క్రీడాకారుడిగా అతడి శారీరక దృఢత్వం, పట్టుదల రిజ్వాన్ కోలుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. అతడు 35 గంటలు ఐసీయూలో ఉన్నాడు”అని డాక్టర్ సైనాలాబ్దీన్ పేర్కొన్నాడు. కాగా తాను ఇంత త్వరగా కోలుకోవడానికి కారణమైన కృతజ్ఞతగా డాక్టర్ సైనాలాబ్దీన్కు తాను ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని మహ్మద్ రిజ్వాన్ అందచేశాడు. చదవండి: T20 WC 2021: ఆస్ట్రేలియతో ఫైనల్.. కాన్వే స్థానంలో ఎవరంటే -
రిజ్వాన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన వీవీఎస్ లక్ష్మణ్..
VVS Laxman lauds Mohammad Rizwan for playing semi final clash: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా గురువారం(నవంబర్11)న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసినప్పటికీ.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్రశంసించాడు. ధైర్యానికి, దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణగా రిజ్వాన్‌ను అతడు అభివర్ణించాడు. తన ఆరోగ్యం కంటే తన జాతీయ జట్టుకు ఆడటానికి రిజ్వాన్ ఎక్కువ ప్రాధన్యత ఇచ్చాడు అని లక్ష్మణ్ కొనియాడాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీ ఫైనల్‌కు ముందు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండే విషయంపై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్లూ కారణంగా వారు జట్టుకు దూరం కానున్నారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు వైద్యుడు నజీబ్ సొమ్రూ... ‘‘నవంబరు 9న మహ్మద్ రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడు’’ అని తెలిపాడు. అయితే జట్టులోకి వచ్చిన మహ్మద్ రిజ్వాన్.. రెండో సెమిఫైనల్లో 67 పరుగులు చేసి పాకిస్తాన్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. "ధైర్యానికి, దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణ రిజ్వాన్. ఈ మ్యాచ్‌లో తన జట్టు గెలిచి ఉండకపోవచ్చు. కానీ రెండు రోజుల పాటు ఐసీయూలో ఉన్న రిజ్వాన్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు అతడి నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవలసినది చాలా ఉంది'అని ట్విటర్ లో లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఇక సెమీస్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. చదవండి: IND vs NZ Test Series: కరుణ్ నాయర్ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు -
Aus Vs Pak: ఛాతిలో ఇన్ఫెక్షన్.. రెండు రోజులు ఐసీయూలో.. రిజ్వాన్‌పై ప్రశంసలు
Shoaib Akhtar Praises Mohammad Rizwan For Playing T20 Semis With Severe Chest Infection: పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నా.. దేశం కోసం ఆడటం గొప్ప విషయం అన్నాడు. రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న వ్యక్తి.. మైదానంలోకి వచ్చి అద్భుత ప్రదర్శన కనబరిచిన తీరు అతడిపై గౌరవాన్ని మరింత పెంచిందని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీ ఫైనల్‌కు ముందు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండే విషయంపై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనారోగ్య కారణాల దృష్ట్యా వారు జట్టుకు దూరం కానున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. రిజ్వాన్ ఫ్లూ కారణంగా బాధ పడుతున్నాడన్న విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు వైద్యుడు నజీబ్ సొమ్రూ... ‘‘నవంబరు 9న మహ్మద్ రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడు’’ అని తెలిపాడు. ఇక దుబాయ్ వేదికగా ఆసీస్‌తో మ్యాచ్‌లో రిజ్వాన్ అందుబాటులోకి రావడమే కాదు.. 67 పరుగులతో రాణించి పాకిస్తాన్ మంచి స్కోరు(176) సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రిజ్వాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అనుకున్నారంతా! కానీ.. షోయబ్ అక్తర్ షేర్ చేసిన ఓ ఫొటో మాత్రం 29 ఏళ్ల రిజ్వాన్ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఆస్పత్రి బెడ్‌పై ఎంతటి దీన స్థితిలో ఉన్నాడోనన్న విషయాన్ని కళ్లకు కట్టింది. ‘‘ఈరోజు ఈ వ్యక్తి దేశం కోసం ఆడటమే కాదు.. అత్యుత్తమంగా రాణించాడంటే మనం ఊహించగలమా! గత రెండు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నాడు! రిజ్వాన్ పట్ల గౌరవభావం అంతకంతకూ పెరుగుతూనే ఉంది’’ అని అక్తర్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు అభిమానులు రిజ్వాన్ అంకితభావంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజమైన హీరో అంటూ కొనియాడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ ఫొటో నిజమేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నాకు. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: Pakistan Defeat Reasons: ఆ క్యాచ్ వదిలేయడం మా కొంప ముంచింది.. ఒక్క చిన్న తప్పు.. భారీ మూల్యం View this post on Instagram A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar) Mohammad Rizwan spent 2 nights in ICU 😳😳pic.twitter.com/6kaNl0Bmrn — Thakur (@hassam_sajjad) November 11, 2021 -
ఆసీస్‌తో సెమీస్‌కు ముందు అనారోగ్యం... అయినా జట్టులోకి వచ్చారు! కానీ ఫైనల్లో నిరాశే
Update: ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు పాకిస్తాన్ కీలక ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులోకి వచ్చారు. రిజ్వాన్ 67 పరుగులతో ఆకట్టుకోగా... షోయబ్ మాలిక్ మాత్రం నిరాశపరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుది. మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. Mohammad Rizwan, Shoaib Malik Doubtful For Semis Against Australia: టీ20 ప్రపంచకప్-2021లో ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్‌కు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగలనుంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు గత రెండు రోజులు నుంచి ఫ్లూ జ్వరంతో బాధపడతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వీరిద్దరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉంటారో లేరోనన్న అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌కు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో లేకపోతే వారి స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీకు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరిని మ్యాచ్‌కు సిద్ధంగా ఉండమని పీసీబీ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ విజయంలో రిజ్వాన్, మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. నవంబర్ 11న (గురువారం) పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్‌పై విజయంతో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2021 NZ Vs ENG: మన క్యూరేటర్‌కు నివాళిగా... -
T20 World Cup: నా నిర్ణయం సరైందే.. అతడితో కలిసి ఓపెనింగ్ చేస్తా!
Babar Azam Commnets On T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో తమ జట్టు ఓపెనింగ్ జోడి గురించి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కీలక వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తానని స్పష్టం చేశాడు. ఈ విషయంలో తన నిర్ణయం సరైందేనని సమర్థించుకున్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. పాకిస్తాన్ టాపార్డర్‌లో తాను, అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్ రిజ్వాన్ బెస్ట్ ఓపెనింగ్ జోడి అని చెప్పుకొచ్చాడు. ‘‘ఓపెనర్‌గా ఉన్న నేను... ప్రపంచంలోనే నంబర్ 1 ఆటగాడిగా ఎదిగాను. ఓపెనర్‌గా బరిలోకి దిగడం నాకెంతో సౌకర్యవంతంగా ఉంది. ఆ స్థానంలో ఆడితేనే నేను అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలను. ఇక రిజ్వాన్... తను ఇప్పటికే.. ఈ క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? మేమిద్దరం మంచి కాంబినేషన్. శుభారంభం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ అవగాహనతో ఆడతాం. మైదానంలో... ఒకవేళ నేను పరుగులు చేయడానికి ఇబ్బంది పడితే.. రిజ్వాన్ సలహాలు ఇస్తాడు. తను స్ట్రగుల్ అయితే.. నేను సూచనలు చేస్తాను. పెద్ద పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పితే మా తర్వాత వచ్చే బ్యాటింగ్‌కు వచ్చే వాళ్లకు పని సులువవుతుంది ’’ అని బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు. ఒకటీ రెండు మ్యాచ్‌లలో తాను సరిగ్గా ఆడనంత మాత్రాన.. వెనకడుగు వేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇక యూఏఈలో తమకు మంచి రికార్డు ఉందన్న బాబర్ ఆజం.. కచ్చితంగా మెగా టోర్నీలో మెరుగ్గా రాణిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్, డెత్ బౌలింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా... వాటిని అధిగమించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. టి20 ప్రపంచకప్ పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ చదవండి: IPL 2021: ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కీలక ప్రకటన -
ICC T20I Rankings: ఐదో స్థానంలో కోహ్లి, కేఎల్ రాహుల్ నం.7
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ కోహ్లి ర్యాంక్‌లో మార్పు లేదు. 762 రేటింగ్ పాయింట్లతో కోహ్లి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (743) తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో రాణించిన పాకిస్తాన్ ఓపెనర్ రిజ్వాన్ పదో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మలాన్ అగ్రస్థానంలో ఉండగా... ఫించ్ (ఆస్ట్రేలియా) రెండు, బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: పృథ్వీ షా అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్‌లను దాటేశాడు -
క్వాటర్ బాటిల్ రూ.1200, నటుడు అరెస్ట్
సాక్షి, చెన్నై : క్వాటర్ బాటిల్ మద్యాన్ని రూ.1200 చొప్పున దొంగచాటుగా విక్రయిస్తున్న సినీ సహాయ నటుడిని, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి మే 3 వరకూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్లో భాగంగా తమిళనాడులో టాస్మాక్ దుకాణాలను మూసివేశారు. దీంతో కొందరు దొంగ చాటుగా మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. (లాక్డౌన్: ఆదిలాబాద్‌లో వైన్‌షాప్ లూటీ) చెన్నైతో స్థానిక ఎంజీఆర్ నగర్, అన్నా మెయిన్‌రోడులోని ఒక ఇంటిలో దొంగచాటుగా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం అక్కడికి వెళ్లిన పోలీసులకు పలు మద్యం బాటిళ్లు దాచిన విషయం బయట పడింది. దీంతో వాటిని దొంగచాటుగా విక్రయిస్తున్న రిస్కాన్ (30) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతను సహాయ నటుడని తెలిసింది. అతను తన మిత్రుల నుంచి క్వాటర్ మద్యం బాటిల్‌ను రూ.1000కి కొనుగోలు చేసి ఇతరులకు రూ.1200లకు ఇంటికే తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు చెప్పారు. (కరోనా కాలం: మందు బాబుల ముందు జాగ్రత్త) దీంతో పోలీసులు రిస్కాన్ ఇచ్చిన సమాచారంతో మిగతవారిని అరెస్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి స్థానిక చూలైమేడు, కామరాజ్‌నగర్‌కు చెందిన కాల్ టాక్సీ డ్రైవర్ దేవరాజ్, రెండో వ్యక్తి సాలిగ్రామం, దివాకర్‌నగర్‌కు చెందిన ప్రదీప్ అని తెలిసింది. కాగా దేవరాజ్ కారులో ఉన్న 189 క్వాటర్ మద్యం బాటిళ్లను, రూ. 20 వేల డబ్బుతో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. (మీరు మద్యం ప్రియులా.. తాగాలని ఉందా..?) -
జోడీ కుదిరింది
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులివాసు దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కన్నడ బ్యూటీ రచితారామ్ను ఎంపిక చేసుకున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 22న ప్రారంభం కానుంది. రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సహ–నిర్మాత ఖుషి.