
సాక్షి, న్యూఢిల్లీ : దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు రిజ్వాన్‌ను దేశం విడిచి పారిపోతుండగా ముంబై విమానాశ్రయంలో యాంటీ ఎక్ట్సోర్షన్ విభాగం అరెస్ట్ చేసింది. దావూద్ ముఠాకు చెందిన అహ్మద్ రజ వధారియాను దుబాయ్‌లో అరెస్ట్ చేసిన కొద్దిరోజులకే రిజ్వాన్‌ను అరెస్ట్ చేయడం గమనార్హం. అహ్మద్ రజాను ఓ దోపిడీ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. రజాతో రిజ్వాన్‌కు సంబంధాలున్నాయని భావిస్తున్నారు.
రిజ్వాన్‌ను ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో భారత్ వేటాడుతున్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. దావూద్ పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న తాజా చిత్రాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. దావూద్ తమ భూభాగంలోనే ఉన్నట్టు పలు ఆధారాలు లభించినా 51 సంవత్సరాల మాఫియా డాన్ పాక్‌లో ఆశ్రయం పొందుతున్నారన్న వార్తలను పాక్ పదేపదే నిరాకరిస్తోంది. దావూద్‌ను పాకిస్తాన్ సత్వరమే భారత్‌కు అప్పగించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ పాకిస్తాన్‌ను డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment