Dawood Ibrahim
-
దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా
లండన్: 2010 నుంచి విదేశాల్లో గడుపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్‌లో తనపై ఎలాంటి కేసులు లేవన్న లలిత్ మోదీ..చంపుతామంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి వచ్చి,న బెదిరింపుల వల్లే విదేశాల్లో ఉంటున్నట్లు చెప్పుకున్నారు. ‘ఫిగరింగ్ ఔట్’అనే పాడ్ కాస్ట్లో రాజ్ షమానీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఈ విషయాలను ఆయన వెల్లడించారు. ‘వాస్తవానికి, దేశం విడిచి పెట్టేటంతటి సీరియస్ కేసులేవీ నాపైన అప్పట్లో లేవు. దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ నాకు బెదిరింపులు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌ను అస్సలు సహించను. అయితే, క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్న దావూద్ ఇబ్రహీం నాపై ఒత్తిడి పెంచాడు. అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడటంపైనే నా దృష్టంతా ఉంది. దీనికి తోడు వ్యతిరేక ప్రచారం నాపై ఎక్కువగా జరిగింది’అని లలిత్ పేర్కొన్నారు. ‘ఈ పరిస్థితుల్లో హిట్ లిస్ట్‌లో ఉన్నందున నాకు 12 గంటలపాటు మాత్రమే భద్రత కల్పించగలమని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. నా వ్యక్తిగత సిబ్బంది సూచనమేరకు ముందు జాగ్రత్తగా ఎయిర్‌పోర్టు నుంచి వీఐపీ గేట్ ద్వారానే బయటకు వెళ్లా’అని వివరించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భారత్ వెళ్లగలనంటూ ఆయన..‘చట్ట పరంగా నేను పరారీలో ఉన్న నేరగాణ్ని కాను. అక్కడ ఏ కోర్టులోనూ నాపైన ఎలాంటి కేసులూ లేవు. అందుకే భారత్‌కు రేపు ఉదయం వెళ్లాలన్నా వెళ్లగలను. అందులో నాకెలాంటి సమస్యాలేదు’అని తెలిపారు. దావూద్ ఇబ్రహీం హిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లలో లలిత్ మోదీ ఒకరు. లలిత్‌ను చంపేందుకు తమ షార్ప్ షూటర్ల బృందం థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సిద్ధంగా ఉందంటూ కొన్నేళ్ల క్రితం దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ వ్యాఖ్యా నించడం తెలిసిందే. -
దావూద్ కుటుంబీకుల ఆస్తులకు రూ.2 కోట్లకు పైగా ధర
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసు సూత్రధారి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యులకు చెందిన రెండు స్థిరాస్తులు వేలంలో రూ.2 కోట్లకు పైగా ధర పలికినట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్సే్ఛంజి మానిప్యులేటర్స్ చట్టం కింద శుక్రవారం ముంబైలోని ఆయకార్ భవనంలో వేలం చేపట్టామన్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తహశీల్ ముంబాకే గ్రామంలోని నాలుగు చోట్ల ఉన్న భూములను వేలానికి ఉంచినట్లు చెప్పారు. వీటిలో సుమారు 171 చదరపు మీటర్ల భూమి ధర వేలంలో అత్యధికంగా రూ.2.01 కోట్లు, మరో 1,730 చదరపు మీటర్ల స్థలం రూ.3.28 కోట్లు పలికిందని చెప్పారు. ఈ రెండింటిని ఢిల్లీకి చెందిన లాయర్ కొనుగోలు చేశారని వివరించారు. మిగతా రెండు ప్లాట్లకు ఎవరూ టెండర్లు వేయలేదని వివరించారు. -
దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..?
ముంబయి: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) అథారిటీ (SAFEMA) జనవరి 5న వేలం వేయనుంది. మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వికుల ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ భూమితో సహా నాలుగు ఆస్తులు ఉన్నాయి. ఈ నాలుగు ప్రాపర్టీల ధర రూ. 19.2 లక్షలు. ఇందులో చిన్న ప్లాట్‌ను రూ. 15,440 రిజర్వ్ ధరగా ఉంచారు. అంతకుముందు 2017, 2020లో దావూద్ ఇబ్రహీంకు చెందిన 17 ఆస్తులను SAFEMA వేలం వేసింది. "దావూద్ ఇబ్రహీం తల్లి అమీనా బీకి చెందిన నాలుగు ఆస్తులను జనవరి 5న వేలం వేస్తున్నాం. ఈ ఆస్తులు మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలోని ముంబ్కే గ్రామంలో వ్యవసాయ భూమి రూపంలో ఉన్నాయి. జనవరి 5న మధ్యాహ్నం 2:00 నుంచి 3:30 గంటల మధ్య వేలం ప్రక్రియ జరగనుంది" అని SAFEMA ఓ ప్రకటనలో పేర్కొంది. దావూద్ ఇబ్రహీం, ఆయన కుటుంబ సభ్యులపై స్మగ్లింగ్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కేసుల్లో ఈ ఆస్తులు అటాచ్ చేశారు. 2017లో వేలం వేసిన దావూద్ ఆస్తులు రూ.11 కోట్లు పలికాయి. 2020లో, వేలంలో దావూద్ ఆస్తులు రూ. 22.79 లక్షలు పలికాయి. ఇదీ చదవండి: Lok Sabha Election: తొలిసారి లోక్‌సభకు జేపీ నడ్డా పోటీ? -
వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి మహారాష్ట్ర రత్నగిరిలో ఉన్న చిన్ననాటి ఇల్లు, మరికొన్ని ప్రాపర్టీలను అధికారులు వేలం వేయనున్నారు. అతని కుటుంబ సభ్యులకు సంబంధిచిన నాలుగు ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయి. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 కింద దావూద్ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిలో కొన్నింటిని జనవరి 5వ తేదీన అధికారులు వేలం వేయనున్నారు. ఇక గడిచిన 9 ఏళ్ల దావూద్, అతని కుటుంబానికి సంబంధిచిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్( రూ.4.53 కోట్లు), ఆరు ఫ్లాట్లు(రూ. 3.53 కోట్లు), గెస్ట్ హౌజ్(రూ. 3.52 కోట్లు) అమ్ముడుపోయాయి. 1993 ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారి అయిన దావూద్.. 1983లో ముంబైకి రాకముందు ముంబాకే గ్రామంలో ఉండేవాడు. అయితే దావూద్ ముంబై పేలుళ్ల అనంతరం భారత్ విడిచివెళ్లిన విషయం తెలిసిందే. ముంబై పెలుళ్లలో 257 మంది మృతి చెందారు. ఇటీవల దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా మారిందని, అతనికి విషప్రయోగం జరిగి ఆస్పత్రిలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అసత్యాలని రెండు నిఘా వర్గాలు తేల్చాయి. చదవండి: రాహుల్ గాంధీ యాత్ర.. ఫోకస్ అంతా అక్కడే! -
Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. ఆయన జీవితంపై ఇన్ని సినిమాలా? (ఫొటోలు)
-
బాలీవుడ్ హీరోయిన్ను పిచ్చిగా ప్రేమించిన దావూద్.. కానీ..
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం చావుబతుకుల మధ్య ఉన్నాడంటూ గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరైతే ఏకంగా ఆయన చనిపోయాడని అంటున్నారు. దీనిపై ఆయన అనుచరుడు చోటా షకీల్ స్పందిస్తూ భాయ్ క్షేమంగా ఉన్నాడని, తన ఆరోగ్యం క్షీణించిందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత దావూద్ పేరు తెరపైకి రావడంతో సాధారణ క్రిమినల్ నుంచి డాన్‌గా ఎదిగిన తీరును, అతడి దుర్మార్గాలను గుర్తు చేసుకుంటున్నారు జనాలు. హీరోయిన్‌తో ప్రేమాయణం ఈ డాన్‌కు క్రిమినల్స్తోనే కాదు బాలీవుడ్‌తోనూ సంబంధాలున్నాయి. హీరోయిన్ మందాకినిని ఎంతో ఆరాధించాడు దావూద్. ఆమెను కూడా ప్రేమ ముగ్గులోకి దింపాడు. ఈ మందాకిని.. 80వ దశకంలో స్టార్ హీరోయిన్గా రాణించింది. తన అందం, అభినయంతో కుర్రకారుకు కంటి మీద నిద్ర లేకుండా చేసింది. 1985లో రిలీజైన రామ్ తేరి గంగా మెయిలీ సినిమా ఆమె కెరీర్లోనే టాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో ఎన్నో అవకాశాలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ఈ నటి.. సింహాసనం, భార్గవ రాముడు చిత్రాలతో తెలుగువారికీ పరిచయమైంది. కానీ ఒకే ఒక్క ఫోటో ఆమె కెరీర్‌నే నాశనం చేసింది. 1994లో దావూద్‌తో మందాకిని కలిసి ఉన్న ఫోటోలు లీకయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఆ మోడల్ కోసం హత్య మొదట తనకేం తెలియదని బుకాయించిన హీరోయిన్ ఆ తర్వాత మాత్రం తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పింది. ఈ సంఘటన వల్ల మందాకినికి అవకాశాలు రావడం ఆగిపోయాయి. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పి కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది నటి. అనంతరం డాక్టర్ కాగ్యుర్ రింపోచే ఠాకూర్‌ను పెళ్లాడి విదేశాల్లో సెటిలైంది. వీరికి రబ్బిల్ అనే కుమారుడు, రబ్జే ఇనయ అని ఓ కూతురు ఉన్నారు. ఇదిలా ఉంటే నటి, మోడల్ అనిత అయ్యుబ్ కూడా దావుద్ ప్రియురాలే అని ఓ ప్రచారం ఉంది. ఈమెను సినిమాలోకి తీసుకోవడానికి నిర్మాత జావెద్ సిద్దిఖి నిరాకరించడంతో దావూదే అతడిని కాల్చి చంపాడని చెప్తుంటారు. దావూద్ ఇబ్రహీంతో మందాకిని View this post on Instagram A post shared by Yasmeen Joseph Thakur | Mandakini (@mandakiniofficial) చదవండి: నా దేశంలో రక్షణ లేకుండా పోయింది.. అడుగు బయటపెట్టాలంటేనే.. -
ముంబయ్ పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పరిస్థితి విషమం
-
Dawood: చోటా షకీల్ కీలక ప్రకటన
ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం(67) ఆరోగ్యంపై గత రెండు రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. విష ప్రయోగం జరిగిందని, ఆరోగ్యం విషమించి చావుబతుకుల మధ్య కరాచీ ఆస్పత్రిలో ఉన్నాడని.. ఇలా ప్రచారాలు జరిగాయి. ఈలోపు దావూద్ దగ్గరి బంధువు, పాక్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందద్ హౌజ్అరెస్ట్ కావడం, కాసేపటికే.. దావూద్ చనిపోయాడంటూ ఇంటర్నెట్లో పోస్టులు కనిపించాయి. దీనికి తోడు పాక్‌లో ఇంటర్నెట్ సేవలకు విఘాతం కలగడంతో ఆ వార్తల్ని దాదాపుగా ధృవీకరించేసుకున్నాయి మన మీడియా సంస్థలు. అయితే.. నిన్న సాయంత్రం నుంచి దావూద్ చనిపోలేదంటూ పలు పాక్ మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తూ వస్తున్నాయి. ఈ తరుణంలో దావూద్ అనుచరుడు, డీ-కంపెనీ వ్యవహారాలను చూసుకునే చోటా షకీల్ భారత్‌కు చెందిన ఓ మీడియా ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. దావూద్ ఇబ్రహీం ఆరోగ్య విషయంలో వస్తున్న కథనాల్ని చోటా షకీల్ ఖండించాడు. విషప్రయోగం జరిగిందన్న కథనాలతో పాటు దావూద్ ఆరోగ్యం క్షీణించిందన్న ప్రచారాన్ని షకీల్ కొట్టిపారేశాడు. భాయ్ వెయ్యి శాతం ఫిట్‌గా ఉన్నాడు అంటూ ఓ భారతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోటా షకీల్ చెప్పాడు. మరోవైపు నిఘా వర్గాలు సైతం దావూద్‌పై విష ప్రయోగం జరిగిందన్న ప్రచారాన్ని ఊహాగానంగా తేల్చేశాయి. ఐఎస్ఐ ఏజెంట్లు.. తన నమ్మకస్తుల భద్రతా వలయం నడుమ దావూద్ భద్రంగానే ఉన్నట్లు చెబుతున్నాయి. అమెరికా దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినప్పటికీ.. ఐఎస్ఐ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. అండర్ వరల్డ్ మాఫియా డాన్‌గా, ముంబై వరుస పేలుళ్ల కేసుతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న దావూద్ ఇబ్రహీం.. కరాచీలో తలదాచుకున్నాడని భారత్ తొలి నుంచి వాదిస్తోంది. అయితే పాక్ మాత్రం దానిని ఆరోపణగానే తోసిపుచ్చుతూ వస్తోంది. తాజాగా.. జాతీయ భద్రతా సంస్థ NIA విడుదల చేసిన ఛార్జిషీట్లో దావూద్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఉన్నాయి. -
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.55 వేలకోట్ల దావూద్ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే..
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. పాకిస్థాన్‌లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో అనేక కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ నివేదికలపై ఎలాంటి ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు. దావూద్ కరాచీలో ఉంటున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మూడు దశాబ్దాలుగా ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పాకిస్థాన్ అడ్డాగా దందాలు, అక్రమ వ్యాపారాలను నడుపుతున్నాడు. దావూద్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది. అతని భార్య జుబీనాజరీన్, సోదరుడు అనీస్ సహకారంతో ఇదంతా నడుస్తోందని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. 1980-90 మధ్య కాలంలో దావూద్ వ్యభిచారం, డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వ్యాపారాలతో కోట్లు గడించాడు. ప్రపంచ ఉగ్రవాద సంస్థ డీ-కంపెనీకి అధిపతిగా మారాడు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు నిర్వహిస్తున్న కొన్ని వ్యాపారాలు ఈ కింది విధంగా ఉన్నట్లు సమాచారం. చమురు, లూబ్రికెంట్లు: ఒయాసిస్ ఆయిల్ & లూబ్ ఎల్సీసీ అనే దుబాయ్ ఆధారిత కంపెనీ చమురు, లూబ్రికెంట్ల వ్యాపారం సాగిస్తోంది. ఇది డీ-కంపెనీల్లో ఒకటిగా ఉన్నట్లు తెలిసింది. డైమండ్స్: అల్-నూర్ డైమండ్స్ అనేది దుబాయ్‌లోని వజ్రాల వ్యాపార సంస్థ. ఇది డి-కంపెనీకి మనీలాండరింగ్‌కు సహకరిస్తుందని గతంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పవర్: ఒయాసిస్ పవర్ ఎల్సీసీ దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సెక్టార్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది డీ-కంపెనీకి సహకరిస్తుందని నమ్ముతుంటారు. నిర్మాణ రంగం: డాల్ఫిన్ కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం, రియల్ ఎస్టేట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుబాయ్ ఆధారిత కంపెనీ. ఇది డీ-కంపెనీకి మద్దతు తెలుపుతుందని కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఎయిర్‌లైన్స్: ఈస్ట్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ను దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీం స్థాపించాడు. ఈ సంస్థను స్మగ్లింగ్, పన్ను ఎగవేత ఆరోపణలతో 1996లో మూసివేశారు. ఇవి దావూద్ ఇబ్రహీం, అతడి డీ-కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న కొన్ని కంపెనీలని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి నిర్థారణలు లేవు. దావూద్ పాకిస్థాన్, యుఏఈ, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కొందరు చెబుతుంటారు. అతను హవాలా మనీతో ఈ సమ్రాజ్యాన్ని సృష్టించారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, గన్ సప్లైతో దావూద్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఫోర్బ్స్ ప్రకారం గ్యాంగ్స్టర్లలో దావూద్ అధిక ధనవంతుడిగా నిలిచాడు. 2015లో అతని ఆస్తుల నికర విలువ 6.7 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం అప్పట్లోనే రూ.55 వేల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. సంస్థ రియాక్షన్ ఇదే.. దావూద్ పేరుపై ఒక హోటల్ కూడా ఉంది. ఇప్పటికే దావూద్‌కు చెందిన అనేక ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పైగా ఇండియాలో ముంబైతో పాటు ఇతర నగరాల్లో సైతం ఆస్తులను కలిగి ఉన్నట్లు సమాచారం. 2జీ స్పెక్ట్రమ్ సహా అనేక కుంభకోణాల్లో దావూద్ పాత్ర ఉందని తెలిసింది. -
కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం?
ఇస్లామాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. పాకిస్థాన్‌లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని సోషల్ మీడియాలో అనేక కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ నివేదికల నిజానిజాలపై ఎటువంటి నిర్ధారణ లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దావూద్ ఇబ్రహీం రెండు రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యాడు. ఆసుపత్రి లో పటిష్ట భద్రత నడుమ చికిత్స చేయించుకుంటున్నాడు. దావూద్ చికిత్స కొనసాగుతున్న ఫ్లోర్లో ఆయన ఒక్కర్నే ఉంచినట్లు సమాచారం. ఆసుపత్రి వైద్యులు, దావూద్ సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ ఫ్లోర్‌లోకి ప్రవేశం ఉందని తెలుస్తోంది. దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్, సాజిద్ వాగ్లే నుండి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు జనవరిలో నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి తెలిపిన విషయం తెలిసిందే. కరాచీ ఎయిర్‌పోర్టును దావూద్ ఇబ్రహీమ్ అనుయాయులే నియంత్రిస్తున్నారని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొన్న విషయం కూడా తెలిసిందే. BIG BREAKING NEWS - As per unconfirmed reports, India's most wanted Dawood Ibrahim has been poisoned by UNKNOWN MEN and is now hospitalised in Karachi with a serious condition. Pakistani media also running this news 🔥🔥 Internet Services shutdown across Pakistan due to UNKNOWN… pic.twitter.com/AuDup7ytwx — Times Algebra (@TimesAlgebraIND) December 17, 2023 మరోవైపు దావూద్ ఇబ్రహీంకు దగ్గరి బంధువు అయిన క్రికెటర్ జావేద్ మియందాద్‌ను, అతడి కుటుంబాన్ని హౌజ్ అరెస్ట్‌లో పెట్టింది అక్కడి ప్రభుత్వం. జావేద్ మియందాద్, అతడి కుటుంబం బహిరంగంగా ఉండడం అంత శ్రేయస్కరం కాదని, మియందాద్ రక్షణ కోసమే అతడిని హౌజ్ అరెస్ట్‌లో పెట్టినట్టు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. BIG BREAKING NEWS - Entire family of former Pakistani cricketer Javed Miandad has been put under house arrest by the Pakistan Army and ISI 🔥🔥 Javed Miyadad is a close relative of terrorist Dawood Ibrahim. There is something big which Pakistan is hiding⚡ UNKNOWN MEN have… pic.twitter.com/ZP3qr0LzDh — Times Algebra (@TimesAlgebraIND) December 18, 2023 ఇదీ చదవండి: ఇస్లాంపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం -
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం
-
దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమం!
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. తీవ్ర ఆనారోగ్యంతో ఉన్న దావూద్‌ను సోమవారం పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారట. అయితే అతనిపై విష ప్రయోగం జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. అతను మరో రెండు రోజుల పాటు ఆసత్రిలో ఉండి చికిత్స తీసుకొనున్నట్లు సమాచారం. పాక్ మీడియా కథనాల ప్రకారం.. ఆస్పత్రి లోపల దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ ఒక్కడే పేషెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతన్ని చూడటానికి కుటుంబసభ్యులు, ఆస్పత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మాఫియా డాన్ గురించి ఈ ఏడాది జనవరిలో అతని సోదరి ఆసక్తికర విషయాలు చెప్పింది. రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి దావూద్ కరాచీలోనే ఉంటున్నట్లు ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణలో ఆమె తెలిపింది. మరోవైపు.. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులు.. పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. చదవండి: ‘మధ్యధరా’లో పడవ మునిగి 60 మంది మృతి -
ఈ కంపెనీలో ఒక రోజు
వీధి రౌడీ నుంచి మాఫియా డాన్ వరకు దావూద్ ఇబ్రహీం నేర పరిణామ క్రమాన్ని దగ్గరి నుంచి చూసింది జర్నలిస్ట్ షీలాభట్. ఆమె దావూద్‌ను ఎన్నోసార్లు ఇంటర్వ్యూ చేసింది. 1970లో...‘చిత్రలేఖ’ మ్యాగజైన్లో మాఫియా డాన్ కరీమ్లాలాతో షీలాభట్ ఉన్న ఫోటోను చూసి ఆమెకు కాల్ చేశాడు దావూద్. అప్పుడు దావూద్ ‘జస్ట్ ఏ క్రిమినల్’ మాత్రమే. ‘మీరు నాకు ఒక సహాయం చేయాలి. ముంబైలోని గవర్నమెంట్ రిమాండ్ హోమ్‌లో ఉన్న అమ్మాయిలను కరీమ్లాలా మనుషులు వేధిస్తున్నారు. మీరు వాళ్ల దుర్మార్గాల గురించి పత్రికల్లో రాయాలి’ అని షీలాను అడిగాడు దావూద్. ‘దావూద్ అంటే భయం కంటే ప్రయాణ ఖర్చుల గురించి బాధే నాలో ఎక్కువగా ఉండేది’ అని దుబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకొని నవ్వుతూ చెప్పింది షీలా. ఒకసారి దావూద్‌ను ఇంటర్య్వూ చేయడం కోసం దుబాయ్‌కు వెళ్లింది. ‘లెట్స్ ఈట్’ అంటున్నాడే తప్ప ఇంటర్య్వూకు మాత్రం ‘నో’ అంటున్నాడు దావూద్. మూడురోజుల తరువాత మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒక మర్డర్ గురించి మాట్లాడుతూ ‘వాడిని నేను చంపి ఉండకపోతే, వాడు నన్ను కచ్చితంగా చంపేవాడు. షీలాజీ... మీరే చెప్పండీ. నేను చేసింది ఏమైనా తప్పంటారా?’ అని అమాయకంగా ముఖం పెట్టాడు దావూద్! తాజాగా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలెన్నో చెప్పింది షీలాభట్. -
వారంతా అవినీతిపరులే.. కేసులు నుండి తప్పించుకోడానికే..
ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ మహారాష్ట్రలో జరిగిన రాజకీయ క్రీడా వెనుక అసలు సూత్రధారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లంతా అవినీతిపరులే.. వారిపై ఉన్న నేరాలను మాఫీ చేసినందుకు ప్రధానికి కృతఙ్ఞతలు తెలపాలని అన్నారు. అధికారం కోసం అర్రులు చాచి అజిత్ పవార్ చాలా పెద్ద తప్పు చేశారని, ఈ రహస్య ఒప్పందం మొత్తం ప్రధాని కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్. అజిత్ పవార్, ఛగన్ భుజబల్, హాసన్ ముష్రిఫ్ లతోపాటు మిగిలిన వారిపైన కూడా నేరారోపణలుండటంతో ప్రధాని వారిని బెదిరించి తమ వైపుకు తిప్పుకున్నారని వ్యాఖ్యానించారు. మా పార్టీ నుండి ఫిరాయింపుకు పాల్పడిన వారందరూ ఆర్ధిక నేరాలకు పాల్పడినవారే. కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ అప్పట్లో భారీ ఎత్తులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామి కాక ఒక్కరోజు ముందు అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసులు ఎత్తివేసిందని శరద్ పవార్ తెలిపారు. ఆయనలాగే ఇరిగేషన్ స్కాములో అదితి తాత్కారే తండ్రి సునీల్ తాత్కారే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీడబ్ల్యుడి మంత్రిగా ఉన్నప్పుడు ఛగన్ భుజబల్ కూడా భారీస్థాయిలో మనీలాండరింగ్ చేసి 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ఇక హాసన్ ముఫ్రి విషయానికి వస్తే తన సొంత కంపెనీ కోసం నిధులు మళ్లించిన కేసులో ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ మీమన్ అలియాస్ మిర్చితో వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈడీ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీళ్లంతా నేరస్తులు కాబట్టే ప్రధాని పని సులువైందని ఆరోపించారు ఎన్సీపీ అధినేత. మా పార్టీని విడిచి వెళ్లిన వారిని వదలబోమని పార్టీ విధానాలను అనుసరించి వారిపై రాజ్యాంగబద్ధమైన చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్ -
నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్.. హత్య చేస్తామంటూ..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. హత్య చేస్తామంటూ దుండగులు కాల్ చేసి బెదిరించారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. నాగ్‌పూర్‌లోని గడ్కరీ నివాసానికి వచ్చిన ఈ కాల్స్‌కు ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాతో సంబంధం ఉన్నాయని అనుమానిస్తున్నారు. కాగా జనవరి 14నే గడ్కరీ ఆఫీస్ ల్యాండలైన్కు మొదటి బెదిరింపు కాల్ వచ్చింది. నిందితున్ని జయేష్ పుజారి అలియాస్ కాంత అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మొదటికాల్స్లో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌గా పేర్కొంటూ రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మార్చి 21న మరో బెదిరింపు కాల్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. లష్క్ర్ ఏ తోయిబాతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితున్ని మార్చి 28న ఊపా చట్టం కింద కేసు నమోదు చేసి నాగ్‌పూర్ జైలుకు తరలించారు. అతను జైళ్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం మరో బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఎన్ఐఏ టీం నాగ్‌పుర్ చేరింది. దర్యాప్తును ప్రారంభించింది. చదవండి: విద్యార్థిగా మారిన మోస్ట్ వాంటెడ్ నక్సల్.. చరిత్ర సృష్టించింది -
Dawood Ibrahim: రెండో పెళ్లి కలకలం..వెలుగులోకి సంచలన విషయాలు
పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ సంచలన విషయాలు వెల్లడించాడు. దావూద్ పాక్ మహిళ పఠాన్‌ను రెండో పెళ్లి చేసకున్నాడంటూ బాంబు పేల్చాడు. అలాగే అతను పాకిస్తాన్‌లోని కరాచిలోనే ఉన్నాడని కాకపోతే వేరే ప్రదేశంలోకి మకాం మార్చాడని కీలక విషయాలు చెప్పాడు. ఈ మేరకు ఉగ్రవాద నిధుల కేసుకి సంబంధించి నేషనల్ ఇన్విస్ట్‌గేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చేసిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ ఈ విషయాలను బయటపెట్టాడు. ఈ అలీషా పార్కర్ దావూద్ ఇబ్రహీం సోదరి, చనిపోయిన హసీనా పార్కర్ కుమారుడు అలిషా ఇబ్రహీం పార్కర్. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహితులపై కేసు నమోదు చేసి కొందర్ని అరెస్టు చేసింది కూడా. అదీగాక దావూద్ దేశంలో బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది. వారు తమ అరాచకాలను పెద్దపెద్ద నగరాల్లో వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సాగిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ నుంచి ఎన్ఐఏ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ మేరకు అలీషా పార్కర్ విచారణలో ...దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని, అలాగే అతడి భార్య తన వాళ్లతో టచ్‌లోనే ఉందని చెప్పాడు. అలాగే అతను ఈ కేసులో పట్టుబడకుండా ఉండేందుకే పాకిస్తాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె పేరు పఠాన్ అని చెప్పుకొచ్చాడు.ఇప్పడూ దావూద్ కరాచీలోని అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక ఉన్న రహీమ్ ఫకీ సమీపంలోని డిఫెన్స్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపాడు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను తాను కొన్ని నెలల క్రితం జులై 2022లో దుబాయ్‌లో కలిశానని చెబుతున్నాడు. అలాగే ఆమె పండుగలకు తన భార్యకు ఫోన్ చేస్తుంటుందని, వాట్సాప్ కాల్స్ ద్వారా తన భార్యతో మాట్లాడుతుందని కూడా చెప్పాడు. ప్రస్తుతం దావూద్, అతని సన్నిహితులు అనీస్ ఇబ్రహీం షేక్, ముంతాజ్ రహీమ్ ఫకీ తదితరులు తమ కుటుంబాలతో సహా పాకిస్తాన్‌లోని కరాచీలో డిఫెన్స్ కాలనీలో అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక నివశిస్తున్నారని పేర్కొన్నాడు. అతను ఇప్పుడూ ఎవరితోనూ టచ్‌లో లేడని చెబుతున్నాడు. అలాగే దావూద్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడనేది అవాస్తవం అని చెప్పాడు. దావూద్‌కి మొదటి భార్య మైజాబిన్‌తో ముగ్గురు కూమార్తెలు, ఒక కూమారుడు ఉన్నారని తెలిపాడు. అంతేగాదు అలీషా పార్కర్ విచారణలో దావూద్ నలుగురు సోదరులకు సంబంధంచిన విషయాలు కూడా దర్యాప్తు సంస్థకు వెల్లడించినట్లు సమాచారం. (చదవండి: దావూద్‌పై ఎన్ఐఏ రూ.25 లక్షల బౌంటీ.. అండర్ వరల్డ్ డాన్‌పై ఎన్ని కేసులన్నాయంటే..) -
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌లు భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు. వీరిద్దరు పాకిస్థాన్‌లో తలదాచుకున్నారని ప్రపంచానికి తెలిసిన విషయమే. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశంలో వీరిద్దరి గురించి ఓ ప్రశ్న పాకిస్థాన్ హోంల్యాండ్ ఉన్నతాధిరి మోహ్సిన్ భట్‌కు ఎదురైంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అయిన దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను భారత్‌కు అప్పగిస్తారా? అని ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రతినిధి భట్‌ను అడిగారు. అయితే ఆయన మాత్రం సమాధానాన్ని దాటవేశారు. ఈ విషయం స్పందించేందుకు నిరాకరించారు. ఒక్కమాట కూడా మాట్లాడుకుండా మౌనం వహించారు. ఢిల్లీలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు జరుగుతున్న ఇంటర్‌పోల్ అసెంబ్లీ సమావేశానికి 195 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా దేశాల మంత్రులు, సెక్యూరిటీ ఉన్నతాధికారులు వచ్చారు. పాక్ నుంచి ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డెరక్టర్ జనరల్ మోహ్సిన్ భట్‌తో పాటు మరో అధికారి వచ్చారు. #WATCH | Pakistan's director-general of the Federal Investigation Agency (FIA) Mohsin Butt, attending the Interpol conference in Delhi, refuses to answer when asked if they will handover underworld don Dawood Ibrahim & Lashkar-e-Taiba chief Hafiz Saeed to India. pic.twitter.com/GRKQWvPNA1 — ANI (@ANI) October 18, 2022 ఇంటర్‌పోల్ అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తోంది. చివరిసారిగా 1997లో భారత్‌లో ఈ కార్యక్రమం జరిగింది. చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష! -
దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే 25లక్షల రివార్డ్
-
దావూద్ ఇబ్రహీంపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?
ఢిల్లీ: గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఎన్ఐఏ. దావూద్ గురించి సమాచారం అందించిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. దావూద్‌తో పాటు అతని అనుచరుడు చోటా షకీల్ మీద కూడా రూ.20 లక్షలు ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ. భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్ అయిన ఎన్ఐఏ.. తాజాగా దావూద్‌కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది. దావూద్, చోటా షకీల్‌తో పాటు ఉగ్రవాదులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, టైగర్ మెమోన్‌ల మీద రూ.15 లక్షల బౌంటీ ప్రకటించింది ఎన్ఐఏ. దావూద్‌తో పాటు ఇతరులంతా కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, అల్ కాయిదాలతో కలిసి పని చేస్తున్నారని, బడా వ్యాపారవేత్తలను, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వీళ్ల గురించి సమాచారం అందించిన వాళ్లకు రివార్డు అందిస్తామని పేర్కొంది. ► 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం.. పన్నెండు చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకుల మరణానికి, 700 మంది గాయపడడానికి కారణం అయ్యాడు. ► గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఐరాస భద్రతా మండలి దావూద్‌ను గుర్తించగా.. అరెస్ట్‌ను తప్పించుకోవడానికి దావూద్ పాక్‌లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. తాజాగా భద్రతా మండలి రిలీజ్ చేసిన ఉగ్రవాద జాబితాలో దావూద్ ఉండగా.. కరాచీ పేరిట అతని చిరునామా సైతం ఉండడం గమనార్హం. ► అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డీ-కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది. ► మే నెలలో ఎన్ఐఏ 29 ప్రాంతాల్లో దాడులు చేసింది. అందులో హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సమీర్ హింగోరా(1993 ముంబై పేలుళ్లలో దోషి), సలీం ఖురేషీ(ఛోటా షకీల్ బావమరిది), ఇతరులకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ► 2003లో, దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించాయి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. ► ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్‌పై కేసులు నమోదు అయ్యాయి. ► 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో, దావూద్ తాజ్ మహల్ హోటల్‌తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. ► 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్‌ను దావూద్ నడిపించాడని కొన్ని జాతీయ మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరించాయి. ► డీ కంపెనీ.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకో హరామ్ ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం. ఇదీ చదవండి: శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా -
పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం.. ‘మోదీ పట్టుకుంటారా ?’
ముంబైలో గ్యాంగ్‌స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనే దావూద్ ఇబ్రహీం ఉన్నట్టు తెలిపింది. అయితే, కొన్ని రోజుల నుండి దావూడ్ సంబంధిన అన్ని విభాగాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని దావూద్ సోదరి హాసీనా పార్కర్ కుమారుడు అలిశా పార్కర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అనంతరం పార్కర్‌ను విచారించే క్రమంలో దావూద్ పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నాడని అతడు తెలిపాడు. దీంతో దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో బయటకు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఇక, ఈడీ విచారణ సందర్భంగా పార్కర్.. ‘‘నేను పుట్టుక ముందే తన మామ(దావూద్ ఇబ్రహీం) ముంబై వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు భారత్‌ను వదిలి.. పాకిస్తాన్లో ఉంటున్నట్టు మా బంధువుల ద్వారా తెలిసింది. అయితే, ఇంతకు ముందు కొన్నిసార్లు ఈద్, ఇతర పండుగలకు దావూర్ భార్య మెహ్జబీన్.. తన భార్య ఆయేషా, తన సోదరితో మాట్లాడింది.’’ అని చెప్పినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. దీంతో దావూద్.. పాకిస్తాన్లో ఉన్నాడని రుజువైంది. ఈడీ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత.. దావూద్ ఇబ్రహాంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే డిమాండ్ చేశారు. In a big revelation, Haseena Parkar's son Alishah has told the Enforcement Directorate that underworld don Dawood Ibrahim is living in Pakistan's Karachi. Read more: https://t.co/TJtKSCm0ow#DawoodIbrahim pic.twitter.com/9bs8EW4xmT — TIMES NOW (@TimesNow) May 24, 2022 అంతకుముందు.. మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుచగా.. కోర్టు ఈడీ కస్టడీ విధించింది. దీంతో నవాబ్ మాలిక్ వ్యవహారంలో బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకోవాలని ప్రధాని మోదీకి ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. Central Govt should take action on it. Till now the location was not known but now if the location is clear then the Central govt should take it seriously and take the action: Maharashtra Home Minister Dilip Walse Patil on Dawood Ibrahim pic.twitter.com/V56OvHK6pI — ANI (@ANI) May 24, 2022 ఇది కూడా చదవండి: బీజేపీకి దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్ -
బీజేపీలో చేరితే దావూద్‌కూ మంత్రి పదవి: ఠాక్రే
ముంబై: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. -
దావూద్ అనుచరుల ఆఫీసులపై ఎన్ఐఏ దాడులు
ముంబై: ముంబైలో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులపై ఎన్ఐఏ ఒక్కసారిగా దాడులు నిర్వహిస్తోంది. దావుద్ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేతలో భాగంగా ఎన్ఐఏ నగరంలోని 20 ప్రాంతాల్లో పరారీలో ఉన్న అతని సహచరుల ఆఫీసులపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల జాబితాలో.. షార్ప్ షూటర్లు, డ్రగ్స్ దందా చేసేవాళ్లు, హవాలా ఆపరేటర్లు, దావూద్ ఇబ్రహీంకు చెందిన రియల్ ఎస్టేట్ మేనేజర్లు, క్రిమినల్ సిండికేట్‌లోని ఇతర కీలక వ్యక్తుల ఉన్నట్లు తెలుస్తోంది. బాంద్రా, నాగ్‌పడా, బోరివలి, గోరేగావ్, పరేల్, శాంతాక్రజ్‌లలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలు, దేశంలో అశాంతిని సృష్టించే లక్ష్యంతో చేసిన చర్యలకు సంబంధించి ఎన్ఐఏ ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. డీ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై నిశీతంగా పరిశీలిస్తోంది. విదేశాల్లో ఉంటూ ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిపై ఇప్పటికే ఎన్ఐఏ నిఘా పెట్టింది. కాగా ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: ఉద్ధవ్‌కు దమ్ముంటే నాపై గెలవాలి: నవనీత్ కౌర్ -
దావూద్ ఇబ్రహీంకు, ఆర్జీవీకి చాలా పోలికలుంటాయి: డైరెక్టర్
'ఏ కథ రాసినా కామెడీ, థ్రిల్లర్, డ్రామా వుండేలా చూసుకుంటాను. తెలుగులో `చంటబ్బాయ్` తర్వాత డిటెక్టివ్ సినిమాలు పెద్దగా రాలేదు. లిటిల్ సోల్జర్స్ తర్వాత పిల్లలతో సినిమా రాలేదు. అందుకే వాటికి తగ్గట్టుగా రాసుకుని తీసిన సినిమానే మిషన్ ఇంపాజిబుల్' అని దర్శకుడు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. తెలియజేశారు. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శనివారంనాడు చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. ► మిషన్ ఇంపాజిబుల్ అనే కథ 2014లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రాసుకున్నా. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని పేపర్లో వచ్చిన ప్రకటన చూసిన పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళిపోతారు. ఈ వార్తను కథగా రాసుకున్నాను. కానీ ఆ తర్వాత ఏజెంట్.. కథ డెవలప్ అవ్వడంతో ముందుగా దాన్ని ప్రారంభించా. ► రెండవ సినిమా ఇలాంటి కథతో రావడం రిస్క్ అనుకోలేదు. నిజాయితీగా కథ చెబితే ప్రేక్షకులు చూస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. ఏజెంట్.. సినిమాతో అది నిజమైంది. నా స్నేహితులు కూడా మొదటి సినిమా లవ్, కామెడీ చేయమన్నారు. కానీ నా తరహాలో నిజాయితీగా చెబితే చూస్తారనే డిటెక్టివ్ సినిమా తీశా. ► మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో మొదట ఎవరైనా హీరోతో చేద్దామనుకున్నాం. కానీ అప్పటికే `ఏజెంట్..` సినిమా చేశాం కదా అని ఫిమేల్ పాత్ర పెట్టాం. తాప్సీ చేసిన `తప్పడ్`, `పింక్` సినిమాలు స్ట్రాంగ్ మహిళా పాత్రలు పోషించింది. అందులోనూ తెలుగులో తను నటించి చాలా కాలం అయింది. ఆమెకు కథ చెప్పాను. తన కేరెక్టర్ చిన్నదైనా కథ నచ్చిందని సినిమా చేయడానికి ఒప్పుకుంది. తను ప్రొఫెషనల్ యాక్టర్. ముందురోజే డైలాగులు తీసుకుని ప్రిపేర్ అయ్యేది. ఆరు గంటలకల్లా సెట్‌కు వచ్చే వారు. ► ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. పిల్లలో ఒకరు దావూద్ ఫొటో చూసి రామ్ గోపాల్ వర్మ అనుకుంటాడు. నేను చిన్నప్పుడు అలానే అనుకునేవాడిని. నాలాగే ఎంతోమంది అలా అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరికీ చాలా పోలికలుంటాయి. అందుకే ట్రైలర్లో చూపించాను. ► టైటిల్ ఆంగ్లంలో `మిషన్..` అనేది పెట్టడానికి కారణం కూడా పిల్లలు స్పెల్లింగ్ తప్పుగా రాస్తారు. అందుకే అలా పెట్టాం. సినిమా చూస్తే అర్థమవుతుంది. ► షూటింగ్ ను మన నేటివిటీకి తగినట్లుగానే తీశాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలలో షూట్ చేశాం. ► కొత్తగా ఎటువంటి సినిమాలు కమిట్ కాలేదు. ఏజెంట్...కు సీక్వెల్ తీయాలనుకున్నాం. కాని దానికి మించి వుండాలి. అందుకే సమయం తీసుకుని చేయాలనుంది. ఏజెంట్.. ను హిందీలో తీయాల్సి వస్తే పూర్తి నేటివిటీ మార్చి తీయాలి. దానికి నేను దర్శకత్వం వహించను అని అన్నారు. చదవండి: తను చనిపోయినట్లు వచ్చిన వార్తలపై నటుడి ఆగ్రహం.. -
దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి సోదరుడైన శ్రీధర్ పాటన్కర్‌కు వ్యతిరేకంగా ఈడీ చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా సుమారు రూ. 6.45 కోట్ల విలువలైన ఆస్తులను మంగళవారం జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..‘‘ మీరు(బీజేపీ) అధికారంలోకి రావాలంటే రండి. అయితే అధికారంలోకి రావడానికి ఈ దుర్మార్గపు పనులన్నీ చేయకండి. అధికారం కోసం మరొకరి కుటుంబ సభ్యులను వేధించకండి. మేము మీ కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మీ(బీజేపీ) కుటుంబ సభ్యులు తప్పు చేశారని, కాషాయ నేతలను ఇబ్బంది పెట్టగలమని తాము చెప్పడం లేదు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమను(ఉద్ధవ్ ఠాక్రే, కుటుంబ సభ్యులు) జైలులో పెట్టాలనుకుంటే పెట్టండి’’ అని విమర్శించారు. అంతకు ముందు.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నవాబ్ మాలిక్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్‌కు కూడా తెలుసని ఆయన ఘాటుగా స్పందించారు. అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకుని చంపేస్తారా? అని ప్రధాని మోదీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీదుగా ఓట్లు అడిగిందని, ఇప్పుడు దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి సిద్ధపడిందా? అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి నవాబ్ మాలిక్ నిజంగా దావూద్‌తో సంబంధాలుంటే కేంద్ర దర్యాప్తు బృందాలు ఇన్ని రోజులు ఎందుకు దాడులు చేయలేదని, ప్రశ్నించలేదని బీజేపీని నిలదీశారు.