
ముంబై : ఇక్బాల్ కస్కర్‌పై తాజాగా పోలీసు లు నమోదు చేసిన దోపిడీ కేసులో దావూద్ తో పాటు అతని మరో సోదరుడు అనీస్ ఇబ్రహీంను నిందితులుగా పేర్కొన్నారు. 38 ఎకరాల స్థలం కొనుగోలుకు సంబం ధించి తనను బెదిరించి రూ.3 కోట్లు తీసు కున్నట్లు బిల్డర్ ఫిర్యాదు చేయడంతో కస్కర్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దోపిడీ కేసులో ముగ్గురు సోదరు లు నిందితులుగా ఉండటం ఇదే తొలిసార ని బుధవారం పోలీసులు మీడియాకు వివ రించారు. తాజా కేసుతో దావూద్, అనీస్ పేర్లు మళ్లీ తెరపైకి వచ్చినట్లయిందన్నారు.