Iqbal Kaskar
-
దావూద్ ఇబ్రహీంతో ఫోన్లో మాట్లాడా
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో తాను ఫోన్లో మాట్లాడినట్టు ఆయన తమ్ముడు ఇక్బాల్ కస్కర్ చెప్పాడు. అరెస్ట్‌కు ముందు దావూద్‌తో ఫోన్లో మాట్లాడినట్టు థానే కోర్టులో ఇక్బాల్ ఒప్పుకున్నాడు. వెంటనే ఇబ్రహీం ఎక్కడున్నాడని, అతని ఫోన్ నెంబర్ ఏంటని జడ్జి ప్రశ్నించగా.. మొబైల్ నెంబరు డిస్ప్లే కాలేదని, అతడెక్కడున్నదీ తాను తెలుసుకోలేకపోయానని న్యాయమూర్తికి తెలిపాడు. దోపిడీ కేసు విచారణలో భాగంగా కస్కర్‌ను థానె పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్వీ థమదేకర్ ఎదుట హాజరు పరిచారు. ఈ కేసు విచారణ క్రమంలో దావూద్‌తో మాట్లాడిన విషయాన్ని కస్కర్ ఒప్పుకున్నాడు. దావూద్ ఇబ్రహీం గతంలో లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడని, అప్పుడు మధ్యవర్తిగా రామ్ జెఠ్మలానీ వ్యవహరించాలని కస్కర్ తరుఫు న్యాయవాది శ్యాం కేస్వాని చెప్పారు. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయంటూ తన తరఫు న్యాయవాది ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాడని, కేసు విచారణ సమయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అర్థర్ రోడ్ జైలులో తనను ఉంచుతానంటేనే లొంగిపోతానని దావూద్ తెలియజేసినట్టు శ్యామ్ కేశ్వాని పేర్కొన్నారు. ఈ షరతులకు ప్రభుత్వం నిరాకరించిందని, దావూద్‌ను అరెస్ట్ చేయలేదని తెలిపారు. దీంతో దావూద్ ఇబ్రహీం లొంగిపోలేదని చెప్పారు. దావూద్ సోదరుడు కస్కర్‌పై, ఆయన గ్యాంగ్ సభ్యులపై దోపిడీ కేసు నమోదైంది. శ్యాం సుందర్ అగర్వాల్ అనే వ్యక్తి బోరివల్లిలో ప్లాట్ కొనుగోలు చేశాడు. అయితే ఈ ప్లాట్ విషయంలో కస్కర్, అగర్వాల్‌ను బెదిరించాడు. ఆ ప్లాట్‌ను బలవంతంగా మరో వ్యక్తికి బదిలీ చేయించాడు. ప్రస్తుతం డయాబెటిస్ వల్ల కాలుకు కలిగిన గాయంతో కస్కర్‌కు మెడికల్ చికిత్స అవసరమని శ్యాం కేస్వాని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సివిల్ ఆసుపత్రిలో అతనికి పోలీసులు చికిత్స అందించాలని, మార్చి 9 వరకు కస్కర్ కస్టడీ కొనసాగుతుందని జడ్జి తెలిపారు. -
కస్కర్ దోపిడీ కేసులో నిందితుడిగా దావూద్
ముంబై : ఇక్బాల్ కస్కర్‌పై తాజాగా పోలీసు లు నమోదు చేసిన దోపిడీ కేసులో దావూద్ తో పాటు అతని మరో సోదరుడు అనీస్ ఇబ్రహీంను నిందితులుగా పేర్కొన్నారు. 38 ఎకరాల స్థలం కొనుగోలుకు సంబం ధించి తనను బెదిరించి రూ.3 కోట్లు తీసు కున్నట్లు బిల్డర్ ఫిర్యాదు చేయడంతో కస్కర్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దోపిడీ కేసులో ముగ్గురు సోదరు లు నిందితులుగా ఉండటం ఇదే తొలిసార ని బుధవారం పోలీసులు మీడియాకు వివ రించారు. తాజా కేసుతో దావూద్, అనీస్ పేర్లు మళ్లీ తెరపైకి వచ్చినట్లయిందన్నారు. -
గతేడాది ముంబైకి దావూద్ భార్య
-
గతేడాది ముంబైకి దావూద్ భార్య
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ షేక్ అలియాస్ జుబీనా జరీన్ గతేడాది ముంబైకి వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మూడ్రోజుల క్రితం అరెస్టైన దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కార్ నుంచి విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలిపారు. అతని సమాచారం మేరకు.. తన తండ్రి సలీమ్ కశ్మీరీని కలుసుకునేందుకు జుబీనా గతేడాది ముంబైకి వచ్చినట్లు, ఆ తర్వాత దేశం దాటి వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. దావూద్ ఇప్పటికీ పాకిస్తాన్‌లోనే ఉన్నట్లు చెప్పాడన్నారు. కరాచీలో అతనికి నాలుగు నివాసాలు కూడా ఉన్నాయని తేలిందన్నారు. పాకిస్తాన్లో దావూద్‌తో పాటు అతని మరో సోదరుడు అనీస్ ఇబ్రహీం, సహచరుడు చోటా షకీల్ అందరూ కలిసే ఉంటున్నట్లుగా తెలిసిందన్నారు. -
పాక్‌లో నాలుగు ఇళ్లు మారాడు
కీలక విషయాలు వెల్లడించిన దావూద్ ఇబ్రహీం సోదరుడు థానే : అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని అతడి సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్ వెల్లడించాడు. డబ్బుల కోసం బిల్డర్‌ను బెదిరించిన కేసులో సోమవారం కస్కర్‌ను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. 8 రోజులు తమ కస్టడీకి అప్పగించడంతో పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. డీ-కంపెనీ అధినేతగా చలామణి అవుతున్న దావూద్ పశ్చిమ, తూర్పు ఆఫ్రికా దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టారని కస్కర్ తెలిపాడు. నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్లో దావూద్ నాలుగుసార్లు ఇళ్లు మారాడని వెల్లడించాడు. అంతేకాదు పాకిస్తాన్లో తన భద్రతను మరింత పెంచుకున్నాడని చెప్పాడు. తన ఆచూకీ ఎవరైనా కనిపెడతారన్న భయంతో కుటుంబ సభ్యులతో ఫోన్ కూడా దావూద్ మాట్లాడడని తెలిపాడు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతడికి లాటిన్ అమెరికా డ్రగ్స్ వ్యాపారులతోనూ సంబంధాలున్నాయని వెల్లడించాడు. బెదిరింపుల వ్యవహారంలో దావూద్ ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం గురించి పోలీసులకు కస్కర్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా తన సోదరుడు నడిపిస్తున్నాడని అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు. కస్కర్ వాంగ్మూలంతో దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడన్న విషయం మరోసారి రుజువైంది. అయితే పాకిస్తాన్ మాత్రం మొదటి నుంచి దావూద్ తమ భూభాగంలో లేడని చెబుతూ వస్తోంది. -
దావూద్ ఇబ్రహీం పాత్రపై ఆరా
సాక్షి, న్యూఢిల్లీ : దోపిడీ, బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటి అభియోగాలపై దావూద్ ఇబ్రహీం చిన్న సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను అరెస్ట్ చేసిన క్రమంలో ఈ కేసుకు సంబంధించి అండర్‌వరల్డ్ డాన్‌కు ఏమైనా నేరుగా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్టు థానే పోలీసులు చెప్పారు. దర్యాప్తులో భాగంగా స్థానిక రాజకీయ నేతలు, కార్పొరేటర్ల పాత్రపైనా నిగ్గుతేల్చనున్నట్టు తెలిపారు. మూడు నగరాలతో ముడిపడిన ఈ రాకెట్లో డ్రగ్స్ కోణం ఉండే అవకాశం ఉందని థానే పోలీస్ కమిషనర్ పరంవీర్ సింగ్ పేర్కొన్నారు. ఇక దావూద్ సోదరుడు కస్కర్‌ను సోమవారం ఆయన బంధువుల ఇంటిలో 40 మంది సభ్యులుగల స్పెషల్ పోలీస్ టీమ్ అరెస్ట్ చేసింది. కస్కర్ తన అన్న పేరు చెప్పి బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని, గూండాలతో బిగ్షాట్స్ను బెదిరించేవాడని పోలీసులు చెప్పారు. కస్కర్ ముఠా ద్వారా థానే, ముంబయి, నవీ ముంబయిల పరిధిలో యధేచ్చగా దోపిడీ దందా సాగిందని తెలిపారు. దావూద్ పేరుతో హెచ్చరించడం కొన్ని సార్లు షూటర్లను బయటనుంచి బిహార్ నుంచి పిలిపించి బలవంతంగా ఇళ్లు, ఆస్తుల నుంచి ఖాళీ చేయించేవారని పోలీసులు తెలిపారు. మంగళవారం ఇక్బాల్ కస్కర్, మరో ఇద్దరిని థానే కోర్టులో హాజరుపరచగా వారికి 8 రోజుల కస్టడీ విధించింది. -
దావుద్ ఇబ్రహీం సోదరుడి అరెస్ట్
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్బాల్ తన అనుచరులతో కలసి ఓ ఎస్టేట్ ఏజెంట్‌ను బెదిరించి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్టేట్ ఏజెంట్ సలీం షేక్ ఫిర్యాదు మేరకు బైకుల్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని ఇక్బాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని పాక్మోడియా స్ట్రీట్‌లోని ఓ భవంతిలో ఇక్బాల్ అనుచరులు సలీంపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.