అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్బాల్ తన అనుచరులతో కలసి ఓ ఎస్టేట్ ఏజెంట్ను బెదిరించి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఎస్టేట్ ఏజెంట్ సలీం షేక్ ఫిర్యాదు మేరకు బైకుల్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని ఇక్బాల్ను అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని పాక్మోడియా స్ట్రీట్లోని ఓ భవంతిలో ఇక్బాల్ అనుచరులు సలీంపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.