
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ షేక్ అలియాస్ జుబీనా జరీన్ గతేడాది ముంబైకి వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మూడ్రోజుల క్రితం అరెస్టైన దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కార్ నుంచి విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలిపారు.
అతని సమాచారం మేరకు.. తన తండ్రి సలీమ్ కశ్మీరీని కలుసుకునేందుకు జుబీనా గతేడాది ముంబైకి వచ్చినట్లు, ఆ తర్వాత దేశం దాటి వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. దావూద్ ఇప్పటికీ పాకిస్తాన్‌లోనే ఉన్నట్లు చెప్పాడన్నారు. కరాచీలో అతనికి నాలుగు నివాసాలు కూడా ఉన్నాయని తేలిందన్నారు. పాకిస్తాన్‌లో దావూద్‌తో పాటు అతని మరో సోదరుడు అనీస్ ఇబ్రహీం, సహచరుడు చోటా షకీల్ అందరూ కలిసే ఉంటున్నట్లుగా తెలిసిందన్నారు.