సాక్షి,న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చోటా రాజన్‌ను హతమార్చేందుకు మరోసారి కుట్ర పన్నాడని వెల్లడైంది. చోటా రాజన్ హత్యకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తీహార్ జైలు అధికారలను హెచ్చరించాయి. జైలులో భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని కోరాయి.ఢిల్లీకి చెందిన టాప్ గ్యాంగ్‌స్టర్ నీరజ్ భవన సహచరుడు నిఘా ఏజెన్సీలకు ఈ సమాచారం చేరవేసినట్టు తెలిసింది.
బెయిల్‌పై విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ మద్యం మత్తులో వేరొకరితో మాట్లాడుతూ ఈ సమాచారం లీక్ చేసినట్టు వెల్లడైంది. రాజన్‌ను హతమార్చేందుకు గ్యాంగ్‌స్టర్ భవనతో డీ కంపెనీ టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. దాదాపు రెండు దశాబ్ధాలుగా చోటా రాజన్‌ను మట్టుబెట్టేందుకు దావూద్ గ్యాంగ్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చోటా రజాన్ ఉన్న జైలులోనే ఉంటున్న నీరజ భవనను ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సూచనతో వేరొక సెల్‌కు తరలించారు. భవనను ఇతర జైలుకు తరలించేముందు అతడి సెల్ నుంచి రెండు మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తీహార్ జైలులో చోటా రాజన్‌ను చేరుకోవడం దావూద్ సన్నిహితులకు, భవన సన్నిహితుడికి కష్టసాధ్యమని జైలు అధికారులు చెబుతున్నారు.రాజన్‌కు రక్షణగా ప్రత్యేక సెక్యూరిటీ గార్డులు, కుక్‌లను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment