Chota Rajan
-
గతంలో చోటా రాజన్ ఇంట్లో రూ.9 కోట్లు చోరీ.. ముంబైలో చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు సలీమ్ హబీబ్ ఖురేషీ... బాంబే సలీం, మున్నా అనే మారు పేర్లూ ఉన్నాయి. 49 ఏళ్ల వయస్కుడైన ఇతడిపై దేశ వ్యాప్తంగా 300 కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన గౌస్ షేక్ ను అనుచరుడిగా మార్చుకుని పంజా విసురుతున్న ఇతగాడిపై తెలంగాణలోనూ 65 కేసులు ఉన్నాయి. ఆఖరుసారిగా 2012లో రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. ఇతడిపై రాష్ట్రంలోని అనేక పోలీసుస్టేషన్లలో నాన్–బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నాయి. గత నెల 18న ముంబయ్‌లోని పొవాయ్ ఠాణా పరిధిలో జరిగిన భారీ చోరీ కేసులో అక్కడి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సలీం, గౌస్‌లతో పాటు తౌఫీఖ్ అనే మరో అనుచరుడినీ పట్టుకున్నారు. ►ముంబయ్‌లోని గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్‌లో ఉన్న డియోనార్ బుచ్చర్ హౌస్‌కు చెందిన సలీం ఆరో తరగతి వరకు చదివాడు. తొలినాళ్ళల్లో ముంబయ్‌లో చిన్న చిన్న చోరీలు చేసినా 2000 నుంచి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ►2001లో ముంబయ్‌లోని చెంబూర్ ప్రాంతంలో రెక్కీ చేసిన బాంబే సలీం గ్యాంగ్ ఓ ఇంటిని టార్గెట్‌గా చేసుకుంది. అదే రోజు రాత్రి ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. మరుసటి రోజు పత్రికలు చూసిన సలీంకు తాము చోరీ చేసింది మాఫియా డాన్ ఛోటా రాజన్ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. ►కొన్నాళ్ల తరవాత బాంబే సలీం అరెస్టు చేసిన ముంబయ్ పోలీసులు సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో బెయిల్‌పై వచ్చిన వెంటనే రాజన్ అనుచరుల్ని కలిసిన సలీం జరిగింది చెప్పి ముంబయ్ వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు. ►ముంబయ్ నుంచి సలీం తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్‌లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ... గ్యాంగ్‌ను విడిచి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరు తీసుకువచ్చి విక్రయించే వాడు. ఇతడి కోసం తీవ్రంగా గాలించిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో పట్టుకున్నారు. ►సలీం జాబితాలో కేసుల సంఖ్య పెరగడం, నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండటంతో బెంగళూరు, పుణే, ముంబయ్ పోలీసుల కళ్లు కప్పడం కోసం సలీం హైదరాబాద్‌లో కొంతకాలం షెల్టర్ తీసుకున్నాడు. ఆపై తన ఇద్దరు భార్యలతో కలిసి హైదారాబాద్ వచ్చి వేర్వేరు ఇళ్ళు తీసుకుని కాపురాలు పెట్టాడు. టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టి కొన్నాళ్లు నడిపాడు. ►ఇది నష్టాలు రావడంతో నగరవాసి గౌస్‌తో కలిసి మళ్లీ చోరీల బాటపడ్డాడు. చందానగర్, బాలానగర్, ఉప్పల్, కుషాయిగూడ, అల్వాల్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, సరూర్‌నగర్, శివరామ్‌పల్లి, చైతన్యపురి, శంషాబాద్, రాయదుర్గం, మీర్పేట్, ఇబ్రహీంపట్నంల్లో పంజా విసిరాడు. మధ్య మధ్యలో పుణే, ముంబయ్ తదితర నగరాలకు వెళ్తూ అందినకాడికి దండుకు వచ్చాడు. ►ఈ రకంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 300కు పైగా నేరాలు చేశాడు. బెంగళూరుకు చెందిన మహిళను మూడో పెళ్లి చేసుకుని అక్కడకు మకాం మార్చాడు. రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు సుదీర్ఘకాలం సలీంపై నిఘా ఉంచి 2012 ఫిబ్రవరి 28న పట్టుకుని రూ.56,27,500 విలువైన 1.58 కేజీల బంగారం, ఆరు కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. ►సలీం 2012 తర్వాత తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు. టార్గెట్ చేసిన నగరానికి విమానంలో ప్రయాణించడం, అక్కడి సంపన్నుల ఇళ్లలో అనుచరులతో కలిసి చోరీలు చేయడం మొదలెట్టాడు. స్టార్ హోటల్స్‌లో బస చేసే ఇతగాడు ఖరీదైన కార్లను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొని వినియోగిస్తుంటాడు. గత నెల 18న ముంబయ్‌లోని జల్ వాయు విహార్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో తన ఇద్దరు అనుచరులతో కలిసి చోరీ చేశాడు. ►దీనిపై కేసు నమోదు చేసుకున్న పొవాయ్ ఠాణా అధికారులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. బెంగళూరులో ఉన్న అనుచరులను ఈ నెల 2న పట్టుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సలీంను శుక్రవారం అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇతడితో పాటు గౌస్‌పై తెలంగాణలో కొన్ని ఎన్బీడ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి అధికారులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. -
చోటా రాజన్ మృతిపై రూమర్స్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో మరణించాడంటూ శుక్రవారం మధ్యాహ్నం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, చోట రాజన్ బతికే ఉన్నాడని తీహార్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. కరోనాతో బాధపడుతన్న చోటా రాజన్ని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే..చోటా రాజన్ మృతి చెందాడని వార్తలు రాగానే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ‘చోటా రాజన్ని కరోనా చంపేసింది. డీ కంపెనీలో రెండో స్థానంలో ఉన్నాడనే భయం లేకుండా రాజన్ని కరోనా చంపేసింది. ఆయన దాన్ని ఎందుకు హతం చేయలేదో నాకు అర్థం కావట్లేదు. దావూడ్ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో’అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. COVID killed CHOTA RAJAN and it dint even care that he is no.2 man of D COMPANY ..I wonder why he dint shoot it ?😳.. Seriously speaking I wonder how DAWOOD IBRAHIM is feeling 🥲🥲 — Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2021 ఇక చోటా రాజన్ మృతి చెందలేదని పోలీసులు స్పష్టం చేయగానే ఆర్జీవీ ఊపిరి పీల్చుకున్నాడు. చోటా రాజన్ మరణ వార్త ఒట్టి పుకారని, ఆయన కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని మరో ట్వీట్ చేశాడు. అలాగే అతనికి బెడ్, ఆక్సిజన్ అందాలని కోరుకుంటున్నానని తెలిపాడు. Apparently the news about Chota Rajan’s death is a rumour .. So it’s not Covid but it’s the rumour mongers who killed him ..I stand corrected ..He’s just admitted in hospital for Covid ..Hope he gets bed and oxygen — Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2021 చదవండి: ఆ వార్తలు అవాస్తవం.. చోటా రాజన్ బ్రతికే ఉన్నాడు! -
ఆ వార్తలు అవాస్తవం.. చోటా రాజన్ బ్రతికే ఉన్నాడు!
సాక్షి, న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో మరణించాడంటూ మీడియాలో వెలువడుతున్న వార్తలపై తీహార్ జైలు డీజీ, ఎయిమ్స్ అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, చోటా రాజన్ బ్రతికే ఉన్నాడని స్పష్టం చేశారు. తీహార్ జైలులో ఖైదీగా ఉన్న రాజేందర్ సదాశివ్ నికల్జే అలియాస్ చోటారాజన్‌కు గత నెల 22వ తేదీ కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆయనను 24వ తేదీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని జైలు డీజీ తెలిపారు. చోటా రాజన్ బ్రతికే ఉన్నాడని, ఎయిమ్స్‌లో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారని ఎయిమ్స్ అధికారులు ట్విటర్ వేదికగా స్పష్టత నిచ్చారు. కాగా, అండర్ వరల్డ్ డాన్‌గా పేరు బడ్డ చోటా రాజన్ మొదట ముంబై డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా ఉండేవాడు. దావూద్‌తో విబేధాల కారణంగా మరో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. రాజన్‌పై దాదాపు 70కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. -
ఆ కేసులో చోటా రాజన్‌కు 8 ఏళ్ల జైలు
ముంబై : హోటళ్ల వ్యాపారి బీఆర్ శెట్టిపై హత్యాయత్నం, దోపిడీ కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర ఎస్ నిఖల్జీకి న్యాయస్ధానం మంగళవారం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో చోటా రాజన్‌తో పాటు ఐదుగురు ఇతరులకు మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరధోక చట్ట ప్రత్యేక న్యాయస్ధానం (మోకా) ఈ శిక్షను ఖరారు చేసింది. కాగా, ఇది చోటా రాజన్ దోషిగా తేలిన మూడవ కేసు కావడం గమనార్హం. ముంబైలోని అంబోలి ప్రాంతంలో బీఆర్ శెట్టిపై రాజన్ అనుచరులు 2013లో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. 2015లో ఇండోనేషియాలోని బాలి నుంచి మాఫియా డాన్ చోటా రాజన్‌ను భారత్‌కు రప్పించగా, ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నాడు. చోటా రాజన్ దోపిడి, హత్య, హత్యాయత్నం వంటి పలు కేసులు ఎదుర్కొంటున్నారు. చోటా రాజన్ ఇప్పటికే పాస్‌పోర్టు కేసులో దోషిగా తేలగా, ముంబైలో జేడే హత్య కేసులోనూ ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో రాజన్ సహా మరో ఎనిమిది మందికి కోర్టు జీవిత ఖైదు విధించింది. -
జే డే హత్య కేసులో చోటా రాజన్‌కు జీవిత ఖైదు
-
చోటా రాజన్‌కు జీవిత ఖైదు
సాక్షి, ముంబై: జర్నలిస్ట్ జ్యోతిర్మయి డే (జే డే) హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ సహా మొత్తం 9 మంది దోషులకు ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. 2011 నాటి ఈ కేసులో దోషులందరూ ఒక్కొక్కరు రూ.26 లక్షల జరిమానా చెల్లించాలని మోకా (మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం–ఎంసీవోసీఏ) కోర్టు ఆదేశించింది. జే డేను హత్య చేసేలా చోటారాజన్‌ను మాజీ జర్నలిస్టు జిగ్నా వోరా ప్రేరేపించారనీ, అలాగే ఈ హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పాల్సన్ జోసెఫ్ నిర్వహించారంటూ నమోదైన అభియోగాలను న్యాయమూర్తి సమీర్ అడ్కర్ కొట్టివేస్తూ వారిరువురినీ నిర్దోషులుగా విడుదల చేశారు. 2015లో చోటా రాజన్ ఇండోనేసియాలోని బాలి విమానాశ్రయంలో అరెస్టయ్యి, భారత్‌కు వచ్చాక అతను దోషిగా తేలిన ప్రధాన కేసు ఇదే. బుధవారం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణను చోటా రాజన్ వీక్షించాడు. అసలు కేసేంటి? జే డే (చనిపోయినప్పటికి ఆయన వయసు 56 ఏళ్లు) ముంబైలో మిడ్ డే అనే పత్రికకు సీనియర్ ఎడిటర్‌గా పనిచేసేవారు. గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ ఆరోగ్యం దెబ్బతిందనీ, మాఫియాలో అతని బలం తగ్గిందంటూ వార్తలు రాయడంతో జే డేపై చోటా రాజన్ కోపం పెంచుకుని హత్య చేయించాడు. 2011 జూన్ 11న జే డే తన ఇంటికి వెళ్తుండగా ముంబైలోని పొవాయ్ ప్రాంతానికి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో జే డే మరణించారు. ఈ కేసుకు సంబంధించి అదే ఏడాది జూన్ 27న ఏడుగురిని, ఆ తర్వాత మరో ముగ్గురిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి మోకా కింద అభియోగాలు మోపారు. 2016 జనవరిలో ఈ కేసు సీబీఐకి చేరింది. -
సిటీపై డి–గ్యాంగ్ కన్ను!
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో తలదాచుకున్న అంతర్జాతీయ డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను హైదరాబాద్‌పై ఉందా? దీనికి ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దావూద్‌కు చెందిన డి–కంపెనీ హైదరాబాద్‌లో ఉండే ఓ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్లు తెలిసింది. దీనికోసం దావూద్ కుడిభుజం ఛోటా షకీల్ ఢిల్లీకి చెందిన షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్‌ను రంగంలోకి దింపాడు. నసీంను నార్త్ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నవంబర్‌లో అరెస్టు చేశారు. నసీం విచారణ నేపథ్యంలో ‘హైదరాబాద్ సెలబ్రిటీ–డి కంపెనీ’ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు దర్యాప్తులో ఉందని చెప్తుండగా.. తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. టార్గెట్ నేపథ్యంలో.. నసీం ఢిల్లీలో జరిగిన అనేక దోపిడీ, దొంగతనం, హత్యలు, హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా.. మరికొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న నసీం కోసం ఢిల్లీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తున్నారు. అతడిపై రూ.50 వేల రివార్డ్ ప్రకటించారు. షార్ప్ షూటర్‌గా పేరున్న నసీం డి–కంపెనీకి అనుబంధంగా పని చేస్తున్నాడని, దావూద్‌తో పాటు ఛోటా షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని చంపడానికి రంగంలోకి దిగాడని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గతేడాది జూన్‌లో నార్త్ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నసీం అనుచరుడు జునైద్ చౌదరిని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో నవంబర్ మొదటి వారంలో నసీంను పట్టుకున్నారు. వెలుగులోకి కీలకాంశాలు.. ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల విచారణలో నసీం తాను ఛోటా. షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని టార్గెట్ చేసినట్లు అంగీకరించాడు. పాక్‌లో పుట్టి కెనడియన్‌గా మారిన రచయిత తారిఖ్ ఫథాతో పాటు ‘కాఫీ విత్ డీ’ సినిమా నిర్మాత మరికొందరు సెలబ్రిటీలు ఉన్నట్లు బయటపెట్టాడు. తారిఖ్ ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఆయన్ను హతమారిస్తే రూ.1.5 కోట్లు చెల్లించడానికి షకీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపాడు. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ కదలికల్నీ కనిపెట్టాల్సిందిగా షకీల్ చెప్పాడనీ అంగీకరించాడు. షకీల్–రాజన్ మధ్య వైరం ఉన్న నేపథ్యంలో అతడిని హతమార్చడానికి రెక్కీగా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు స్పెషల్ సెల్ అనుమానిస్తోంది. షకీల్ రెండుసార్లు నసీంతో మాట్లాడి ఈ కాంట్రాక్టులు ఇచ్చినట్లు వెల్లడైంది. రూ. 45 లక్షల సుపారీ ఛోటా షకీల్ నసీం విచారణలో హైదరాబాద్‌కు సంబంధించిన కోణం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఉంటున్న ఓ సెలబ్రిటీని చంపేందుకు షకీల్ నుంచి అతడు రూ.45 లక్షల సుపారీకి అంగీకరించాడని వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ మున్నా సింగ్‌తో కలసి చేయాల్సిందిగా షకీల్ స్పష్టం చేసినట్లు స్పెషల్ సెల్ గుర్తించింది. దీనికోసం గుర్గావ్ ప్రాంతంలో మున్నాను కలిసే యత్నాల్లో ఉండగా నసీం ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ సెల బ్రిటీ ఎవరు? అతడిని టార్గెట్ చేయాల్సిన అవసరం డి–కంపెనీకి ఎందుకు వచ్చింది? అనేవి అంతు చిక్కట్లేదు. గతంలోనే సిటీలో డి–గ్యాంగ్ ఛాయలు కనిపించాయి. ఓ వీడియో కంపెనీ యజమానుల్ని దుబాయ్ కు పిలిపించుకుని వారిని కలిసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ విషయంపై ‘సాక్షి’ ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల్ని సంప్రదించగా.. నసీం కేసు దర్యాప్తులో ఉందని, అనేక అంశాలు వెలుగులోకి రావాలని చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు మాత్రం సిటీ సెలబ్రిటీని డి–కంపెనీ టార్గెట్ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. -
చోటా రాజన్ హత్యకు మరో కుట్ర
సాక్షి,న్యూఢిల్లీ: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చోటా రాజన్‌ను హతమార్చేందుకు మరోసారి కుట్ర పన్నాడని వెల్లడైంది. చోటా రాజన్ హత్యకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తీహార్ జైలు అధికారలను హెచ్చరించాయి. జైలులో భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని కోరాయి.ఢిల్లీకి చెందిన టాప్ గ్యాంగ్‌స్టర్ నీరజ్ భవన సహచరుడు నిఘా ఏజెన్సీలకు ఈ సమాచారం చేరవేసినట్టు తెలిసింది. బెయిల్‌పై విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ మద్యం మత్తులో వేరొకరితో మాట్లాడుతూ ఈ సమాచారం లీక్ చేసినట్టు వెల్లడైంది. రాజన్‌ను హతమార్చేందుకు గ్యాంగ్‌స్టర్ భవనతో డీ కంపెనీ టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. దాదాపు రెండు దశాబ్ధాలుగా చోటా రాజన్‌ను మట్టుబెట్టేందుకు దావూద్ గ్యాంగ్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. చోటా రజాన్ ఉన్న జైలులోనే ఉంటున్న నీరజ భవనను ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సూచనతో వేరొక సెల్‌కు తరలించారు. భవనను ఇతర జైలుకు తరలించేముందు అతడి సెల్ నుంచి రెండు మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. తీహార్ జైలులో చోటా రాజన్‌ను చేరుకోవడం దావూద్ సన్నిహితులకు, భవన సన్నిహితుడికి కష్టసాధ్యమని జైలు అధికారులు చెబుతున్నారు.రాజన్‌కు రక్షణగా ప్రత్యేక సెక్యూరిటీ గార్డులు, కుక్‌లను నియమించారు. -
చోటా రాజన్‌కు ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు మంగళవారం శిక్ష ఖరారైంది. రాజన్‌తో పాటు మరో ముగ్గురికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు 15 వేల జరిమానా కూడా విధించింది. రాజన్‌తో పాటు దీనికి సహకరించిన ముగ్గురు రిటైర్డ్ అధికారులు జయశ్రీ దత్తాత్రేయ రహతే, దీప్ నట్వర్ లాల్షా, లలితా లక్ష్మణన్‌ను ప్రత్యేక కోర్టు జడ్జి వీరేందర్ కుమార్ గోయల్ దోషులుగా నిర్ధారిస్తూ పై శిక్షనే ఖరారు చేశారు. రాజన్ తీహార్ జైలులో ఉండగా, బెయిల్ పై బయట ఉన్న మిగతా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. ‘దావూద్‌ను పట్టుకోవడానికి, ఉగ్ర వాదాన్ని అణచివేసేందుకు కృషి చేస్తున్న నిఘా సంస్థలకు సాయం చేశా’ అని రాజన్ కోర్టుకు విన్నవించాడు. రాజన్ చెప్పిన ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. -
ఛోటారాజన్గా అభిషేక్ బచ్చన్
పొలిటికల్, క్రైమ్‌కు సంబంధించి ఎలాంటి పెద్ద ఘటనలను వదిలిపెట్టడం లేదు బాలీవుడ్. ఇప్పటికే బాంబు పేలుళ్లు, ఉగ్ర దాడులు, రాజకీయ నాయకుల కథలతో సినిమాలు తీసిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు, తాజాగా అంతర్జాతీయ మీడియాను ఆకర్షిస్తున్న ఓ అండర్ వరల్డ్ డాన్ కథతో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. 20 ఏళ్ల పాటు ముంబై చీకటి సామ్రాజ్యాన్ని ఏలి, ఇటీవలే పోలీసులకు పట్టుబటిన మాఫియా కింగ్ ఛోటారాజన్ జీవితాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. హుస్సేన్ జైదీ రచించిన 'బైకుల్లా టు బ్యాంకాక్' నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు సంజయ్ గుప్తా. గతంలో జైదీ రాసిన 'డోంగ్రీ టు దుబాయ్' ఆధారంగా కూడా బాలీవుడ్లో రెండు మూడు సినిమాలు వచ్చాయి. షూటౌట్ ఎట్ వడాలా లాంటి సినిమాలకు ఆ పుస్తకమే ఆధారం. ప్రస్తుతం బాలీవుడ్లో బయోగ్రాఫికల్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తుండటంతో ఛోటారాజన్ లైఫ్ హిస్టరీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా దేశభక్త డాన్‌గా పేరున్న ఛోటా జీవితంలో హీరోయిజం కూడా పుష్కలంగా ఉండటంతో సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమాలో ఛోటారాజన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించనున్నాడు. గతంలో కూడా పలు చిత్రాల్లో డాన్ తరహా సీరియస్ పాత్రలు చేసిన అభిషేక్, ఛోటా రాజన్ పాత్రకు పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నారు. అంతేకాదు, అభిషేక్‌కి బయోగ్రఫికల్ మూవీస్‌లో నటించిన అనుభవం కూడా ఉంది. ధీరుబాయ్ అంబానీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన గురు సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. -
'ఛోటా' విన్నపాన్ని సర్కార్ మన్నించిందా!
న్యూఢిల్లీ: ఎక్స్టార్షన్, స్మగ్లింగ్, మర్డర్స్ తదితర నేరాల నిర్వహణలో కరడుగట్టి.. రెండు దశాబ్ధాల కిందట భారత్ నుంచి పారిపోయి, విదేశాల నుంచే గ్యాంగ్ ను ఆపరేట్ చేస్తున్న మాఫియా డాన్ ఛోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జేను సీబీఐ ఐధికారులు శుక్రవారం ఉదయం భారత్ కు తీసుకొచ్చారు. బాలీ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టుకు, అక్కడి నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయానికి రాజన్ ను తరలించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్, సీబీఐ హెడ్ ఆఫీస్ ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజన్ ను విచారించున్న సీబీఐ హెడ్ ఆఫీస్ చుట్టూ 500 మీటర్ల మేర ఇతరులెవ్వరినీ అనుమతించడంలేదు. కాగా, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రల్లో ఛాటన్ రాజన్ పై నమోదయిన అన్ని కేసులు సీబీఐకి బదలాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫడ్నవిస్ సర్కార్ కేంద్రానికి విన్నవించుకునే ప్రక్రియ కూడా ఆఘమేఘాల మీద పూర్తిచేసినట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం డాన్ ను ఈ రోజు ఉదయమే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి ఛోటాను బాలి నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లిన అధికారుల బృందంలో సీబీఐతోపాటు ఢిల్లీ, ముంబై పోలీసు శాఖలకు చెందినవారు కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వ ఆదేశాలను బట్టి రాజన్ ను రెండు మహానగరాల్లో ఎటువైపైనా తీసుకుపోయేందుకు సంసిద్ధులయ్యారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వైపే మొగ్గుచూపటం గమనార్హం. ఐదురోజుల కిందట బాలీలో మీడియాతో మాట్లాడిన ఛోటా రాజన్ ముంబై పోలీసులపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసుల్లో దావూద్ ఇబ్రహీం మనుషులు ఉన్నారని, అక్కడ తన ప్రాణాలకు ముప్పుందని, కాబట్టి తనను ముంబైకి తరలించొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అతణ్ని ఢిల్లీకి తీసుకొచ్చిన పరిణామాలను గమనిస్తే ఛోటా విన్నపాన్ని సర్కార్ మన్నించినట్లే భావిచొచ్చు. భారత్‌లో రాజన్‌పై దాదాపు 80 కేసులు నమోదయ్యాయి. వీటిలో 70కిపైగా కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. ఇతడిపై ఉగ్రవాద నిరోధక, మోకా చట్టాల కింద కూడా కేసులుండటం గమనార్హం. పోలీసుల వేట తీవ్రం కావడంతో 1988లో రాజన్ దుబాయి పారిపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీంకు రైట్ హ్యాడ్ గా పనిచేసిన ఛోటా రాజన్.. 1993 ముంబై పేలుళ్లను వ్యతిరేకించి డీ-గ్యాంగ్ కు దూరమయ్యానని చెప్పుకున్నాడు. ఆ తర్వాత దావూద్ ఇబ్రహీంను అంతం చేసేందుకు, డీ- గ్యాంగ్ ఉగ్రవాద కార్యకలాపాల అడ్డుకట్టకు ఛోటా సహకరించాడని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే ఛోటా రాజన్.. 'దేశభక్త డాన్' అనే ఇమేజ్ నూ పొందినట్టు విశ్లేషకులు చెబుతారు. -
నేడు భారత్ చేరుకోనున్న చోటారాజన్
-
చోటా రాజన్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు: ఏది ఎలా ఉన్నా ఇండియాలో ఉన్నంత డీసెన్సీ వేరే ఏ కంట్రీలోనూ ఉండదు! డి గ్యాంగ్ అయినా, బి గ్యాంగ్ అయినా, ఏ గ్యాంగ్ అయినా.. డాన్‌కి ఉండే విలువ డాన్‌కి ఉంటుంది. డాన్‌కి ఉండే ఫాన్స్ డాన్‌కి ఉంటారు. ఇంటరాగేషన్‌కి కూడా డాన్ తనకు ఇష్టమైన జీన్స్ వేసుకెళ్లొచ్చు. తనకు నచ్చిన టీ షర్ట్ తొడుక్కోవచ్చు. వర్మ కంపెనీ 'ఒబెరాయ్'లా, 'వాత్సవ్'లో సంజయ్దత్లా హీరో వర్షిప్ కూడా. ఇక్కడ అలా లేదు! పోలీసులు పోలీసులుగా లేరు. మీడియా మీడియాలా లేదు. ఎవరికి వాళ్లే డాన్లుగా లుక్ ఇస్తున్నారు. గన్లు తీస్తున్నారు. గన్‌మైక్‌లు తీస్తున్నారు. కళ్లలోకి ఉఫ్‌మని ఊది మరీ, 'భయపడ్డావా డాన్?' అని మీడియా అడుగుతోంది! ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆరెంజ్ కలర్ కోటు ఒకటి నా ఒంటిపై వేసి వారం రోజులుగా ఇండోనేసియా పోలీసులు నన్ను అక్కడికీ ఇక్కడికీ తిప్పుతూనే ఉన్నారు. మోకాళ్లకు కొద్దిగా మాత్రమే కిందికి దిగి ఉన్న ఆ కోటులో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నాలోని డాన్ ఎలా ఉండి ఉంటాడో ఊహించుకోడానికే నామోషీగా ఉంది. దావూద్ ఈపాటికి నా అవతారం చూసే ఉంటాడు టీవీల్లో. చోటా షకీల్ అయితే కడుపు చేత్తో పట్టుకుని పడీ పడీ నవ్వుకుని ఉంటాడు. ఇంతకన్నా.. 'చోటా రాజన్ షాట్ డెడ్ ఇన్ గ్యాంగ్ వార్'అని ఏ సీఎన్నెన్ ఐబిఎన్లోనో, ఆజ్తక్లోనో బ్రేకింగ్ న్యూస్ వచ్చినా గౌరవమే. ఇరవయ్యేళ్లయింది ఇండియా వదిలొచ్చి! అక్కడి థియేటర్లో కూర్చొని సినిమా చూసి కూడా ఇరవయ్యేళ్లవుతోంది. ఇండియా వెళ్లగానే, దేశభక్త డాన్ కోటాలో స్పెషల్ పర్మిషన్ ఏదైనా దొరికితే చెంబూర్ వెళ్లి నా చిన్నప్పటి సహకార్ థియేటర్లో కాసేపు కూర్చొని రావాలి. ఇప్పుడది సహకార్ ప్లాజా అయిందని ఆ మధ్య అబూ సావంత్ చెప్పాడు. సావంత్‌ది కూడా చెంబూరే. నాకన్నా పదేళ్లు చిన్నవాడు. థియేటర్ బయట బ్లాక్ టికెట్లు అమ్మడం ఎలాగో నా దగ్గరే నేర్చుకున్నాడు. నీతోనే ఉంటాను భాయ్ అన్నాడు ఓ రోజు. అప్పట్నుంచీ నాతోనే ఉన్నాడు. ఇండోనేసియా నుంచి వెళ్లాక ఇండియన్ గవర్నమెంట్ నన్ను నిజంగానే అరెస్టు చేస్తే, నన్ను నిజంగానే జైల్లో పెడితే నా బిజినెస్లన్నీ సావంత్ చూసుకోగలడు. నన్నెప్పుడు ఇండియా పంపిస్తారని పక్కనే ఉన్న పోలీసు అధికారిని అడిగాను.'మీ వాళ్లు రావాలి కదా' అన్నాడు చికాగ్గా. నన్ను అప్పగించేందుకు ఇండోనేసియా రెడీ. తీసుకెళ్లడానికి ఇండియా రెడీ. మరి ఎక్కడ లేట్ అవుతోంది?! ఏమైనా గవర్నమెంట్ల కంటే గ్యాంగ్‌స్టర్లే నయం. ధనాధన్మని.. గన్ పాయింట్‌తో అక్కడికక్కడ తేల్చేసుకుంటారు. ఒప్పందాలు, సంతకాలతో పనిలేకుండా. -
20 రోజుల్లో భారత్‌కు ఛోటా రాజన్
-
20 రోజుల్లో భారత్‌కు ఛోటా రాజన్
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను ఇండోనేసియా నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భారత దౌత్యాధికారి సంజీవ్ అగర్వాల్ బాలి జైల్లో ఉన్న ఛోటా రాజన్‌ను కలిశారు. ఛోటా రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చే విషయంపై సంజీవ్ అగర్వాల్.. ఇండోనేసియా అధికారులతో చర్చించారు. 20 రోజుల్లో ఛోటా రాజన్‌ను భారత్‌కు పంపిస్తామని ఇండోనేసియా అధికారులు చెప్పారు. ఛోటా రాజన్‌ను బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
డాన్ చోటా రాజన్‌పై వర్మ ట్వీట్
మాఫియా కథాంశాలతో ఒకప్పుడు బాలీవుడ్లో కుప్పలు తెప్పలు సినిమాలు తీసి.. డాన్ల జీవితాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. 2002లో ఆయన తీసిన 'కంపెనీ' సినిమా.. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ల సంబంధాలకు తెర రూపమని చెబుతారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం చోటారాజన్ పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న చోటా అరెస్టుపై వర్మ సంచలన టీట్ చేశాడు. 'ఇన్నాళ్లూ గ్యాంగ్‌ను నడపటంలో చోటా రాజన్ ఎవరెవరు సహకరించారు? ఎంత మంది పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పేర్లను చోటారాజన్ వెల్లడిస్తాడో? ప్రస్తుతం నాకు అత్యంత ఆసక్తి కలిగిస్తున్న విషయం ఇదే' అంటూ బుధవారం ఓ ట్వీట్ వదిలాడు వర్మ. భారత నిఘా వర్గానికి చెందిన అధికారులు కొందరు దావూద్‌ను మట్టుబెట్టేందుకు చోటా రాజన్‌ను ఉపయోగించుకున్నారని, ఆ క్రమంలో పరోక్షంగా చోటా గ్యాంగ్ విస్తరణకు సహకరించానే సారాంశంతో వార్తాకథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో వర్మ కూడా ఇదే కోణంలో ట్వీట్ చేయడం చర్చనీయంశంగా మారింది. Am most curious about which politicians,police officers n top businessmen's names Chota Rajan will reveal who helped him maintain his gang — Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2015 -
దావూద్‌పై 'దేశభక్త' డాన్ ప్రయోగం!
ముంబై/న్యూఢిల్లీ: మాఫియా గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్ అరెస్టుతో చాలా కేసుల్లో మిస్టరీ తొలగిపోతుందని ముంబై పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా మాఫియా చేతిలో హాతమైన 'మిడ్ డే' పత్రిక జర్నలిస్టు జే డే హత్యతోపాటు అనేక నేర, ఉగ్రవాద కేసుల్లో అతని నుంచి కీలక ఆధారాలు రాబట్టాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. అయితే వాస్తవానికి అండర్ వరల్డ్ మాఫియా గురించి ప్రస్తుతం ఛోటారాజన్ వద్ద పెద్దగా సమాచారం ఉండకపోవచ్చునని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. చాలా ఏళ్ల నుంచి మాఫియా ప్రపంచంతో ఏమాత్రం సంబంధాలు లేకుండా ఆయన ఏకాంత జీవితాన్ని గడుపుతున్నాడు. తన అనుచరులకు కూడా అందకుండా అజ్ఞాతవాసంలో ఉన్నాడు. తాను ఎక్కడున్నది బయటపడకుండా వీవోఐపీని వాడుతూ ప్రొక్సీ ఐడీలో వాట్సప్ లో మాత్రమే ఆయన ఫోన్ కాల్స్ చేసేవాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యం, ప్రత్యర్థి ఛోటా షకీల్ నుంచి ముప్పు ఉండటంతో ఛోటారాజన్ తిరిగి భారత్ కు వచ్చేందుకు తానే స్వయంగా ముందుకొచ్చి అరెస్టయి ఉంటాడని భావిస్తున్నారు. దేశభక్త డాన్..! నిజానికి 1998లోనే థాయ్‌ల్యాండ్‌లో ఛోటా రాజన్‌ను పట్టుబడ్డాడు. నకిలీ పాస్ పోర్టుతో ప్రయాణిస్తున్న అతను అరెస్టయిన తెల్లారే విడుదలయ్యాడు. అప్పట్లో థాయ్‌లాండ్ నుంచి అతన్ని భారత్ తీసుకువచ్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వాశాఖ, భద్రతా సంస్థలు ఆసక్తి చూపలేదు. ఇందుకు కారణం అప్పట్లో మాఫియా డాన్ దావూద్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర నిఘా సంస్థలు ఛోటా రాజన్‌ను ప్రధాన ఆయుధంగా వాడుకున్నాయి. 1993 ముంబై పేలుళ్లతో దావూద్ కు దూరం జరిగిన ఛోటా రాజన్ తనను తాను దేశభక్త హిందూ డాన్‌గా అభివర్ణించుకునేవాడు. ముఖ్యంగా రీసెర్చ్ అనాసిస్ వింగ్ (రా), ఐబీలు రాజన్ ను దావూద్ గ్యాంగ్ కు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నాయని అధికార వర్గాలు చెప్తాయి. దీంతో దావూద్, ఐఎస్ఐ అనుచరులను తుదముట్టించడంలో రాజన్ కీలకంగా వ్యవహరించాడు. నేపాల్ లో ఎమ్మెల్యే దిల్షాద్ మీర్జా బైగ్, ఐఎస్ఐ మాస్టర్ మైండ్ ఖలీద్ మసూద్, పర్వెజ్ టాండాలను నిఘావర్గాల మద్దతుతోనే ఛోటా రాజన్ హతమార్చాడు. దావూద్ కీలక అనుచరుడు, ఈస్ట్ వెస్ట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన తకివుద్దీన్ వాహిద్ ఖాన్ హత్యలోనూ రాజన్ హస్తమున్నట్టు వార్తలు వచ్చాయి. -
బాలీవుడ్‌కి సినిమా చూపిస్తున్న మాఫియా
బాలీవుడ్ ఇండస్ట్రీ, భారత్ లోనే కాదు.. ప్రపంచంలోనే అతి ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్న సినీరంగాల్లో ఒకటి. లోబడ్జెట్ హిట్ చిత్రాల నుంచి వందల కోట్లు కొల్లగొట్టగలిగే బడా బడా స్టార్ హీరోల వరకు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయలు బాలీవుడ్లో చేతులు మారతాయి. అందుకే ముంబై మాఫియా కూడా బాలీవుడ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. సినిమాలకు ఫైనాన్స్ చేయడం దగ్గర నుంచి చాలావరకు సినీ రంగంలో తలెత్తున్న వివాదాలను సెటిల్ చేయటం, సినీ తారలతో ప్రేమాయణాలు కొనసాగించటం వరకు బాలీవుడ్- మాఫియాది విడదీయరాని సంబంధం. తాజాగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ అరెస్ట్‌తో మరోసారి బాలీవుడ్ ఉలిక్కిపడింది. రాజన్‌తో ప్రేమ వ్యవహారాలు నడిపిన అందాలభామలతో పాటు రాజన్ సాయంతో సినిమాల్లో ఎదిగిన వారు టెన్షన్ పడుతున్నారు. బాలీవుడ్‌తో ముంబై మాఫియా సంబంధాలు ఇప్పటివేం కాదు. ఇండస్ట్రీ కమర్షియల్‌గా బలపడుతున్న సమయం నుంచే ఇవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దావుద్ నేరసామ్రాజ్యం విస్తరించిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు తమకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయని గర్వంగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ లాంటి స్టార్ హీరోలు దావుద్‌తో కలిసిన దిగిన ఫొటోలు కూడా బయటికి రాగా, సంజయ్ దత్ 1993 ముంబై పేలుళ్ల కేసులో జైలుపాలయ్యాడు. స్టార్ హీరోలు మాఫియా డాన్లతో సంబంధాలు కొనసాగించటానికి చాలా కారణాలే ఉన్నాయి. తమ సినిమాలకు ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా అండగా ఉంటారనే ఆలోచన కొందరిదైతే, వాళ్లతో సరిగా లేకపోతే ఏవైనా ఇబ్బందులు కలిగిస్తారేమో అన్న భయం మరికొందరిది. కేవలం హీరోలు మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు కూడా అండర్ వరల్డ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ లిస్టులో అందరికంటే ముందున్న హీరోయిన్ సోనా. హీరోయిన్గా స్టార్ ఇమేజ్ అందుకోకపోయినా.. మాఫియా డాన్ హాజీ మస్తాన్‌తో ఉన్న సంబంధాల కారణంగా సోనా మంచి పాపులారిటీ సాధించింది. తరువాత తరంలో కూడా ఈ సంబంధాలు కొనసాగాయి. బోల్డ్ యాక్ట్రెస్ మందాకినికి కూడా మాఫియాతో మంచి సంబంధాలే ఉన్నాయి. దావూద్ ఇబ్రహీంతో కలిసి చాలా ప్రైవేట్ ఫంక్షన్స్‌లో కనిపించిన ఈ పిల్లికళ్ల సుందరి.. తర్వాత అతడితో కలిసి దుబాయ్‌లో సెటిల్ అయ్యింది. కొంత కాలం తరువాత దావూద్‌కు దూరమైన ఈబోల్డ్ బ్యూటీ.. 'మేం జస్ట్ ఫ్రెండ్స్' అంటూ తమ రిలేషన్‌కు గుడ్ బై చెప్పేసింది. మరో హాట్ బ్యూటీ మమతా కులకర్ణి కూడా విక్కీ గోస్వామితో పాటు ఛోటా రాజన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేది. ఈ రిలేషన్ల వల్లే మమతకు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయన్న టాక్ కూడా ఉంది. ఈ జనరేషన్లో బాలీవుడ్‌ను షేక్ చేసిన మాఫియా రిలేషన్ మోనికా బేడీ- అబూ సలేంలది. నార్త్‌తో పాటు సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఈ భామ, నటనకు గుడ్ బై చెప్పి అబూసలేంతో కలిసి ఫారిన్లో సెటిలైంది. తర్వాత పోర్చుగల్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కడంతో మోనికా, అబూ సలేంల ప్రేమ వ్యవహారం మరోసారి బాలీవుడ్, మాఫియా సంబంధాలను తెరమీదకు తీసుకువచ్చింది. వీళ్లే కాదు ఈ తరం హీరోయిన్లతో కూడా మాఫియా సంబంధాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ప్రీతీ జింటా, నెస్ వాడియాల వివాదంలో మాఫియా బెదిరింపులకు దిగిందంటూ వచ్చిన వార్తలతో ప్రీతి జింటాకు మాఫియా డాన్లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపించాయి. తెర వెనక కథలు నడపటమే కాదు. బాలీవుడ్లో ముంబై మాఫియా ప్రత్యక్ష దాడులకు దిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తమకు అనుకూలంగా లేని చాలామంది హీరోలు, నిర్మాతల సినిమాలను ఓవర్ సీస్లో రిలీజ్ కాకుండా మాఫియా అడ్డుకుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది స్టార్లు మాఫియాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక తాజా ఉదాహరణల విషయానికి వస్తే, హృతిక్ రోషన్ హీరోగా పరిచయం అయిన 'కహోనా ప్యార్ హై' సినిమా ఓవర్ సీస్ రైట్స్ విషయంలో తలెత్తిన వివాదం రాకేష్ రోషన్‌పై కాల్పులు జరిపేవరకు వెళ్లింది. కేవలం మాఫియా చెప్పు చేతల్లో ఉండటం లేదన్న ఒక్క కారణంతో బాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్, టీ - సిరీస్ అధినేత గుల్షాన్ కుమార్‌ను హత్య చేసింది మాఫియా. ఇప్పటికీ బాలీవుడ్లో చాలా మంది హీరోలకు, హీరోయిన్లకు, నిర్మాతలకు ముంబై అండర్ వరల్డ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న వాదన ఉంది. వీటిలో నిజానిజాలెంతో తెలియదు గానీ, అరెస్ట్ అయిన ఛోటారాజన్ నోరువిప్పితే మాత్రం బాలీవుడ్ లో చాలా మంది పేర్లు బయటి వస్తాయన్నది ఎవరూ కాదనలేని నిజం. -
బ్లాక్ టికెట్స్ టు మాఫియా డాన్..!
* చోటా రాజన్ నేర ప్రస్థానం * మొదట దావూద్‌కు కుడిభుజం.. * అనంతరం ప్రధాన శత్రువు * రెండు దాడుల నుంచి సాహసోపేతంగా తప్పించుకున్న వైనం * దావూద్ సమాచారమందిస్తూ * భారతీయ నిఘా సంస్థలకు సహకారం! సాక్షి, సెంట్రల్ డెస్క్: చోటా రాజన్.. భారత దేశ వ్యవస్థీకృత నేర చరిత్రలో చెరిగిపోని పేరు. ఎన్నో సినిమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడి సరుకును అందించిన జీవితం. ముంబై శివార్లలోని చెంబూర్ ప్రాంతంలో సహకార్ సినిమాటాకీస్ వద్ద బ్లాక్ టికెట్ల అమ్మకంతో ప్రారంభమైన ఆ 'నానా' నేర జీవితం క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన ట్విస్ట్‌లతో.. మతం, దేశభక్తి కోణాలతో ఆసక్తికర మలుపులతో సాగుతుంది. 1959లో జన్మించిన రాజేంద్ర సదాశివ నికాల్జే సాధారణ మిల్లు కార్మికుడి కొడుకు. చెంబూర్ ప్రాంతంలో బ్లాక్ టికెట్లమ్ముతూ, చోటామోటా నేరాలు చేస్తూ గడుపుతుండేవాడు. స్థానిక దాదా రాజన్ నాయర్ ఉరఫ్ బడా రాజన్ ప్రాపకంలో మరింత రాటు తేలాడు. బడా రాజన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా అక్రమ మద్యం, బంగారం, వెండి స్మగ్లింగ్, బెదిరింపు వసూళ్ల దందా, భూ సెటిల్మెంట్లు తదితరాలతో ముంబై నేర సామ్రాజ్యంలో వేళ్లూనుకున్నాడు. తమిళ డాన్ వరదరాజ ముదలియార్, హైదరాబాదీ గ్యాంగ్‌స్టర్ యాదగిరిలతో సంబంధాలు పెంచుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకున్నాడు. 1983లో బడారాజన్ హత్య అనంతరం ఆ గ్యాంగ్ పగ్గాలు చేపట్టి 'చోటా రాజన్'గా అలియాస్ 'నానా'గా మారాడు. అదే క్రమంలో ముంబైలో అప్పటికే చక్రం తిప్పుతున్న గ్యాంగ్స్టర్లు అరుణ్ గావ్లి, దావూద్ ఇబ్రహీంలతో కలిసి క్రిమినల్ యాక్టివిటీస్‌ను తీవ్రం చేశాడు. ముంబై అక్రమ ఆయుధాల వ్యాపారంలో కీలకంగా మారాడు. అదే క్రమంలో దావూద్ ఇబ్రహీంకు బాగా దగ్గరయ్యాడు. అత్యంత సన్నిహితుడిగా పేరొందాడు. దావూద్‌కు నడిపే డీ కంపెనీలో కీలకంగా మారాడు. 1980ల నాటికి దావూద్‌కు కుడిభుజంగా, ఆయన నేర కార్యకలాపాల్లో, ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్‌లో కీలక శక్తిగా రూపొందాడు. పోలీసుల వేట తీవ్రం కావడంతో అరెస్ట్‌ను తప్పించుకునేందుకు దావూద్ దుబాయి పారిపోయిన సమయంలో డీ కంపెనీ ముంబై కార్యకలాపాలను తానే చేపట్టాడు. స్మగ్లింగ్ వ్యవహారాలను శ్రీలంక, నేపాల్‌ల వరకు విస్తృతం చేశాడు. 1989లో దుబాయిలో అంగరంగ వైభవంగా జరిగిన దావూద్ సోదరుడి వివాహానికి హాజరై... ముంబై పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అక్కడే ఉండిపోయాడు. దేశభక్త డాన్‌గా చిత్రీకరణ..: ముంబై పేలుళ్లను వ్యతిరేకించి, దేశభక్త డాన్‌గా రాజన్ తనను తాను చిత్రీకరించుకున్నాడు. ఇండియాలో దావూద్‌ను జాతివ్యతిరేకి, దేశద్రోహిగా చిత్రీకరించడంలో విజయం సాధించాడు. ఈ క్రమంలో శివసేనకు, ఠాక్రేలకు సన్నిహితుడయ్యాడని కూడా అంటుంటారు. మరోవైపు, దావూద్‌కు సంబంధించిన కీలక సమాచారం, దావూద్ నేర వ్యవహరాల వివరాలు అందిస్తూ భారత దర్యాప్తు, నిఘా సంస్థలకు కూడా దగ్గరయ్యాడని సమాచారం. దావూద్‌కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు కూడా రాజన్‌కు ఇతోధికంగా సాయపడి అతని ఎదుగుదలకు దోహదపడ్డారు. మరోవైపు, నకిలీ నోట్లు, క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్‌లు, బాలీవుడ్ ఫైనాన్సింగ్ వ్యవహారాల్తో ఆర్థికంగా బలపడ్డాడు. బాలీవుడ్ తారలతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. ఎటాక్స్..: ముంబైలో సొంత అస్తిత్వం దెబ్బతింటున్న పరిస్థితులు ఏర్పడటంతో రాజన్ అడ్డు తొలగించుకోవడం దావూద్‌కు అనివార్యమైంది. తన సన్నిహిత సహచరుడు చోటా షకీల్‌కు ఆ బాధ్యత అప్పజెప్పాడు. దాంతో తన ప్రాణాలు కాపాడుకునే క్రమంలో రాజన్ ముంబై కన్నా బ్యాంకాక్ సురక్షితమని భావిం చి, అక్కడికి స్థావరాన్ని మార్చుకున్నాడు. రాజన్ 2000 సంవత్సరంలో రాజన్‌పై మొదటిసారి భారీ ఎటాక్ జరిగింది. బ్యాంకాక్‌లోని రాజన్ స్థావరంలోకి పిజ్జా డెలివరీ బోయ్స్ రూపంలో చోటా షకీల్, మరి కొందరు చొరబడి, రాజన్‌పై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రోహిత్‌వర్మ షార్ప్ షూటర్, రాజన్ సన్నిహితుడు చనిపోయాడు. తీవ్ర గాయాలతో ఇంటి పై కప్పు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు చోటా రాజన్. ఆకస్మిక దాడి నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకొని.. అనంతరం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. థాయ్ పోలీసుల అరెస్ట్‌ను తప్పించుకునేందుకు హాస్పిటల్ నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు. 2003లో ఆ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాడు. బ్యాంకాక్ దాడిలో పాల్గొన్న దావూద్ కీలక అనుచరుడు శరద్ షెట్టీని రాజన్ గ్యాంగ్ దుబాయిలో హతమార్చింది. మరో ఇద్దరు దావూద్ అనుచరులు వినోద్ షెట్టీ, సునీల్ సోవన్లను కూడా చంపేశారు. కొన్నాళ్ల తరువాత ఆస్ట్రేలియాలో మారుపేరుతో తలదాచున్నాడు. 2015 ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోనూ రాజన్‌పై దాడి చేసేందుకు చోటా షకీల్ వ్యూహం రచించాడు. చోటా రాజన్ అనుచరుడిని తమవైపు తిప్పుకుని, పూర్తి వివరాలు రాబట్టాడు. కానీ, ఈ విషయం ముందే తెలవడంతో, రాజన్ ఆ ప్రాంతం నుంచి సురక్షిత, రహస్య ప్రాంతానికి వెళ్లిపోయాడు. తాజాగా విహారయాత్ర కోసం ఇండోనేసియాలోని బాలి ద్వీపానికి వెళ్లిన చోటా రాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసుల సహకారంతో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేయడంతో రాజన్ క్రైమ్ స్టోరీ క్లైమాక్స్‌కు వచ్చింది. ఇటీవల రాజన్ ఆరోగ్యం దెబ్బతిన్నదని, కిడ్నీలు పనిచేయడంలేదని, నిత్యం డయాలసిస్ తప్పట్లేదన్న వార్తలు వచ్చాయి. దాంతో కావాలనే అరెస్ట్ అయ్యాడన్న వాదనా వినిపిస్తోంది. 1993 ముంబై పేలుళ్లు.. 1992లో దావూద్ ఆదేశాల మేరకు రాజన్ అనుచరులు ముగ్గురిని దావూద్ సన్నిహితుడు సుభాష్ ఠాకూర్ హతమార్చడంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతినడం ప్రారంభమయ్యాయి. అయితే 257 మందిని బలిగొన్న ముంబై వరుస పేలుళ్లను రాజన్ తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. ఆ సీరియల్ పేలుళ్లను రాజన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తద్వారా హిందువుల అనుకూల డాన్‌గా ముద్ర వేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత దావూద్‌ను, దుబాయిని వీడివచ్చేశాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య విబేధాలు మరింత తీవ్రమయ్యాయి. సొంత గ్యాంగ్ సహకారంతో ముంబైలో దావూద్‌కు ప్రధాన ప్రత్యర్థిగా మారాడు. 1993 నుంచి 2000 దాకా ఆ ఇద్దరి గ్యాంగ్‌వార్‌లో ఇరువర్గాలకు చెందిన వందమందికి పైగా హతమయ్యారు. -
'దావూద్ ఇబ్రహీంను చంపకుండా నేను చావను'
ముంబై: అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను చంపకుండా తాను చచ్చేది లేదని ఆయన చిరకాల ప్రత్యర్ధి, మరో మాఫియా డాన్ చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నిఖాల్జే స్పష్టం చేశాడు. 1993 ముంబై పేలుళ్ల తర్వాత దావూద్, చోటా రాజన్ ల మధ్య శత్రుత్వం తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని చెంబూర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే స్థాయి నుంచి మాఫియా డాన్ ఎదిగిన రాజన్ వర్గానికి, దావూద్ వర్గానికి మధ్య వైరం గత కొద్దికాలంగా ఊపందుకుంది. అయితే ప్రస్తుతం చోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న రాజన్ మలేషియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. 2001లో దావూద్ వర్గం జరిపిన కాల్పుల్లో చోటా రాజన్ కు కిడ్నీలో గాయమైంది. అప్పటి నుంచి చోటా రాజన్ ను కిడ్ని వ్యాధితో బాధపడుతున్నారు.