'దావూద్ ఇబ్రహీంను చంపకుండా నేను చావను'
'దావూద్ ఇబ్రహీంను చంపకుండా నేను చావను'
Published Wed, Apr 23 2014 2:49 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
ముంబై: అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను చంపకుండా తాను చచ్చేది లేదని ఆయన చిరకాల ప్రత్యర్ధి, మరో మాఫియా డాన్ చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నిఖాల్జే స్పష్టం చేశాడు.
1993 ముంబై పేలుళ్ల తర్వాత దావూద్, చోటా రాజన్ ల మధ్య శత్రుత్వం తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని చెంబూర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే స్థాయి నుంచి మాఫియా డాన్ ఎదిగిన రాజన్ వర్గానికి, దావూద్ వర్గానికి మధ్య వైరం గత కొద్దికాలంగా ఊపందుకుంది.
అయితే ప్రస్తుతం చోటా రాజన్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న రాజన్ మలేషియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
2001లో దావూద్ వర్గం జరిపిన కాల్పుల్లో చోటా రాజన్ కు కిడ్నీలో గాయమైంది. అప్పటి నుంచి చోటా రాజన్ ను కిడ్ని వ్యాధితో బాధపడుతున్నారు.
Advertisement
Advertisement