ఎప్పుడనుకుంటే అప్పుడు స్వదేశానికి వస్తా
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ వెల్లడి
లండన్: 2010 నుంచి విదేశాల్లో గడుపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్‌లో తనపై ఎలాంటి కేసులు లేవన్న లలిత్ మోదీ..చంపుతామంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి వచ్చి,న బెదిరింపుల వల్లే విదేశాల్లో ఉంటున్నట్లు చెప్పుకున్నారు. ‘ఫిగరింగ్ ఔట్’అనే పాడ్ కాస్ట్‌లో రాజ్ షమానీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఈ విషయాలను ఆయన వెల్లడించారు.
‘వాస్తవానికి, దేశం విడిచి పెట్టేటంతటి సీరియస్ కేసులేవీ నాపైన అప్పట్లో లేవు. దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ నాకు బెదిరింపులు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌ను అస్సలు సహించను. అయితే, క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్న దావూద్ ఇబ్రహీం నాపై ఒత్తిడి పెంచాడు. అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడటంపైనే నా దృష్టంతా ఉంది. దీనికి తోడు వ్యతిరేక ప్రచారం నాపై ఎక్కువగా జరిగింది’అని లలిత్ పేర్కొన్నారు.
‘ఈ పరిస్థితుల్లో హిట్ లిస్ట్‌లో ఉన్నందున నాకు 12 గంటలపాటు మాత్రమే భద్రత కల్పించగలమని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. నా వ్యక్తిగత సిబ్బంది సూచనమేరకు ముందు జాగ్రత్తగా ఎయిర్‌పోర్టు నుంచి వీఐపీ గేట్ ద్వారానే బయటకు వెళ్లా’అని వివరించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భారత్ వెళ్లగలనంటూ ఆయన..‘చట్ట పరంగా నేను పరారీలో ఉన్న నేరగాణ్ని కాను.
అక్కడ ఏ కోర్టులోనూ నాపైన ఎలాంటి కేసులూ లేవు. అందుకే భారత్‌కు రేపు ఉదయం వెళ్లాలన్నా వెళ్లగలను. అందులో నాకెలాంటి సమస్యాలేదు’అని తెలిపారు. దావూద్ ఇబ్రహీం హిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లలో లలిత్ మోదీ ఒకరు. లలిత్‌ను చంపేందుకు తమ షార్ప్ షూటర్ల బృందం థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సిద్ధంగా ఉందంటూ కొన్నేళ్ల క్రితం దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ వ్యాఖ్యా నించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment