death threats
-
దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా
లండన్: 2010 నుంచి విదేశాల్లో గడుపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్‌లో తనపై ఎలాంటి కేసులు లేవన్న లలిత్ మోదీ..చంపుతామంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి వచ్చి,న బెదిరింపుల వల్లే విదేశాల్లో ఉంటున్నట్లు చెప్పుకున్నారు. ‘ఫిగరింగ్ ఔట్’అనే పాడ్ కాస్ట్లో రాజ్ షమానీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఈ విషయాలను ఆయన వెల్లడించారు. ‘వాస్తవానికి, దేశం విడిచి పెట్టేటంతటి సీరియస్ కేసులేవీ నాపైన అప్పట్లో లేవు. దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ నాకు బెదిరింపులు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌ను అస్సలు సహించను. అయితే, క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్న దావూద్ ఇబ్రహీం నాపై ఒత్తిడి పెంచాడు. అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడటంపైనే నా దృష్టంతా ఉంది. దీనికి తోడు వ్యతిరేక ప్రచారం నాపై ఎక్కువగా జరిగింది’అని లలిత్ పేర్కొన్నారు. ‘ఈ పరిస్థితుల్లో హిట్ లిస్ట్‌లో ఉన్నందున నాకు 12 గంటలపాటు మాత్రమే భద్రత కల్పించగలమని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. నా వ్యక్తిగత సిబ్బంది సూచనమేరకు ముందు జాగ్రత్తగా ఎయిర్‌పోర్టు నుంచి వీఐపీ గేట్ ద్వారానే బయటకు వెళ్లా’అని వివరించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భారత్ వెళ్లగలనంటూ ఆయన..‘చట్ట పరంగా నేను పరారీలో ఉన్న నేరగాణ్ని కాను. అక్కడ ఏ కోర్టులోనూ నాపైన ఎలాంటి కేసులూ లేవు. అందుకే భారత్‌కు రేపు ఉదయం వెళ్లాలన్నా వెళ్లగలను. అందులో నాకెలాంటి సమస్యాలేదు’అని తెలిపారు. దావూద్ ఇబ్రహీం హిట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లలో లలిత్ మోదీ ఒకరు. లలిత్‌ను చంపేందుకు తమ షార్ప్ షూటర్ల బృందం థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో సిద్ధంగా ఉందంటూ కొన్నేళ్ల క్రితం దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ వ్యాఖ్యా నించడం తెలిసిందే. -
పూజా హెగ్డేను చంపేస్తామంటూ బెదిరింపులు.. టీమ్ క్లారిటీ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన ఓ తప్పుడు వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూజా హెగ్డే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల దుబాయ్ వెళ్లారని.. అక్కడ గొడవ జరగడంతో కొంతమంది ఆమెను చంపేస్తామని బెదిరింపులకు దిగినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో బుట్ట బొమ్మ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఏం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా ఈ వార్తలపై పూజా హెగ్డే టీమ్ స్పందించింది. ‘అసలు ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు సృష్టిస్తారో తెలియదు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దు’అని ఆమె టీమ్ పేర్కొంది. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను కూడా డిలీట్ చేయించింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక పూజా హెగ్డే సినిమాల విషయాలకొస్తే.. తెలుగులో ‘అల..వైకుంఠపురములో’ తర్వాత పూజాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కవ వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్‌కి జంప్ అయింది. అక్కడ చివరిగా సల్మాన్ ఖాన్ ‘కిసీ కా బాయ్ కిసీకి జాన్’సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు హిందీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. షాదీ కపూర్ హీరోగా నటిస్తున్న దేవా చిత్రంలో హీరోయిన్గా పూజాని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2024 దసరాకి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.తెలుగులో మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరుకారం’ చిత్రంలో తొలుత పూజానే హీరోయిన్. షూటింగ్ వాయిదా పడడంతో డేట్స్ కుదరక ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం తెలుగులో పూజాకు ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. -
చంపేస్తాం..! హైకోర్టు జడ్జిలకు బెదిరింపులు
బెంగళూరు: గుర్తు తెలియని వ్యక్లి నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జీలకు బెదిరింపులు అందాయి. హైకోర్టులోని ఓ ఉద్యోగితోపాటు పలువురు న్యాయమూర్తులను చంపేస్తామని ఓ పలు నెంబర్ల నుంచి వాట్సాప్ మెసెజ్‌లు వచ్చాయి. దీనిపై హైకోర్టు ప్రెస్ రిలేషన్స్ అధికారి(పీఆర్ఓ) కే మురళీధరన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా జూలై 12న రాత్రి 7 గంటలకు ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి మురళీ ధరన్ వాట్సాప్‌కు మెసెజ్ వచ్చిన్నట్లు పోలీసులు తెలిపారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన ఈ మెసెజ్‌లో తనతోపాటు హైకోర్టులోని ఆరుగురు జడ్జిలను చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఆరుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ మహ్మద్ నవాజ్, జస్టిస్ హెచ్‌టి నరేంద్ర ప్రసాద్, జస్టిస్ అశోక్ జి నిజగన్నవర్ (రిటైర్డ్), జస్టిస్ హెచ్‌పి సందేశ్, జస్టిస్ కె నటరాజన్, జస్టిస్ బి వీరప్ప (రిటైర్డ్) ఉన్నారు. కాగా బెదిరింపులు వచ్చిన నెంబర్‌ను మురళీధరన్‌కు హైకోర్టు అధికారికంగా అందించిందని తెలిపారు. పాకిస్థాన్‌లోని బ్యాంకు ఖాతాకు ₹ 50 లక్షలు చెల్లించాలని లేదంటే.. ఈ లిస్ట్‌లో పేర్కొన్న వారిని దుబాయ్ గ్యాంగ్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసెజ్‌లో ఐదు అనుమానాస్పద మొబైల్ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని చెప్పారు. మురళీధరన్ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 506, 507, 504, ఐటీ చట్టంలోని 75, 66(ఎఫ్) సెక్షన్ల కింద సెంట్రల్ CEN పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు .. నన్ను సీమాతో పోల్చకండి! -
దీపక్ చహర్ భార్యకు బెదిరింపులు
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్‌కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు సదరు దుండగులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై దీపక్ చహర్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయంలోకి వెళితే.. రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్ జయ భరద్వాజ్ దగ్గర రూ. 10లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్లైన్లో రూ.10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్లు తెలుసుకున్న జయా భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగారు. అయితే తండ్రి, కొడుకులు డబ్బు తిరిగి ఇవ్వడమే కాకుండా ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని.. చంపేస్తామంటూ బెదిరించారని దీపక్ చహర్ తండ్రి పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో కంపెనీ యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా దీపక్ చహర్ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. దీపక్, జయ భరద్వాజ్‌ల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు చహర్. చహర్ టీమిండియా తరపున ఏడు వన్డేల్లో 10 వికెట్లు, 24 టి20 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
‘కేసు వాపస్ తీసుకుంటే నెలకి రూ.1 కోటి ’.. మహిళా కోచ్ సంచలన ఆరోపణ
చండీగఢ్: హరియాణా క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన జూనియర్ మహిళా అథ్లెటిక్ కోచ్ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కేసు వాపసు తీసుకోవాలని లేదంటే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తాను చావుకు భయపడనని, సందీప్ సింగ్‌కు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తనను దేశం విడిచి వెళ్లిపోవాలని, అందుకు నెలకి రూ.1 కోటి చొప్పున ఇస్తామని బేరమాడినట్లు వెల్లడించారు. ‘నా నోరు మూయించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను చావుకు భయపడను. బెదిరింపులు వస్తున్నా వెనక్కి తగ్గను. నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నాకు నచ్చిన దేశానికి వెళ్లిపోతే నెలకి రూ.1 కోటి అందుతాయని ఆఫర్ చేశారు. నా ఫిర్యాదును వెనక్కి తీసుకుని, వేరే దేశానికి వెళ్లమని నన్ను అడిగారు. నాకు తెలుసు ఆయన(సందీప్ సింగ్) మంత్రివర్గం నుంచి తొలగించబడతాడు, జైలుకు వెళతాడు, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.’అని మహిళా కోచ్ తెలిపినట్లు ఏఎన్ఐ నివేదించింది. అలాగే.. ఈ కేసును హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం మాట్లాడారు సీఎం ఖట్టర్. క్రీడాశాఖ మంత్రిపై వచ్చిన లైంగిక ఆరోపణలు అంసబ్ధమైనవని, ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన దోషిగా మారడని స్పష్టం చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా! -
సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్.. పోలీసుల నిర్ణయం
Salman Khan Gets Arms License After His Request Citing Death Threats: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు తాజాగా తుపాకీ లైసెన్స్ మంజూరైంది. ఇటీవల సల్లూ భాయ్‌ని, అతని తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన విషయం తెలిసిందే. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే పడుతుందని సల్లూ భాయ్‌కు వచ్చిన లేఖ నేపథ్యంలో ముంబయి పోలీసులను సల్మాన్ ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబానికి వస్తున్న చావు బెదిరింపుల కారణంగా తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేయాలని పోలీసులకు సల్మాన్ ఖాన్ విన్నవించుకున్నాడు. ఈ విషయంపై విచారించిన తర్వాత సల్మాన్‌కు తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ ముంబయి కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే సల్లూ భాయ్‌కు తుపాకీ లైసెన్స్ జారీ చేసిన ఆతను ఎలాంటి తుపాకీ కొంటారనేది పేర్కొనలేదు. ఆయన రక్షణ కోసం 32 కాలిబర్ రివాల్వర్ లేదా పిస్టల్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఆయుధ నిపుణులు సూచించినట్లు సమాచారం. కాగా బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌కు ముంబయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. ఇటీవల తెలుగు సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ పార్క్ హయత్ హోటల్లో బస చేయడంతో భారీ బందోబస్తు ఉంచారు. హోటల్లోని ఒక ఫ్లోర్ మొత్తాన్ని సల్మాన్‌కు కేటాయించారు. షూటింగ్‌ల కోసం నగరాల్లో తిరిగేందుకు సల్మాన్ కారుకు ముందు వెనుక ఎస్కార్టు ఏర్పాటు చేశారు. అలాగే సల్మాన్ ఖాన్ ముందు జాగ్రత్తగా తన ల్యాండ్ క్రూయిజర్‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించారు. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా.. -
మరోసారి ఉలిక్కి పడ్డ బాలీవుడ్.. కత్రీనాను చంపేస్తామంటూ బెదిరింపులు
గత కొంతకాలంగా బాలీవుడ్లో బెదింపులు కలకలం రేపుతున్నాయి. ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తరచూ హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో స్టార్ కపుల్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. దీంతో బాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడింది. ఇంతకి ఆ స్టార్ కపుల్ ఎవరంటే హీరోయిన్ కత్రీనా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్. ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విక్కీ బర్తడే సందర్భంగా ఈ జంట విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలె తిరిగొచ్చిన కత్రినా,విక్కీలు తమ సినిమా షూటింగ్‌లతో బిజీ అయిపోయారు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న రణ్‌బీర్ షంషేరా మూవీ, ఎప్పుడు.. ఎక్కడంటే ఈ నేపథ్యంలో చంపేస్తామంటూ ఓ అగంతుడు కత్రీనాను ఇన్స్టాగ్రామ్ వేదికగా బెదిరిస్తున్నాడు.దీంతో కత్రీనా-విక్కీ ముంబైలోని శాంతాక్రూజ్ పోలీసులను ఆశ్రయించారు. తమకు వచ్చిన బెదిరింపుల మెసేజ్‌లపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంతకాలంగ గుర్తు తెలియని వ్యక్తి చాలా ఇబ్బంది పెడుతున్నాడని, కత్రీనాను చంపేస్తామంటూ తరచూ బెదిరింపు మెసేజ్‌లు చేస్తున్నట్లు విక్కీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఈ స్టార్ జంట ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్(ఇన్ఫర్మెషన్ టెక్కాలజీ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: లైగర్ చిత్రానికి కళ్లు చెదిరే శాటిలైట్, డిజిటల్ రైట్స్? ఎంతంటే.. -
అరటిపండ్లకు 35 లక్షల బిల్లు?.. చంపుతామంటూ బెదిరింపులు
ఉత్తరాఖండ్ రంజీ క్రికెట్ అసోసియేషన్‌లో చోటుచేసుకుంటున్న అక్రమాల గురించి కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోవిడ్-19 తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్(సీఏయూ) తప్పుడు రిపోర్టులు అందిస్తూ వచ్చింది. తమ రంజీ ఆటగాళ్లకు రోజు దినసరి కూలి కింద రూ.వంద ఇవ్వడం సంచలనం రేపింది. సీఏయూ రిపోర్ట్ ప్రకారం రూ.1.74 కోట్లు కేవలం ఫుడ్, ఇతర క్యాటరింగ్ సేవలకు ఉపయోగించినట్లు పేర్కింది. కేవలం ఆటగాళ్లకు అందించే అరటిపండ్లకు రూ. 35 లక్షల దొంగ బిల్లులను చూపించింది. ఇక రూ.49.5 లక్షలు రోజూవారి అలెవన్స్‌ల కింద తప్పుడు లెక్కలు సమర్పించింది. ఇలాంటి తప్పుడు బిల్లులకు తోడూ ఆటగాళ్లకు చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. తమ బిల్లులు చెల్లించాలని ఎవరైనా ఫోన్ చేస్తే చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని మాజీ అండర్-19 క్రికెటర్ ఆర్య సేతీ పేర్కొన్నాడు.ఈ విషయమై అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీఎయూ సెక్రటరీ మహిమ్ వర్మ, హెడ్‌కోచ్ మనీష్ జా, అసోసియేషన్ అధికార ప్రతినిధి సంజయ్ గుసెన్‌లను విచారించగా.. క్రికెటర్లకు బెదిరింపులు నిజమేనని పేర్కొన్నారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక రంజీ క్రికెటర్‌కు రోజువారీ వేతనంలో ఒక క్రికెటర్‌కు రూ. 1000-1500 నుంచి అందుకుంటారు. అదే ఒక సీనియర్ క్రికెటర్‌కు రూ. 2వేల వరకు పొందుతారు. కానీ ఈ నిబంధనలను గాలికొదిలేసిన ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ గత 12 నెలలుగా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా కేవలం వంద రూపాయాలను మాత్రమే రోజూవారీ వేతనంగా ఇస్తుండడం శోచనీయం. గత మార్చి 20న 'టోర్నమెంట్ అండ్ ట్రయల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్' పేరిట తయారు చేసిన ఆడిట్ రిపోర్టులో మాత్రం సదరు క్రికెట్ అసోసియేషన్ ఘనంగానే లెక్కలు చూపించింది. ఆటగాళ్ల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులతో కలిపి రూ.1,74,07,346 ఖర్చు చేస్తున్నట్లు చూపించింది. ఇందులో రూ.49,58,750లను ఆటగాళ్లకిస్తున్న రోజువారీ వేతనం కింద లెక్క చూపించింది. అంతేగాక మరో 35 లక్షలతో ఆటగాళ్లకు అరటిపండ్లు, రూ.22 లక్షలతో వాటర్ బాటిల్స్ అందిస్తున్నట్లుగా రిపోర్ట్‌లో చూపించింది. -
ప్రకాశ్‌రాజ్‌కు బెదిరింపు లేఖ.. ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’
శివాజీనగర/బెంగుళూరు: బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, సాహితీవేత్త వీరభద్రప్పతో పాటు 16 మంది కర్ణాటక సాహితీవేత్తలకు బెదిరింపు లేఖలు వచ్చాయి. ‘జై హిందూ దేశం, జై సహిష్ణు’పేరుతో వచ్చిన ఈ లేఖల్లో ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’అని ఉంది. దీనిపై వీరభద్రప్ప, పలువురు రచయితలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు భద్రత పెంచాలని కోరారు. తాను హిందువును కాదని, లింగాయత్‌ను అని వీరభద్రప్ప ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రకటించారు. చదవండి👉🏻 చింతన్ శిబిర్ వేళ కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత సునీల్ జాఖడ్ గుడ్‌బై -
చచ్చిపోవడానికి రెడీగా ఉండండి.. మాజీ సీఎంలకు వార్నింగ్
సాక్షి, బెంగళూరు: మాజీ సీఎంలను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఏకంగా 63 మందిని ఓ క్షణంలోనైనా చంపేస్తామనడం కర్నాటకలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యలకు చంపేస్తామంటూ గుర్తు వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. మరో 61 మంది రచయితలకు కూడా ఇదే తరహా లేఖలు అందాయి. అయితే, ఈ లేఖలు ఎవరు పంపించారనేది ఇంకా తెలియరాలేదు. కాగా, సిద్ధరామయ్య, కుమారస్వామితో పాటు మిగిలిన రచయితలను దేశద్రోహులుగా అభివర్ణిస్తూ వారు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ లేఖల చివర్లో ఓ సహనం కలిగిన హిందువు అని రాసి ఉండడంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, లేఖలో వీరందరూ ఓ వర్గం పక్షాన ఉంటూ.. హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు. మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి' అని రాసి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ లేఖ అందినవారిలో సీనియర్ కన్నడ రచయిత కుమ్ వీరభద్రప్ప (కుంవీ) కూడా ఉన్నారు. ఈ లేఖపై మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వానికి మరింత సమాచారం అందిస్తానని తెలిపారు. బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు తక్షణమే తగిన భద్రత కల్పించాలని కోరారు. లేఖల విషయంలో తనకు ఎలాంటి భయాలు లేవని కుమారస్వామి చెప్పుకొచ్చారు. -
‘హిజాబ్ తీర్పు’ జడ్జిలకు బెదిరింపులు.. వై కేటగిరీ భద్రత
హిజాబ్ తీర్పు వెల్లడించిన ధర్మాసనంలోకి ముగ్గురు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు.. హిజాబ్ ముస్లిం మతాచారం కాదంటూ ఈ మధ్యే సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు తీర్పు హిజాబ్ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులను బెదిరించిన ఓ వ్యక్తి వీడియో వైరల్ అయ్యింది. శుక్రవారం తిరుచురాపల్లికి చెందిన Tamil Nadu Thowheed Jamath (TNTJ) నేత ఉస్మానీ ఓ ర్యాలీలో పాల్గొని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోపై తంజావూర్(తమిళనాడు) పోలీసులు కేసు నమోదు చేయడం.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. హైకోర్టు జడ్జిలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ బెదిరింపు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తులో స్వయంగా పాల్గొనాల్సిందిగా కర్ణాటక డీజీపీని సీఎం బొమ్మై స్వయంగా ఆదేశించారు. తమిళనాడు పోలీసులతో కలిసి విచారణను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలంతా కుహనా లౌకికవాదులని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిలను బెదిరించిన ఘటనపై ఇంత వరకు ఎవ్వరూ ఖండించలేదని విమర్శించారు. ‘‘జడ్జిలను బెదిరించిన ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. ఈ కుహనా లౌకికవాదులు ఎందుకు మాట్లాడడం లేదు? ఓ వర్గం వారిని మెప్పించేందుకే నోరు మూసుకున్నారా? అది నిజమైన లౌకికవాదం కాదు. అదే అసలైన మతతత్వం’’ అని మండిపడ్డారు. జార్ఖండ్‌లో వాకింగ్‌కు వెళ్లిన ఓ జడ్జి దారుణ హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓ వ్యక్తి తీసిన బెదిరింపు వీడియో వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం కర్ణాటక హైకోర్టు అడ్వొకేట్ ఉమాపతితో పాటు మరికొందరు అడ్వొకేట్లు.. హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు సదరు వీడియోపై ఫిర్యాదు చేశారు. భగవద్గీత సిలబస్‌లో.. నైతిక విద్యలో భాగంగా కర్ణాటక స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేర్చబోతున్నట్లు సీఎం బొమ్మై, శనివారం వెల్లడించారు. ఇదివరకే గుజరాత్ స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేర్చాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆ స్టూడెంట్స్‌కు షాక్ హిజాబ్ నిరసనల్లో భాగంగా పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చేదే లేదని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి వెల్లడించారు. తీర్పు ముందు బహిష్కరించిన వాళ్లకే అవకాశం అని, తీర్పు వచ్చాక కొందరు పరీక్షలను బహిష్కరించారని, వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ నిర్వహించబోయే పరీక్షలకు అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. -
'పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి.. వారు మీకేం అన్యాయం చేశారు'
సాక్షి, ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిశోరీ పెడ్నేకర్‌కు గురువారం సాయంత్రం బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. ఆ లేఖలో అసభ్య పదజాలం వాడటంతో పాటు మేయర్‌ను, ఆమె కుటుంబాన్ని హతమారుస్తామని హెచ్చరికలు ఉన్నాయి. ‘మాతో వైరం పెట్టుకోవద్దు. నా సోదరుడి వైపు కన్నెత్తి చూడవద్దు’అని కూడా ఆ లేఖలో రాశారు. దీంతో మేయర్ కిశోరీ పెడ్నేకర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: (భారత్‌లో ఒమిక్రాన్ భయాలు.. ఒకే రోజు 9 కేసులు) గతేడాది జూన్‌లో కూడా ఆమెకు ఇలాగే ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు దీన్ని తీవ్రంగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ లేఖ రాసిన వారి చిరునామా గందరగోళంగా ఉండటంతో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రాసి ఉండవచ్చని తొలుత అనుమానించారు. కానీ, ఈ లేఖ నవీ ముంబైలోని పన్వేల్ నుంచి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మేయర్ కిశోరీ పెడ్నేకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయాలు రోజురోజుకు మరింత దిగజారి పోతున్నాయని, లేఖలో రాసిన అసభ్య పదజాలం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఆమె కంటతడి పెట్టారు. చదవండి: (ట్రాఫిక్ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్ రోడ్’ పూర్తి..) ఒక మహిళకు రాసిన లేఖలో రాయాల్సిన పదాలేనా ఇవి అంటూ నిలదీశారు. ‘నన్ను, నా కుటుంబ సభ్యులను రివాల్వర్‌తో కాల్చి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేస్తామని లేఖలో పేర్కొనడం ఎంత వరకు సమంజసం? పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి. నా కుటుంబ సభ్యులు మీకు ఏం అన్యాయం చేశారు’అని ప్రశ్నించారు. మహిళలను గౌరవించే మన దేశంలో ఇలాంటి పదాలు వాడటం సిగ్గుచేటన్నారు. అడ్వొకేట్ విజేంద్ర మాత్రే అనే వ్యక్తి లేఖ రాసినట్లు లేఖపై ఉందని తెలిపారు. తన గళాన్ని అణచివేసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను శివసైనికురాలినని, ఇలాంటి గుర్తుతెలియని వ్యక్తులు రాసిన బెదిరింపు లేఖలకు భయపడనని ఉద్ఘాటించారు. -
సింగర్ రాహుల్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్
Rahul Vaidya Gets Death Threats : ప్రముఖ సింగర్, బిగ్‌బాస్14 రన్నరప్ రాహుల్ వైద్య వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలె నవరాత్రి స్పెషల్ సందర్బంగా రాహుల్ ‘గర్బే కి రాత్’అనే పాటను కంపోజ్ చేశాడు. రాహుల్, భూమి త్రివేది కలిసి పాడిన ఈ పాట విడుదలైన కాసేపటికే తీవ్ర వివాదాస్పదం అయ్యింది. తమ మనోభావాలను కించపరిచే విధంగా పాటను కంపోజ్ చేశారంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పాటలో గుజరాతీ జానపద పాట 'రమ్వా ఆవో మది' అనే పదాన్ని అభ్యంతరకరంగా ఉపయోగించారంటూ గుజరాతీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ఆచారాలను కించపరిచారనే కారణంతో రాహుల్, భూమి త్రివేదిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇప్పటికీ బెదిరింపులు ఆగడం లేదని, రాహుల్‌ను కొడతం, చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ రాహుల్ టీం పేర్కొంది. మనోబావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, ఆ పదాలు తీసేయడానికి తమ బృందం పని చేస్తుదని తెలిపారు. అప్పటివరకు అందరూ శాంతంగా ఉండాలని, దాన్ని సరిదిద్దడానికి కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. చదవండి: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో సాయితేజ్? పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి -
‘మరో నాలుగు రోజులే, సీఎం యోగీకి మరణం తప్పదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. తాజాగా యూపీ పోలీసులకు చెందిన ‘112’ అనే వాట్సాప్ నెంబర్‌కు సీఎంను చంపేస్తామని మరోసారి బెదిరింపు సందేశాలు అందినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 29న గుర్తు తెలియని వ్యక్తి ఓ మెసెజ్ ద్వారా ‘యూపీ సీఎం ఆదిత్యానాథ్‌కు ఇంకా నాలుగు రోజులే మిగిలున్నాయి. ఆయనకు మరణం తప్పదు’ అని హెచ్చరించినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై ఇప్పటికే సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేగాక హెచ్చరికలు పంపినవారేవరో తెలుసుకుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓ నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే యూపీ సీఎంకు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా హోమంత్రి అమిత్‌షాతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను కూడా చంపేస్తామని బెదిరిస్తూ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు ఈ మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే గత ఏడాది సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్లలో యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ కాల్స్ అందాయి. చదవండి: పీటల మీద పెళ్లి ఆపిన వధువు.. కారణం తెలిస్తే షాకే! జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే! -
హీరో సిద్దార్థ్‌కు బెదిరింపులు.. ఖండించిన బీజేపీ
తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వస్తున్నాయని హీరో సిద్దార్థ్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేగాక అత్యాచారం బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పాడు. అయితే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ ఫోన్ నంబర్ లీక్ చేయడం వల్లే ఇలా జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఇవాళ సిద్దార్థ్ మరో ట్వీట్ చేస్తూ తనకు, తన కుటుంబం భద్రత దృష్ట్యా పోలీసు సెక్యూరిటీని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే రాష్ట్ర బీజేపీ స్పోక్స్‌పర్సన్ నారాయణన్ తిరుపతి కూడా దీనిపై స్పందించారు. సిద్దార్థ్ ప్రధాని మోదీని అగౌరపరిచి మరోసారి నేరస్థుడయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సిద్ధార్థ్ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. గతంలో నేను అతడిపై కేసు పెట్టాను. అది ఇప్పటికీ కోర్టులోనే ఉంది. తాజాగా అతడు ప్రధాన మంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకరమైన పదజాలంతో దూషించి మరోసారి అపరాది అయ్యాడు. ఇటీవల సిద్దార్థ్ చేసిన ట్వీట్లో కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై వివాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రస్తుతం తనకు వస్తున్న బెదిరింపుల్లో ఎంతవరకు నిజముందో నాకు తెలియదు. ఒకవేళ అతనికి సమస్య ఉంటే చట్టపరమైన చర్య తీసుకోవాలి. కానీ, ప్రధానమంత్రి, హోంమంత్రి, సీఎంలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వ్యతిరేకత తీసుకురావడం సరైనది కాదు. ఇది ఖండించదగిన చర్య’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ వింగ్ హెడ్ సీటీఆర్ నిర్మల్ కుమార్ సిద్దార్థ్ ఆరోపణలను ఖండించారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సిద్దార్థ్‌కు వస్తున్న బెదిరింపులకు బీజేపీకి ఎలాంటి సబంధం లేదు. సిద్దార్థ్ వంటి వ్యక్తులపై దృష్టి పెట్టొద్దని పార్టీ సభ్యులు, అనుచరులను అభ్యర్థిస్తున్న’ అని పేర్కొన్నారు. కాగా తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ తన మొబైల్ నంబర్ లీక్ చేసిందని, గడిచిన 24 గంటల్లో తనకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చినట్లు సిద్దార్థ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే తనను తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారని, ఆ నంబర్లంన్నింటిని రికార్డ్ చేశాను.. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే అని తెలిపాడు. అంతేగాక వీట్నింటిని పోలీసులుకు అందించానని కూడా సిద్దార్థ్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. During this pandemic all of us very much focused on supporting people in providing food, medicine..etc Requesting all supporters not to give any attention to individuals like @Actor_Siddharth who are just trying to pass time, pls stay focused on covid support to people. pic.twitter.com/1d9Eirnqx3 — CTR.Nirmal kumar (@CTR_Nirmalkumar) April 29, 2021 చదవండి: నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్ పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్ -
నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ మొబైల్ నంబర్ లీక్ చేసిందని ఆరోపించారు. అందువల్ల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. తమపై అత్యాచారం చేస్తామని బెదిరింపు సందేశాలు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ నా మొబైల్ నంబర్ లీక్ చేసింది. గడిచిన 24 గంటల్లో నాకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చాయి. నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని.. మాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ నంబర్లంన్నింటిని రికార్డ్ చేశాను. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే ఉన్నాయి. వీట్నింటిని పోలీసులుకు అందించాను. నేను మౌనంగా ఉంటానని మాత్రం అనుకోవద్దు’’ అని తెలిపారు. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 దీంతో పాటు సిద్ధార్థ్ తనను బెదిరిస్తూ వచ్చిన మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీశారు. వాటిని తన ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ నాయకులు నిన్న నా పర్సనల్ నంబర్ని లీక్ చేశారు. చాలా గ్రూపుల్లో నా నంబర్ చక్కర్లు కొట్టింది. వీరంతా నన్ను ట్రోల్ చేశారు. నేను కోవిడ్‌తో పోరాడాలా.. ఇలాంటి వారితో పోరాడాలా’’ అని వాపోయారు సిద్ధార్థ్. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 ఇక సిద్ధార్థ ట్వీట్‌పై నటి శ్రేయా ధన్వంతరీ స్పందించారు. ఇది చాలా దారుణం అంటూ ట్వీట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో సిద్ధార్థ్ ముందు ఉంటారు. కొద్ది రోజుల క్రితం తన సోసల్ మీడియాలో కోవిడ్‌ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. చదవండి: పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్ -
రైతులకు మద్దతు.. నటికి అత్యాచార బెదిరింపులు
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సం నాటి ఘటనతో రైతులకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖలు మద్దతిస్తుండగా.. మన దేశంలో సెలబ్రిటీలు మాత్రం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతలకు మద్దతిస్తోన్న తనపై అత్యాచార చేస్తామని.. చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బ్రిటీష్ నటి జమీలా జమిల్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘గత కొన్ని నెలలుగా నేను తరచుగా భారతీయ రైతులకు మద్దతుగా మాట్లాడుతున్నాను. ఫలితంగా నేను బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. చంపేస్తాం.. అత్యాచారం చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవారు ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి.. నేనూ మనిషినే.. కొంతవరకే దేన్ని అయినా భరించగలను. రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నాను.. ఇక మీదట కూడా తెలుపుతాను. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారు తమ న్యాయమైన హక్కుల కోసం పొరాడుతున్నారని గుర్తించండి’’ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Jameela Jamil (@jameelajamilofficial) ఇక జమీలా విషయానికి వస్తే.. ఆమె తండ్రి అలీ జమిల్ భారత సంతతి వ్యక్తి కాగా.. తండ్రి షిరీన్ జమిల్ పాక్ సంతతి మహిళ. ఇక జమీలా 2009లో టీ4తో తన టెలివిజన్ కెరీర్ స్టార్ట్ చేసింది. 2012 వరకు సాగిన ఈ పాప్ కల్చర్ సిరీస్ జమీలా హోస్ట్‌గా పని చేసింది. ఇక ఎన్బీసీలో వచ్చిన ఫాంటసీ కామెడీ సిరీస్ ది గుడ్ ప్లేస్ లో తహాని అల్-జమీల్ పాత్రతో బాగా పాపులర్ అయ్యింది. చదవండి: ‘పోలీసుల దెబ్బలకు రైతుల కాళ్లు కమిలిపోయాయి’ రైతుల చుట్టూ కాదు.. గుండెల్లో మేకులు -
చంపేస్తాం..! గంభీర్‌కు బెదిరింపు కాల్స్
సాక్షి,న్యూఢిల్లీ: తనను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తనకు హత్యా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శనివారం ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. గుర్తుతెలియని వ్యక్తులు, ఇంటర్నేషనల్ ఫోన్ నెంబర్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రతను కల్పించాల్సిందిగా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. గంభీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నెంబర్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు తగిన భద్రత కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. కాగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళకారులు తీరును గంభీర్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పోలీసులు ఆత్మరక్షణ కోసం లాఠీచార్జి చేస్తే అందులో తప్పుబట్టాల్సిందేమీ లేదని, తమపై రాళ్లు విసురుతున్నప్పుడు, ప్రజల ఆస్తులను దహనం చేస్తూ హింసకు పాల్పడుతున్నప్పుడు ఆందోళనకారులను పోలీసులు ప్రతిఘటిస్తారని అభిప్రాయపడ్డారు. కేవలం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేస్తే అది తప్పేనని గంభీర్ స్పష్టం చేశారు. హింసకు తావులేని రీతిలో నిరసన చేపడితే ఎవరికీ సమస్య ఉండదని అన్నారు. -
ప్రధానికి హత్యా బెదిరింపులు.. సంచలన తీర్పు
చిట్టగాంగ్: బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉపాధ్యక్షుడు గైసుద్దీన్ ఖాదర్ చౌదరికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిట్టగాంగ్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను చంపేస్తానని గత ఏడాది గైసుద్దీన్ ఖాదర్ చౌదరి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ బెదిరింపు వ్యాఖ్యలపై అధికార ఆవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి నిజాముద్దీన్ ముహురీ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారించిన చిట్టాగాంగ్ కోర్టు.. ఆరోపణలు నిజమేనని రుజువుకావడంతో గత ఏడాది మే 31వతేదీన గైసుద్దీన్ అరెస్టుకు వారంట్ జారీ చేసింది. తాజాగా తుది తీర్పును వెలువరించిన ధర్మాసనం.. సాక్షాత్తూ ప్రధానమంత్రిని చంపేస్తానని బెదిరించిన గైసుద్దీన్ కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు ఐదువేల బంగ్లాదేశీ టాకాలను జరిమానాగా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. జరిమానా చెల్లించకుంటే మరో మూడు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తెలిపింది. -
మరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సోనాలి
చండీగఢ్ : టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన సోదరి, మరిదిపై సోనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తన సోదరి రుకేష్, మరిది అమన్ పుణియాలు తనను చంపుతానని బెదిరించారని సోనాలి ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. సోనాలి మంగళవారం తన స్వగ్రామం భూతాన్ కలాన్‌కు వెళ్లారు. ఆ రోజు రాత్రి పలువురు బీజేపీ నాయకులు ఆమెను కలిశారు. అలాగే సోనాలి సోదరి, మరిది కూడా అక్కడికి వచ్చారు. అక్కడ వారు సోనాలితో గొడవకు దిగారు. ఈ సమయంలో వారు తనను దూషించడంతో పాటు.. చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని సోనాలి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. సోనాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి.. విచారణ చేపడతామన్నారు. కాగా, ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అధంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన సోనాలి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
నమ్మకం ముఖ్యం
ప్రేమ గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. భిన్న నిర్వచనాలు ఉంటాయి. మరి..‘మీ దృష్టిలో ప్రేమంటే ఏం చెబుతారు?’ అన్న ప్రశ్నను వరుణ్ ధావన్ ముందు ఉంచితే...‘‘నా దృష్టిలో ప్రేమ అంటే కుటుంబ సభ్యులను ప్రేమించడం. ఏ రిలేషన్షిప్లో అయినా నిజాయతీతో పాటు నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకం దూరమైనప్పుడు ఏదో ఒక సందర్భంలో మన మనసు కచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. ఎవరైనా ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమించిన వారితో చనిపోవడానికైనా సిద్ధపడే మనస్తత్వం ఉంటుంది. కానీ అది వాస్తవంలో చాలా కష్టం’’ అని చెప్పుకొచ్చారు. తాను త్వరలో ఓ బయోపిక్‌లో నటించ బోతున్నట్లు వరుణ్ ధావన్ వెల్లడించారు. అభిషేక్‌వర్మన్ దర్శకత్వంలో వరుణ్ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘కళంక్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇక ఆయన వ్యక్తిగత విషయాలకొస్తే... తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో వరుణ్ ధావన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. -
న్యూడ్ ఫొటో షూట్: ఫొటోగ్రాఫర్‌కు బెదిరింపులు
కోల్‌కతా: వైవిధ్యంగా ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో చేసిన పని ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ప్రాణాల మీదకు తెచ్చింది. కోల్‌కతాకు చెందిన ప్రీతమ్ మిత్రా అనే ఓ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్. ఇటీవల ఓ మోడల్‌తో ఫొటోషూట్ నిర్వహించాడు. అయితే అది సాధారణ ఫొటోషూట్ అయితే ఏ సమస్య ఉండేది కాదు. కానీ మోడల్‌ను పెళ్లికూతురుగా, బెంగాల్ స్టైల్లో పెద్ద బొట్టుతో అలంకరించి న్యూడ్ ఫొటోలు తీశాడు. ఆ మోడల్ ఎవరో తెలియకుండా కళ్లు మాత్రమే కనిపించేలా తమలపాకులతో జాగ్రత్తపడ్డాడు. అలాగే ఆమె ప్రయివేట్ పార్ట్స్ కనిపించకుండా జుట్టుతో, చేతిలో కుంకుమ భరణి పెట్టి కవర్ చేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఫొటోను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో వివాదం చెలరేగింది. ఈ ఫొటో బెంగాల్ వివాహ వ్యవస్థను, హిందువులను అవమానపరిచేలా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. 24 గంటల్లో ఆ ఫొటోను.. ఆ ఫేస్బుక్ పేజీని తొలిగించకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అలాగే అతని తలను తీసుకొచ్చినవారికి బహుమానం కూడా ఇస్తామని పిలుపునిస్తున్నారు. గత వారం రోజులుగా వస్తున్న ఈ బెదిరింపులకు భయపడ్డ ప్రీతమ్ రక్షణ కల్పించాలని కోల్‌కతా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఏదో చేద్దామని చేసిన పని ప్రీతమ్‌కు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. గత ఐదేళ్లుగా ప్రీతమ్ ఫ్రొఫెషనల్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీతమ్ తీసిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో వ్యవహారం కూడా రచ్చైంది. -
చంపేస్తామని బెదిరించారు: కునికా
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణజింకల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడి, బెయిల్ పొందిన సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా ఓ చర్చా వేదికలో మాట్లాడిన తనను హతమారుస్తామని కొందరు బిష్ణోయ్ వర్గీయులు బెదిరించారని బాలీవుడ్ సూపర్‌స్టార్ సహ నటి కునికా సదానంద్ చెప్పారు. తనను బెదిరించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని సల్మాన్‌తో హమ్ సాథ్ సాథ్ హై మూవీలో నటించిన కునికా తెలిపారు. సల్మాన్‌కు మద్దతుగా నిలిచినందుకు బిష్ణోయ్ వర్గీయులు కొందరు తనను హతమారుస్తామని ఫోన్లో బెదిరించారని, అసభ్య మెసేజ్‌లు పంపారని కునికా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భద్రత కల్పించినట్టు సమాచారం. టీవీ చర్చల సందర్భంగా తాను సల్మాన్‌ను శిక్షించే బదులు బిష్ణోయ్ కమ్యూనిటీ అతడిని ఉపయోగించుకోవాలని, బెయిల్‌ను వ్యతిరేకించరాదని తాను సూచించానన్నారు. కృష్ణజింకలకు ఆహారం సమకూర్చడం, వనాలను దత్తత తీసుకోవడం వంటి కార్యకలాపాలను సల్మాన్ చేపట్టేలా చూడాలని చెప్పానన్నారు. మరో చర్చలో బిష్ణోయ్‌లు సైతం జింకలను వేటాడతారని చెప్పానన్నారు. అయితే టీవీ చర్చలో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని సంతోష్ బిష్ణోయ్ అనే వ్యక్తి తనకు కాల్ చేసి బెదిరించాడని తెలిపారు. బెదిరింపు ఫోన్‌కాల్స్ ఆగలేదని, ఫేస్‌బుక్‌లోనూ తనను వెంటాడారని, తనపై కేసు పెడతామని బెదిరించారని చెప్పుకొచ్చారు. అయితే తన ప్రకటనకు క్షమాపణలు కోరుతూ తాను ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశానని తెలిపారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన సల్మాన్‌కు ఇటీవల బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. -
డెత్ వార్నింగ్‌ను పక్కనపెట్టి..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను హతమారుస్తానని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చేసిన హెచ్చరికలను కండలవీరుడు తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. జోధ్‌పూర్‌లో ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు సల్మాన్ ఖాన్ కోర్టుకు వచ్చిన సందర్భంలో స్ధానిక గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే. బిష్ణోయ్ హెచ్చరికల నేపథ్యంలో ముంబయిలోని ఫిల్మ్ సిటీలో రేస్ 3 షూటింగ్‌ను నిలిపివేసిన పోలీసులు పటిష్ట భద్రత నడుమ ఇంటికి తీసుకువెళ్లారు. అయితే భారీ భద్రత నడుమ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి సల్మాన్ ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నట్టు తెలిసింది. అయిదు రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో సల్మాన్‌తో పాటు జాకీ, డైసీషా, అనిల్ కపూర్, బాబీ డియోల్, ఫ్రెడీ దరువలాలు పాల్గొంటారు. టైటిల్ సాంగ్ చిత్రీకరణ కోసం రూపొందించిన ప్రత్యేక సెట్లో షూట్ చేయనున్నారు. వచ్చే నెలలో చిత్ర యూనిట్ బ్యాంకాక్, దుబాయ్, అబుదాబిలో భారీ షెడ్యూల్‌కు ప్లాన్ చేసింది. -
చంపేస్తామని నటి భర్తకు ఫోన్ కాల్స్
ముంబయి: ప్రముఖ నటి ఆయేషా టకియా భర్తకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆయనను చంపేస్తామని బెదిరించారు. అయేషా టకియా ఓ హిందువు అని, లవ్ జిహాద్లో భాగంగాన ఆమెను వివాహం చేసుకున్నావని, త్వరలోనే ఆయన కుటుంబం మొత్తాన్ని హత్య చేస్తామని బెదిరించారు. ఈ మేరకు ఆయేషా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల (జులై) 21న ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్ రాగా ఆయన 26న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాజాగా మీడియాకు తెలిసింది. అయేషా టకియాను సమాజ్ వాది పార్టీ నేత అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని 2009లో వివాహం చేసుకున్నారు. వారికి మిఖెయిల్ అనే బాలుడు కూడా ఉన్నాడు. అయితే, తాజాగా పోలీసులకు చేసిన ఫిర్యాదులో హిందూ సేనకు సంబంధించిన వాళ్లే ఈ పనిచేశారని పర్హాన్ తండ్రి అబూ అజ్మీ పేర్కొన్నారు. 'మీరంతా జంతువులు. లవ్ జిహాద్ పేరిట మీరు ఓ హిందువు మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని మర్చిపోయారా? త్వరలోనే మీ కుటుంబాన్ని చంపేస్తాం. బాంబులు పెట్టి మరీ ఈ పనిచేస్తాం' అంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.