చంపేస్తామంటూ హీరో అక్షయ్కుమార్కు బెదిరింపులు | Bollywood actor Akshay Kumar receives death threats | Sakshi
Sakshi News home page

చంపేస్తామంటూ హీరో అక్షయ్కుమార్కు బెదిరింపులు

Oct 26 2013 5:17 PM | Updated on Apr 3 2019 6:23 PM

చంపేస్తామంటూ హీరో అక్షయ్కుమార్కు బెదిరింపులు - Sakshi

చంపేస్తామంటూ హీరో అక్షయ్కుమార్కు బెదిరింపులు

బెదిరింపు హెచ్చరికలతో బాలీవుడ్ ప్రముఖులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా హీరో అక్షయ్కుమార్కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానంటూ బెదిరించాడు.

బెదిరింపు హెచ్చరికలతో బాలీవుడ్ ప్రముఖులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా హీరో అక్షయ్కుమార్కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానంటూ బెదిరించాడు. ఇటీవల నిర్మాత బోనీ కపూర్, దర్శకులు కరణ్ జొహార్, రాంగోపాల్ వర్మ, గాయకుడు సోనూ నిగమ్కు కూడా ఇలాంటి హెచ్చరికలే వచ్చాయి.

అక్షయ్కు ఫోన్ చేసిన వ్యక్తి తనను గ్యాంగ్స్టర్ రవి పూజారిగా పేర్కొన్నట్టు పోలీసులు శనివారం వెల్లడించారు. తనను పనిలో నుంచి తొలగించి తప్పుచేశావని, చంపేస్తానని హెచ్చరించినట్టు తెలిపారు. కాగా ఆకతాయి ఫోన్ కాల్ అయిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంపై స్పందించేందుకు అక్షయ్ మేనేజర్ అందుబాటులోకి రాలేదు. వరుస బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులతో సమావేశం కావాలని ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ యోచిస్తున్నారు. వారికి పూర్తిగా అండగా ఉండటంతో పాటు భద్రతపై భరోసా ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement