Akshay Kumar Says Bollywood Actors Scared To Do Multi Starrer Movies - Sakshi
Sakshi News home page

Akshay Kumar: హిందీ హీరోలు అందుకు భయపడుతున్నారు: అక్షయ్‌ కుమార్‌

Published Fri, Jul 22 2022 2:26 PM | Last Updated on Fri, Jul 22 2022 4:45 PM

Akshay Kumar Says Bollywood Actors Scared To Do Multi Starrer Movies - Sakshi

అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న షోలలో 'కాఫీ విత్ కరణ్‌' టాక్‌షో ఒకటి. ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్‌లు పూర్తి చేసుకుని ఏడో సీజన్‌ను ప్రారంభించింది.

Akshay Kumar Says Bollywood Actors Scared To Do Multi Starrer Movies: అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న షోలలో 'కాఫీ విత్ కరణ్‌' టాక్‌షో ఒకటి. ప్రముఖ బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్‌లు పూర్తి చేసుకుని ఏడో సీజన్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో జులై 7 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ షోలో సినీ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడో సీజన్‌లో అలియా భట్‌-రణ్‌వీర్‌ సింగ్‌, బీ టౌన్‌ బెస్ట్ ఫ్రెండ్స్‌ జాన్వీ కపూర్‌-సారా అలీ ఖాన్‌ పాల్గొని అలరించారు. తాజాగా మూడో ఎపిసోడ్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత, యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

ఈ షోలో మల్టీస్టారర్‌ గురించి అక్షయ్‌ కుమార్‌ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. హిందీ హీరోలు మల్టీ స్టారర్‌ చిత్రాల్లో నటించడం గురించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఓర్మాక్స్ పాపులారిటీ సర్వేలో సమంత, అక్షయ్‌ కుమార్‌ మొదటి స్థానంలో ఉన్నారు. మీరిద్దరూ టాప్‌ లిస్ట్‌లో ఎలా ఉన్నారని కరణ్‌ ప్రశ్నించగా.. 'నటీనటులందరూ కష్టపడి పనిచేయడమే ఇందుకు కారణం. సాధారణంగా బాలీవుడ్‌ యాక్టర్స్‌ మల్టీ స్టారర్‌ చిత్రాలు చేయడానికి భయపడతారు. సింగిల్‌ హీరో సినిమాలకే ఎక్కవగా ప్రాధాన్యత ఇస్తారు. మరో హీరోతో కలిసి పనిచేయడంలో అభద్రతా భావం ఉంది. మీకు నచ్చిన పాత్ర తీసుకోమ్మని చెప్పినా కూడా నో చెప్పిన సందర్భాలున్నాయి. దినిని విడిచిపెట్టాలి. నేను, కరణ్‌ నిర్మిస్తున్న సినిమాలో సెకండ్‌ హీరో కావాలనుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా ఏ హీరో ఒప్పుకోలేదు' అని అక్షయ్‌ షాకింగ్‌ విషయాలు తెలిపాడు. 

చదవండి: మాజీ భార్యతో స్టార్‌ హీరో స్పెషల్‌ డిన్నర్‌.. ఫొటోలు వైరల్‌
కరీనా కపూర్‌ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్‌

కాగా ప్రస్తుతం అక్షయ్‌ కుమార్ రామ సేతు, ఓ మై గాడ్‌ 2, సెల్ఫీ, రాట్ససన్‌ రీమేక్‌, క్యూప్సూల్ ‍గిల్‌, గూర్ఖా, బడే మియాన్‌ చోటే మియాన్‌, సూరరై పోట్రు రీమేక్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement