multi starrer movies
-
ఎవరు ఊహించని విధంగా విజయ్ దళపతి మల్టీస్టారర్ సినిమా
-
టాలీవుడ్ లో మల్టీస్టారర్ హవా
-
బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్
Akshay Kumar Says Bollywood Actors Scared To Do Multi Starrer Movies: అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న షోలలో 'కాఫీ విత్ కరణ్' టాక్‌షో ఒకటి. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుని ఏడో సీజన్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోలో సినీ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడో సీజన్లో అలియా భట్-రణ్వీర్ సింగ్, బీ టౌన్ బెస్ట్ ఫ్రెండ్స్ జాన్వీ కపూర్-సారా అలీ ఖాన్ పాల్గొని అలరించారు. తాజాగా మూడో ఎపిసోడ్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ షోలో మల్టీస్టారర్ గురించి అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. హిందీ హీరోలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓర్మాక్స్ పాపులారిటీ సర్వేలో సమంత, అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో ఉన్నారు. మీరిద్దరూ టాప్ లిస్ట్‌లో ఎలా ఉన్నారని కరణ్ ప్రశ్నించగా.. 'నటీనటులందరూ కష్టపడి పనిచేయడమే ఇందుకు కారణం. సాధారణంగా బాలీవుడ్ యాక్టర్స్ మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి భయపడతారు. సింగిల్ హీరో సినిమాలకే ఎక్కవగా ప్రాధాన్యత ఇస్తారు. మరో హీరోతో కలిసి పనిచేయడంలో అభద్రతా భావం ఉంది. మీకు నచ్చిన పాత్ర తీసుకోమ్మని చెప్పినా కూడా నో చెప్పిన సందర్భాలున్నాయి. దినిని విడిచిపెట్టాలి. నేను, కరణ్ నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో కావాలనుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా ఏ హీరో ఒప్పుకోలేదు' అని అక్షయ్ షాకింగ్ విషయాలు తెలిపాడు. చదవండి: మాజీ భార్యతో స్టార్ హీరో స్పెషల్ డిన్నర్.. ఫొటోలు వైరల్ కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్ కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ రామ సేతు, ఓ మై గాడ్ 2, సెల్ఫీ, రాట్ససన్ రీమేక్, క్యూప్సూల్ గిల్, గూర్ఖా, బడే మియాన్ చోటే మియాన్, సూరరై పోట్రు రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. -
ఒక్క సిన్మాలోనే ఇద్దరు హీరోలు.. ఆ కిక్కే వేరప్పా!!
ఒక స్టార్ హీరోను తెరపై చూస్తేనే... అభిమానులు ఆగలేరు. ఇక ఇద్దరు హీరోలు కలిసి ఒకే తెరను పంచుకుంటే.. దానికొచ్చే కిక్కే వేరప్ప. గెస్ట్ అప్పియరెన్స్‌గా ఒక హీరో సినిమాలో మరో హీరో కనిపిస్తేనే ఆ సినిమాకు ఎక్కడాలేని హైప్ వస్తుంది. అలాంటిది ఇద్దరు స్టార్లను కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలకు స్కోప్ ఎక్కువగానే ఉండేది. మారిన పరిస్థితులు, అభిమానుల తీరుతో టాలీవుడ్లో మల్టీస్టారర్ అనే కాన్సెప్ట్ కొంతకాలం పాటు కనుమరుగైంది. ఎన్టీఆర్-ఏఎన్నార్, కృష్ణ-శోభన్ బాబులు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలను చేశారు. అయితే 90వ దశకాన్ని ఏలిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు మాత్రం మల్టీస్టారర్ మూవీస్‌ను చేయలేకపోయారు. ఇక ముందు చేస్తారేమో చెప్పలేం. ఆ నలుగురు హీరోల్లో ఇద్దరు మాత్రం పంథా మార్చుకుని మల్టీస్టారర్ సినిమాలకు ఓకే చెబుతున్నారు. మల్టిస్టారర్ మూవీస్ అంటే ముందుగా వెంకటేష్ వైపు చూస్తున్నారు దర్శకులు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మొదలైన మల్టీస్టారర్ హవా.. మళ్లీ మెల్లగా ఊపందుకుంటోంది. వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా చేసిన ఈ సినిమా విజయవంతమైంది. ఆ తరువాత వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబోలో గోపాల గోపాల మూవీ వచ్చింది. అది కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ల జోరు కొనసాగుతోంది. నాగార్జున కూడా మరో హీరోతో తెరను పంచుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కార్తీతో కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించిన నాగ్.. ప్రస్తుతం నానితో కలిసి ‘దేవదాస్’ సినిమాను చేస్తున్నారు. వెంకటేష్-నాగచైతన్య కలిసి ‘వెంకీ మామ’, వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబోలో ‘ఎఫ్2’, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. నితిన్-శర్వానంద్ మల్టీస్టారర్ కూడా రాబోతున్నట్లు సమాచారం. ఇక రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ టాలీవుడ్లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాలి. మెగా-నందమూరి అభిమానులను సంతృప్తిపరిచేలా జక్కన్న కథను సిద్ధం చేయిస్తున్నట్లు వినికిడి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో తెరకెక్కించే ఈ మల్టీస్టారర్‌ను జాతీయ స్థాయిలో రూపొందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీ అనగానే రాజమౌళి రూపోందించే ఈ సినిమా వైపే చూస్తున్నారు సినీజనాలు. బాహుబలి తర్వాత జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-రామ్‌చరణ్ కాంబోలో సినిమా ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. ఇప్పటికే ఈ సినిమా కథపై రకరకాల పుకార్లు వస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ భారీ మల్టీస్టారర్ సినిమా తరువాత టాలీవుడ్లో మరిన్ని సినిమాలు రావొచ్చని, రావాలని కోరుకుంటూ.. తెలుగు సినీ పరిశ్రమ స్థాయి ఇంకా పెరగాలని ఆశిద్దాం. - బండ కళ్యాణ్ -
విజయ్ ఫుల్ బిజీ
సాక్షి, చెన్నై : మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు విజయ్‌సేతుపతి. సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న ఈయన మల్టీస్టారర్ చిత్రాల్లోనూ నటించేస్తున్నారు. మరో పక్క తెలుగులోనూ సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవితో కలిసి ముఖ్య కథాపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రంలో ఆయనకు విలన్‌గా మారనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ చిత్రం సెక్క సివంత వానం చిత్రంతో పాటు 10 చిత్రాలకు పైగా ఈయన చేతిలో ఉన్నాయి. మరో పక్క నిర్మాతగానూ చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈయన గ్యాంగ్‌స్టర్‌గా నటించి నిర్మిస్తున్న జుంగా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మరో చిత్రానికి విజయ్‌సేతుపతి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. దర్శకుడు ఎస్పీ.జననాథన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు ఈయన దర్శకత్వంలో ఆర్యతో కలిసి పొరంబోకు చిత్రంలో విజయ్‌సేతుపతి నటించారు. ఈ చిత్రం విడుదలై మూడేళ్లు కావస్తున్నా జననాథన్ మరో చిత్రం చేయలేదు. తాజాగా విజయ్‌సేతుపతి కాల్షీట్స్ ఇవ్వడంతో ఆయన షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇయర్కై, జయంరవి హీరోగా పేరాణ్మై వంటి సామాజిక అంశాలతో కూడిన కథా చిత్రాలను తెరకెక్కించిన జననాథన్ విజయ్‌సేతుపతి హీరోగా చేసే చిత్రం సామాజికక ఇతివృత్తంతోనే కూడి ఉంటుందట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఆ క్షణంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను!
ప్రతిభ, అదృష్టం... ఈ రెండూ తోడైతే నాని. ప్రస్తుత పరిస్థితుల్లో గాడ్‌ఫాదర్ లేకుండా సినీరంగంలో ఎదగడం తేలికైన విషయం కాదు. కానీ, నాని ఎదిగి చూపించాడు. సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టి, హీరోగా టర్న్ తీసుకొని, ఇప్పుడు నిర్మాత స్థాయికి చేరుకున్నాడు. ‘‘నేనింకా చేరుకోవాల్సిన విజయ తీరాలు చాలా ఉన్నాయి’’ అంటున్నారు నాని. సిరాజ్ కల్లా దర్శకత్వంలో రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె.లతో కలిసి నాని నిర్మించిన ‘డి ఫర్ దోపిడి’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నానితో జరిపిన సంభాషణ. ఉన్నట్టుండి నిర్మాతగా మారారేంటి? వాయిస్ ఓవర్ చెబుతున్నప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చూశాను. ఆసక్తికరంగా అనిపించాయి. మొత్తం సినిమా చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈ టీమ్‌లో నేనూ ఒకణ్ణి ఎందుకు కాలేకపోయానా అనిపించింది. అనుకోకుండా ఈ సినిమా నిర్మాతలు నన్ను కూడా వారి టీమ్‌లోకి ఆహ్వానించారు. అలా నిర్మాతల్లో నేనూ ఒకణ్ణి అయిపోయాను. ఇక ముందు కూడా నిర్మాతగా కొనసాగుతారా? సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకూ జరిగే ప్రాసెస్ అంతా నాకు తెలుసు. అయితే... ఆ తర్వాత జరిగే ప్రాసెస్ నాకు తెలీదు. నిర్మాతగా మారాక, ఇప్పుడు తెలుస్తోంది. సినిమా పూర్తవ్వడం ఒక ఎత్తయితే... దాన్ని థియేటర్లకు పంపడం ఒక ఎత్తు అని. ఈ అనుభవం నిర్మాతగా కొనసాగడానికే ఉపయోగపడుతుందంటే నేనొప్పుకోను. నటుడికి కూడా అవసరమే. మరి మీ ‘పైసా’ సినిమా విడుదల విషయంలో కూడా ఇలాగే సహకరించొచ్చుగా? నేను ‘పైసా’ లాంటి సినిమాలో హీరోగా చేసే స్థాయికి ఎదిగానేమో కానీ, ‘పైసా’ లాంటి సినిమాను నిర్మించే స్థాయికి ఎదగలేదు. అది చాలా పెద్ద సినిమా. ఇంతకీ ‘పైసా’ విడుదల ఎప్పుడు? త్వరలోనే. అయితే, ఒక్కటి మాత్రం నిజం. ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా విజయం మాత్రం ఖాయం. నేను కృష్ణవంశీగారి అభిమానిని. కానీ.. ‘పైసా’ నిర్మాణం టైమ్‌లో ఆయనతో చాలా విషయాల్లో వాదన పెట్టుకునేవాణ్ణి. అందులో కొన్ని సీన్స్, ఇందులో కొన్ని సీన్స్ తీసుకుని సినిమా తయారు చేస్తున్నారని ఏవేవో అనేశాను. కానీ.. సినిమా మొత్తం చూశాక తెలిసింది కృష్ణవంశీగారంటే ఏంటో. నేను నమ్మకంగా చెప్పేదొక్కటే. కృష్ణవంశీగారి కెరీర్లో ‘ఖడ్గం’ ఎంత గొప్ప సినిమానో, ఇదీ అంతటి గొప్ప సినిమా. మీ ద్వారా యశ్‌రాజ్ సంస్థ దక్షిణాదికి ప్రవేశించడం ఎలా ఉంది? ఈ సినిమాకు ‘ఆహా కళ్యాణం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పనిమీద ముంబయ్‌లోని యశ్‌రాజ్ స్టూడియోకి వెళ్లాను. అక్కడ వరుసగా మేకప్ రూమ్స్‌పై షారుఖ్ అనీ, సల్మాన్ అనీ, ఆమిర్ అనీ, దీపికా పదుకొనే అనీ... ఇలా ఆర్టిస్టుల పేర్లు రాసున్నాయి. వాటిని చూసుకుంటూ వెళ్తుంటే చివర్లో ‘నాని’ అని నా పేరు రాసుంది. తమ సంస్థలో నటించిన హీరోల ఫొటోలను కూడా వారు వరుసగా అమర్చారు. వాటిలో నా ఫొటో కూడా ఉంది. ఆ క్షణంలో నేను పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. ‘ఆహా కల్యాణం’ దర్శకుడు గోకుల్ తమిళుడవ్వడంతో ఈ సినిమాను తమిళంలోనే తెరకెక్కించారు. కొన్ని కీలక సన్నివేశాలు మాత్రం తెలుగులో రీషూట్ చేశారు. కానీ ఆర్టిస్టులు మాత్రం దాదాపుగా అందరూ కొత్తవారే. శేఖర్‌కమ్ముల సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. వాణీకపూర్ కథానాయిక. ‘బ్యాండ్ బాజా బారత్’ రీమేక్ కదా. మరి ఇందులో లిప్ లాక్‌లు ఉంటాయా? అంతా ఇప్పుడే చెప్పేస్తే ఎలా. ఆ సినిమా గురించి మాట్లాడే రోజులు ముందున్నాయి. లిప్ లాక్‌లు ఎన్ని ఉన్నాయి? అవి ఎంత సేపు ఉంటాయి? అవన్నీ అప్పుడు చెబుతా (నవ్వుతూ). కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారా? మా అక్కయ్య యూఎస్‌లో ఉంటోంది. తన దగ్గరకు వెళ్లాలని ఎప్పుట్నుంచో అనుకుంటున్నా కుదరట్లేదు. ఈసారి అక్కడే న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకుంటా. ఇరవై రోజుల్లో తిరిగొచ్చాక... అప్పుడు కొత్త సినిమాల గురించి ఆలోచిస్తా. మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా? ఎందుకు చేయను. కాకపోతే.. మల్టీస్టారర్స్ అంటే ఇక్కడ పాత్రల పరిధుల్నే చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పాత్రలు సమానంగా ఉండనక్కర్లేదు. ఓ పాత్ర తక్కువగా ఉన్నా... అది కథను ప్రభావితం చేసేలా ఉంటే చాలు, అదే గొప్ప మల్టీస్టారర్ అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో జరుగుతోంది అదే. పెద్ద పెద్ద హీరోలే అక్కడ అలా వచ్చి ఇలా మాయమయ్యే పాత్రలు చేస్తున్నారు. అలాంటి మంచి కథ దొరికితే... మల్టీస్టారర్ చేయడానికి నేను రెడీ. కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా. వైవాహిక జీవితం ఎలా ఉంది? పెళ్లి విషయంలో లేట్ చేయకుండా 27 ఏళ్లకే చేసేసుకున్నా. అందుకే మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంది. పిల్లల్ని ఇప్పుడే వద్దనుకుంటున్నాం. దానికి కాస్త టైమ్ కావాలి.