విజయ్‌ ఫుల్‌ బిజీ | VIjay Sethupathi Busy With His Projects | Sakshi
Sakshi News home page

Published Mon, May 7 2018 9:13 AM | Last Updated on Mon, May 7 2018 9:13 AM

VIjay Sethupathi Busy With His Projects - Sakshi

సాక్షి, చెన్నై :  మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు విజయ్‌సేతుపతి. సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్న ఈయన మల్టీస్టారర్‌ చిత్రాల్లోనూ నటించేస్తున్నారు. మరో పక్క తెలుగులోనూ సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవితో కలిసి ముఖ్య కథాపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రంలో ఆయనకు విలన్‌గా మారనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం సెక్క సివంత వానం చిత్రంతో పాటు 10 చిత్రాలకు పైగా ఈయన చేతిలో ఉన్నాయి. మరో పక్క నిర్మాతగానూ చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈయన గ్యాంగ్‌స్టర్‌గా నటించి నిర్మిస్తున్న జుంగా చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా మరో చిత్రానికి విజయ్‌సేతుపతి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం.

దర్శకుడు ఎస్‌పీ.జననాథన్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు ఈయన దర్శకత్వంలో ఆర్యతో కలిసి పొరంబోకు చిత్రంలో విజయ్‌సేతుపతి నటించారు. ఈ చిత్రం విడుదలై మూడేళ్లు కావస్తున్నా జననాథన్‌ మరో చిత్రం చేయలేదు. తాజాగా విజయ్‌సేతుపతి కాల్‌షీట్స్‌ ఇవ్వడంతో ఆయన షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇయర్కై, జయంరవి హీరోగా పేరాణ్మై వంటి సామాజిక అంశాలతో కూడిన కథా చిత్రాలను తెరకెక్కించిన జననాథన్‌ విజయ్‌సేతుపతి హీరోగా చేసే చిత్రం సామాజికక ఇతివృత్తంతోనే కూడి ఉంటుందట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement