చెన్నై: ప్రముఖ తమిళ నటుడు జయశీలన్ (40) అనారోగ్యంతో మరణించారు. రెండు నెలల క్రితం కామెర్ల వ్యాధితో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జయశీలన్.. విజయ్‌తో బిగిల్, తేరి, ధనుష్‌తో పుదుపేట్టై, విజయ్ సేతుపతితో విక్రమ్ వేద సినిమాల్లో నటించారు.
తన కెరీర్‌లో వందకు పైగా సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలన్న కోరికతో చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ పోయారు. కానీ ఆయన టాలెంట్‌కు తగ్గ గుర్తింపు రాలేదు. ఈయన విజయ్ సేతుపతికి మంచి స్నేహితుడని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment