![Akshay Kumar Gets Injured While Performing Action Sequence In Scotland - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/24/Akshay%20Kumar01.jpg.webp?itok=ARn_0xC3)
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ గాయపడ్డారు. షూటింగ్ సెట్‌లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా అనుకోకుండా అక్షయ్‌కు గాయమైంది. ప్రస్తుతం అక్షయ్ స్కాట్లాండ్‌లో బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో భాగంగా హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి స్టంట్ సీన్ చేస్తుండగా అక్షయ్ మోకాలికి గాయమైంది.
అయినప్పటికీ అక్షయ్ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించడం విశేషం. గాయం తీవ్రత అంతగా లేకపోవడంతో కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు సమాచారం.
కాగా టైగర్ జిందా హై, సుల్తాన్ వంటి పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్, టైగర్‌లతో పాటు సోనాక్షి సిన్హా ఇందులో నటిస్తుంది. ఇటీవలె ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు మూవీ టీం స్కాట్లాండ్‌కు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment