'మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం..' బాలీవుడ్‌ మూవీ టీజర్‌ చూశారా? | Akshay Kumar Bade Miyan Chote Miyan Telugu Teaser Released | Sakshi
Sakshi News home page

Bade Miyan Chote Miyan: తెలుగులో రిలీజ్‌ కానున్న అక్షయ్‌ కుమార్‌ కొత్త సినిమా.. టీజర్‌ చూశారా?

Published Thu, Jan 25 2024 1:02 PM | Last Updated on Thu, Jan 25 2024 1:34 PM

Akshay Kumar Bade Miyan Chote Miyan Telugu Teaser Released - Sakshi

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యాక్షన్‌ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. ఇందులో అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌లో రిలీజ్ డేడ్‌ను కూడా ప్రకటించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్‌లో బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కానుంది.

టీజర్‌ రిలీజ్‌
గురువారం ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్‌తో టీజర్‌ మొదలైంది. "ప్రళయం రాబోతోంది.. ఆ మహా ప్రళయం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను మార్చేస్తుంది... ఆ మహా ప్రళయం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణలను శాశ్వతంగా నిర్ములిస్తుంది. హిందుస్తాన్‌ నాశనమైపోతుంది. మమ్మల్నెవరు ఆపుతారు? అన్న డైలాగ్‌ వినిపిస్తుంది.

మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం..
సరిగ్గా అ‍ప్పుడే రంగంలోకి దిగిన ఇద్దరు హీరోలను చూపిస్తారు. 'సైనికుడి వీరత్వం, సైతాన్‌ క్రూరత్వం మా సొంతం. మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం' అనే డైలాగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. ఈ సినిమాకు ఏక్ థా టైగ‌ర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement