షూటింగ్‌ సెట్‌లో ప్రమాదం.. స్టార్ నటుడికి గాయాలు! | Bollywood actor Suniel Shetty injured severely on Hunter set | Sakshi
Sakshi News home page

Suniel Shetty: ఫైట్ యాక్షన్‌ సీక్వెన్స్‌.. సునీల్ శెట్టికి గాయాలు!

Published Thu, Nov 7 2024 4:04 PM | Last Updated on Thu, Nov 7 2024 4:15 PM

Bollywood actor Suniel Shetty injured severely on Hunter set

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న హంటర్‌ వెబ్ సిరీస్‌ సెట్స్‌లో గాయపడినట్లు సమాచారం. ఓ ఫైట్ సీక్వెన్స్‌ చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ సన్నివేశంలో ఒక చెక్క లాగ్‌ అనుకోకుండా ఆయన పక్కటెముకలకు  తగిలిందని తెలిపారు. ఈ సంఘటనతో  ముంబయిలో జరుగుతున్న షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.

అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే సునీల్ శెట్టికి వైద్యచికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని సునీల్ శెట్టి సైతం ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నాకు చిన్న గాయం మాత్రమే తగిలిందని.. ప్రస్తుతం బాగానే ఉన్నానని పోస్ట్ చేశారు. దయచేసి ఎవరూ కూడా ఆందోళనకు గురికావద్దని అభిమానులను కోరారు. మీ అందరి ప్రేమ, అభిమానాలకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు.

కాగా.. హంటర్ వెబ్ సిరీస్‌ను ముంబయిలోని అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆయన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా డియోల్, బర్ఖా బిష్త్, కరణ్వీర్ శర్మ, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత వెల్‌కమ్‌ టు ది జంగిల్‌ అనే చిత్రంలో నటించనున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, దిశా పటానీ, సంజయ్ దత్లాంటి ‍స్టార్స్‌ కూడా ఉన్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement