బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తోన్న తాజా చిత్రం సింగం-3. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా అజయ్ దేవగణ్ గాయపడినట్లు తెలుస్తోంది. పొరపాటున అజయ్ కంటికి గాయమైనట్లు సమాచారం. అయినప్పటికీ అజయ్ దేవగణ్ వెంటనే షూటింగ్‌ని తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా.. ఇటీవలే సింగం-3 చిత్రంలో అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో కరీనా, దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు టాలీవుడ్ హీరో మూవీ పుష్ప-2 కూడా రిలీజ్ కానుంది. దీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. కాగా.. గతంలో రిలీజైన సింగం, సింగం రిటర్న్స్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. మరోవైవు అజయ్ దేవగన్ బోనీ కపూర్ నిర్మిస్తోన్న మైదాన్‌లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment