Rakshit Shetty
-
రక్షిత్ శెట్టికి చుక్కెదురు.. భారీ మొత్తంలో డిపాజిట్ కోరిన కోర్టు
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టికి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెళ్లడించింది. ఈమేరకు రూ. 20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో తమ పాటలను అనుమతి లేకుండా రక్షిత్ శెట్టి కాపీ కొట్టారని MRT మ్యూజిక్‌లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కన్నడలో మంచి విజయం అందుకున్న ఈ సినిమాను పరంవా స్టూడియోపై రక్షిత్ నిర్మించారు.రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ఉపయోగించారని MRT మ్యూజిక్ సంస్థ ఫిర్యాదు చేసింది. కాపీరైట్ అనుమతులు లేకుండానే ఇలాంటి చర్యలకు పాల్పడిన రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. అయితే, రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఢిల్లీ కోర్టు దానిని తొసిపుచ్చింది. ఆపై రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలంటూ రక్షిత్ శెట్టిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆ పాటలను తొలగించాలని సూచించింది. పలు కారణాల వల్ల రక్షిత్ శెట్టి ఢిల్లీ కోర్టుకు హాజరు కాలేదు. -
రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ సినిమాలో తమ పాటలను కాపీ కొట్టారని MRT మ్యూజిక్‌లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకున్న బ్యాచిలర్ పార్టీలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీని అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ఉపయోగించారని MRT మ్యూజిక్ సంస్థ ఫిర్యాదు చేసింది. కాపీరైట్ అనుమతులు లేకుండానే ఇలాంటి చర్యలకు పాల్పడిన రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోపై యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, రక్షిత్ శెట్టి ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. కానీ, 61వ సెషన్స్ కోర్టులో నేడు విచారణ జరగగా బుధవారానికి వాయిదా వేసింది. విచారణ అనంతరం ముందస్తు బెయిల్ గురించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. -
సినీ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తను హీరోగా నటించి నిర్మించిన 'బ్యాచిలర్ పార్టీ' సినిమా వల్ల ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీని అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.'బ్యాచిలర్ పార్టీ' చిత్రంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నారు. తన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియో ద్వారా ఈ మూవీని నిర్మించారు. అయితే, రక్షిత్ శెట్టిపై MRT మ్యూజిక్‌లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు. రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో కాపీరైట్ అనుమతులు లేకుండానే తమ పాటలను ఉపయోగించారని ఫిర్యాదుదారు ఆరోపించారు. న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను ‘బ్యాచిలర్ పార్టీ’లో రక్షిత్ శెట్టి కాపీ కొట్టారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ వివాదంపై హీరో రక్షిత్ శెట్టి ఇంకా స్పందించలేదు. సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, సైడ్-బి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకున్న రక్షిత్ శెట్టి తన టీమ్‌తో సదరు మ్యూజిక్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఏడు ఎపిసోడ్లుగా ఏకం.. ట్రైలర్ చూశారా?
ప్రకాశ్ రాజ్, రాజ్ బి శెట్టి, షైన్ శెట్టి, మానసి సుధీర్, ప్రకాశ్ తుమినడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ఏకం. ఇందులో ఏడుగురి జీవితాలను ఏడు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదుగురు దర్శకులు పని చేశారు. సుమంత్ భట్, స్వరూప్ ఎలమొన్, సనల్ అమన్, శంకర్ గంగాధరన్, వివేక్ వినోద్ దర్శకత్వం వహించారు. వీరిలో సనల్, వివేక్ మినహా మిగతా ముగ్గురూ స్క్రీన్‌ప్లే అందించారు. ఈ స్క్రీన్‌ప్లేకు జీఎస్ భాస్కర్ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. ఈ సిరీస్ జూలై 13న ఏకం ద సిరీస్ (https://www.ekamtheseries.com/) వెబ్సైట్లో విడుదల కానుంది.భావోద్వేగాల సమ్మేళనంఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమ, భయం, ధైర్యం, బాధ.. ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌ను రంగరించారు. ఎంతో సహజసిద్ధంగా కనిపిస్తున్న ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యుంటే ఎక్కువమంది చూసే ఆస్కారం ఉండేది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ సిరీస్‌ను తిరస్కరించడంతో మరో అవకాశం లేక సొంత ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.పట్టించుకోని ఓటీటీలుఈ విషయాన్ని కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించాడు. '2020 జనవరిలో ఏకం ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది. 2021 అక్టోబర్‌లో ఫైనల్ కట్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ అద్భుతమైన సిరీస్‌ను ప్రపంచానికి చూపించాలని ఆరాటపడ్డాను. కానీ ఎంత ఎదురుచూసినా, ప్రయత్నించినా ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఏకం తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే మా సొంత ప్లాట్ఫామ్లోనే దీన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు' అని ట్వీట్ చేశాడు. Presenting #EKAM – with love, from us to you! 🤗Join the waitlist now!🔗 https://t.co/PFMuw92M13 @ParamvahStudios @teamjourneyman #SumanthBhat @sandeep_ps5 @AaronMac05 @prakashraaj @RajbShettyOMK @ShineShetty_ @worldofekam @definestudio_ pic.twitter.com/e6DCwAj7tD— Rakshit Shetty (@rakshitshetty) June 17, 2024చదవండి: అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో? -
OTTకి బదులుగా రక్షిత్ శెట్టి కొత్త ప్లాన్.. జులైలో 'ఏకం' విడుదల
777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ విడుదల కానుంది. ఈ సీరిస్‌ను విడుదల చేసేందుకు సుమారు 3 ఏళ్ల నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ ఓటీటీ వేదికలు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో రక్షిత్ శెట్టి ఒక సొంత ప్లాట్‌ఫామ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.ఏడు కథలతో ఏకం వెబ్ సీరిస్‌ను మేకర్స్ నిర్మించారు. జులై 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్కు రానుంది. అయితే, ఈ చిత్రాన్ని చూసేందుకు www.ekamtheseries.com వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.149 చెల్లించి ఏకం వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. ఇదే విషయాన్ని రక్షిత్ శెట్టి అధికారికంగా ప్రకటించారు.రక్షిత్ శెట్టి నిర్మించిన ఏకం వెబ్ సిరీస్‌లో ప్రకాశ్ రాజ్, షైన్ శెట్టి వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఏకం వెబ్ సిరీస్ కన్నడలో మాత్రం అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌ను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకోకపోవడంతోనే ఇలా సొంతంగా ఒక వెబ్సైట్ ద్వారా విడుదల చేస్తున్నట్లు రక్షిత్ శెట్టి తెలిపాడు. చూడాలనే ఆసక్తి ఉన్నవారు జులై 13 నుంచి రూ.149 చెల్లించి ఏకం ప్రపంచంలోకి అడుగుపెట్ట వచ్చు.Presenting #EKAM – with love, from us to you! 🤗Join the waitlist now!🔗 https://t.co/PFMuw92M13 @ParamvahStudios @teamjourneyman #SumanthBhat @sandeep_ps5 @AaronMac05 @prakashraaj @RajbShettyOMK @ShineShetty_ @worldofekam @definestudio_ pic.twitter.com/e6DCwAj7tD— Rakshit Shetty (@rakshitshetty) June 17, 2024 -
చార్లి గుర్తుందా.. ఇన్నేళ్ల తర్వాత అంటూ వీడియో షేర్ చేసిన రక్షిత్
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ '777 ఛార్లి'. చిన్న చిత్రంగా 2022లో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా డాగ్ లవర్స్‌ను ఆకట్టుకుంది. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ కన్నడ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. ఈ చిత్రానికి రక్షిత్ శెట్టితో పాటు మరో ప్రధాన హీరో ఛార్లీనే.. ఛార్లీ పాత్రలో తెరపై కనిపించేది ఒక శునకమే అయినా.. సినిమా చూస్తున్నంతసేపు చాలామంది దానికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అందుకోసం చార్లికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కొన్ని సీన్ల కోసం పదుల సంఖ్యలో టేకులు తీసుకోవాల్సి వచ్చిందని చిత్ర రచయిత, దర్శకుడు కిరణ్ రాజ్ గతంలో తెలిపారు. కానీ ఆ డాగ్ మాత్రం చిత్ర యూనిట్ మొత్తాన్ని మెప్పించిందని ఆయన తెలిపారు.తాజాగా డాగ్ చార్లిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు రక్షిత్ శెట్టి. లేటు వయసులో 6 అందమైన పిల్లలకు చార్లి జన్మనిచ్చిందని ఆయన తెలిపారు. వాటిని చూసేందుకే తాను మైసూర్ వచ్చానని ఒక వీడియో ద్వారా రక్షిత్ చెప్పారు. చార్లి మొదటిసారి తల్లి అయినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి చార్లి వయసు కూడా చాలా ఎక్కువ. తను ఎప్పుడు పిల్లలకు జన్మనిస్తుందని తామందరం ఎంతగానో ఎదరుచూశామని రక్షిత్ తెలిపారు. ఫైనల్లీ ఇన్నేళ్లకు తామందరిలో చార్లి సంతోషాన్ని నింపిందని ఆయన అన్నారు. చార్లికి ఇక సంతానం కలగదేమోనని అనుకున్నట్లు ఆయన అన్నారు. అయితే, లేటు వయసులో చార్లికి సంతానం కలగడం చాలా సంతోషాన్ని కలిగించిందని రక్షిత్ తెలిపారు. ట్రైనర్ ప్రమోద్ ఇంట్లో మే 09న 6 పిల్లలకు చార్లి జన్మనిచ్చింది. అందులో 5 ఫిమేల్,1 మేల్ పప్పీలు ఉన్నాయి. రక్షిత్ శెట్టి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rakshit Shetty (@rakshitshetty) -
ఓటీటీలో సడెన్‌గా మాయమైన హిట్ సినిమా.. కారణం ఇదేనా
కన్నడ హిట్ సినిమా ‘సప్త సాగరాలు దాటి సైడ్- బీ’ ఓటీటీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో తొలగించేసింది. కన్నడ నటులు రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది. గతేడాది నవంబరు 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సడెన్‌గా తొలగించింది. ‘సప్త సాగరాలు దాటి సైడ్- ఏ’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం కన్నడతో పాటుగా టాలీవుడ్లో కూడా మంచి ఆదరణ పొందింది. సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, సైడ్-బీ రెండు చిత్రాలు ఇంతవరకు అమెజాన్ ప్రైమ్‌లోనే స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే సప్త సాగరాలు దాటి సైడ్- బీ ఓటీటీలో సడెన్‌గా మాయమైంది. చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ అందుబాటులో లేకపోవడంతో సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రైమ్ వీడియో నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. 'సప్త సాగరాలు దాటి' సీక్వెల్ చిత్రాలకు హీరో రక్షిత్ శెట్టి నిర్మాతగానూ ఉన్నారు. ఈ రెండు చిత్రాల శాటిలైట్ హక్కులను జీ5 నెట్వర్క్ కూడా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని బిజినెస్ డీల్స్ వల్ల మొదట అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, సైడ్-బీ చిత్రాన్ని మాత్రం 'జీ5' ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు టాక్. అందుకే సైడ్ -బీ చిత్రం ప్రైమ్ వీడియోలో తొలగించారని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సప్త సాగరాలు దాటి సైడ్- ఏ మాత్రమే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ మూవీ.. ఆ భాషలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇది ఓటీటీలోకి మూవీ లవర్స్‌ని నవ్వించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎలాంటి హడావుడి లేకుండా ఇచ్చేశారు. దీంతో ఓటీటీ ప్రేమికులు అలెర్ట్ అయిపోయారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? ఓటీటీల హవా పెరిగిన తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల కోసమా అన్నట్లు కన్నడ హిట్ మూవీ 'బ్యాచిలర్ పార్టీ' ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయింది. జనవరి 26న థియేటర్లకి వచ్చిన ఈ చిత్రం.. సోమవారం నుంచి అంటే మార్చి 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.అంటే ఈ రోజు అర్థరాత్రే. అలానే ఓటీటీలో రిలీజ్ విషయాన్ని కూడా కొన్ని గంటల ముందు మాత్రమే చెప్పారు. అంటే సడన్ స్ట్రీమింగ్ అన్నట్లే. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) మరోవైపు ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంది. భార్య-భర్త మధ్య ఉండే చిన్న సమస్యలతో కామెడీ పుట్టించినట్లు తెలుస్తోంది. అలానే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బ్యాంకాక్‌లో చేసిన సందడి కూడా బాగానే ఉంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అనేది కేవలం కన్నడ వరకే ఉంటుందా? తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. 'బ్యాచిలర్ పార్టీ' కథ విషయానికొస్తే.. సంతోష్ (దిగంత్ మైకేల్) సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. పెళ్లి కూడా అయ్యింటుంది. కానీ భార్య సంధ్య(సిరి రవికుమార్) వల్ల జీవితంలో సంతోషం అనేదే ఉండదు. పార్టీలు కూడా చేసుకోనివ్వకుండా ఆఫీస్ తర్వాత నేరుగా ఇంటికొచ్చేయాలనే టైప్. అలాంటి సంతోష్ అనుకోకుండా ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో తన పాత ఫ్రెండ్ మ్యాడీ (యోగా), పీటీ సర్ (అచ్యుత్ కుమార్)ని కలుస్తాడు. ఆ తర్వాత వీళ్లు ముగ్గురు కలిసి బ్యాంకాక్ వెళ్తారు. చివరకు ఏమైంది? ఈ జర్నీలో ఏం తెలుసుకున్నారు? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నిజమెంత అనేది పక్కనబెడితే కొందరి జీవితాలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వారిలో రష్మిక ఒకరు. ఎందుకంటే సొంతభాష కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఏమైందో ఏమో గానీ పెళ్లి జరగలేదు. తాజాగా రష్మిక గురించి మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి మాట్లాడాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక.. ఈ మధ్య 'యానిమల్' చిత్రంతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈమె చేతిలో 'పుష్ప 2', 'రెయిన్ బో', 'గర్ల్ ఫ్రెండ్' లాంటి చిత్రాలున్నాయి. సరే సినిమాల సంగతి పక్కనబెడితే ఈమె గురించి మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పలు వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో రష్మికతో ఎంగేజ్మెంట్, పెళ్లి ఆగిపోవడం గురించి తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రక్షిత్ శెట్టి.. 'తమ పెళ్లి ఆగితే ఏంటి? తామిద్దరం ఇప్పటికే టచ్‌లోనే ఉన్నాం. రష్మికకు జీవితంలో పెద్ద డ్రీమ్ ఉండేది. ఇప్పుడు దాన్ని సాకారం చేసుకుంది' అని చెప్పుకొచ్చాడు. ఈ మాటల బట్టి చూస్తుంటే.. ప్రేమికులుగా విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్‌గా రష్మిక-రక్షిత్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారనమాట. (ఇదీ చదవండి: ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్) -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ఆ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ’. హేమంత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ రావడంతో సీక్వెల్‌గా సప్త సాగరాలు దాటి - సైడ్ బి తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 17న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై రక్షిత్ శెట్టి తాజాగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. కథేంటంటే..? డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ. -
మాస్ హీరో కోసం 'సప్త సాగరాలు' దాటి వచ్చేస్తున్న వైరల్ బ్యూటీ
సినిమా ప్రపంచంలోకి కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు... భాష ఏదైనా కానివ్వండి తమ వద్ద టాలెంట్ ఉంటే చాలు ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్‌ఉ చేరుకుంటారు. ఆపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. అలాంటి స్టార్ల జాబితాలోకి తాజాగా ఓ కన్నడ ముద్దుగుమ్మ చేరింది. ఆమె పేరు రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమాలో నటించింది. ఆపై తెలుగు వారికి కూడా తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే సినిమాలపై అభిమానం పెంచుకుంది. దీంతో లండన్ వెళ్లి యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చింది. కన్నడ నుంచి రెండు సినిమాల్లో నటించినా 'సప్త సాగరాలు దాటి' చిత్రం ద్వారా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రాల ద్వారా అందరినీ ఫిదా చేసింది. నటనతో పాటు తన అందంతోనూ ఈ అమ్మడు అందరినీ కట్టిపడేస్తుంది. "సప్త సాగరాలు దాటి" సినిమా రొమాంటిక్, భావోద్వేగాలను ఆకర్షించింది. యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఆదరణ కరువైంది. ముఖ్యంగా, రుక్మిణి వసంత్ ప్రశంసలు అందుకుంది, చాలామంది ఆమెను ప్రశంసించడమే కాకుండా సాయి పల్లవితో పోల్చారు. (ఇదీ చదవండి: సలార్‌లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి) తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్ దక్కింది. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు K. V. అనుదీప్ డైరెక్షన్లో రవితేజ ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాతిరత్నాలు తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. -
నెల రోజుల్లోపే ఓటీటీ వచ్చేస్తోన్న స్టార్ హీరో మూవీ!
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత జంటగా నటించిన చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్-ఏ. ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాగా సూపర్ హిట్ టాక్ అందుకుంది. దీంతో వెంటనే 'సప్త సాగరాలు దాటి సైడ్- బి' మూవీని తెరకెక్కించారు మేకర్స్. హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను మెప్పించలేకపోయింది. దీంతో అప్పుడే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'యానిమల్' వైబ్‌లోనే ఆర్జీవీ.. డైరెక్టర్ గురించి అలాంటి ట్వీట్) ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీపై క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ లవ్ స్టోరీ డిసెంబర్ 15న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన రాలేదు. ఈనెల 15న స్ట్రీమింగ్ అయితే నెల రోజుల్లోపే ఓటీటీలో చూస్తే ఛాన్స్ దక్కనుంది. (ఇది చదవండి: రోడ్డుపై తాగి వీరంగం సృష్టించిన బాలీవుడ్ స్టార్? వీడియో వైరల్) -
పుష్ప-2తో పోటీ పడనున్న మూవీ.. షూటింగ్లో స్టార్ హీరోకు గాయాలు!
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తోన్న తాజా చిత్రం సింగం-3. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా అజయ్ దేవగణ్ గాయపడినట్లు తెలుస్తోంది. పొరపాటున అజయ్ కంటికి గాయమైనట్లు సమాచారం. అయినప్పటికీ అజయ్ దేవగణ్ వెంటనే షూటింగ్‌ని తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఇటీవలే సింగం-3 చిత్రంలో అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో కరీనా, దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు టాలీవుడ్ హీరో మూవీ పుష్ప-2 కూడా రిలీజ్ కానుంది. దీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. కాగా.. గతంలో రిలీజైన సింగం, సింగం రిటర్న్స్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. మరోవైవు అజయ్ దేవగన్ బోనీ కపూర్ నిర్మిస్తోన్న మైదాన్‌లో కనిపించనున్నారు. -
యాంకర్ సుమకు 'సప్తసాగరాలు దాటి' హీరో పంచ్‌లు.. పరువు పాయే!
ప్రేమకథలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలా ఓ అద్భుతమైన ప్రేమకథతో వచ్చిన సినిమా సప్తసాగరాలు దాటి. సెప్టెంబర్‌లో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాగా తాజాగా రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్ బిగా విడుదలైంది. ఇందులో హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రుక్మిణి, చైత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు ముందు వీరు ముగ్గురూ యాంకర్ సుమకు ఇంటర్వ్యూ ఇచ్చారు. హీరో కౌంటర్లు.. కవరింగ్ చేసే పనిలో సుమ సుమ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే.. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ సుమ ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. 'సప్తసాగరాలు దాటి సైడ్ ఎ, సైడ్ బి.. కథలు ముందే రాసుకున్నారా?' అని హీరోను అడగ్గా కథ రాసింది నేను కాదు, హేమంత్ అని క్లారిటీ ఇచ్చాడు రక్షిత్ శెట్టి. 'రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా తీద్దామా? అని ఓరోజు హేమంత్ అడిగాడు. రెండు భాగాలుగా తీస్తే బాగుంటుంది అని చెప్పాను. అలా సైడ్ ఎ, సైడ్ బిగా తీశాం' అని వివరణ ఇచ్చాడు. మరి దీనికి నిర్మాత ఒప్పుకున్నాడా? అని సుమ ప్రశ్నించగా నేనే నిర్మాతను అని పంచ్ ఇచ్చాడు రక్షిత్. నాలుక్కరుచుకున్న సుమ మీరు హీరో, డైరెక్టర్, నిర్మాత, సింగర్ అని వర్ణించుకుంటూ పోవడంతో రక్షిత్ శెట్టి తాను సింగర్ కాదని చెప్పాడు. అటు సినిమా గురించి, ఇటు హీరో రక్షిత్ శెట్టి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ చేసి సుమ నాలుక్కరుచుకుంది. ఈ ఇంటర్వ్యూ చూసిన జనాలు.. 'ఏంటి సుమ.. ఎంతో అనుభవం ఉన్నదానివి, ఇలా చేశావేంటి? ముందే ప్రిపేర్ అవ్వాల్సింది. అనవసరంగా వాళ్ల ముందు పరువు తీసుకున్నావ్' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం 'తనదసలే బిజీ షెడ్యూల్.. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సాధారణమే' అని వెనకేసుకొస్తున్నారు. చదవండి: 21 ఏళ్లకే విడాకులు.. జీవితంపై విరక్తి.. డిప్రెషన్.. చనిపోదామనుకున్నా.. -
'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ
టైటిల్: సప్త సాగరాలు దాటి సైడ్-బి నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర జే ఆచార్, అచ్యుత్ కుమార్ తదితరులు నిర్మాత: పరంవహ పిక్చర్స్ (రక్షిత్ శెట్టి) సమర్పణ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్: హేమంత్ ఎమ్ రావు సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి విడుదల తేదీ: నవంబర్ 17, 2023 ప్రేమ కథలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా ఏ భాష మూవీని అయినా సరే ఆదరిస్తారు. అలా ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమా ' సప్త సాగరలు దాటి'. సెప్టెంబర్ లో 'సైడ్- ఏ' పేరుతో తొలి భాగం రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని సీక్వెల్‌ను 'సప్త సాగరాలు దాటి సైడ్ - బి' పేరుతో థియేటర్స్‌లో విడుదల చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది? తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథేంటి? డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను(రక్షిత్ శెట్టి) పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ మొదలవుతుంది. తన ప్రేయసి ప్రియ(రుక్మిణి వసంత్)కి అప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక మను సతమతం అవుతుంటాడు. ప్రియని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో.. తన గురించి ఏం చెప్పకుండా స్నేహం చేస్తాడు. అన్ని విధాలా ఆమెకి సహాయం చేస్తాడు. మరి చివరకు ప్రియని మను కలిశాడా? ఈ స్టోరీలో సురభి(చైత్ర జే ఆచార్) ఎవరు? తను జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై మను పగ తీర్చుకున్నాడా? అనేది స్టోరీ. ఎలా ఉంది? 'సప్త సాగరాలు దాటి'.. ఈ సినిమా స్లో పాయిజన్ లాంటిది. అర్థం చేసుకుంటే నచ్చేస్తుంది. లేకపోతే ఇదేం బోరింగ్ సినిమారా బాబు అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్.. జైలు బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ కాగా.. ఇప్పుడు వచ్చిన రెండో పార్ట్ పూర్తిగా రివేంజ్ డ్రామాతో సాగే ప్రేమ కథ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. డబ్బుకి ఆశపడి జైలుకి వెళ్ళిన మను, 10 ఏళ్ల తర్వాత బయటకు రావడంతో సినిమా మొదలవుతుంది. తనకు జైల్లో పరిచయమైన ఓ వ్యక్తి మనుకి ఆశ్రయం ఇస్తాడు. అప్పటికే తన లవర్ ప్రియకి వేరే వ్యక్తితో పెళ్లి అయిపోవడంతో మను ఆమెని కలవడానికి కూడా ఇష్టపడడు. కానీ ఆమెని మర్చిపోలేడు. దీంతో దూరం నుంచి ఆమెని గమనిస్తూ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రియ ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాడు. దాదాపు ఇవే సీన్స్ ఫస్ట్ హాఫ్ అంతా వుంటాయి. అలా ఇంటర్వల్ కార్డ్ పడతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలు కాగానే అసలు స్టోరీ షురూ అవుతుంది. అప్పటివరకు హీరోయిన్ని చూస్తూ ఉన్న హీరో కాస్త ఆమె జీవితాన్ని చక్కబెడ్తాడు. మరి చివరకు మను - ప్రియ ఒక్కటయ్యారా? లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. సెప్టెంబర్ లో రిలీజ్ అయిన సప్త సాగారాలు దాటి ఫస్ట్ పార్ట్.. కథ, మ్యూజిక్ పరంగా మంచి హిట్ అనిపించుకుంది. ఇప్పుడు రిలీజ్ అయిన రెండో పార్ట్ మాత్రం చాలా స్లోగా ఉండి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఫస్ట్ హాఫ్ లో అసలు కథే ఉండదు. ఇంటర్వల్ తర్వాత కూడా కథ నెమ్మదిగా వెళ్తుంది తప్ప ఎక్కడా ఇంట్రెస్ట్ అనిపించదు. మ్యూజిక్ అయినా బాగుందా అంటే పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది తప్పితే ఇంప్రెసివ్ గా ఏం లేదు. క్లైమాక్స్ కూడా కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. అయితే సినిమాలో చిన్న చిన్న డీటైలింగ్ మాత్రం బాగుంది. తనకి డబ్బులు అవసరమై, ఇంతకుముందు పనిచేసిన ఓనర్ కొడుకు దగ్గరకు మను వెళతాడు. వాళ్ళు ఫస్ట్ తరిమేస్తారు. మళ్ళీ వెళ్తే మనుని కుక్కలా ట్రీట్ చేసి, బిస్కెట్ వేసినట్టు ఖరీదైన వాచ్ పడేస్తారు. దీంతో మనుకి కోపం వచ్చి, తనని కుక్కలా ట్రీట్ చేసిన ఓనర్ కొడుకుని కుక్కతో కరిపిస్తాడు. అలానే తను జైలుకి వెళ్ళడానికి కారణం అయిన ప్రభుని ఓ పాడుబడ్డ గోడౌన్ లో బంధించి, తను జైలులో అనుభవించిన దానిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అలానే ఫస్ట్ పార్ట్‌లో ఉన్న విలన్ రెండో భాగంలోనూ ఉంటాడు. సినిమా సముద్రం హోరుతో మొదలై అదే సముద్రం హోరుతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా సముద్రానికి సింబాలిక్ గా బ్లూ కలర్ చూపిస్తే.. ఇందులో మాత్రం రివెంజ్ కి సింబాలిక్ గా రెడ్ కలర్ ని ఎక్కువగా చూపిస్తారు. ఓవరాల్ గా చెప్పుకుంటే 'సప్త సాగరాలు దాటి సైడ్- బీ'.. ఫస్ట్ పార్ట్ అంత అయితే కనెక్ట్ కాదు. సాగదీత ఎక్కువైంది. ఎవరెలా చేశారు? హీరో రక్షిత్ శెట్టి ఎప్పటిలానే పాత్రలో జీవించాడు. ప్రియగా చేసిన రుక్మిణి వసంత్.. ఇందులో గృహిణిగా కనిపించింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో ఆమెకి నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు. ఇదే సినిమాలో వేశ్యగా, హీరోకి ప్రియురాలు సురభిగా చేసిన చైత్ర జే ఆచర్ కి మాత్రం కాస్త మంచి సీన్స్ పడ్డాయి. మిగిలిన వాళ్ళు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పరవాలేదనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిపై ఎడిటర్ దృష్టి పెట్టుంటే బాగుండేేది. రెండున్నర గంటల సినిమా ఇది. ఓ అరగంట తగ్గించొచ్చు. కథపై ఇంకాస్త దృష్టి పెట్టి మంచి సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్
ప్రస్తుతం సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోల రచ్చ ఎక్కువైంది. కొన్నిరోజుల ముందు రష్మిక, తాజాగా కరీన్ కపూర్.. దీని బారిన పడ్డారు. అయితే ఈ విషయమై బాధితులు మాత్రమే కాదు చాలామంది హీరోహీరోయిన్లు స్పందిస్తున్నారు. తాజాగా రష్మిక జరిగిన దానిపై ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ రష్మిక గురించి రక్షిత్ ఏమన్నాడు? (ఇదీ చదవండి: హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!) కన్నడలో 'కిరిక్ పార్టీ' సినిమాతో రష్మిక హీరోయిన్గా పరిచయమైంది. ఇదే మూవీలో హీరోగా చేసిన రక్షిత్ శెట్టి.. షూటింగ్ టైంలో ఆమెలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. కారణమేంటో తెలీదు గానీ పెళ్లి చేసుకోలేదు. ఎవరి కెరీర్ పరంగా వాళ్లు బిజీలో ఉన్నారు. రక్షిత్ కొత్త మూవీ 'సప్త సాగరాలు దాటి సైడ్-బి'.. నవంబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో.. రష్మిక ఫేక్ వీడియో ఘటనపై రెస్పాండ్ అయ్యాడు. 'నిజానికి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరముంది. ఎలాంటి సాఫ్ట్వేర్ తయారు చేసినప్పటికీ దానికి ఓ లైసెన్స్ ఉండాలి. అలాంటి రూల్స్ వచ్చినప్పుడే ఇలాంటి వాటిని అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్‌వేర్స్‌ని చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటిని అరికట్టకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువవ్వొచ్చు. అయితే రష్మిక కెరీర్ కోసం ఎన్నో డ్రీమ్స్ అనుకున్న అమ్మాయి' అని రక్షిత్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. టెన్షన్లో ఆ కంటెస్టెంట్) -
స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!
తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చితే చాలు నెత్తిన పెట్టేసుకుంటారు. అందులోని నటీనటుల్ని కూడా అభిమానిస్తారు. అలా ఈ మధ్య కాలంలో కన్నడ హీరోలు కూడా మనవాళ్లకు బాగా దగ్గరయ్యారు. వాళ్లలో హీరో రక్షిత్ శెట్టి కూడా ఒకడు. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ అని చాలామందికి తెలుసు. కానీ 'చార్లి 777' మూవీతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ హీరోకి రష్మిక మాత్రమే అంతకుముందు కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందట. రష్మికతో బ్రేకప్ కన్నడలో రక్షిత్ శెట్టి పేరు తెలియని వాళ్లుండరు. నటుడు-దర్శకుడు-రచయిత-నిర్మాత.. ఇలా మనోడి దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి. గతంలో 'కిరిక్ పార్టీ' అనే సినిమాలో రక్షిత్ హీరోగా నటిస్తే, రష్మిక హీరోయిన్గా చేసింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు వీళ్లు ప్రేమలో పడ్డారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కారణం ఏంటే తెలీదు గానీ ఈ జంట విడిపోయింది. అయితే ఇదే కాదు రక్షిత్ కి మరో లవ్‌స్టోరీ కూడా ఉంది. అక్కడ క్లోజ్ ఫ్రెండే మోసం చేశాడట. (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) రక్షిత్ ఏం చెప్పాడు? 'నా ఇంజినీరింగ్ సెకండియర్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశా. తనకి లవ్ లెటర్ ఇవ్వమని మా ఫ్రెండ్‌కి రోజూ లవ్ లెటర్స్ రాసి ఇచ్చేవాడిని. అలా రెండేళ్లు గడిచిపోయాయి కానీ అమ్మాయి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఇచ్చిన లెటర్స్‌ని నా ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యభర్తలు' అని హీరో రక్షిత్ శెట్టి తనకు జరిగిన మోసం గురించి చెప్పుకొచ్చాడు. 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన కాలేజీ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాడు. అయితే రక్షిత్ జీవితంలోని ఈ రెండు స్టోరీలు చూసిన ఎవరికైనా సరే.. ఈ హీరో ప్రేమ అనేది అస్సలు కలిసి రావడం లేదా అనే సందేహం వస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
‘సప్తసాగరాలుదాటి సైడ్ బి’ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి
రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్ బి’. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్, చైత్ర జె. ఆచార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది విడుదలైన ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్ ఏ’ సినిమాకు ఇది సీక్వెల్. ‘సప్తసాగరదాచే ఎల్లో: సైడ్ బి’ సినిమాను తెలుగులో ‘సప్తసాగరాలుదాటి సైడ్ బి’గా టీజీ విశ్వప్రసాద్ , వివేక్ కూచిభొట్ల ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశానికి ఓ అతిథిగా హాజరైన అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ప్రతి కథకు పలు కోణాలు ఉంటాయి. ‘సైడ్ ఏ’లో కనిపించని కోణాలు ఏమైనా ‘సైడ్ బి’లో కనిపిస్తాయా? అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘సప్తసాగరాలు దాటి సైడ్ ఏ’కు లభించిన ప్రేక్షకాదరణ ‘సైడ్ బి’కి కూడా లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మరో అతిథి కేవీ అనుదీప్. రక్షిత్‌శెట్టి మాట్లాడుతూ– ‘‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’, ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’కి కూడా లభిస్తాయని ఆశిస్తున్నాను’ అన్నారు. ‘‘నా జీవితంలో తారసపడిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘సప్త సాగరాలు దాటి..’ సినిమా కథ రాసుకున్నాను’’ అన్నారు హేమంత్ రావు. ‘‘సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ’కు లభించినట్లే ‘సైడ్ బి’కీ ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. -
సప్త సాగరాలు దాటి సైడ్-బి టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే
రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సప్త సాగరాలు దాటి’. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. మనసుకు హత్తుకునే ప్రేమకథగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర కలెక్షన్లు వసూలు చేయలేకపోయినా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడటం ఆసమయంలో అతను పడే వేదనను ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు. అదే సమయంలో ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చేందుకు అతడి ప్రేయసి పడే కష్టాన్ని కూడా బాగా ఎమోషనల్‌గా చూపించారు. పార్ట్-1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి భాగానికి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పార్ట్ రిలీజ్‌పై మేకర్స్ ప్రకటన ఇచ్చారు. 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీటీమ్ రిలీజ్ డేట్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసింది. నవంబర్ 17న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించగా.. పవిత్ర లోకేశ్, అవినాష్, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. -
థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా
కంటెంట్ బాగుంటే చాలు ఇతర పరిశ్రమలకు చెందిన సినిమాలనూ ఆదరించడంలో ముందుంటారు తెలుగు ప్రేక్షకులు. అలా ఇప్పటికే ఇతర ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరోలను తెలుగువారు ఆదరిస్తున్నారు. అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లి సినిమాలతో కన్నడ హీరో రక్షిత్ ఇప్పటికే తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన ‘సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ’ సెప్టెంబర్ 22న తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. (ఇదీ చదవండి: (Salaar Release Date: ప్రభాస్ సలార్ విడుదలపై అఫిషీయల్ ప్రకటన వచ్చేసింది) ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ సినిమాను ఓటీటీలో విడదల చేయడంతో ఫ్యాన్స్ థ్రిల్‌కు గురౌతున్నారు. కథ నెమ్మదిగా సాగిన ఇదోక అద్భుతమైన ప్రేమ కథ అని మంచి టాక్ వచ్చింది. సప్త సాగరాలు దాటిన ఈ ప్రేమకథ అందరినీ కదిలించిందని ఎందరో పాజిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం కథతో పాటు అందులోని నటీనటుల భావోద్వేగాలు అని సినీ ప్రేమికులు తెలిపారు. ప్రేమలో పడిన ఓ జంట ప్రయాణమే ఈ చిత్రం. అందమైన కలలు కన్న ఆ జంట ప్రయాణాన్ని విధి ఎలా ప్రభావితం చేసింది? అనేదే కథాంశం. థియేటర్లో చూడలేకపోయిన వారు ఈ వారం సప్త సాగరాలు దాటి చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి. కన్నడలో ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్ ఏ’ కి ఈ చిత్రం అనువాదం. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి టాక్ వచ్చినా.. థియేటర్స్ సమస్య ఎదురైంది. దీంతో వారు వెంటనే ఓటీటీలోకి విడుదల చేసినట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటన మరో రేంజ్లో ఉంటుందని ఆమెను పలువురు అభినందించారు. ఇంతటి సూపర్ హిట్ కొట్టిన సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి. ఈ సినిమాను సీక్వెల్ కూడా త్వరలో రాబోతోంది. పార్ట్ వన్ను 'సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ'గా రిలీజ్ చేశారు. సీక్వెల్ 'సప్తసాగరాలు దాటి: సైడ్ బీ' అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) -
రష్మికపై మాజీ లవర్ సంచలన కామెంట్స్ వైరల్
-
రష్మికతో టచ్‌లో ఉన్నా.. మెసేజ్‌లు కూడా చేసుకుంటాం: రక్షిత్ శెట్టి
ఎవరికై నా అదృష్టం ఎంత అవసరమో అన్నది హీరోయిన్ రష్మిక మందన్నను చూస్తే తెలుస్తుంది. కొందరికి అందం ప్రతిభా ఉన్నా లక్కు దోబూచులాడుంది. అది లేకపోతే ఎన్ని ఉన్నా పైకి రావడం సాధ్యం కాదు. నటి రష్మిక విషయంలో అదృష్టమే కీలకం అయ్యిందని చెప్పక తప్పదు. 2016 కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన డ్యూటీ రష్మిక మందన్న. తొలిచిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఈ కన్నడ బ్యూటీకి వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అలా అక్కడ ఛలో అనే చిత్రంలో కథానాయకిగా నటించింది ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక్కడే రష్మిక మందన్న అదృష్టం ఏమిటో అర్థం అయిపోతుంది. ఆ తర్వాత గీత గోవిందం చిత్రం ఈ అమ్మడిని క్రేజీ హీరోయిన్ను చేసేసింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్‌తో జతకట్టిన పుష్ప చిత్రం స్టార్ హీరోయిన్ను చేయడంతో పాటు బాలీవుడ్‌కు తీసుకెళ్లింది. అయితే కోలీవుడ్‌లో ఈమెకు లక్కు అనే మ్యాజిక్కు పెద్దగా పనిచేయలేదు. అదేవిధంగా బాలీవుడ్లో నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదు. త్వరలో తెరపైకి రానున్న యానిమల్ చిత్రం రిజల్ట్ కోసమే రష్మిక మందన్న ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక ఈమె వ్యక్తిగత విషయాలు గురించి చెప్పాలంటే చాలా కథలే ఉన్నాయి. కన్నడంలో నటించిన తొలి చిత్రం షూటింగ్ దశలోనే ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఆ తర్వాత అది ముందుకు సాగలేదు. పెళ్లి పీటలూ ఎక్కలేదు. ఇక గీత గోవిందం చిత్రం తర్వాత ఆ చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండతో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం బాగానే జరిగుతుంది. వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారనే మాటా వినిపిస్తోంది. అయితే అలాంటి వార్తలను రష్మిక ఖండించింది. ఫ్రెండ్స్ మాత్రమే అని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను నటి రష్మిక మందన్నతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం అని పేర్కొన్నారు. ఫోన్ ద్వారా మెసేజ్‌లు చేసుకుంటామని, చిత్రాలు విడుదల సమయంలో ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటామని చెప్పారు. రష్మిక ముందన్న నటిగా చాలా కలలు ఉన్నాయని, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇప్పుడు నేషనల్ క్రష్ అయ్యిందని పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ
టైటిల్: సప్త సాగరాలు దాటి నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ తదితరులు నిర్మాత: రక్షిత్ శెట్టి దర్శకుడు: హేమంత్ ఎమ్.రావు సంగీతం: చరణ్ రాజ్ సినిమాటోగ్రఫీ: అద్వైత్ గురుమూర్తి విడుదల తేదీ: 22 సెప్టెంబరు 2023 మంచి సినిమాకు భాషతో సంబంధం లేదు. ప్రేమకథలకు అంతం లేదు. అలా ఈ మధ్య కాలంలో కన్నడలో రిలీజై సెన్సేషన్ సృష్టించిన మూవీ 'సప్త సాగర ఎల్లోదాచె'. 'చార్లి 777' చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న రక్షిత్ శెట్టి ఇందులో హీరో. ఇప్పుడు ఈ సినిమాని 'సప్త సాగరాలు దాటి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇంతకీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? మను (రక్షిత్ శెట్టి) కారు డ్రైవర్. శంకర్ గౌడ (అవినాష్) అనే బిజినెస్‌మ్యాన్ దగ్గర పనిచేస్తుంటాడు. సింగర్ కమ్ స్టూడెంట్ ప్రియ(రుక్మిణి వసంత్)తో ప్రేమలో ఉంటాడు. త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనేది వీళ్లిద్దరి ప్లాన్. ఓ రోజు శంకర్ గౌడ కొడుకు కారుతో గుద్ది ఒకరిని చంపేస్తాడు. డబ్బు ఆశ, త్వరగా బెయిల్ ఇప్పిస్తానని చెప్పడంతో ఆ నేరాన్ని.. మను తనపై వేసుకుంటాడు. జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. జైలులో మను, బయట ప్రియ ఎలాంటి కష్టాలు అనుభవించారు? చివరకు ఏమైందనేదే 'సప్త సాగరాలు దాటి' మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? ఓ తప్పటడుగు లేదా ఓ తప్పు నిర్ణయం మను అనే కుర్రాడి జీవితాన్ని తలక్రిందులు చేయడమే 'సప్త సాగరాలు దాటి' సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టోరీ లైన్ ఇదే. సాధారణంగా ప్రేమకథా సినిమాలు అనగానే ఎవరో తెలియని వ్యక్తులు చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది చూపిస్తుంటారు. కానీ ఇందులో కాస్త డిఫరెంట్. ఆల్రెడీ ప్రేమలో ఉన్న ఓ అబ్బాయి-అమ్మాయి.. జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారనేది చక్కగా చూపించారు. ఫస్టాఫ్ విషయానికొస్తే.. ఖరీదైన కారులో మను-ప్రియ. కట్ చేస్తే డ్రైవర్‌గా మను, మధ్య తరగతి అమ్మాయి ప్రియ జీవితం ఎలా ఉంటుందో చూపించారు. మరోవైపు ప్రేమలో ఉన్న మను-ప్రియ.. త్వరలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవడం, కలిసి ఉండేందుకు ఓ ఇల్లు కోసం వెతుకులాట లాంటి సీన్స్‌తో సరదాగా వెళ్తుంటుంది. అయితే జీవితంలో సెటిల్ కావాలని కలలు కంటున్న మను.. డబ్బుకి ఆశపడి చేయని నేరాన్ని తనపై వేసుకోవడం, జైలుకెళ్లడంతో ఒక్కసారిగా స్టోరీ టర్న్ తీసుకుంటుంది. అయితే తనని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని మాటిచ్చిన ఓనర్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడంతో పరిస్థితులన్నీ తారుమారు అవుతాయి. మరి మను.. జైలు నుంచి బయటకొచ్చాడా? ప్రియని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీ చూడాల్సిందే. 'సప్త సాగరాలు దాటి' కొత్త కథేం కాదు. కానీ సినిమాగా చూస్తున్నప్పుడు మనకు అస్సలు ఆ ఫీలింగే రాదు. మరోవైపు హీరోహీరోయిన్ల యాక్టింగ్, సంగీతాన్ని వేరుచేసి చూడలేం. ఎందుకంటే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయి. ఈ సినిమాలో సముద్రం చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేసింది. హీరోయిన్‌కి సముద్రం అంటే చాలా ఇష్టం. మను-ప్రియ.. ఇద్దరూ సముద్రం పక్కనే ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ విధి మరోలా ఉంటుంది. సముద్రంలో తుపాన్‌లా వీళ్ల జీవితం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రేమంటే హగ్గులు, ముద్దులు లాంటివి ఇప్పుడు తీస్తున్న లవ్‌స్టోరీల్లో కామన్ పాయింట్. 'సప్త సాగరాలు దాటి' చిత్రంలో మాత్రం అలాంటివేం లేవు. ఓ మంచి పుస్తకం చదువుతున్నట్లో.. ఓ మంచి పాట వింటున్నంత హాయిగా ఉంది. ప్రేమకథా చిత్రం అన్నాను కదా అని మొత్తం లవ్ సీన్సే ఉంటాయని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో జైలు, అందులో ఖైదీల జీవితం ఎలా ఉంటుందనేది చాలా హృద్యంగా ఆవిష్కరించారు. కానీ ఆ సన్నివేశాలనే కొన్నిసార్లు బోర్ కొట్టిస్తాయి కూడా! ఎవరెలా చేశారు? మనుగా నటించిన రక్షిత్ శెట్టి.. ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ప్రేమికుడు, ఖైదీ, పరిణితి చెందిన మనిషిగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్‌ని అద్భుతంగా ఎక్స్పోజ్ చేశాడు. ప్రియ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్.. కేవలం తన కళ్లు, నవ్వుతో మాయ చేసింది. రక్షిత్ శెట్టితో ఈమె కెమిస్ట్రీ అయితే వేరే లెవల్. నిజంగా ప్రేమికులు అనేంతలా స్క్రీన్‌పై రెచ్చిపోయారు. ప్రేమ, విరహాం, తపన.. ఇలా డిఫరెంట్ ఎమోషన్స్‌ని అంతే అద్భుతంగా పండించారు. మిగిలిన పాత్రల్లో నటించిన పవిత్రా లోకేశ్, అచ్యుత్ తదితరులు తమ వంతుగా ఆకట్టుకునే యాక్టింగ్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'సప్త సాగరాలు దాటి'లో హీరోహీరోయిన్ అద్భుతమైన ఫెర్పార్మెన్తో అదరగొడితే మరో ముగ్గురు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. వీళ్లలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ రాజ్. ప్రేమకథకు సంగీతమే ప్రాణం. ఈ సినిమాకు ఇతడిచ్చిన పాటలు కావొచ్చు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావొచ్చు మూవీకి ప్రాణం పోశాయి. మొదటి నుంచి చివర వరకు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయాయి. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి.. తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్‌కి రిచ్‌నెస్ తీసుకొచ్చాడు. దర్శకుడు విజన్‌ని స్క్రీన్‌పై అద్భుతంగా వచ్చేలా చేశాడు. చివరగా రచయిత, దర్శకుడు హేమంత్ ఎమ్.రావు గురించి చెప్పుకోవాలి. ఓ సాధారణ ప్రేమకథని అంతే నిజాయితీగా చెప్పాడు. అనవసరమైన సీన్ల జోలికి పోకుండా ఉన్నది ఉన్నట్లు ప్రెజెంట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీగా ఉంది. అక్టోబరు 20న అది రిలీజ్ కానుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్‌డెస్క్ -
సప్త సాగరాలు
రక్షిత్ శెట్టి హీరోగా నటించి, నిర్మించిన కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. ఈ నెల 1న కన్నడలో విడుదలైన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి కలిసి ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో ఈ నెల 22న తెలుగులో విడుదల చేయనున్నారు. ‘‘క్లాసిక్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రమిది. కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.