
777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ విడుదల కానుంది. ఈ సీరిస్‌ను విడుదల చేసేందుకు సుమారు 3 ఏళ్ల నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ ఓటీటీ వేదికలు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో రక్షిత్ శెట్టి ఒక సొంత ప్లాట్‌ఫామ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
ఏడు కథలతో ఏకం వెబ్ సీరిస్‌ను మేకర్స్ నిర్మించారు. జులై 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే, ఈ చిత్రాన్ని చూసేందుకు www.ekamtheseries.com వెబ్‍సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.149 చెల్లించి ఏకం వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. ఇదే విషయాన్ని రక్షిత్ శెట్టి అధికారికంగా ప్రకటించారు.
రక్షిత్ శెట్టి నిర్మించిన ఏకం వెబ్ సిరీస్‍లో ప్రకాశ్ రాజ్, షైన్ శెట్టి వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఏకం వెబ్ సిరీస్ కన్నడలో మాత్రం అందుబాటులో ఉంది. ఈ సిరీస్‍ను ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకోకపోవడంతోనే ఇలా సొంతంగా ఒక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేస్తున్నట్లు రక్షిత్ శెట్టి తెలిపాడు. చూడాలనే ఆసక్తి ఉన్నవారు జులై 13 నుంచి రూ.149 చెల్లించి ఏకం ప్రపంచంలోకి అడుగుపెట్ట వచ్చు.
Presenting #EKAM – with love, from us to you! 🤗
Join the waitlist now!
🔗 https://t.co/PFMuw92M13 @ParamvahStudios @teamjourneyman #SumanthBhat @sandeep_ps5 @AaronMac05 @prakashraaj @RajbShettyOMK @ShineShetty_ @worldofekam @definestudio_ pic.twitter.com/e6DCwAj7tD— Rakshit Shetty (@rakshitshetty) June 17, 2024