ఛలో హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌ రద్దు...! | Rashmika Rakshit Break Up Rumours Viral | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 2 2018 5:22 PM | Last Updated on Thu, Aug 2 2018 5:22 PM

Rashmika Rakshit Break Up Rumours Viral - Sakshi

కన్నడ బ్యూటీ, ఛలో ఫేమ్‌ రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకున్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నటుడు, దర్శకుడు రక్షిత్‌ శెట్టితో గతేడాది ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. కిరిక్‌ పార్టీ షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుండటంతో ఆమె నిశ్చితార్థం రద్దు దిశగా ఆలోచన చేస్తోందని, ఈ మేరకు ఓ నిర్ణయం కూడా తీసేసుకుందంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. 

దీనికితోడు ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా తలెత్తాయన్నది ఆ కథనం పేర్కొంది. గీత గోవిందం పోస్టర్లలో రష్మిక.. విజయ్‌ దేవరకొండల మధ్య రొమాన్స్‌పై  రక్షిత్‌ ఫ్యాన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్‌ చేశారు. దీనిపై ఆమె స్ట్రాంగ్‌ కౌంటరే ఇచ్చారు. అయితే అప్పటి నుంచి రక్షిత్‌-రష్మికల మధ్య మాటలు లేవన్నంట. దీంతో కెరీర్‌ పీక్స్‌లో ఉన్న ఈ సమయంలో ఆమె వివాహ ఆలోచనను పూర్తిగా పక్కకు పెట్టినట్లు ఆ కథనం ఉటంకించింది.

అయితే ఈ వ్యవహారాన్ని ఆమె సన్నిహితులు తూచ్‌గా తేల్చేస్తున్నారు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, దయచేసి అలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి హాజరైన విషయాన్ని వాళ్లు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ గాసిప్స్‌పై రష్మిక, రక్షిత్‌లు స్పందించాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement