Rashim Mandanna
-
'పుష్ప 2' మూవీ ఆల్ పోస్టర్స్.. ఫుల్ HD (ఫొటోలు)
-
ఏడుస్తూ కూర్చోవాలా? లాగి ఒక్కటివ్వాలా?: రష్మిక
నెలసరి బాధలు.. అనుభవించేవారికే తెలుస్తుంది. పీరియడ్స్ మొదలయ్యే ముందు నుంచి రెండు రోజుల వరకు పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు ఏ పనీ చేయడానికి వీలుపడనంత నొప్పి ఉంటుంది. ఎంతోమంది మహిళలు ఈ రుతుస్రావం వల్ల వచ్చే బాధలను పంటికిందే భరిస్తారు. హీరోయిన్లు కూడా వాటిని భరిస్తూ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటారు. అలా సాయిపల్లవి కూడా పీరియడ్ టైంలోనే రౌడీ బేబి వంటి పవర్ఫుల్ డ్యాన్స్ నంబర్లు పూర్తి చేసిందట. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న నెలసరితో బాధపడుతోంది. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తన పీరియడ్ కష్టాలను సోషల్ మీడియాలో పంచుకుంది. నొప్పి, బాధ ఎక్కువైందని.. ఇప్పుడేం చేస్తే బెటర్‌గా ఉంటుందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడిగేసింది. 1. ఐస్‌క్రీమ్స్, చాక్లెట్స్ తినాలా? 2. ఎవరినైనా లాగి ఒక్కటివ్వాలా? 3. మైండ్‌ను డైవర్ట్ చేసేందుకు ఏదైనా సినిమా చూడాలా? 4. అలాగే ఏడుస్తూ కూర్చోవాలా? అని అడిగింది. ఏం చేసినా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని పలువురూ అభిప్రాయపడుతున్నారు. చదవండి: హృదయాలను మెలిపెట్టే సినిమా.. సడన్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ అక్కడే! -
ఛలో హీరోయిన్ ఎంగేజ్మెంట్ రద్దు...!
కన్నడ బ్యూటీ, ఛలో ఫేమ్ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో గతేడాది ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కిరిక్ పార్టీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆఫర్లు వెల్లువెత్తుండటంతో ఆమె నిశ్చితార్థం రద్దు దిశగా ఆలోచన చేస్తోందని, ఈ మేరకు ఓ నిర్ణయం కూడా తీసేసుకుందంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. దీనికితోడు ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కూడా తలెత్తాయన్నది ఆ కథనం పేర్కొంది. గీత గోవిందం పోస్టర్లలో రష్మిక.. విజయ్ దేవరకొండల మధ్య రొమాన్స్‌పై రక్షిత్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. దీనిపై ఆమె స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. అయితే అప్పటి నుంచి రక్షిత్-రష్మికల మధ్య మాటలు లేవన్నంట. దీంతో కెరీర్ పీక్స్‌లో ఉన్న ఈ సమయంలో ఆమె వివాహ ఆలోచనను పూర్తిగా పక్కకు పెట్టినట్లు ఆ కథనం ఉటంకించింది. అయితే ఈ వ్యవహారాన్ని ఆమె సన్నిహితులు తూచ్‌గా తేల్చేస్తున్నారు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, దయచేసి అలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ ఈవెంట్లో ఇద్దరూ కలిసి హాజరైన విషయాన్ని వాళ్లు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ గాసిప్స్‌పై రష్మిక, రక్షిత్‌లు స్పందించాల్సి ఉంది. -
విజయ్.. రష్మిక.. ఓ సినిమా
‘ఎవడే సుబ్రమణ్యం’లో కీలక పాత్రతో, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో హీరోగా విజయాలతో దూసుకెళుతున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. పరశురామ్‌తో ఈ సంస్థ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజా చిత్రంలో కన్నడ భామ రష్మిక మండన్నాను కథానాయికగా ఎంచుకున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇతర తారాగణం, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్రబృందం తెలిపింది. ‘‘విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడానికి సైన్ చేసినందుకు ఆనందంగా ఉంది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసులకు థ్యాంక్స్’’ అని హీరోయిన్ రష్మిక మండన్నా ట్వీట్ చేశారు.