
నెలసరి బాధలు.. అనుభవించేవారికే తెలుస్తుంది. పీరియడ్స్ మొదలయ్యే ముందు నుంచి రెండు రోజుల వరకు పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు ఏ పనీ చేయడానికి వీలుపడనంత నొప్పి ఉంటుంది. ఎంతోమంది మహిళలు ఈ రుతుస్రావం వల్ల వచ్చే బాధలను పంటికిందే భరిస్తారు. హీరోయిన్లు కూడా వాటిని భరిస్తూ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటారు. అలా సాయిపల్లవి కూడా పీరియడ్ టైంలోనే రౌడీ బేబి వంటి పవర్‌ఫుల్ డ్యాన్స్ నంబర్లు పూర్తి చేసిందట.
ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న నెలసరితో బాధపడుతోంది. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తన పీరియడ్ కష్టాలను సోషల్ మీడియాలో పంచుకుంది. నొప్పి, బాధ ఎక్కువైందని.. ఇప్పుడేం చేస్తే బెటర్‌గా ఉంటుందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడిగేసింది. 1. ఐస్‌క్రీమ్స్, చాక్లెట్స్ తినాలా? 2. ఎవరినైనా లాగి ఒక్కటివ్వాలా? 3. మైండ్‌ను డైవర్ట్ చేసేందుకు ఏదైనా సినిమా చూడాలా? 4. అలాగే ఏడుస్తూ కూర్చోవాలా? అని అడిగింది. ఏం చేసినా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని పలువురూ అభిప్రాయపడుతున్నారు.
చదవండి: హృదయాలను మెలిపెట్టే సినిమా.. సడన్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ అక్కడే!
Comments
Please login to add a commentAdd a comment