విజయ్‌.. రష్మిక.. ఓ సినిమా | vijay devarakonda & geeta arts film launched | Sakshi
Sakshi News home page

విజయ్‌.. రష్మిక.. ఓ సినిమా

Published Thu, Sep 7 2017 12:21 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

విజయ్‌.. రష్మిక.. ఓ సినిమా

విజయ్‌.. రష్మిక.. ఓ సినిమా

‘ఎవడే సుబ్రమణ్యం’లో కీలక పాత్రతో, పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి చిత్రాలతో హీరోగా విజయాలతో దూసుకెళుతున్నారు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థ జీఏ2 బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. పరశురామ్‌తో ఈ సంస్థ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా, తాజా చిత్రంలో కన్నడ భామ రష్మిక మండన్నాను కథానాయికగా ఎంచుకున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇతర తారాగణం, టెక్నీషియన్స్‌ వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్రబృందం తెలిపింది. ‘‘విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌లో  సినిమా చేయడానికి సైన్‌ చేసినందుకు ఆనందంగా ఉంది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసులకు థ్యాంక్స్‌’’ అని హీరోయిన్‌ రష్మిక మండన్నా ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement