Geeta Arts
-
బయోపిక్ లో నాగచైతన్య...!
-
ఎస్ఆర్ కళ్యాణ మండపం నచ్చడంతో ఈ అవకాశం.. ఇది నా అదృష్టం
‘‘గీతా ఆర్ట్స్‌లాంటి మంచి, పెద్ద బ్యానర్లో నటించా లని అందరూ అనుకుంటారు. నా కెరీర్‌ప్రారంభంలోనే ఆ బ్యానర్లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి మంచి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా నచ్చడంతో అల్లు అరవింద్, వాసుగార్లు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చేసే అవకాశం ఇచ్చారు. ప్రేమ, వినోదం, థ్రిల్.. ఇలా కుటుంబ సమేతంగా చూడదగ్గ అన్ని అంశాలతో మురళి తెరకెక్కించారు. నా కెరీర్లో ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ మంచి కమర్షియల్ హిట్. ఆ సినిమాని మించిన కమర్షియల్ హిట్‌ని ‘వినరో..’ సాధిస్తుంది. ‘కిరణ్ ఎలాంటి పాత్రలైనా చేయగలడు’ అని ప్రేక్షకులతో అనిపించుకోవా లన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మీటర్’ షూటింగ్ పూర్తయింది. ‘రూల్స్ రంజన్’ 80 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. -
కిరణ్‌లాంటి వ్యక్తులు తక్కువ.. రెండు సీన్లకే థ్రిల్లయ్యా: అఖిల్
‘‘గీతా ఆర్ట్స్ ఈవెంట్‌కు నేను ఓ కుటుంబసభ్యుడిలా వచ్చాను. కొత్తదనం కోసం అరవింద్‌గారు ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు. కష్టం ఎప్పుడూ వృథా కాదు. కిరణ్ ఎంతో కష్టపడుతున్నాడు. తనకు ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు అక్కినేని అఖిల్. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ (నందు) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్ మాట్లాడుతూ– ‘‘వినరో..’లోని రెండు సీన్లు చూసి, థ్రిల్ అయ్యాను. ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌తో ఈ సినిమా వస్తోంది ’’ అని అన్నారు. ‘‘జెన్యూన్‌గా ఉండే కిరణ్‌లాంటి వ్యక్తులు తక్కువ. బన్నీ వాసుతో పాటు కిరణ్ అబ్బవరంనూ ఓ నిర్మాతగా ఫీలవుతున్నాను. ఈ సినిమాకు అతను అలా వర్క్ చేశాడు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘అఖిల్గారి సినిమాలో నేను ఓ కీ రోల్ చేయాల్సింది. కుదర్లేదు. ఏయన్నార్‌గారు చేసిన ‘మనం’ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ ఎమోషన్. స్క్రీన్‌పై గీతా ఆర్ట్స్ అని చూసిన మాలాంటి వారు కూడా అదే బ్యానర్లో సినిమాలు చేయొచ్చు అంటూ చాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు. నాలా సినిమాపై ప్యాషన్‌తో వచ్చేవారి తరపున అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ‘వినరో. ..’ సినిమా బాగా రావడానికి ఎంతో కారణమైన బన్నీ వాసుగారి దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీతో నందు అన్నకు మంచి పేరు వస్తుంది. యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్ ‘గచ్చిబౌలి’ నుంచి నేను ఇక్కడి వచ్చేంతవరకు నన్ను ప్రోత్సహించిన, ఇంకా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘వినరో..’ పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘నేను దర్శకుడిని అయ్యానని మా నాన్నకు నేను హ్యాపీగా చెప్పుకునేలా చేసిన కిరణ్ అబ్బవరంకు, నిర్మాతలు అరవింద్, బన్నీ వాసుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు మురళీ కిషోర్. ‘‘గీతా ఆర్ట్స్ తర్వాత నాగచైతన్య, అఖిల్ నాకు ఆప్తులు. నా మనసుకు కనెక్ట్ అయిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక ఆడియన్స్ కొన్ని అంశాలను వెంట తీసుకెళ్తారు. కిరణ్, కిశోర్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్‌లకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు బన్నీ వాసు. -
అందుకే తెలుగు సినిమాలంటే ఇష్టం
‘‘మంచి కంటెంట్‌కు కమర్షియల్ అంశాలు జోడించి, తెలుగు సినిమాలు తీస్తుంటారు. అందుకే తెలుగు సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి తరహా సినిమాలు తీయడం రిస్క్ అయినప్పటికీ చాలెంజింగ్‌గా తీసుకుని ఇక్కడ తెరకెక్కిస్తారు. అయితే మా (మరాఠీ) సినిమాలు కమర్షియల్‌గా కాకుండా ఎక్కువగా రియలిస్టిక్‌గా ఉంటాయి’’ అని అన్నారు కశ్మీరా పరదేశి. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కశ్మీరా మాట్లాడుతూ– ‘‘తిరుపతి నేపథ్యంలో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతిలో షూటింగ్ చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. ఈ చిత్రంలో నటనకు స్కోప్ ఉన్న దర్శన పాత్ర చేశాను. గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్లో సినిమా చేయడం కంఫర్ట్‌గా అనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ.. కిరణ్ కొత్త సినిమా టీజర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కశ్మీర పర్ధేశీ హీరోయిన్. తాజాగా చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. 'నా పేరు విష్ణు! మా జీవితాలు అన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ’అని కిరణ్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతోంది. టీజర్ మొదటి నుంచి చివరివరకు ఆసక్తికరంగా మలిచారు. లవ్, కామెడీ , థ్రిల్లర్ అన్ని సమపాళ్లలో ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమతుంది. ముఖ్యంగా విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు.‘ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్?’, ‘కాన్సెప్ట్ తో మొదలై లవ్వు కామెడీ మిక్సయి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు" అని కిరణ్ చెప్పిన డైలాగ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది ఈ టీజర్. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. -
ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్ సాయం..
Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims: సినిమాలు నిర్మిస్తూ డబ్బులు సంపాదించడమే కాదు, అవసరానికి సహాయం కూడా చేస్తారు సినీ నిర్మాతలు. అలాంటి కోవకే చెందినదే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. అయితే గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ. 10 లక్షలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ స్వయంగా ట్విటర్లో ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains. — Geetha Arts (@GeethaArts) November 24, 2021 ఇలా ఇంతకుముందు 'గీతా ఆర్ట్స్2' బ్యానర్లో వచ్చిన 'గీతా గోవిందం' సినిమా ఫ్రాఫిట్‌ను కేరళ వరద బాధితులకు సహాయంగా అందించారు. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం ఈ క్రిస్మస్కి థియేటర్లలో సందడి చేయనుంది. -
బర్త్‌డే పార్టీలో అల్లు అర్జున్ హంగామా
చావు కబురు చల్లగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శరత్ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తళుక్కున మెరిశాడు. సోమవారం అతడి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు హాజరైన బన్నీ దగ్గరుండి కేక్ కట్ చేయించాడు. అనంతరం అతడికి ఆప్యాయంగా కేక్ తినిపించాడు. ఈ పార్టీలో నిర్మాత అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతున్నాయి. ఇందులో బన్నీ లుక్ సరికొత్తగా ఉండటంతో 'అన్న మళ్లీ లుక్ మార్చాడురోయ్..' అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. 'స్టైల్ నీ డీఎన్ఏలోనే ఉంది', 'స్టైలిష్ స్టార్లు ఊరికే అయిపోరు మరి..' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా శరత్ చంద్ర.. బన్నీకి కుడి భుజంలా ఉంటూ అతడి వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇదే విషయాన్ని బన్నీ 'చావు కబురు చల్లగా' ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ప్రస్తావిస్తూ అతడిపై ప్రశంసలు కురిపించాడు. తనకన్నీ శరతే అని, అతడు తన ఫ్యామిలీ మెంబర్ అని పేర్కొన్నాడు. చదవండి: ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే! అల్లు అర్జున్ను కలిసి ‘కేజీఎఫ్’ డైరెక్టర్.. ఫొటో వైరల్ -
వెబ్ సిరీస్‌లతో నిర్మాతగా..
ఈ మధ్య కాలంలో హీరోలు సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌లోనూ ప్రావీణ్యం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నిర్మాణంలో.. అటు హీరోలుగా, ఇటు నిర్మాతలుగా కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మొన్న రామ్‌చరణ్, నిన్న విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థలు స్థాపించి కంటెంట్ బాగుంటే ఏ హీరో అయినా, ఏ దర్శకుడు అయినా, వారికి అనుభవం ఉన్నా లేకపోయినా సినిమాలు నిర్మిస్తామని స్టేట్మెంట్ ఇచ్చేశారు. అదే రీతిలో అల్లు అర్జున్ కూడా ఎప్పటికప్పుడు తనకంటూ ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. దానిపై సీరియస్‌గా దృష్టి కూడా పెట్టారు. ఇక అల్లు అర్జున్ పేరుతో నిర్మాణ సంస్థకు అంతా సిద్ధమని, త్వరలోనే అది ప్రారంభం కానుందని తెలుస్తోంది. తన తండ్రి అల్లు అరవింద్‌కు గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా తనకంటూ ఒక బ్యానర్ స్థాపించాలనుకున్నారు. ఆ బ్యానర్లోనే సినిమాలను నిర్మించాలని అల్లు అర్జున్ కోరుకుంటున్నాడని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికి ఆ కోరిక నిజమయ్యింది. (బిగ్‌బాస్: శృతి మించిన రొమాన్స్) ఓటీటీలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్‌లకు ఈ మధ్య క్రేజ్ పెరిగింది. సినిమాలకన్నా వెబ్ సిరీస్‌లను చూస్తూ ఎంజాయ్ చేసేవారి సంఖ్య ఎక్కువైంది. అందుకే తను నిర్మాతగా ముందు ఓటీటీతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకుంటున్నాడట అల్లు అర్జున్. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో బయటికి రానుంది. ఈ వెబ్ సిరీస్‌లు కూడా తన తండ్రి ప్రారంభించిన ఆహా యాప్‌లోనే విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప షూటింగ్ నవంబర్10 నుంచి ప్రారంభం అవుతుండగా ఒక వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా అల్లు అర్జున్ బిజీబిజీగా గడపబోతున్నారన్నమాట. -
‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ లుక్కు విశేష స్పందన
టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో అతడు 29వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో అటు సినీ ప్రముఖుల నుంచి, ఇటు అభిమానుల నుంచి కార్తికేయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుణ్ తేజ్, మంచు లక్ష్మీ, అనుప్ రూబెన్స్, ప్రియదర్శి, గీతా అర్ట్స్, బ్రహ్మజీ, లావణ్య త్రిపాఠి వంటి నటులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ రోజు కార్తికేయ తన పుట్టిన రోజుతో పాటు మరో శుభవార్తను అభిమానులకు అందించారు. (ఎన్ఐఏ ఆఫీసర్) కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమా నుంచి నేడు ఫస్ట్ గ్లిమ్స్‌ను విడుదల చేశారు. హీరో కార్తికేయ పోషించిన ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వీడియోలో కార్తికేయ గెటప్, యాస, డైలాగ్ డెలవరి బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అలాగే దీనిని చూస్తుంటే కార్తికేయ గత చిత్రాలకు ఈ సినిమా పూర్తి భిన్నంగా వుండబోతుందని అర్థమవుతోంది. (మరోసారి ప్లాస్మా దానం చేసిన కీరవాణి) ఈ సినిమాను అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మాతగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ నెల 21న కార్తికేయ బర్త్‌డే సందర్బంగా సోషల్ మీడియా వేదికగా గీతా ఆర్ట్స్ వారు కార్తికేయ ని ఏం వరం కావాలో కోరుకోమని సెప్టెంబర్ 17న అన్నారు. దానికి కార్తికేయ నాకు టీజర్ విడుదల చేయమని అడిగాడు. దీంతో వెంటనే దర్శకుడు సర్ప్రైజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 11.47 నిమిషాలకి విడుదల చేసిన ఈ విడియో చూసిన నెటిజన్లు నిజంగా సర్ప్రైజ్ అయ్యారు. -
పలాస కథ
మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో ‘పలాస 1978’ చిత్రాన్ని విడుదల చేసేందుకు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ముందుకొచ్చాయి. పలాసలో జరిగిన వాస్తవ సంఘటనలు, కొన్ని నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి కథ, కథనాలున్న ఈ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీలకు బాగా నచ్చడంతో గీతా ఆర్ట్స్, యూవీ ప్రొడక్షన్స్ పతాకాలపై విడుదల చేయనున్నారు. ‘‘మంచి సినిమాలను అందరికీ చేరువయ్యేలా చూడాలని అల్లు అరవింద్‌గారు భావించడంతో ‘పలాస 1978’ ఈ చిత్రాన్ని జీఏటు యూవీ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాం’’ అని బన్నీ వాసు తెలిపారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె. -
యంగ్ హీరో 'షికారు'
పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విజయ్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారట. విజయ్ క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్న ఈ సినిమాకు షికారు అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో పరశురాం దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు విజయ్ దేవరకొండ. -
విజయ్.. రష్మిక.. ఓ సినిమా
‘ఎవడే సుబ్రమణ్యం’లో కీలక పాత్రతో, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో హీరోగా విజయాలతో దూసుకెళుతున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వాసు ఓ సినిమా నిర్మించనున్నారు. పరశురామ్‌తో ఈ సంస్థ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజా చిత్రంలో కన్నడ భామ రష్మిక మండన్నాను కథానాయికగా ఎంచుకున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇతర తారాగణం, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్రబృందం తెలిపింది. ‘‘విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడానికి సైన్ చేసినందుకు ఆనందంగా ఉంది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసులకు థ్యాంక్స్’’ అని హీరోయిన్ రష్మిక మండన్నా ట్వీట్ చేశారు. -
లావణ్యకు శుభమస్తు!
శుభం భుయాత్! ఇంకోసారి అంతా శుభమే జరగాలని లావణ్యా త్రిపాఠి ఆశిస్తున్నారు. ఎందుకంటే... అచ్చొచ్చిన నిర్మాణ సంస్థలో ముచ్చటగా మూడో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారీ సుందరి! గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్‌లో లావణ్యా త్రిపాఠి చేసిన మొదటి సినిమా ‘భలే భలే మగాడివోయ్’ మాంచి హిట్. తర్వాత గీతా ఆర్ట్స్‌లో ‘శ్రీరస్తు శుభమస్తు’ చేశారు. అదీ హిట్టే. ఇప్పుడు ఇంకోసారి జీఏ2 పిక్చర్స్‌లో ఆమెకు ఛాన్స్ వచ్చిందట. ‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందనున్న సినిమాలో లావణ్యా త్రిపాఠీని హీరోయిన్గా ఎంపిక చేశారట! ‘శ్రీరస్తు శుభమస్తు’లో ఆమె నటనకు ఇంప్రెస్ అయిన దర్శకుడు మరోసారి అవకాశం ఇచ్చారట. అమ్మాయిగారు ఓ సినిమా చేస్తే... ఇంకో సినిమా లాభంగా వచ్చిందన్న మాట. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో లావణ్య నటిస్తున్నారు. -
శత్రువుని సెలక్ట్ చేసుకున్నధృవ
‘‘నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది.. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువును నేను సెలక్ట్ చేసుకున్నా’’ అంటున్నారు రామ్‌చరణ్. ఆయన పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘ధృవ’. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. సురేందర్ రెడ్డి దర్వకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హిప్ హాప్ ఆది స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ నెల 9న నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. హై బడ్జెట్, టెక్నికల్ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. సినిమా విడుదలకు ముందు మెగా అభిమానులు, ప్రేక్షకుల మధ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ . డిసెంబర్ఫంక్షన్ నిర్వహించాలనుకుంటున్నాం మొదటి వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. అరవింద్ స్వామి, నాజర్, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.యస్.వినోద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
బోయపాటి బర్త్ డే @ గీతాఆర్ట్స్ ఆఫీస్
సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుకలు శనివారం గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. హీరో అల్లు అర్జున్, నిర్మాత అరవింద్.. బోయపాటికి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ పతాకంపై త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. -
‘కొత్త జంట’ ఆడియో ఆవిష్కరణ
-
నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఆ నలుగురు : అల్లు శిరీష్
‘‘మనం చేసే తప్పుల్ని ఎత్తి చూపేవారు చాలా తక్కువమంది ఉంటారు. నిజానికి వారే మన శ్రేయోభిలాషులు. నా వరకు నా తమ్ముడు శిరీష్ అలాంటివాడే. నా సినిమాల్లో నేను చేసిన తప్పులు ఎంచి చెబుతూ... ఎప్పటికప్పుడు నన్ను నార్మల్ పర్సన్‌గా ఉంచుతాడు తను. ప్రపంచానికి నేను హీరోని కావచ్చు. వాడికి మాత్రం అన్నయ్యనే’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా, రెజీనా కథానాయికగా మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘కొత్త జంట’. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకుడు. జె.బి. స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కె.రాఘవేంద్రరావు ఆడియో సీడీని ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కి అందించారు. ఈ సందర్భంగా బన్నీ మరిన్ని విషయాలు చెబుతూ- ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే... ఈ సినిమా నేను చూశాను. శిరీష్, రెజీనాలకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘నేను ఈ స్థాయికి రావడానికి కారణం మెగా కుటుంబం. నా గత చిత్రాలు లో బడ్జెట్లో తీశాను. కానీ ఈ సినిమాకు బాగా ఖర్చయింది. ‘కొత్త జంట’ టైటిల్‌కి శిరీష్, రెజీనా సరిగ్గా సరిపోయారు. ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించిన ‘గీతా ఆర్ట్స్’లో సినిమా చేయడం గర్వంగా ఉంది’’ అని మారుతి అన్నారు. శిరీష్ మాట్లాడుతూ- ‘‘బన్నీవాసు విన్నింగ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. తను నాకు మరో అన్నయ్య. కొన్నాళ్లుగా నాకు ఫ్రెండ్ అయిన మారుతీ... ఈ రోజు బ్రాండ్‌గా మారాడు. నాతో అద్భుతమైన సినిమా తీశాడు. నేనీ రోజు ఇక్కడ నిలబడటానికి కారణమైన తాతయ్య, నాన్న, చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గార్లకు థ్యాంక్స్. నాకు గురువు, మిత్రుడు అన్నయ్య బన్నీనే. నటునిగా తనే నాకు ప్రేరణ’’ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులతో పాటు దిల్ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఎన్వీ ప్రసాద్, జెమినీ కిరణ్, కేఎల్ నారాయణ, నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు, సుకుమార్, సురేందర్‌రెడ్డి, గోపిచంద్ మలినేని, హరీశ్‌శంకర్, చంటి అడ్డాల, ఠాగూర్ మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.