Watch: Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Movie Teaser Out, Goes Viral - Sakshi
Sakshi News home page

Vinaro Bhagyamu Vishnu Katha: ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ

Published Tue, Jan 10 2023 12:22 PM | Last Updated on Tue, Jan 10 2023 1:36 PM

Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha teaser Out - Sakshi

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’.  మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  బ‌న్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా పరిచయం కాబోతున్నాడు. కశ్మీర పర్ధేశీ హీరోయిన్‌. తాజాగా చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.  

'నా పేరు విష్ణు! మా జీవితాలు అన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ’అని కిరణ్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభం అవుతోంది. టీజర్ మొదటి నుంచి చివరివరకు ఆసక్తికరంగా మలిచారు. లవ్, కామెడీ , థ్రిల్లర్ అన్ని సమపాళ్లలో ఉన్నట్లు టీజర్‌ చూస్తే అర్థమతుంది. ముఖ్యంగా విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు.‘ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్?’, ‘కాన్సెప్ట్ తో మొదలై లవ్వు కామెడీ మిక్సయి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు" అని కిరణ్ చెప్పిన డైలాగ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది ఈ టీజర్.  చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement