యంగ్ హీరో 'షికారు' | Vijay Devarakonda Next movie title Shikaaru | Sakshi
Sakshi News home page

యంగ్ హీరో 'షికారు'

Published Fri, Dec 1 2017 1:16 PM | Last Updated on Fri, Dec 1 2017 1:16 PM

Vijay Devarakonda Next movie title Shikaaru - Sakshi

పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విజయ్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. 

ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారట. విజయ్ క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్న ఈ సినిమాకు షికారు అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో పరశురాం దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు విజయ్ దేవరకొండ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement