వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!? | Vijay Devarakonda To Play Dual Role In His New Movie With Rahul Sankrityan, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: రిస్క్ చేస్తున్న రౌడీ హీరో.. ఏంటి విషయం?

Published Sat, May 11 2024 9:35 PM | Last Updated on Sun, May 12 2024 7:28 PM

Vijay Devarakonda Dual Role New Movie With Rahul Sankrityan

తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో విజయ్ దేవరకొండ స్టైల్ వేరే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి రెండు మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ తర్వాత తర్వాతే అడుగులు తడబడ్డాయి. సినిమాల రిజల్ట్ అటకెక్కేసింది. ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి టైంలో రిస్క్ తీసుకునేందుకు రౌడీ హీరో రెడీ అయ్యాడని అంటున్నారు. అసలేంటి విషయం?

(ఇదీ చదవండి: నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్)

'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో వరస హిట్స్ కొట్టి విజయ్ దేవరకొండ.. స్టార్ అయిపోయాడు. కొందరైతే ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్‌తో పోల్చారు. కానీ ఈ సక్సెస్‌ని కొనసాగించలేకపోయాడు. 'నోటా' దగ్గర నుంచి వరసగా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. గతేడాది వచ్చిన 'ఖుషి' పర్వాలేదనిపిస్తే.. రీసెంట్‌గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' దారుణమైన ఫలితాన్ని చూసింది. కానీ విజయ్ చేతిలో ఇప్పుడు మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి.

వీటిలో 'శ్యామ్ సింగరాయ్' తీసిన రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్ ఒకటి. 19వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. రీసెంట్ గానే కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఉన్నంతలో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రాహుల్ గత సినిమా మాదిరిగానే ఇందులోనూ హీరో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ అయితే వినిపిస్తోంది. అది కూడా తండ్రి కొడుకుల పాత్రలని అంటున్నారు. మరి వేర్వేరు టైమ్ జోన్స్‌కి చెందినవా? లేదంటే ఒకసారి తెరపై కనిపిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏమైనా సరే కెరీర్ కాస్త డేంజర్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పాత్రలంటే సాహసమనే చెప్పాలి.

(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement