Rahul Sankrityan
-
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో విజయ్ దేవరకొండ స్టైల్ వేరే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి రెండు మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ తర్వాత తర్వాతే అడుగులు తడబడ్డాయి. సినిమాల రిజల్ట్ అటకెక్కేసింది. ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి టైంలో రిస్క్ తీసుకునేందుకు రౌడీ హీరో రెడీ అయ్యాడని అంటున్నారు. అసలేంటి విషయం?(ఇదీ చదవండి: నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్)'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో వరస హిట్స్ కొట్టి విజయ్ దేవరకొండ.. స్టార్ అయిపోయాడు. కొందరైతే ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్‌తో పోల్చారు. కానీ ఈ సక్సెస్‌ని కొనసాగించలేకపోయాడు. 'నోటా' దగ్గర నుంచి వరసగా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. గతేడాది వచ్చిన 'ఖుషి' పర్వాలేదనిపిస్తే.. రీసెంట్గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' దారుణమైన ఫలితాన్ని చూసింది. కానీ విజయ్ చేతిలో ఇప్పుడు మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి.వీటిలో 'శ్యామ్ సింగరాయ్' తీసిన రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్ ఒకటి. 19వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. రీసెంట్ గానే కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఉన్నంతలో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రాహుల్ గత సినిమా మాదిరిగానే ఇందులోనూ హీరో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ అయితే వినిపిస్తోంది. అది కూడా తండ్రి కొడుకుల పాత్రలని అంటున్నారు. మరి వేర్వేరు టైమ్ జోన్స్‌కి చెందినవా? లేదంటే ఒకసారి తెరపై కనిపిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏమైనా సరే కెరీర్ కాస్త డేంజర్లో ఉన్నప్పుడు ఇలాంటి పాత్రలంటే సాహసమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్) -
హిట్ కోసం ట్రాక్ మార్చిన రౌడీ
-
టీవీల్లో సందడి చేయనున్న 'శ్యామ్ సింగరాయ్'.. ఆరోజే ప్రసారం
నేచురల్ స్టార్ నాని, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిల అద్భుతనటనగల ప్రేమ కావ్యం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 26న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తర్వాత కొద్ది రోజులకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ అనూహ్యమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు కూడా పొందింది. ఈ సినిమా ప్రేమకథా అనేక ప్రేక్షక జనానికి ఎంతో నచ్చి ప్రశంసలు కురింపించారు. తాజాగా ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇక సినిమాను టీవీ ఆడియెన్స్ వీక్షించనున్నారు. ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో 'శ్యామ్ సింగరాయ్' ప్రసారం కానుంది. అంటే థియేటర్, ఓటీటీలో చూడని వీక్షకులు టీవీ ద్వారా ఈ సినిమాను వీక్షించవచ్చు. సుమారు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదలైంది. పూర్వజన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవితోపాటు కృతి శెట్టి, మడోన్నాసెబాస్టియన్లు హీరోయిన్లుగా అలరించారు. Story of Aspiring film maker haunted hy his past Shyam Singha Roy | April 3 | 6 PM#GeminiTV#UgadiwithShyamSinghaRoy #KrithiShetty @IamKrithiShetty@Sai_Pallavi92@NameisNani pic.twitter.com/DVeuYy0a4J — Gemini TV (@GeminiTV) April 1, 2022 -
ఆన్లైన్ క్లాస్‌లో 'శ్యామ్ సింగరాయ్'.. తమను కలపాలని లెక్చరర్‌కు వినతి
Students Makes Fun With Lecturer On Shyam Singha Roy Name: నేచురల్ స్టార్ నాని, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిల అద్భుతనటనగల ప్రేమ కావ్యం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తర్వాత ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు కూడా పొందింది. ఈ సినిమా ప్రేమకథా అనేక ప్రేక్షక జనానికి ఎంతో నచ్చి ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో పూర్వజన్మ నేపథ్యంతో ప్రేమకథ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ఒక లెక్చరర్‌తో సరదాగా ఆడుకున్నారు. స్టూడెంట్ తన పేరు శ్యామ్ సింగరాయ్ అని తన భార్య పేరు రోజీ సింగరాయ్ అని చెప్పాడు. వాళ్లిద్దరిని ఎలాగైనా కలపాలని లెక్చరర్‌ను కోరి ఇబ్బంది పెట్టాడు. ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన ఓ విద్యార్థి తన ఐడీని శ్యామ్ సింగరాయ్‌గా మార్చుకున్నాడు. అది నిజంగా తన పేరా ? లేదా సినిమా పేరును ఐడీగా పెట్టుకున్నారా ? అని లెక్చరర్ అడగ్గా అది తన పేరేనని, తన భార్య రోజీ సింగరాయ్ కూడా క్లాస్‌లోనే ఉందని, తాను పునర్జన్మ ఎత్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న లెక్చరర్ క్లాస్ అయ్యాక పర్సనల్‌గా మాట్లాడదామని తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను ఓ నెటిజన్ శ్యామ్ సింగరాయ్ చిత్రబృందానికి ట్యాగ్ చేశాడు. దానికి ఆన్లైన్ క్లాస్‌లో శ్యామ్ సింగరాయ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూసిన మూవీ డైరెక్టర్ రాహుల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే ఈ ఆడియోను కావాలని సరదాగా క్రియేట్ చేశారో, నిజంగానే జరిగిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది. Shyam Singh Roy in Online Class🔥🥳😂😂😂@NameisNani @Sai_Pallavi92 @NiharikaEnt #ShyamSinghaRoy #ShyamSinghaRoyonnetflix pic.twitter.com/5Ga5l4Y0aK — RRRisky Venù (@RevuriVenu) January 28, 2022 -
మరో క్రేజీ దర్శకుడికి ఓకే చెప్పిన రామ్ చరణ్
RRR Hero to join hands with Shyam Singha Roy Director: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఒక పక్కన దర్శకుడు శంకర్ సినిమా చేస్తూనే తన తదుపరి చిత్రాన్ని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు చెర్రి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ఏంటంటే ఆ రెండు చిత్రాల అనంతరం 'శ్యామ్ సింగరాయ్’తో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంక్రిట్యన్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నట్టు సమాచారం. రీసెంట్గా 'శ్యామ్ సింగరాయ్’ చూసి రామ్ చరణ్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే మంచి కథ ఉంటే రాహుల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. అయితే వీళ్ల కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
సాయిపల్లవి అందుకోసం ఏడురోజులు కష్టపడింది
Shyam Singha Roy Movie Director Rahul Sankrityan: నేచురల్ స్టార్ నాని హీరోగా, సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ► సత్యదేవ్ జంగా గారు ఈ కథ బెంగాల్లో జరుగుతుందని చెప్పగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఈ కథ మీద వర్క్ చేయడానికి స్కోప్ ఉందనిపించింది. క్యారెక్టర్స్ చాలా బాగా కుదిరాయి. దాన్ని ఇంకా ఎంత బెటర్‌గా చేయొచ్చు అనే దానిపై వర్క్ చేశాను. లాక్డౌన్లో దొరికిన టైమ్‌ను బాగా ఉపయోగించుకున్నాను. లక్కీగా ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్‌కు తగ్గ ఆర్టిస్టులు దొరికారు. ► కథ పూర్తిగా డెవలప్ చేశాక నేరుగా నానిగారి దగ్గరకే వెళ్లి నరేషన్ ఇచ్చాను. మరో ఆప్షన్ కూడా అనుకోలేదు ..ఆ పాత్రలో నానిగారు తప్ప మరెవ్వరూ కనపడలేదు. ► ఎడిటర్ నవీన్ నూలి జర్సీకి పని చేశారు కాబట్టి ఆయన్నే తీసుకున్నాం. సినిమాటోగ్రాఫర్‌గా ముందు రవివర్మన్ అనుకున్నాం. కానీ అప్పుడు ఆయన పొన్నియన్ సెల్వమ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మ్యూజిక్ రెహమాన్ అనుకున్నాం కుదరకపోవడంతో మిక్కీ జే మేయర్‌ను సజెస్ట్ చేశాను. సాను జాన్ వర్గీస్‌ను నాని సజెస్ట్ చేశారు. హీరోయిన్గా సాయి పల్లవి ఫస్ట్ ఆప్షన్. నానికి ఈ విషయం చెప్పగానే తను చేస్తే ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుందని ఎగ్జయిట్ అయ్యారు. ► దేవదాసి వ్యవస్థ అనే పాయింట్ కథ ప్రకారం పశ్చిమ బెంగాల్లో స్టార్ అయిన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా ప్యాన్ ఇండియా స్థాయిలో దానిని చర్చిస్తాం. ఈ సినిమాలో దేవదాసి వ్యవస్థ అనేది మెయిన్ సబ్జెక్ట్ కాదు. కథలో క్యారెక్టర్‌కి భాగంగా తీసుకున్నదే.. దానికి వ్యతిరేకంగా లీడ్ క్యారెక్టర్ పోరాడుతాడు. సమాజానికి మంచి సందేశం ఇస్తాడు. ► నాని గారితో గతంలో ఒక సబ్జెక్ట్ గురించి చర్చించాను. అది కుదరలేదు. కాని ఆయన ఎలాంటి కథల మీద ఇంట్రెస్ట్‌గా ఉంటారని ఒక ఐడియా ఉంది. ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఒకే చేశారు. అప్పటి నుంచే నన్ను నమ్మడం మొదలైంది. ఈ రోజు వరకూ ఆ నమ్మకం పెరుగుతూనే వస్తుంది తప్ప ఎక్కడా తగ్గలేదు. ఆయన సపోర్ట్ వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలిగాను. ఈ స్క్రిప్ట్ అనుకున్న రోజే శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ కూడా అనుకున్నాం. ► క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరణ చాలా చాలెంజింగ్ అనిపించింది. రెండు రోజులు షూటింగ్ చేశాం. అది ఎందుకు అనేది సినిమా విడుదలయ్యాక చెప్తాను. ► సాయి పల్లవి మంచి డ్యాన్సర్..ఈ సినిమా కోసం క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. పగలంతా రిహార్సల్ చేయడం రాత్రి పెర్ఫామ్ చేయడం అలా ఏడు రోజుల పాటు ఆ సాంగ్ షూటింగ్ కంటిన్యూగా చేసింది. ప్రస్తుతం టైమ్ ట్రావెల్ జోనర్లో ఒక కథ రెడీగా ఉంది. అది మరో డిఫరెంట్ జోనర్.. ఈ సినిమా తర్వాత దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చాడు రాహుల్. 'శ్యామ్ సింగరాయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూసేయండి -
Shyam Singha Roy: ఆరు ఎకరాల్లో సెట్.. మూన్నెళ్లు..300 మంది శ్రమించారు
శ్యామ్ సింగరాయ్ మూవీలో రెండు కథలు ఉంటాయి. ఒకటి ప్రజెంట్‌గా సాగుతుంది. మరోకటి 70వ దశకంలో జరుగుతుంది. బెంగాల్లో అప్పటి పరిస్థితులను చూపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాం. ఈ సినిమా కోసం వేసిన టెంపుల్ సెట్ హైలెట్‌గా నిలుస్తుంది’అని అన్నారు ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల. న్యాచులర్ స్టార్ నాని హీరోగా, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ►ఈ సినిమాలో రెండు కథలుంటాయి. ఒకటి ప్రజెంట్‌గా జరుగుతుంది. ఇంకోటి 70వ దశకంలో బెంగాల్లో జరుగుతుంది. అప్పటి పరిస్థితులను చూపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాం. గత ఏడాది లాక్డౌన్ సమయంలో బెంగాల్లోనే ఉండిపోయాను. సౌత్, నార్త్ ఒకరకమైతే..బెంగాల్లో మరోలా ఉంటుంది. అక్కడి ఆర్కిటెక్చర్, టెంపుల్స్ అన్నింటిపై పరిశోధించాను. ► అన్ని సెట్స్ హైద్రాబాద్‌లోనే వేశాం. ట్రైలర్లో చూసి ఉంటే ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. దాని కోసం చాలా కష్టపడ్డాం. అప్పుడు వాడిన పేపర్, టెక్స్ట్ ఇలా అన్నింటి గురించి తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న వాటిని తెలుసుకుని, కొన్నింటిని రీక్రియేట్ చేశాం. ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద సెట్ టెంపుల్ సెట్. అందులో మేజర్ సీన్స్ తెరకెక్కించారు. టెంపుల్ సెటప్ మేజర్ హైలెట్ అవుతుంది. ఆ సెట్‌ను హైద్రాబాద్‌లోనే వేశాం. ఆరు ఎకరాల్లో వేసిన ఆ సెట్ కోసం మూడు నెలల పాటు, రోజూ మూడొందల మంది శ్రమించారు. ► కోల్‌కతా నేపథ్యంలో సినిమా రాబోతోందనే విషయమే నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. కోల్‌కతా కల్చర్ ఇండియాలో ఎక్కడా కనిపించదు. దేవదాసిలకు సంబంధించిన టెంపుల్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం కేవలం ఊహించగలం. కథకు తగ్గట్టు ఊహించుకుని ఆ సెట్ వేశాను. ►ఈ సినిమా కోసం సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. కానీ అవన్ని బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉన్నాయి. దాని వల్ల అంతగా ఉపయోగం ఏమీ లేదు. ►కరోనా వల్ల చాలా రోజు సెట్స్ పనులు ఆగిపోయాయి. మధ్యలో వర్షాలు, తుఫాను వల్ల ఇబ్బంది ఏర్పడింది. కానీ మళ్లీ షూటింగ్ మొదలయ్యే సరికి సెట్స్‌ను రెడీ చేశాం. ►టెంపుల్ సెట్‌ను ఇండస్ట్రీలో చాలా మంది చూశారు. ఇంత డీటైలింగ్‌గా ఎందుకు వేశారు.. దర్శకుడు చెప్పారని ఇలా వేశారా? మీరు వేశారని డైరెక్టర్ తీస్తారా? అనే అనుమానాలు అందరికీ వచ్చాయి. ►నిర్మాత గారు నన్ను ఏనాడూ ఏ ప్రశ్న వేయలేదు. ఎంత ఖర్చు పెడుతున్నారు.. ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని అడగలేదు. ఇలాంటి సినిమాలకు అలాంటి నిర్మాతలే ఉండాలి. అలాంటప్పుడే కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ తీసుకురాగలం. ►శ్రీమంతుడు సినిమాకు అప్రెంటిస్‌గా పని చేశాను. ఆ తరువాత నాని గారి కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాకు మొదటిసారి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆయనతో జెర్సీ కూడా చేశాను. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్. ఆ తరువాత దసరా కూడా చేస్తున్నాను. ►ఆర్ట్ వర్క్‌తో పాటు కెమెరా పనితనం కూడా చాలా ముఖ్యం. కొన్ని సార్లు ఆర్ట్ వర్క్‌కు గుర్తింపు వస్తుంది. కొన్ని సార్లు రావు. జెర్సీ సినిమాకు పేరు వచ్చింది. కానీ ఆర్ట్ డైరెక్షన్‌కు పేరు రాలేదు. అందులో వేసినవి సెట్స్ అని ఎవరికీ తెలియవు. ► నాని గారి దసరా సినిమా చేస్తున్నాను. రవితేజ గారితో టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రాన్ని చేస్తున్నాను. సెట్స్ వర్క్ ఆల్రెడీ మొదలయ్యాయి. ►నా టీం పనిదనం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. మొదటి నుంచి ఇప్పటి వరకు అదే టీంతో పని చేస్తున్నాం. ఎవ్వరూ మారలేదు. -
సిరివెన్నెల తన మరణాన్ని ముందుగానే ఊహించారు: డైరెక్టర్
Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు పాటకు అందాన్నే కాక గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు సినీ పాటకు విశ్వ ఖ్యాతిని తెచ్చిన సిరివెన్నెల అస్తమయాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం అందరి హృదయాల్లో సజీవంగా మిగిలిపోనున్నాయి. ఆయన రాసిన పలు పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. అందులో శ్యామ్ సింగరాయ్ సినిమాలో రాసిన రెండు పాటలు కూడా ఉన్నాయి. అయితే ఆ పాటలు రాస్తున్న క్రమంలోనే తన మరణాన్ని ఊహించినట్లున్నారు సిరివెన్నెల. ఇదే నా చివరి పాట అని రాహుల్‌తో అన్నారట! తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. 'నవంబర్ 3వ తేదీన రాత్రి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫోన్ చేసి తన ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నాను.. ఇంకెవరితోనైనా రాయిద్దాం అన్నారు. పర్లేదు సర్ అన్నాను. ఆ తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ చేసి నన్ను నిద్ర లేపారు. ఆరోజు దీపావళి. ఆయన ఫోన్ చేసి పల్లవి అయిపోయింది చెప్తాను రాస్కో అన్నారు. నేను వెంటనే పక్కనున్న మహాభారతం పుస్తకంలో పల్లవి రాశాను. అందులో మొదటి వాక్యంలో సిరివెన్నెల తన పేరు రాశారు. ఎందుకుసార్ ఈ పాటకు సంతకమిచ్చారని అడిగితే.. బహుశా ఇదే నా ఆఖరి పాట అవచ్చు అని గట్టిగా నవ్వారు... ఈ పాట రికార్డింగ్ మొదలు పెట్టిన రోజునే ఆయన అంత్యక్రియలు జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది, అందుకే ఈ సాంగ్‌కు ఆయన పేరే పెట్టాం' అని చెప్పుకొచ్చాడు. హీరో నాని మాట్లాడుతూ.. శ్యామ్ సింగరాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. -
ఇక కొత్త నానీనే చూస్తారు
‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో నేనెప్పుడూ కొత్త, పాత అని చూడను. కంటెంట్ మాత్రమే చూస్తాను. ఇప్పటినుంచి ప్రతి సినిమాలో ఇది వరకు చూడని కొత్త నానీనే చూస్తారు’’ అని హీరో నాని అన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా, సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల తర్వాత థియేటర్‌కు వస్తున్నాను.. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి కరెక్ట్ సినిమాతో వస్తున్నాను. మంచి టీమ్ కుదిరినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. క్రిస్మస్ అనేది నాకు స్పెషల్. ‘ఎంసీఏ’తో హిట్ సాధించాను.. ‘శ్యామ్ సింగరాయ్’కి ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఇది ప్రేమ కథ. టీజర్ కంటే సినిమా వంద రెట్లు ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను కూడా నాని అభిమానినే. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగానే మా సినిమా ఉంటుంది’’ అని రాహుల్ సంకృత్యాన్ అన్నారు. ‘‘నాని ఎంతో సపోర్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి వెంకట్గారిలాంటి నిర్మాతలు అవసరం ’’ అన్నారు నటుడు రాహుల్ రవీంద్రన్. కథా రచయిత సత్యదేవ్ జంగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట్ రత్నం (వెంకట్). -
‘టాక్సీవాలా’కు మెగాస్టార్ ప్రశంసలు
-
‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ
టైటిల్ : టాక్సీవాలా జానర్ : సూపర్ నేచురల్ కామెడీ తారాగణం : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణీ, ఉత్తేజ్ సంగీతం : జాక్స్ బెజోయ్ దర్శకత్వం : రాహుల్ సాంక్రుత్యాయన్ నిర్మాత : ఎస్కేయన్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ టాక్సీవాలా. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా రిలీజ్ కన్నా చాలా రోజుల ముందే ఆన్లైన్ లో రిలీజ్ కావటంతో రిజల్ట్ ఎలా ఉండబోతుందన్న ఆందోళనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది..? విజయ్ దేవరకొండ మరోసారి తన ఫాం చూపించాడా..? కథ ; శివ (విజయ్ దేవరకొండ) అతి కష్టమీద ఐదేళ్లపాటు చదివి డిగ్రీ పూర్తిచేసిన కుర్రాడు. అన్నా వదినలకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్(మధు నందన్) దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చేస్తాడు. ముందు ఒకటి రెండు జాబ్స్ ట్రై చేసిన వర్క్ అవుట్ కాకపోవటంతో క్యాబ్ డ్రైవర్‌గా పని చేయాలనకుంటాడు. తన వదిన బంగారం అమ్మి ఇచ్చిన డబ్బుతో ఓ పాత కారును కొని టాక్సీగా మారుస్తాడు. టాక్సీ తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..? ఈ పరిస్థితుల్లో శివ ఏం చేశాడు..? అసలు టాక్సీలో ఉన్న ఆ పవర్ ఏంటి..? ఈ కథతో అను (ప్రియాంక జవాల్కర్), శిశిర (మాళవిక నాయర్)లకు ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజయ్ దేవరకొండ మరోసారి తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిజం, స్టైల్‌తో పాటు ఎమోషన్స్, భయం కూడా చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో విజయ్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్గా పరిచయం అయిన ప్రియాంక గ్లామర్ రోల్ లో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో పర్ఫామెన్స్‌కు స్కోప్ లేదు. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర పాత్రల్లో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్, ఉత్తేజ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; తెలుగులో పెద్దగా కనిపించని సూపర్‌నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంచుకున్న దర్శకుడు రాహుల్, అనుకున్న కథను తెర మీద చూపించటంలో విజయం సాధించాడు. సూపర్ నేచురల్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో తయారు చేసుకున్న లైన్ కావటంతో లాజిక్ల గురించి మాట్లాడుకోవటం అనవసరం. సినిమాకు ప్రధాన బలం కామెడీ. ముఖ్యం ఫస్ట్ హాఫ్ అంతా హీరో, ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గినా మార్చురీ సీన్ సూపర్బ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. గ్రాఫిక్స్ నిరాశపరుస్తాయి. ఈ తరహా సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా కీలకం. సుజిత్ సారంగ్ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు. ఒక్క ‘మాటే వినుదుగా’ పాట తప్ప మిగతా పాటలేవి గుర్తుండేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ దేవరకొండ కామెడీ మైనస్ పాయింట్స్ ; సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ పాటలు గ్రాఫిక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఇంకా పూర్తి కాలేదు: విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే లోగా పూర్తి సినిమా లీకైపోయింది. మొబైల్స్‌లో టాక్సీవాలా సినిమా షేర్ అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై చిత్రయూనిట్ ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశారు. తన సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే విజయ్ దేవరకొండ ఈ ప్రమోషనల్ వీడియోలోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే లీకైన వీడియోలో సినిమా రష్ మాత్రమే ఉందని.. ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ పూర్తయితేనే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుందని ఇన్నోవేటివ్‌గా చూపించాడు. ‘ద రియాలిటీ బిహైండ్ టాక్సీవాలా’ పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. విజయ్ సరసన ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రౌడీవాలా
-
టాక్సీవాలా : మళ్లీ డేట్ మార్చారు..!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల కిందే రిలీజ్ కావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. గీత గోవిందం సినిమాతో పాటే షూటింగ్ పూర్తయినా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా డీలే కావటంతో పాటు ఇతర కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల ఈ సినిమాను నవంబర్ 16న రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. తాజాగా మరో కొత్త డేట్‌ను ప్రకటించారు టాక్సీవాలా టీం. అయితే అదే రోజు రవితేజ, శ్రీనువైట్ల కాబింనేషన్లో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటొని కూడా రిలీజ్ అవుతుండటంతో విజయ్ కాస్త వెనక్కి తగ్గాడు. ఒక్క రోజు ఆలస్యంగా నవంబర్ 17న టాక్సీవాలా సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా కొత్త రిలీజ్ డేట్‌ను పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. Release date announcement -#Taxiwaala will now arrive Nov 17! Driver arriving a day late, but driver promises a fun ride to the destination! pic.twitter.com/BRuOBmwxL7 — Vijay Deverakonda (@TheDeverakonda) 4 November 2018 -
‘టాక్సీవాలా’ వచ్చేస్తున్నాడు..!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల కిందే రిలీజ్ కావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. గీత గోవిందం సినిమాతో పాటే షూటింగ్ పూర్తయినా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా డీలే కావటంతో పాటు ఇతర కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమాను నవంబర్ 16న రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు టాక్సీవాలా టీం. -
మొబైల్స్‌లో హల్చల్ చేస్తున్న ‘టాక్సీవాలా’
టాలీవుడ్‌ను పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం సినిమా పైరసీ భారిన పడటంతో ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. అదే సమయంలో విజయ్హీరోగా తెరకెక్కిన మరో సినిమా టాక్సీవాలా కూడా పైరసీకి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి లో కొంత మంది ఆకతాయిలు మొబైల్లో టాక్సీవాలా సినిమా చూస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారికి సినిమా ఎక్కడి నుంచి వచ్చింది. వారు ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారన్న విషయాలను ఆరా తీస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. -
‘టాక్సీవాలా’ రిలీజ్ డేట్..!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మే 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అప్పటికి నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో టాక్సీవాలా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజు రిలీజ్ చేస్తే సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సమ్మోహనం’ సినిమాతో విజయ్ పోటి పడాల్సి వస్తుంది. త్వరలోనే టాక్సీవాలా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
నేను మే 18న రావట్లే : విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్సీవాలా సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల మహానటి సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ యువ కథానాయకుడు టాక్సీవాలా సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స 2 బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ సినిమాను మే 18న రిలీజ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోటంతో టాక్సీవాలా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘మై రౌడీస్.. నేను మే 18న రావట్లే. భయపడటానికి, అరవటానికి, గట్టిగా నవ్వడానికి కాస్త వెయిట చేయండి. కొత్త రిలీజ్ డేట్‌ను మరో వారం రోజుల్లో వెల్లడిస్తాం’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. My rowdies, Nenu May 18th ki ravatle - sit tight for slightly longer to Scream! Shout! LaughOutLoud! coz we are giving this madcool film some final touches. Will announce the June Release date in a week. For now enjoy this pic of me sitting on my taxi and smiling 😜 #Taxiwaala pic.twitter.com/LQ8bMaEfJW — Vijay Deverakonda (@TheDeverakonda) May 14, 2018 -
‘టాక్సీవాలా’ వాయిదా..?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఇంత వరకు ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించకపోవటంతో ముందుగా ప్రకటించిన సమయానికి టాక్సీవాలా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. లేదా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తయినా.. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కావటానికి మరింత సమయం పట్టనుందట. అందుకే సినిమా విడుదల వాయిదా వేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఇంతవరకు ప్రమోషన్ హడావిడి కనిపించకపోవటంతో టాక్సీవాలా విడుదల వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక జువాల్కర్, మాళవిక నాయర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
‘టాక్సీవాలా’ టీజర్ వచ్చేస్తోంది..!
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. అర్జున్ రెడ్డి తరువాత ఏ మంత్రం వేసావే సినిమాతో నిరాశపరిచిన ఆ ప్రభావం విజయ్ కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సీవాలా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఆకట్టుకుంటున్న టాక్సీవాలా టీం ఏప్రిల్ 17న టీజర్ ను రిలీజ్ చేస్తోంది. టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్చేస్తూ ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో కండలు తిరిగిన బాడీతో సూపర్బ్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ ప్రియాంక లుక్‌ను కూడా ఈ పోస్టర్లో రివీల్ చేశారు. గోపిసుందర్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మే మూడోవారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. Because I'll give you the unexpected. Presenting to you the Swaggest Stress Busting Thriller you have ever seen. #TaxiwaalaTeaser pic.twitter.com/yxDenv3UlJ — Vijay Deverakonda (@TheDeverakonda) 14 April 2018 -
యంగ్ హీరో 'షికారు'
పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విజయ్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారట. విజయ్ క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్న ఈ సినిమాకు షికారు అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో పరశురాం దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు విజయ్ దేవరకొండ. -
షార్ట్ ఫిలిం బ్యూటీతో అర్జున్ రెడ్డి రొమాన్స్
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి చేరిపోయాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో విజయ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. అంతేకాదు తన నెక్ట్స్ సినిమాల కోసం క్రేజీ కాంబినేషన్ లను సెట్ చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా షార్ట్ ఫిలిం స్టార్ ప్రియాంక జవాల్కర్ ను ఎపింక చేశారు. ఈ సినిమాలో ప్రియాంక డాక్టర్ అను పాత్రలో కనిపించనుందట. విజయ్ క్యాబ్ డ్రైవర్ శివగా నటిస్తున్న ఈ సినిమా సరికొత్త కథా కథనాలతో రూపొందుతోంది. అనంతపురానికి చెందిన ప్రియాంక అక్కడే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ను పూర్తి చేసింది. తరువాత నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈ బ్యూటీ నటిగా స్థిరపడే ప్రయత్నాల్లో ఉంది. -
ది ఎండ్ మూవీ స్టిల్స్
-
‘ది ఎండ్ ’ టైలర్ లాంచ్