విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల కిందే రిలీజ్ కావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
గీత గోవిందం సినిమాతో పాటే షూటింగ్ పూర్తయినా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా డీలే కావటంతో పాటు ఇతర కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమాను నవంబర్ 16న రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు టాక్సీవాలా టీం.
Comments
Please login to add a commentAdd a comment