
టాలీవుడ్‌ను పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం సినిమా పైరసీ భారిన పడటంతో ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. అదే సమయంలో విజయ్‌హీరోగా తెరకెక్కిన మరో సినిమా టాక్సీవాలా కూడా పైరసీకి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి లో కొంత మంది ఆకతాయిలు మొబైల్‌లో టాక్సీవాలా సినిమా చూస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు వారికి సినిమా ఎక్కడి నుంచి వచ్చింది. వారు ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారన్న విషయాలను ఆరా తీస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment