Taxiwaala
-
టాక్సీవాలా రీమేక్
పాత కారు, అందులో దెయ్యం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన విజయ్ దేవరకొండ చిత్రం ‘టాక్సీవాలా’. రిలీజ్‌కు ముందే పైరసీ అయినప్పటికీ మంచి విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోందని సమాచారం. బాలీవుడ్ యంగ్ హీరో, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ హీరోగా ‘కాలీ పీలీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనన్యా పాండే హీరోయిన్. మక్బూల్ ఖాన్ దర్శుకుడు. ఈ సినిమాలో టాక్సీ కూడా ప్రధాన పాత్ర అని సమాచారం. తాజా సమాచారం ఏంటంటే ‘కాలీ పీలీ’ చిత్రం ‘టాక్సీవాలా’ చిత్రం ఆధారంగా రూపొందుతోందని తెలిసింది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా రిలీజ్. ఇషాన్ గత సినిమా ‘ధడక్’ కూడా మరాఠీ సినిమాకు రీమేకే. -
చిత్ర రచయిత్రి
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘కల్యాణవైభోగమే’, ‘మహానటి’, ‘ట్యాక్సీవాలా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది మాళవిక నాయర్. ఢిల్లీలో పుట్టిన ఈ అమ్మకుట్టి కోచిలో చదువుకుంది. బాలనటిగా చేసింది.‘‘పాత్ర నిడివి గురించి కాదు... అది ఎంత శక్తిమంతమైనది? అనే దాని గురించి ఆలోచిస్తాను’’ అంటున్న మాళవిక మనసులో మాటలు ఇవి.... ఆ పాత్రలో నటించాలని ఉంది... కంఫర్ట్జోన్లో ఉండే పాత్రలు చేయడం కంటే సవాలు విసిరే పాత్రలు చేయడం అంటేనే ఇష్టం. మానసిక వైకల్యం ఉన్న యువతిగా నటించాలని ఉంది. మలయాళ చిత్రంలో ‘కూకూ’ అంధురాలిగా నటించాను. ఈ పాత్ర నాకు సంతృప్తి ఇచ్చింది. ఆమిర్‌ఖాన్ ఆదర్శం పాత్రల ఎంపికలో ఆమిర్‌ఖాన్‌తో పాటు విద్యాబాలన్ నాకు ఆదర్శం. కమర్షియల్–నాన్ కమర్షియల్ సినిమాలను సమన్వయం చేసుకోవడంలో అమీర్ నాకు బాగా నచ్చుతారు. బాలీవుడ్‌లోకి వెళ్లాలనే ఆతృత లేదు. ఆసక్తి కూడా లేదు. గ్లామర్‌రోల్స్ పోషించడం నాకు కంఫర్ట్ కాదు. తొందరేమీ లేదు ఒక సినిమా సక్సెస్ అయితే ‘సంతోషం’తో పాటు, స్క్రిప్ట్ ఎంపికలో నా మీద నాకు నమ్మకం కూడా ఏర్పడుతుంది. ‘ట్యాక్సీవాలా’ విషయంలో ఇలాగే జరిగింది. డైరెక్టర్ రాహుల్ స్క్రిప్ట్ నెరేట్ చేయగానే వెంటనే ఓకే చెప్పేశాను. నా నమ్మకం వమ్ము కాలేదు. మంచి పాత్రల విషయంలో నిడివి గురించి ఆలోచించను. ఎడాపెడా సినిమాలు చేసేయాలనే తొందర లేదు. నచ్చే పాత్రలు వచ్చే వరకు ఓపికగా ఎదురుచూస్తాను. రాకపోతే బాధ పడను. దూరం ఎందుకంటే... ‘సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు ఎందుకు?’ అని అడుగుతుంటారు. మన గురించి మన సినిమాలు మాట్లాడాలి తప్ప మనం కాదు అనేది నా అభిప్రాయం. ‘వైడ్ రీచ్’ అనేది సోషల్ మీడియాకు ఉన్నదనేది నిజమేగానీ, టైమ్ ఎక్కువగా తినేస్తుంది. దానికి దూరంగా ఉండడంలో కూడా హాయిగా ఉంది. రచనలు చేయడమన్నా , పెయింటింగ్స్ వేయడమన్నా నాకు చాలా ఇష్టం. నా పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఉంది. నా రోల్‌మోడల్ ప్రజలతో మమేకమైనప్పుడే వారి ప్రవర్తన, పద్ధతులు తెలుస్తాయి. అవి నటనకు ఉపయోగపడతాయి. కమర్షియల్ సినిమాలు చేయడానికి అభ్యంతరం లేదు. అయితే అందులో నేను చేస్తున్న పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. పాత్ర నచ్చకపోవడంతో ఈమధ్య ఒక కమర్షియల్ సినిమాను వద్దనుకున్నాను. నా రోల్ మోడల్ మలయాళ నటి పార్వతి. ఆమె చేసిన పాత్రలు ఇష్టం. ఒక పాత్ర చేసే ముందు ఎంతో రీసెర్చి చేసిగాని ఆమె కెమెరా ముందుకు రాదు. -
బాలీవుడ్‌కి అతిథిగా..!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో మెప్పించిన విజయ్ నోటా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. అదే జోరులో బాలీవుడ్లో కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతుండటంతో అక్కడ కూడా విజయ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పట్లో బాలీవుడ్ లో హీరోగా ఆలోచన చేసే ఆలోచన విజయ్‌కు లేదని తెలుస్తోంది. కానీ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో విజయ్ కనిపించనున్నాడట. ఓ భారీ చిత్రంలో విజయ్ అతిధి పాత్రలో కనిపించటం కన్ఫామ్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా 2020లో రిలీజ్ కానుందన్న ప్రచారం జరుగుతోంది. మరి విజయ్ నటిస్తున్న ఆ బాలీవుడ్ మూవీ ఎదో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
‘టాక్సీవాలా’కు మెగాస్టార్ ప్రశంసలు
-
‘టాక్సీవాలా’కు మెగాస్టార్ ప్రశంసలు
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంక్రుత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టాక్సీవాలా. రిలీజ్‌కు ముందు పూర్తి సినిమా లీక్ అవ్వటంతో పాటు, ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఇమేజ్ మరింత పెరిగింది. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల సమర్పణలో ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించిన తో తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా పరిచయం అయ్యారు. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి చిత్రయూనిట్‌ను అభినందించారు. ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన టాక్సీవాలా స్టడీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. -
మాస్ హీరోతో ‘టాక్సీవాలా’ బ్యూటీ.!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. టాక్సీవాలా సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్న ప్రియాంక, మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ‘అమర్ అక్బర్ ఆంటొని’తో నిరాశపరిచిన రవితేజ త్వరలో విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. మరో హీరోయిన్గా ఇప్పటికే పాయల్ రాజ్‌పుత్‌ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. -
విజయ్ దేవరకొండలా నిద్ర లేస్తానంటోన్న జాన్వీ!
అమ్మాయిల్లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భీమవరంలో జరిగిన ‘టాక్సీవాలా’ విజయ యాత్రలో ఆయన లేడీ ఫ్యాన్స్ స్కూటీలతో ర్యాలీ చేసిన ఫొటోలు వైరల్ అవడం ఇందుకు ఒక ఉదాహరణ. విజయ్ క్రేజ్ బాలీవుడ్‌కి కూడా చేరింది. విజయ్‌తో ఓ సినిమా చేయాలని ఉందని శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ చెప్పారు. కాఫీ విత్ కరణ్ షోలో అన్నయ్య అర్జున్ కపూర్‌తో కలిసి పాల్గొన్నారు జాన్వీ కపూర్. ఈ షోలో ‘సడన్‌గా ఓ మేల్ యాక్టర్లా ఓ రోజు నువ్వు నిద్ర లేవాలి అనుకుంటే ఎవరిని ఊహించుకుంటావు? అని జాన్వీని కరణ్ జోహార్ అడిగితే.. ‘‘విజయ్‌దేవర కొండలా నిద్రలేచి, నాతో సినిమా చేయమని అడుగుతాను’’ అన్నారు. జాన్వీ ఇలా అనగానే ‘అర్జున్‌రెడ్డి’ అని అర్జున్ కపూర్ అన్నారు. ‘‘ఇప్పుడు ఆ సినిమా రీమేక్ ‘కబీర్‌సింగ్’ లోనే షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. విజయ్ సెక్సీ’’ అని కరణ్ అన్నారు. ఏది ఏమైనా జాన్వీ నోటి నుంచి విజయ్ దేవరకొండ పేరు రావడంతో తెలుగు సినిమాల్లో నటించాలని ఈ యంగ్ హీరోయిన్‌కి ఉందని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా విజయ్‌తో జోడీ కట్టాలనుకుంటున్నారని కూడా అర్థమైంది. మరి.. జాన్వీ ఊహ నెరవేరుతుందా? వేచి చూద్దాం. -
‘టాక్సీవాలా’ సక్సెస్ సెలెబ్రేషన్స్
-
కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి
‘నేను చేసిన కొన్ని పాత్రలు హీరోయిన్గా నా కెరీర్‌కు ప్లస్ కాకపోవచ్చు కానీ ఆ పాత్రల వల్ల యాక్టర్‌గా ఇంప్రూవ్ అయ్యాను. కొన్ని సినిమాల్లో హీరోయిన్ రోల్ చేయలేక పోయినందుకు గిల్టీ ఫీలవ్వడం లేదు. నాలో ఉన్న నటి ‘టాక్సీవాలా’, ‘మహానటి’ వంటి మంచి సినిమాల్లో మంచి రోల్స్ చేసేలా చేసింది. స్టార్ అనడంకన్నా ‘యాక్టర్’గా మారిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అన్నారు కథానాయిక మాళవికా నాయర్. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘టా క్సీవాలా’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకంపై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం గత శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా మాళవిక చెప్పిన విశేషాలు... ∙‘టాక్సీవాలా’ రిలీజ్ తర్వాత స్క్రిప్ట్స్‌ను ఎంచుకునే విషయంలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇందులో నా క్యారెక్టర్‌ను రాహుల్ బాగా డిజైన్ చేశారు. నా స్నేహితులతో కలిసి థియేటర్లో సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కేరింతలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంది. నాకు నచ్చిన కమర్షియల్ రోల్ వస్తే తప్పకుండా చేస్తాను. ∙ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ నుంచి దూరం కాలేదు. ‘టాక్సీవాలా’ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితం మొదలైంది. సావిత్రిగారి లాంటి గొప్ప నటి బయోపిక్‌లో భాగమవ్వాలని ‘మహానటి’లో నటించాను. ఆ మధ్య విడుదలైన ‘విజేత’లో హీరోయిన్‌గానే నటించాను. కెరీర్ బాగుండాలంటే కమర్షియల్ రోల్స్ చేయాలి. అలాగే నాకు సంతృప్తినిచ్చే పాత్రలూ చేయాలి. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. ∙ నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. ప్రతి సినిమాలో చాలెంజింగ్ రోల్స్ కుదరకపోవచ్చు. స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండాలి. అలాంటి పాత్రల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘ఎవడే సుబ్రమణ్యం’ వన్నాఫ్ మై ఫేవరెట్ మూవీస్. విజయ్ దేవరకొండ నా ఫేవరెట్ స్టార్ . నేను తెలుగులో 5 సినిమాలు చేశాను. అందులో మూడు సినిమాలు విజయ్‌తోనే ఉన్నాయి. ∙ మహిళలను వే«ధించడం అన్ని ఇండస్ట్రీస్లోనూ ఉంది. లక్కీగా నాకు ఎంటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. ఇండస్ట్రీలో నా కెరీర్ ఎర్లీగా స్టార్ట్ అయ్యింది. ‘మీటూ’ వంటి ఉద్యమాలు మంచివే. కాస్త ఆలస్యమైందని నా భావన. ఇండస్ట్రీలో మహిళల భద్రతకు సంబంధించి మార్పు రావాల్సిన అవసరం ఉంది. ∙ ఇంటర్లో ఉన్నప్పుడు పైలట్ అవ్వాలనుకున్నాను. కానీ ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. పెయింటింగ్, స్క్రిప్టింగ్ అంటే కూడా ఇష్టం. డైరెక్షన్ చాలా కష్టం. భవిష్యత్తులో సినిమా స్క్రిప్ట్స్ రాస్తానేమో ఇప్పుడే చెప్పలేను. స్పోర్ట్స్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. తెలుగు అర్థం అవుతుంది. మాట్లాడటానికి కాస్త టైమ్ పడుతుంది. ∙ తెలుగులో కొత్త చిత్రాలేవీ ఒప్పుకోలేదు. తమిళంలో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. -
‘టాక్సీవాలా’ రికార్డ్ : తొలి రోజే బ్రేక్ ఈవెన్
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. రిలీజ్ కు ముందే ఈ సినిమా లీక్ అవ్వటంతో చిత్రయూనిట్‌తో పాటు అభిమానులు కూడా సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో అన్న ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అందరిని అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి సెన్సేషనల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. (‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ) మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన విజయ్ ఏకంగా తొలి రోజే 10.5 కోట్ల గ్రాస్ సాధించి తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఈ విషయాన్ని నిర్మాత ఎస్కేయన్ స్వయంగా వెల్లడించారు. తనకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ, గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లతో పాటు తెలుగు సినీ పరిశ్రమ, మీడియా, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. Box office ki East side @TheDeverakonda West side @UV_Creations South side @GA2Official North side technicians team All sides aadarinche audience tho WE DID IT AGAIN#Taxiwaala break even on day 1 with 10.5cr WW Gross Thanks to all media, TFI , dearest audience 🙏🙏 pic.twitter.com/2bjY6GjLhn — SKN- Watch Taxiwaala in theaters (@SKNonline) 18 November 2018 -
‘టాక్సీవాలా’ సక్సెస్ సెలెబ్రేషన్స్
-
విజయ్‌కి సక్సెస్ కొత్త కాదు
‘‘మేమంతా వెనకుండి కేవలం సపోర్ట్ చేశాం. ‘టాక్సీవాలా’ విజయం యూనిట్ సమిష్టి కృషి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్ ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘టాక్సీవాలా’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘టాక్సీవాలా’ సినిమా సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. విజయ్‌కి సక్సెస్ కొత్తేమీ కాదు. అతను చాలా సక్సెస్‌లు అందుకున్నాడు. నిర్మాత ఎస్కేఎన్కు ఇది తొలి విజయం. త్వరలో సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా పైరసీ అయినప్పుడు కొత్త టీమ్ కదా అని బాధపడ్డాను. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా లైన్ గురించి చెప్పినప్పుడు వంశీ నాకు విజయ్ దేవరకొండని సజెస్ట్ చేశాడు. రాహుల్ చాలా కొత్తగా తీశాడు. ఇంత హైప్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు మారుతి. ‘‘ఆడియో ఫంక్షన్లో థియేటర్స్‌ని నింపమని ప్రేక్షకులను కోరాను. అలా చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘ఈ సినిమా టెక్నికల్‌గా సక్సెస్ అయ్యింది అంటున్నారు. అందుకే నా టెక్నికల్ టీమ్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. వంశీగారు, బన్నీగారు, మారుతిగారికి థ్యాంక్స్’’ అన్నారు రాహుల్. ‘‘అవకాశం ఇచ్చిన అరవింద్‌గారికి, వంశీ, బన్నీలకు థ్యాంక్స్. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’అన్నారు ఎస్కేఎన్. ‘‘ౖపైరసీ అయిన సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నవారందరికీ థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంక జవాల్కర్. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం... ‘టాక్సీవాలా’
‘టాక్సీవాలా’ సినిమాతో వెండితెరకు పరిచయమవుతోంది ప్రియాంక జవల్కర్. మరాఠీ మూలాలు ఉన్న ప్రియాంక పుట్టి పెరిగింది అనంతపురంలో. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ఈ చక్కనిచుక్క గురించి కొన్ని ముచ్చట్లు... ఫ్యాషన్ డిజైనర్! ‘టాక్సీవాలా’ షూటింగ్ సమయంలో రకరకాల టిప్స్ ఇచ్చి తనలో ఉన్న బెరుకును పోగొట్టాడట విజయ్ దేవరకొండ. ‘స్టోరీనే హీరో’ అని కూడా చెప్పాడట. సి.జి కోఆర్డినేషన్, ఫ్యాషన్ డిజైన్లోనూ ఒక చెయ్యి వేసిందట ప్రియాంక. అనంతపురంలో ఇంజనీరింగ్ తరువాత నిఫ్ట్‌లో డిప్లొమా పూర్తిచేసింది. కాబట్టి డిజైనింగ్ ఆమెకు కొత్తేమీ కాదు. ఒక ప్రయత్నం... సినిమాల్లో నటించాలనేది తన చిన్నప్పటి కల. తన మనసులో మాట పైకి చెబితే స్నేహితులు వెక్కిరిస్తారేమోననే భయంతో ఆ కోరిక రహస్యంగానే ఉండిపోయింది. సరదాగా షార్ట్ఫిల్మ్స్లో నటిస్తున్న కాలంలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.‘సినిమాల్లో మాత్రం ఎందుకు నటించకూడదు!’ అనుకుంది.చిన్నప్పుడు మనసులో అనుకున్న కోరిక బయటికి వచ్చి తొందరపెట్టింది. ‘‘ఒక సీరియస్ ప్రయత్నం చేసిచూద్దాం. ఒక సంవత్సరంలో వర్కవుటైతే ఓకే. లేకపోతే ఇక సినిమాల పేరుతో టైమ్ వృథా చేయవద్దు’’ అనుకొని రంగంలోకి దిగింది. యాక్టింగ్స్ కోర్సు కూడా చేసింది. హైపర్ ‘టాక్సీవాలా’లో జూనియర్ డాక్టర్ అనుగా ప్రియాంక నటించింది. ప్రియాంక ఇంట్రావర్ట్. తక్కువ మాట్లాతుంది. ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. అలాంటిది ఈ సినిమాలో ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ పాత్రలో నటించాల్సి వచ్చింది. అను, ప్రియాంకలా కాదు...ఎక్స్ట్రీమ్ హైపర్. పార్టీయింగ్, పబ్బింగ్, అందరితో కలిసిపోతుంది. సహజమైన స్వభావం నుంచి తనది కాని స్వభావంలోకి పరాకాయ ప్రవేశం చేయడం కష్టమే. అయినా సరే, ‘అను’గా మంచి మార్కులే కొట్టేసింది. ‘మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్’ అని డైరెక్టర్‌తో అనిపించుకుంది. టెన్షన్ టెన్షన్! యాక్టింగ్ కోర్సు పూర్తి చేసిన తరువాత గీతా ఆర్ట్స్‌కు తన ఫొటోలను పంపింది. మూడు నెలల తరువాత లుక్‌టెస్ట్, టెస్ట్‌షూట్, ఫొటోషూట్ జరిగింది. ఒకటే టెన్షన్...ఒకానొక టైమ్‌లో అయితే...‘‘నాకు వద్దు బాబోయ్ ఈ ఆఫర్’’ అని కూడా అనుకుందట.సరిగ్గా ఆ సమయంలోనే ఆఫర్ డోర్ బెల్ నొక్కింది. అలా ‘టాక్సీవాలా’లో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం! మూవీ పైరసీ కావడం, లీకవ్వడం, ‘ఈ పోర్షన్లో యాక్టింగ్ బాగా చేశారు’ ‘ఈ సీన్లో బాగున్నారు’ అంటూ తనకే మెసేజ్‌లు, స్క్రీన్షాట్లు రావడం చూసి మొదట్లో కంగారు పడిందట ప్రియాంక. దీనికితోడు ‘థియేటర్లలో మూవీ రిలీజ్ అవ్వట్లేదట కదా’లాంటి మాటలు తనను బాధించాయి. దీని గురించి ఎలా ఉన్నా ఎన్నాళ్లో వేచిన ఉదయంలా ‘టాక్సీవాలా’ ప్రియాంక పెదాలపై చిరునవ్వును మెరిపించింది. -
‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ
టైటిల్ : టాక్సీవాలా జానర్ : సూపర్ నేచురల్ కామెడీ తారాగణం : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణీ, ఉత్తేజ్ సంగీతం : జాక్స్ బెజోయ్ దర్శకత్వం : రాహుల్ సాంక్రుత్యాయన్ నిర్మాత : ఎస్కేయన్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ టాక్సీవాలా. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా రిలీజ్ కన్నా చాలా రోజుల ముందే ఆన్లైన్ లో రిలీజ్ కావటంతో రిజల్ట్ ఎలా ఉండబోతుందన్న ఆందోళనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది..? విజయ్ దేవరకొండ మరోసారి తన ఫాం చూపించాడా..? కథ ; శివ (విజయ్ దేవరకొండ) అతి కష్టమీద ఐదేళ్లపాటు చదివి డిగ్రీ పూర్తిచేసిన కుర్రాడు. అన్నా వదినలకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్(మధు నందన్) దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చేస్తాడు. ముందు ఒకటి రెండు జాబ్స్ ట్రై చేసిన వర్క్ అవుట్ కాకపోవటంతో క్యాబ్ డ్రైవర్‌గా పని చేయాలనకుంటాడు. తన వదిన బంగారం అమ్మి ఇచ్చిన డబ్బుతో ఓ పాత కారును కొని టాక్సీగా మారుస్తాడు. టాక్సీ తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..? ఈ పరిస్థితుల్లో శివ ఏం చేశాడు..? అసలు టాక్సీలో ఉన్న ఆ పవర్ ఏంటి..? ఈ కథతో అను (ప్రియాంక జవాల్కర్), శిశిర (మాళవిక నాయర్)లకు ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజయ్ దేవరకొండ మరోసారి తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిజం, స్టైల్‌తో పాటు ఎమోషన్స్, భయం కూడా చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో విజయ్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్గా పరిచయం అయిన ప్రియాంక గ్లామర్ రోల్ లో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో పర్ఫామెన్స్‌కు స్కోప్ లేదు. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర పాత్రల్లో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్, ఉత్తేజ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; తెలుగులో పెద్దగా కనిపించని సూపర్‌నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంచుకున్న దర్శకుడు రాహుల్, అనుకున్న కథను తెర మీద చూపించటంలో విజయం సాధించాడు. సూపర్ నేచురల్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో తయారు చేసుకున్న లైన్ కావటంతో లాజిక్ల గురించి మాట్లాడుకోవటం అనవసరం. సినిమాకు ప్రధాన బలం కామెడీ. ముఖ్యం ఫస్ట్ హాఫ్ అంతా హీరో, ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గినా మార్చురీ సీన్ సూపర్బ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. గ్రాఫిక్స్ నిరాశపరుస్తాయి. ఈ తరహా సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా కీలకం. సుజిత్ సారంగ్ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు. ఒక్క ‘మాటే వినుదుగా’ పాట తప్ప మిగతా పాటలేవి గుర్తుండేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ దేవరకొండ కామెడీ మైనస్ పాయింట్స్ ; సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ పాటలు గ్రాఫిక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆ సినిమాల్లా హిట్ అవుతుంది
‘‘ఇప్పటివరకూ ఎవరూ తీసుకోని సైన్స్ ఫిక్షన్ కామెడీని తీసుకుని రాహుల్ ‘టాక్సీవాలా’ తెరకెక్కించారు. తను చెప్పిన కథ అల్లుఅరవింద్గారికి, బన్నీగారికి, నాకు బాగా నచ్చి ఓకే చేశాము. ప్రస్తుతం అన్ని భాషల్లో కాన్సెప్ట్ చిత్రాలు వస్తున్నాయి. అదేకోవలో మా సినిమా తెరకెక్కింది’’ అని నిర్మాత ఎస్.కె.ఎన్ అన్నారు. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్, గీత గోవిందం’ సినిమాల్లా ‘టాక్సీవాలా’ మంచి విజయాన్ని సాధిస్తుంది. మా చిత్రం పైరసీ చూసిన వారంతా మళ్లీ థియేటర్‌కి వెళ్లి సినిమాని చూడండి. ఒక పూర్తి సినిమా చూసిన అనుభూతి వస్తుంది’’ అన్నారు. ‘‘సైన్స్ ఫిక్షన్ కామెడీగా తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని రాహుల్ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేశా’’ అన్నారు మళవికా నాయర్. ‘‘ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది’’ అని ప్రియాంక జవాల్కర్ అన్నారు. -
ముందు సాహో అప్డేట్ ఇవ్వండన్నా: విజయ్
టాక్సీవాలా చిత్రం శనివారం విడుదలవుతున్న సందర్భంగా హీరో విజయ్ దేవరకొండకి, చిత్ర యూనిట్‌కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్బుక్లో శుభాకాంక్షలు తెలిపారు. మీ దగ్గర్లో ఉన్న థియేటర్లలో టాక్సీవాలా చిత్రాన్ని చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని అభిమానులను కోరారు. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘అన్నా... ముందు మాకు సాహో అప్డేట్ ఇవ్వండన్నా’ అంటూ ప్రభాస్‌కు బదులిచ్చారు. టాక్సీవాలా చిత్రం విడుదల ముందే లీక్ అయిపోవడంతో చిత్ర బృందంలో మనోధైర్యం నింపుతూ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, వరుణ్ తేజ్, నిఖిల్లతోపాటూ పలువురు సినీ ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంటులో పాల్గొన్న అల్లు అర్జున్ కూడా పైరసీ గురించి మాట్లాడారు. -
వాళ్లు కనిపించని శత్రువులు
‘‘పెళ్ళి చూపులు’ సినిమా రిలీజ్‌కు ముందు ‘టాక్సీవాలా’కి జరిగినట్లే ఆ సినిమా లీక్ అయ్యుంటే నాకు ‘అర్జున్‌రెడ్డి’ అవకాశం వచ్చేది కాదు. అలాగే ‘పెళ్ళి చూపులు’ థియేటర్స్‌లో సరిగ్గా రిలీజై పెద్ద హిట్ సాధించేది కాదు. నాకు కెరీర్‌నే లేకుండా పోయేది. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇంకా ఆడిషన్స్ ఇస్తూ, చాన్స్లకు కోసం ప్రయత్నిస్తూనే ఉండేవాడినేమో. లేకపోతే ప్రొడక్షన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్లిపోయేవాడినేమో. స్టార్డమ్ కోసం చాలా కష్టపడ్డాను’’ అన్నారు విజయ్ దేవరకొండ. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్ జంటగా రూపొందిన సినిమా ‘టాక్సీవాలా’. మాళవికా నాయర్ కీలక పాత్ర చేశారు. యూవీ, జీఏ2 బ్యానర్స్‌పై ఎస్కేయన్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు... ► ‘టాక్సీవాలా’లో యాక్టర్స్ పడే ఇబ్బందులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. మాళవికా నాయర్ పాత్ర సినిమాకి కీలకమైంది. అందుకే ట్రైలర్, టీజర్లో ఆమెను రివీల్ చేయలేకపోయాం. నిజానికి ఆ రోల్‌కి చాలా మందిని అడిగాం. మాళవిక చేయడం బాగా హెల్ప్ అయ్యింది. ► నాకు ఝలక్ తగిలింది ‘నోటా’ వల్ల కాదు... ‘టాక్సీవాలా’ పైరసీ కావడం వల్ల. ఈ సినిమా రైటర్, హీరోయిన్, దర్శకుడు, అందరూ ప్రతిభావంతులే. వీరందరికీ ఇది ఫస్ట్ సినిమా. నేనిప్పుడీ స్థాయిలో ఉండటానికి నా తొలి సినిమా ‘పెళ్ళిచూపులు’ ఒక కారణం. కానీ వీళ్ల ఫస్ట్ సినిమా లీక్ అవ్వడం బాధగా ఉంది. ► ‘రెండు నెలలు క్రితమే సినిమా మా దగ్గరకు వచ్చింది. రిలీజ్ తర్వాత పెడదాం అనుకున్నాం. కాపీ వేరే వాళ్లు పెట్టడంతో మేం పెడుతున్నాం’ అని నిన్న మొన్న సినిమాను వైరల్ చేసిన వారు లెటర్స్ పెడుతున్నారు. ఈ సైట్స్‌ను కంట్రోల్ చేయలేం. యాంటీ పైరసీ టీమ్ లింక్‌ను తీసేసినా మళ్లీ పెడుతున్నారు. పోర్న్సైట్లను బ్యాన్ చేసినట్లు, పైరసీ సైట్లను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమాపై ఆధారపడి చాలా మంది ఉన్నారు. ఈ చిత్రం టీమ్ మెంబర్స్ నాలా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్లే. రీ రీకార్డింగ్ టైమ్‌లో జేక్స్ వాళ్ల ఫాదర్‌కు హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కష్టపడి ఈ సినిమాకు పనిచేశాడు. వాళ్ల నాన్నకు కీమోథెరపీ చేయిస్తూనే జేక్స్ రీ–రీకార్డింగ్ను కంప్లీట్ చేశాడు. ► రిలీజ్‌కి ముందు నా సినిమాలే ఎందుకు లీక్ అవుతున్నాయి? అనిపిస్తుంటుంది. ఇటీవల మా స్కూల్ ఫ్రెండ్స్‌ను లొకేషన్లో మీట్ అయ్యాను. నా సినిమాలు లేని టైమ్‌లో మేం కలిసి ఉన్న ఫొటోలను చూపించారు. 2012–2013 ఫొటోలు అవి. వాటిలో నన్ను నేను చూసుకుని గుర్తు పట్టలేకపోయాను. కెరీర్ ఏంటి? అనే టెన్షన్ ఉండేది. సినిమాలు వస్తాయా? డబ్బులు ఏంటీ? లైఫ్ ఏం అవుతుంది? అని ఆలోచిస్తుండేవాడిని. ఫ్రెండ్స్ నా కోసం ఖర్చు పెట్టేవారు. ఒకప్పుడు సినిమాలు లేవనే టెన్షన్. అప్పటి రోజులతో పోలిస్తే ఇప్పుడు సినిమా ఉంది. అది పైరసీ అవుతుంది. సర్లే.. ఇది బెటర్ కదా అనిపిస్తోంది. ఒక సినిమా అటూ ఇటూ అయితే సేఫ్‌గార్డ్‌గా ఉండగలిగే స్థాయిలో మనం ఉన్నాం అనే ఫీలింగ్ ఉంది. ► థియేటర్స్‌లోకి రాకముందే నీ సినిమా చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే పాజిటివ్ యాంగిల్లో ఆలోచించవచ్చు కదా అని నా స్నేహితుడు అన్నాడు. కానీ టీమ్ అందరి లైఫ్స్ ఆధారపడి ఉంటాయి. లీక్ చేసిన వారు కనిపించని శత్రువులు. వారిపై ఎలా పోరాడగలం. ► ‘నోటా’ ప్రమోషన్స్ టైమ్‌లో మా అమ్మ ఆరోగ్యం పాడైంది. హాస్పిటల్‌కి వెళ్లే దారిలో.. అమ్మ గురించి ఆలోచించా. హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలీదు నాకు. ఆ జర్నీలో మెంటల్‌గా యాక్టింగ్‌ను వదిలేశాను. అయినవాళ్లను చూసుకోలేనంతగా బిజీయా? అనిపించింది. నాకు ఈ కేరీర్ వద్దు. డబ్బు వద్దు. ఫేమ్ వద్దు. అన్నీ వదిలేద్దాం అనుకున్నా. మెంటల్‌గా నా ప్రొడ్యూసర్స్‌కి కాల్ చేసి అడ్వాన్సులు రిటర్న్ చేద్దామని అనుకున్నా. యాక్టింగ్‌ను వదిలేద్దాం అని ఫిక్స్ అయ్యాను. హాస్పిటల్‌కి వెళ్లిన తర్వాత అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది. ► నేనంటే ఇష్టపడేవారిని కొందరు సోషల్ మీడియాలో అబ్యూజ్ చేస్తున్నారు. అందుకే ‘‘నేను చేయబోయే సినిమాలు నాకు తెలుసు. వాళ్లకు తెలీదు. మాట్లాడిన వాళ్లకు సక్సెస్‌తో సమాధానం చెబుదాం’’ అనే పోస్ట్‌ను షేర్ చేశాను. నాపై కొందరు యంగ్ హీరోలు అసూయగా ఉన్నారు అంటే నాకు ఓకే. కానీ ఎవ్వరితో ఎక్కువగా ఏం మాట్లాడను. నేను, నా టీమ్, నా స్కూల్ ఫ్రెండ్స్‌తో ఉంటాను.. అంతే. ► యాక్టర్‌ని అవుతాననుకోలేదు. అయ్యాను. నా ఒకటో తరగతి నుంచే చిరంజీవిసార్ సినిమాలు చూస్తున్నాను. అలాంటిది చిరంజీవిసార్,బన్నీ అన్న నా సినిమాల ప్రీ–రిలీజ్ ఈవెంట్లకు వచ్చి నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రస్తుతానికి వాటిని మర్చిపోవాలనుకుంటున్నా. నాకు అరవయ్యేళ్లు వచ్చినప్పుడు ఈ వీడియోస్ పెట్టుకుని బాగా ఎంజాయ్ చేస్తాను. ► ఒక సినిమా రిలీజైన తర్వాత ఏం జరిగిందో ఆలోచించి నెక్ట్స్ స్టెప్ తీసుకోవాలి. ఇటీవల ‘గీతగోవిందం, టాక్సీవాలా, నోటా’సినిమాలకు ఒకే టైమ్‌లో వర్క్ చేశాను. ఒక టైమ్‌లో ఒక సినిమాపైనే ఫోకస్ పెట్టి తక్కువ సినిమాలు చేద్దామనుకున్నా. కానీ చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఎన్నింటికి నో చెప్పినా ఇప్పటికీ ఫుల్ బిజీ వర్క్‌లోనే ఉన్నాను. ‘డియర్ కామ్రేడ్’ సినిమా 30 పర్సెంట్ అయిపోయింది. నా ప్రొడక్షన్ హౌస్ గురించి త్వరలో అనౌన్స్ చేస్తాను. -
పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి
-
‘టాక్సీవాలా’కు మద్దతుగా..!
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. ఎస్కేఎన్ నిర్మాతగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు ముందే లీకై యూనిట్ వర్గాలకు షాక్ ఇచ్చింది. నిర్మాతలు పైరసీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. దీంతో టాక్సీవాలాకు మద్దతుగా ఇండస్ట్రీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. యంగ్ హీరో నిఖిల్ పైరసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో మేసేజ్‌ను పోస్ట్ చేశారు. టాక్సీవాలా చిత్ర సినిమాటోగ్రాఫర్ మెసేజ్‌పై స్పందించిన నిఖిల్, ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా రిలీజ్ కు ముందే లీకైతే గుండె పగిలినంత బాధకలుగుతుంది. ఇటీవల ఎన్టీఆర్ అరవింద సమేత విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు టాక్సీవాలాకు జరిగింది. తరువాత నా సినిమాకు కూడా జరగొచ్చు అందుకే అందరూ పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు. శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న టాక్సీవాలా విజయం సాధించాలని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. -
‘సూర్య సర్... ఐ లవ్ యు’
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. డిఫరెంట్ జానర్లో రూపొందిన ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ మూవీ శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా కోలీవుడ్ టాప్ హీరో సూర్య, విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతుండగా బుక్‌మై షోలో 2.ఓ తరువాత అత్యధిక మంది ఇంట్రస్ట్ చూపిస్తున్న సినిమాగా, ఐఎండీబీలో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాలను వెల్లడిస్తూ తనకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు తెలియజేశాడు. విజయ్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన సూర్య ‘నీపై మా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. టాక్సీవాలా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన విజయ్ దేవరకొండ ‘సూర్య సర్ ఐ లవ్ యు’ అంటూ రిప్లై చేశాడు. Suriya sirrr 🤗 I love you. https://t.co/eIsSlPNOjf — Vijay Deverakonda (@TheDeverakonda) 14 November 2018 -
చాలా నేర్చుకోవాలి
‘‘హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ అయితేనే చేస్తానని కాదు. ప్రేక్షకులకు నచ్చే మంచి సినిమాల్లో నేనొక భాగమైతే చాలు. ఇప్పుడు ఉన్న అగ్రకథానాయికలు చాలా విషయాల్లో మెరుగ్గా ఉన్నారు. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అన్నారు ప్రియాంకా జవాల్కర్. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్ జంటగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో యూవీ, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై ఎస్కేయన్ నిర్మించిన ‘టాక్సీవాలా’ ఈ 17న రిలీజ్ కానుంది. ప్రియాంకా జవాల్కర్ చెప్పిన విశేషాలు. ∙మాది మారాఠి ఫ్యామిలీ. అయితే అనంతపురంలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇష్టం. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. నేను చేసినవాటిలో ‘పొసెసివ్‌నెస్’ అనే షార్ట్ ఫిల్మ్ బాగా వైరల్ అయ్యింది. ఇంజినీరింగ్, ఫ్యాషన్‌లో డిప్లొమా, స్టాటిస్టిక్స్.. ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఉంది నాకు. ఆ తర్వాత యూఎస్‌లో ఉన్నప్పుడు వన్ ఇయర్ ఇండస్ట్రీలో మళ్లీ ట్రై చేద్దాం అనుకున్నాను. 2016లో భిక్షు, అరుణ భిక్షుల వద్ద 4 నెలల యాక్టింగ్ క్లాసులు పూర్తి చేశాను. నా ఫొటోలు గీతా ఆర్ట్స్‌కు పంíపించిన 6 నెలలకు ‘టాక్సీవాలా’లో చాన్స్ వచ్చింది. ఆ చాన్స్ గురించి ఎవరికీ చెప్పలేదు. తీసేస్తారేమోనని భయపడ్డాను. రెండు, మూడు వారాల తర్వాత నన్ను తీసేయరని నమ్మకం వచ్చిన తర్వాత ఇంట్లో చెప్పాను. ఇందులో జూనియర్ డాక్టర్ రోల్ చేశాను. దర్శకుడు రాహుల్ పర్ఫెక్షనిస్ట్. ∙తెలుగు అమ్మాయిలు ఎక్కువగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇతర భాషల కథానాయికలు తెలుగు నేర్చుకుని, సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తెలుగు అమ్మాయిగా నాకు డిస్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే హైదరాబాద్‌లో ఉండకపోవడం, ముంబై నుంచి రాకపోవడం అనుకుంటా (నవ్వుతూ). నా నెక్ట్స్ చిత్రాల గురించి త్వరలో చెబుతాను. -
వైరల్ అవుతున్న ‘టాక్సీవాలా’ ట్రైలర్!
ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం విడుదల కాబోతోంది. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హారర్, కామెడీ, యూత్ ఎంటర్టైనర్గా రూపొందింన ఈ సినిమా ట్రైలర్లో విజయ్ మళ్లీ తన నటనతో ఆకట్టుకున్నాడు. కథ మొత్తం టాక్సీ చుట్టే తిరుగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఆ టాక్సీతో విజయ్ జీవితంలో వచ్చిన యూ టర్న్స్ని థియేటర్స్‌లో చూడాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక లుక్స్‌తో అదరగొట్టేసింది. జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్కెఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. -
నచ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్ కొట్టదు!
‘‘మళ్లీ విజయ్ ఫంక్షన్‌కి వస్తారా? ఏదైనా ఇబ్బంది ఉందా? అని ఎస్కేయన్ అడిగాడు. ఇష్టమైనవాళ్ల కోసం చేసేది ఏదీ ఇబ్బంది కలిగించదు అన్నాను. దీన్నే విజయ్ స్టైల్లో చెప్పాలంటే నచ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్ కొట్టదు (నవ్వుతూ)’’ అని అల్లు అర్జున్ అన్నారు. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్ జంటగా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ తెరకెక్కించిన చిత్రం ‘టాక్సీవాలా’. యూవీ, జీఏ2 బ్యానర్స్‌పై ఎస్కేయన్ నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు పని చేసిన సాయికుమార్ రెడ్డిని, పాటలు రాసిన కృష్ణకాంత్‌ని మనం గౌరవించాలి. ఎందుకంటే.. కల్చర్‌ని ముందుకు తీసుకువెళ్లేది రచయితలే. సినిమాలకు అందరూ గుర్తింపు కోసం వస్తారు. అందరి కంటే ఎక్కువ పని చేసి తక్కువ పేరు పొందేది రచయితలే. నేనంటే క్రష్(ఇష్టం) ఉందని ప్రియాంక చెప్పింది. ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం (నవ్వుతూ). ఉన్న అన్నీ పరిశ్రమల్లో అమ్మాయిలకు గౌరవం ఇచ్చేది చిత్రపరిశ్రమే. మీరు (కొత్త హీరోయిన్స్‌ని ఉద్దేశిస్తూ) సినిమాల్లోకి నమ్మకంగా రండి. ఎస్కేయన్ పెద్ద మెగా అభిమాని. జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా, నిర్మాతగా ఎదిగాడు. ఎస్కేయన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. నేను సినిమా చేయాలని అడిగిన ఏకైక ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్. ఎవరైనా ఎదిగితే నాకు చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న ఆఫీస్ బ్యాయ్ ఇప్పుడు ప్రొడక్షన్ మ్యానేజర్. నా దగ్గర పదేళ్లు ఉండి కూడా అలానే ఉంటే అతనికి నేనేం చేసినట్టు? ఏం చేయలేదు అనే ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. మనవాళ్లు మన పక్కనే ఉండకూడదు. మనతోపాటు ఎదగాలి. విజయ్ దగ్గర ఒర్జినాలిటీ ఉంది. మేం అందరం, మా కాంటెపరరీస్ ఒక రొట్టలో స్టక్ అయిపోయాం. నువ్వు అందులో లేవు. కొత్తగా చేస్తున్నావు. ఆ తీరు జనాలకు నచ్చింది. విజయ్ మంచి నటుడు. మేం గోల్డెన్ ప్లేట్. నా లాంచ్ రాఘవేంద్రరావుగారు, అశ్వనీదత్గార్లు చేశారు. తను ‘ఎవడే, పెళ్లి చూపులు..’ ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ సొంతంగా వచ్చాడు. సెల్ఫ్‌మేడ్ పర్సన్. నేనెంత పెద్ద నటుడిని అయినా సెల్ఫ్‌మేడ్ అని చెప్పుకోలేను. తనని తాను చెక్కుకున్న శిల్పం విజయ్. నేనెప్పుడూ టాలెంట్ ఉన్నోడి మీద జోక్‌లు వేయలేను. ఈ మధ్య విజయ్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. సడెన్‌గా స్టార్ అయితే నెగటీవ్ ఫోర్స్ కూడా ఉంటుంది. పట్టించుకోవద్దు విజయ్. అవన్నీ దాటి హిట్స్ కొడతావనే నమ్మకం నాకుంది. నాకంటే స్టార్ అయినా కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. నీ సక్సెస్‌ని ఎంజాయ్ చేసేవాళ్లలో నేనొకడిని అని నమ్ము. పైరసీ చేయడం చాలా తప్పు. సినిమా అనేది మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే. పేపర్లో నాలుగో పేజీలో వార్తే. కానీ మాకు అది జీవితం. అందర్నీ గౌరవిస్తారు. సినిమా వాళ్లకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు? దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘విజయ్ వెరైటీ ఉన్న స్క్రిప్ట్స్‌నే ఎంచుకుంటాడు. రాహుల్ నీకు ఆల్ ది బెస్ట్. మా బ్యానర్లో ఎన్నో హిట్స్ వచ్చాయి. కానీ ‘గీతగోవిందం’ వందకోట్లు తీసుకువచ్చింది’’ అన్నారు. ‘‘ఫస్ట్ హాఫ్‌ని మూడు గంటల్లో రాసేశాం. సెకండ్ హాఫ్ 6 నెలలు రాశాం. మేం సంతృప్తి చెందినా ఇంకా బెటర్‌గా చేయండి అని మమ్మల్ని బన్నీ వాసు పుష్ చేశారు’’ అన్నారు రాహుల్ సంక్రిత్యాన్. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లి చూపులు’ తర్వాత నన్ను పిలిపించారు బన్నీ అన్న. చాలా బాగా చేశారు. నాకిలాంటి సినిమాలు బాగా ఇష్టం. అని అభినందించారు. ‘అర్జున్ రెడ్డి’ అప్పుడు మళ్లీ పిలిపించి, 20 నిమిషాలు మాట్లాడారు. ‘గీత గోవిందం’ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ అన్న వచ్చారు. మళ్లీ ఇప్పుడు వచ్చారు. థ్యాంక్స్ అన్న. బన్నీ అన్నలా డ్యాన్స్ ఈ జన్మలో చేయలేను. ఇండస్ట్రీకు బయట వ్యక్తిని నేను. అవుట్‌సైడర్స్ నన్ను ఎక్కువ ఓన్ చేసుకోవడానికి కారణం అదే. మనలో ఒక్కడు సక్సెస్ సాధించినా మనవాడు కొట్టాడు అని సంతోషపడతారు. అందుకే చాలా మంది నాకు ఇంత ప్రేమని ఇస్తున్నారని అనుకుంటున్నాను. ‘పెళ్లి చూపులు’ చేస్తే గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ నాకు దారి చూపించాయి. వాళ్లు ఎస్కేయన్, బన్నీ వాసుని ఎలా తీసుకొచ్చారో అలా నేను కూడా వీలైనంత మందిని లాక్కెళ్తా. మా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. దాని వెనక చాలా మంది కెరీర్, ప్యూచర్ ఉంటుంది. ఎంటర్టైన్ అవ్వండి. కానీ వాళ్ల పనిని గౌరవించండి. థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి పైరేట్ చేసినవాళ్లు సిగ్గుపడేలా చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఎస్కేయన్ మాట్లాడుతూ – ‘‘ప్రొడ్యూసర్‌గా మారడానికి కారణం గాడ్ ఫాదర్ అల్లు అరవింద్‌గారు. మెగా అభిమానిగా బ్యానర్లు కట్టే నన్ను సినిమా ప్రొడ్యూసర్ని చేశారు. ఏ నిర్మాత అయినా కొడుకునో, మనవడినో నిర్మాతను చేస్తారు. మన ఫ్యాన్‌లో టాలెంట్ ఉందని తీసుకొచ్చి, నిర్మాతను చేశారు అల్లు అరవింద్‌గారు. ఇదెక్కడా జరిగి ఉండదు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. సూపర్ న్యాచురల్ సైన్స్ ఫిక్షన్. సినిమా లీక్ అయినా భయపడలేదు. మా కంటెంట్ మీద ఉన్న నమ్మకం అలాంటిది. నా కెరీర్ ఏఏ (అల్లు అర్జున్)తో స్టార్ట్ అయింది. జీవితం ఇచ్చిన వాళ్ల గురించి చెప్పాలి. తన వాళ్లు కూడా ఎదగాలనుకునేవారు బన్నీ’’ అన్నారు. ‘‘నాకు అల్లు అర్జున్ మీద చాలా క్రష్ ఉంది.సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రియాంకా జవాల్కర్. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంకా పూర్తి కాలేదు: విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే లోగా పూర్తి సినిమా లీకైపోయింది. మొబైల్స్‌లో టాక్సీవాలా సినిమా షేర్ అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై చిత్రయూనిట్ ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశారు. తన సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే విజయ్ దేవరకొండ ఈ ప్రమోషనల్ వీడియోలోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే లీకైన వీడియోలో సినిమా రష్ మాత్రమే ఉందని.. ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ పూర్తయితేనే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుందని ఇన్నోవేటివ్‌గా చూపించాడు. ‘ద రియాలిటీ బిహైండ్ టాక్సీవాలా’ పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. విజయ్ సరసన ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘టాక్సీవాలా’ కోసం స్టైలిష్ స్టార్
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవల నోటా సినిమా కాస్త స్లో అయిన విజయ్ త్వరలో టాక్సీవాలాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఈ నెల 11న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు.