‘సూర్య సర్‌... ఐ లవ్‌ యు’ | Suriya wishes to Vijay Devarakonda Taxiwaala | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 14 2018 11:54 AM | Last Updated on Wed, Nov 14 2018 1:06 PM

Suriya wishes to Vijay Devarakonda Taxiwaala - Sakshi

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టాక్సీవాలా. డిఫరెంట్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ మూవీ శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా కోలీవుడ్ టాప్‌ హీరో సూర్య, విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతుండగా బుక్‌మై షోలో 2.ఓ తరువాత అత్యధిక మంది ఇంట్రస్ట్ చూపిస్తున్న సినిమాగా, ఐఎండీబీలో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాలను వెల్లడిస్తూ తనకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు విజయ్‌ దేవరకొండ శుభాకాంక్షలు తెలియజేశాడు.

విజయ్‌ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన సూర్య ‘నీపై మా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. టాక్సీవాలా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన విజయ్‌ దేవరకొండ ‘సూర్య సర్‌ ఐ లవ్‌ యు’ అంటూ రిప్లై చేశాడు.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement