‘‘హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ అయితేనే చేస్తానని కాదు. ప్రేక్షకులకు నచ్చే మంచి సినిమాల్లో నేనొక భాగమైతే చాలు. ఇప్పుడు ఉన్న అగ్రకథానాయికలు చాలా విషయాల్లో మెరుగ్గా ఉన్నారు. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అన్నారు ప్రియాంకా జవాల్కర్. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్ జంటగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో యూవీ, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై ఎస్‌కేయన్ నిర్మించిన ‘టాక్సీవాలా’ ఈ 17న రిలీజ్ కానుంది. ప్రియాంకా జవాల్కర్ చెప్పిన విశేషాలు.
∙మాది మారాఠి ఫ్యామిలీ. అయితే అనంతపురంలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే ఇష్టం. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వచ్చింది. నేను చేసినవాటిలో ‘పొసెసివ్‌నెస్’ అనే షార్ట్ ఫిల్మ్ బాగా వైరల్ అయ్యింది. ఇంజినీరింగ్, ఫ్యాషన్‌లో డిప్లొమా, స్టాటిస్టిక్స్.. ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఉంది నాకు. ఆ తర్వాత యూఎస్‌లో ఉన్నప్పుడు వన్ ఇయర్ ఇండస్ట్రీలో మళ్లీ ట్రై చేద్దాం అనుకున్నాను. 2016లో భిక్షు, అరుణ భిక్షుల వద్ద 4 నెలల యాక్టింగ్ క్లాసులు పూర్తి చేశాను. నా ఫొటోలు గీతా ఆర్ట్స్‌కు పంíపించిన 6 నెలలకు ‘టాక్సీవాలా’లో చాన్స్ వచ్చింది. ఆ చాన్స్ గురించి ఎవరికీ చెప్పలేదు. తీసేస్తారేమోనని భయపడ్డాను. రెండు, మూడు వారాల తర్వాత నన్ను తీసేయరని నమ్మకం వచ్చిన తర్వాత ఇంట్లో చెప్పాను. ఇందులో జూనియర్ డాక్టర్ రోల్ చేశాను. దర్శకుడు రాహుల్ పర్ఫెక్షనిస్ట్. ∙తెలుగు అమ్మాయిలు ఎక్కువగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇతర భాషల కథానాయికలు తెలుగు నేర్చుకుని, సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. తెలుగు అమ్మాయిగా నాకు డిస్ అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే హైదరాబాద్‌లో ఉండకపోవడం, ముంబై నుంచి రాకపోవడం అనుకుంటా (నవ్వుతూ). నా నెక్ట్స్ చిత్రాల గురించి త్వరలో చెబుతాను.
చాలా నేర్చుకోవాలి
Published Wed, Nov 14 2018 12:13 AM | Last Updated on Wed, Nov 14 2018 12:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment