‘నేను చేసిన కొన్ని పాత్రలు హీరోయిన్‌గా నా కెరీర్‌కు ప్లస్ కాకపోవచ్చు కానీ ఆ పాత్రల వల్ల యాక్టర్‌గా ఇంప్రూవ్ అయ్యాను. కొన్ని సినిమాల్లో హీరోయిన్ రోల్ చేయలేక పోయినందుకు గిల్టీ ఫీలవ్వడం లేదు. నాలో ఉన్న నటి ‘టాక్సీవాలా’, ‘మహానటి’ వంటి మంచి సినిమాల్లో మంచి రోల్స్ చేసేలా చేసింది. స్టార్ అనడంకన్నా ‘యాక్టర్’గా మారిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అన్నారు కథానాయిక మాళవికా నాయర్. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘టా క్సీవాలా’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకంపై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ చిత్రం గత శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా మాళవిక చెప్పిన విశేషాలు...
∙‘టాక్సీవాలా’ రిలీజ్ తర్వాత స్క్రిప్ట్స్‌ను ఎంచుకునే విషయంలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇందులో నా క్యారెక్టర్‌ను రాహుల్ బాగా డిజైన్ చేశారు. నా స్నేహితులతో కలిసి థియేటర్‌లో సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కేరింతలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంది. నాకు నచ్చిన కమర్షియల్ రోల్ వస్తే తప్పకుండా చేస్తాను.
∙ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ నుంచి దూరం కాలేదు. ‘టాక్సీవాలా’ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితం మొదలైంది. సావిత్రిగారి లాంటి గొప్ప నటి బయోపిక్‌లో భాగమవ్వాలని ‘మహానటి’లో నటించాను. ఆ మధ్య విడుదలైన ‘విజేత’లో హీరోయిన్‌గానే నటించాను. కెరీర్ బాగుండాలంటే కమర్షియల్ రోల్స్ చేయాలి. అలాగే నాకు సంతృప్తినిచ్చే పాత్రలూ చేయాలి. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను.
∙ నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. ప్రతి సినిమాలో చాలెంజింగ్ రోల్స్ కుదరకపోవచ్చు. స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండాలి. అలాంటి పాత్రల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘ఎవడే సుబ్రమణ్యం’ వన్నాఫ్ మై ఫేవరెట్ మూవీస్. విజయ్ దేవరకొండ నా ఫేవరెట్ స్టార్ . నేను తెలుగులో 5 సినిమాలు చేశాను. అందులో మూడు సినిమాలు విజయ్‌తోనే ఉన్నాయి.
∙ మహిళలను వే«ధించడం అన్ని ఇండస్ట్రీస్‌లోనూ ఉంది. లక్కీగా నాకు ఎంటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. ఇండస్ట్రీలో నా కెరీర్ ఎర్లీగా స్టార్ట్ అయ్యింది. ‘మీటూ’ వంటి ఉద్యమాలు మంచివే. కాస్త ఆలస్యమైందని నా భావన. ఇండస్ట్రీలో మహిళల భద్రతకు సంబంధించి మార్పు రావాల్సిన అవసరం ఉంది.
∙ ఇంటర్‌లో ఉన్నప్పుడు పైలట్ అవ్వాలనుకున్నాను. కానీ ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. పెయింటింగ్, స్క్రిప్టింగ్ అంటే కూడా ఇష్టం. డైరెక్షన్ చాలా కష్టం. భవిష్యత్తులో సినిమా స్క్రిప్ట్స్ రాస్తానేమో ఇప్పుడే చెప్పలేను. స్పోర్ట్స్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. తెలుగు అర్థం అవుతుంది. మాట్లాడటానికి కాస్త టైమ్ పడుతుంది.
∙ తెలుగులో కొత్త చిత్రాలేవీ ఒప్పుకోలేదు. తమిళంలో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment